Mizoram Governor
-
అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్
తగరపువలస (భీమిలి): నూతన విద్య, ఆర్థిక విధానాల కారణంగా అభివృద్ధిలో దేశం దూసుకుపోతోందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. చెరకుపల్లిలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న గ్యాన్–2కే23 జాతీయ సాంకేతిక ఫెస్ట్‌ను శుక్రవారం ఆయన c. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అభివృద్ధిని నేటి తరం అనుభవిస్తుంటే తనకు అసూయగా ఉందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా దేశం తన అవసరాలను తీర్చుకోవడంతోపాటు విదేశాలకు అవసరమైన ఎగుమతులు చేయగలుగుతోందన్నారు. ప్రపంచానికి అవసరమైన సాంకేతికపరమైన డేటా మనదేశంలో చౌకగా లభిస్తుందన్నారు. విద్యార్థులు తన చుట్టూ ఉన్నవారికి, దేశానికి అవసరమైన వాటిని గుర్తించి ఉత్పత్తి చేయడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా విజయం సాధించాలని సూచించారు. అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కులం, డబ్బు వంటివాటితో పనిలేదన్నారు. తెలివితేటలు, కష్టపడే తత్వం అలవరచుకోవాలన్నారు. జేఎన్టీయూ–కె ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు మాట్లాడుతూ విద్యార్థులు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్‌స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటూ నిరంతరం అభ్యాసం చేయాలన్నారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్ ఎం.సైదులు, అవంతి విద్యాసంస్థల డైరెక్టర్ ఆకుల చంద్రశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ ఐ.శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Andhra Pradesh: సామాన్యుడికి ఆధునిక వైద్యం -
దేశ ఆర్థికాభివృద్ధిలో విశాఖ పాత్ర కీలకం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారతదేశ ఆర్థికాభివృద్ధిలో విశాఖ నగరం పాత్ర కీలకమైందని మిజోరం గవర్నర్ కె.హరిబాబు అన్నారు. విశాఖలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన బిజినెస్ కాంక్లేవ్ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏపీలో ఉన్నాయన్నారు. ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలో హైదరాబాద్ తర్వాత విశాఖ అనుకూలమని చెప్పారు. ఏపీ సహజ వనరులు కలిగిన రాష్ట్రమని తెలిపారు. 954 కి.మీ తీరం కలిగి ఉండటం రాష్ట్రం అదృష్టమన్నారు. విశాఖలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు తిరుగులేదని చెప్పారు. ఉమ్మడి ఏపీ అయినా, విభజిత ఏపీ అయినా పరిశ్రమల ఏర్పాటుకు విశాఖ మంచి నగరమన్నారు. జల, రోడ్డు, వాయు మార్గాలు ఉన్న ప్రధాన నగరాల్లో విశాఖ ఒకటని గుర్తు చేశారు. ఐదేళ్లుగా ప్రముఖ ఫార్మా కంపెనీలు విశాఖలో తమ యూనిట్లను స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఏపీ కేవలం పరిశ్రమల ఏర్పాటులోనే కాకుండా వ్యవసాయ రంగ ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ దేశంలో ముందు వరుసలో ఉందన్నారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 35 శాతం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పండించే పండ్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉందన్నారు. త్వరలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన: మంత్రి అమర్నాథ్ మరో రెండు నెలల్లో భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్ర జనాభాలో 71 శాతం మంది పని చేయగలిగిన సామర్థ్యం ఉన్నవారేనన్నారు. ప్రపంచంలో ఐటీ రంగంలో ఉన్న ప్రముఖుల్లో 25 శాతం మంది తెలుగువారేనని చెప్పారు. -
ప్రొఫెసర్ స్థాయి నుంచి గవర్నర్ గా..
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్‌గా నియమితులవడంపై విశాఖలో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకతీతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హరిబాబు ప్రకాశం జిల్లాలో జన్మించినప్పటికీ విద్యార్థి నుంచి విశాఖలోనే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయ ప్రస్థానం విశాఖ కేంద్రంగానే సాగించారు. ఏయూ విద్యార్థి నుంచి ప్రొఫెసర్ వరకు.. హరిబాబు ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామంలో 1953, జూన్ 15న జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేశారు. పీహెచ్డీ పట్టా కూడా ఏయూ నుంచే పొందారు. ఇక్కడే అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. విద్యార్థి నాయకుడిగా.. విద్యార్థి దశలోనే నాయకుడిగా అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1972–73లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి యూనియన్‌కు సెక్రటరీ అయ్యారు. 1975–75లో లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన లోక్ సంఘర్ష సమితి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతలో భాగంగా అరెస్ట్ అయ్యారు. విశాఖ సెంట్రల్ జైలు, ముషీరాబాద్ జైలులో 6 నెలలు ఉన్నారు. జైఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. 1977లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జనతా పార్టీలో చేరి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా సేవలందించారు. 1978లో జనతా యువమోర్చాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1991–93 మధ్యలో పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నారు. 1993–2003 కాలంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. విశాఖ–1 ఎమ్మెల్యేగా.. 1999లో విశాఖ–1 నియోజకవర్గం నుంచి హరిబాబు పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2003లో శాసనసభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో కూడా అక్కడే నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. 2014 మార్చిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తన పదవీ కాలం ముగిసిన తరువాత తిరిగి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అభినందనల వెల్లువ గవర్నర్‌గా నియమితులైన హరిబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దసపల్లా హిల్స్ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం సందడిగా మారింది. బీజేపీ నేతలతో పాటు అన్ని పక్షాల నేతలు, సన్నిహితులు హరిబాబు ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేస్తున్నారు. బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, బీజేపీ జిల్లా ఇన్చార్జి కోడూరి లక్ష్మీనారాయణ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. -
రాజకీయాల్లోకి మిజోరం గవర్నర్!
తిరువనంతపురం: మిజోరం గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ తన పదవికి శుక్రవారం రాజీనామా సమర్పించారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కేరళ నుంచి ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజశేఖరన్ గతేడాది మేలో మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ముద్రపడ్డ రాజశేఖరన్ త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి పోటీ చేసే అవకాశముందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి పోటీచేసిన రాజశేఖరన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ చేతిలో ఓడిపోయారు. -
బెంగాల్ గవర్నర్‌కు మిజోరాం బాధ్యతలు
ఇప్పటికే పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న కేఎన్ త్రిపాఠీకి మిజొరాం అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. ఆయన ఈనెల 4వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన శనివారం ఐజ్వాల్ వస్తారని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేస్తారని మిజొరాం ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎల్.ఆర్. సైలో తెలిపారు. కేంద్రప్రభుత్వం గతవారం తొలగించిన పాత గవర్నర్ అజీజ్ ఖురేషి అదేరోజు.. అంటే ఏప్రిల్ 4న రాష్ట్రం వదిలి వెళ్తారు. అయితే.. రాష్ట్రంలో పదే పదే గవర్నర్లను ఎందుకు మారుస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. గడిచిన 8 నెలల్లో ఈ రాష్ట్రంలో ఏడుగురు గవర్నర్లు మారారు. -
గవర్నర్ పదవికి శంకర్‌నారాయణ్ రాజీనామా
-
బదిలీ చేస్తే రాజీనామా చేస్తా!
కొచ్చి:తనను మహారాష్ట నుంచి మిజోరాంకు బదిలీ చేసినట్లయితే ఆ పదవికి రాజీనామా చేస్తానని గవర్నర్ శంకర్ నారాయణ్ స్పష్టం చేశారు. తాను మిజోరాంకు బదిలీ అవుతున్నట్లు ఎటువంటి అధికారిక సమాచారం లేదని.. కేవలం మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్నానని ఆయన తెలిపారు. దీనిపై మీడియాలో పలుకథనాలు రావడంతో ఆయన స్పందించారు. ' నా బదిలీకి సంబంధించి ఎటువంటి సమాచారం ప్రభుత్వం నుంచి అందలేదు. నన్ను అవమానిస్తే గవర్నర్ పదవిలో అంటిపెట్టుకుని ఉండటానికి కొయ్యను కాదు. ఒకవేళ నన్ను బదిలీ చేస్తే అవమానించేనట్లే' అని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో తనకు గవర్నర్ గా కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు. ఆ క్రమంలోనే తన బదిలీకి తెరలేపి ఉండవచ్చు అని తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ మిజోరాం గవర్నర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీచేసింది మహారాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్‌గా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ వ్యవహరిస్తారని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కె.శంకరనారాయణన్ పదవి కాలం 2017లో ముగియనుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ రాష్ట్రాల గవర్నర్ల బదిలీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. -
మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణన్ బదిలీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ మిజోరాం గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గత అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్‌గా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ వ్యవహరిస్తారని రాష్ట్రపతి భవన్ జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది. కె.శంకరనారాయణన్ పదవి కాలం 2017లో ముగియనుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ రాష్ట్రాల గవర్నర్ల బదిలీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర గవర్నర్ కమలా బెనీవాల మధ్య వైరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను మిజోరం గవర్నర్‌గా బదిలీ చేశారు. అనంతరం ఆమెను మిజోరం గవర్నర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. దాంతో మిజోరం గవర్నర్ పదవి ఖాళీ అయింది. అయితే మరో రెండు నెలల్లో కమలా బెనీవాల్ పదవి కాలం ముగియనన్న సమయంలో ఆమెపై వేటు పడిన సంగతి తెలిసిందే. -
కమలా బేనివాల్కు ఉద్వాసన
న్యూఢిల్లీ : మరో గవర్నర్‌పై వేటు పడింది. మిజోరం గవర్నర్ కమలా బేనివాల్కు ఉద్వాసన పలికారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఆ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరించారు. మోడీ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు, కమలా బేనివాల్ కు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. కమలా బేనివాల్ పదవీకాలం కేవలం నాలుగు నెలలే ఉన్నా, ఆమెను నెలరోజుల క్రితం మిజొరాం గవర్నర్‌గా బదిలీ చేశారు. కమలా బేనివాల్ పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనున్న దశలో గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాలని రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడటం విశేషం. పదవీకాలం చివరకు వచ్చేసినా బేనివాల్ తొలగింపు రాజకీయ ప్రాథాన్యత సంతరించుకుంది. కాగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కారణాలు ఏవైనా ఇప్పటికి వరుసపెట్టి ఆరుగురు గవర్నర్లు రాజీనామా చేశారు. మరికొందరు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీళ్లంతా యూపీఏ హయాంలో నియమితులైనవాళ్లే.కాగా గుజరాత్ గవర్నర్ గా ఉన్న సమయంలో కమలా బేనివాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. -
కమలా బెనీవాల్ పై వేటు
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీతో ఉప్పు-నిప్పులా వ్యవహరించిన కమలా బెనీవాల్ పై వేటు పడింది. మిజోరం గవర్నర్ గా ఉన్న ఆమెను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. పదవి నుంచి తొలగించారు. మరో రెండు నెలల్లో ఆమె పదవీ కాలం ముగియనుండగా ఈ చర్య తీసుకోవడం గమనార్హం. గుజరాత్ గవర్నర్ గా ఉన్న బేనీవాల్ నెల రోజుల క్రితమే మిజోరం గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. మణిపూర్ గవర్నర్ వీకే దుగ్గల్ కు మిజోరం గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పటించినట్టు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా చర్యతో కమలా బేనీవాల్ శకం ముగిసిందని భావిస్తున్నారు. -
గుజరాత్ గవర్నర్‌పై బదిలీ వేటు
మిజోరం గవర్నర్‌గా నియామకం న్యూఢిల్లీ: గుజరాత్ గవర్నర్ కమలా బెనీవాల్ (87) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనున్నప్పటికీ కేంద్రం ఆమెపై ఆదివారం బదిలీ వేటు వేసింది. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ఇక్కట్లకు గురి చేసిన ఆమెను మిజోరం గవర్నర్‌గా నియమించింది. రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వాకు గుజరాత్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ర్టపతి భవన్ తెలిపింది. మిజోరం గవర్నర్‌గా ఉన్న పురుషోత్తమన్‌ను నాగాలాండ్ గవర్నర్‌గా నియమించినట్లు పేర్కొం ది. ఆయనకు త్రిపుర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారంది. లోకాయుక్త నియామకం వ్యవహారంతోపాటు గుజరాత్‌లోని స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం కోటా కోసం తెచ్చిన బిల్లును బెనీవాల్ తిరస్కరించడం వివాదాస్పదమవడం తెలిసిందే.