అలాంటి సినిమాలు చేయాలనే...
‘‘2012లో నేను డెరైక్ట్ చేసిన ‘లవ్‌లీ’ ఆ ఏడాది టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వందకి వంద మార్కులు పడే సినిమాలు చేయాలనే ఉద్దేశంతో 2013లో సినిమా చేయలేదు. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి పెద్ద హీరోతో, మరోటి చిన్న సినిమా ఉంటుంది’’ అని దర్శకురాలు బి.జయ తెలిపారు. శనివారం తన పుట్టినరోజు వేడుకను హైదరాబాద్‌లోని ఆశ్రయ్-ఆకృతి బధిర పాఠశాలలో జరుపుకున్నారు. ఈ సంస్థ నిర్వహణ నిమిత్తం ఒక లక్షా తొమ్మిదివేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి.ఎ.రాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.