ఇప్పటికే పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల గవర్నర్గా ఉన్న కేఎన్ త్రిపాఠీకి మిజొరాం అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. ఆయన ఈనెల 4వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన శనివారం ఐజ్వాల్ వస్తారని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేస్తారని మిజొరాం ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎల్.ఆర్. సైలో తెలిపారు.
కేంద్రప్రభుత్వం గతవారం తొలగించిన పాత గవర్నర్ అజీజ్ ఖురేషి అదేరోజు.. అంటే ఏప్రిల్ 4న రాష్ట్రం వదిలి వెళ్తారు. అయితే.. రాష్ట్రంలో పదే పదే గవర్నర్లను ఎందుకు మారుస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. గడిచిన 8 నెలల్లో ఈ రాష్ట్రంలో ఏడుగురు గవర్నర్లు మారారు.
బెంగాల్ గవర్నర్కు మిజోరాం బాధ్యతలు
Published Wed, Apr 1 2015 6:51 PM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM
Advertisement
Advertisement