మిజోరం గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్
తిరువనంతపురం: మిజోరం గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ తన పదవికి శుక్రవారం రాజీనామా సమర్పించారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కేరళ నుంచి ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజశేఖరన్ గతేడాది మేలో మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తిగా ముద్రపడ్డ రాజశేఖరన్ త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి పోటీ చేసే అవకాశముందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి పోటీచేసిన రాజశేఖరన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment