Entry into politics
-
ఖద్దరు చొక్కాకై ఖాకీ తహతహ!
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో అనేకమంది బ్యూరోక్రాట్లు తమ రెండో ఇన్సింగ్స్‌ను రాజకీయాల్లో మొదలు పెట్టేందుకు తహతహలాడుతున్నారు. ఖద్దరు చొక్కా వేసుకొని ప్రజలకు మరింతగా సేవ చేసుకోవాలని ఎన్నికల కదన రంగంలోకి దిగుతున్నారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఇటీవలే ఐపీఎస్ పదవికి రాజీనామా చేసినా ఆశిమ్ అరుణ్ రెండ్రోజుల కిందటే బీజేపీలో చేరడం, ఆయనతో పాటు మారో మాజీ ఐఏఎస్ రామ్ బహదూర్ సైతం బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిధ్దపడుతుండటం ప్రస్తుతం ఆసక్తి రేపే అంశంగా మారింది. అఖిలేష్ అడ్డా నుంచే ఆశిమ్ పోటీ... 1994 బ్యాచ్‌కు చెందిన 51 ఏళ్ల ఆశిమ్ అరుణ్ పదిరోజుల కిందటే స్వచ్చంద పదవీ విరమణ ప్రకటించారు. 2017 ఎన్నికల్లో గెలిచిన అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనా«థ్ ఆశిమ్ను కాన్పూర్ మొదటి పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ఇక్కడ రౌడీ మూకల ఆట పట్టించి ఆశిమ్ తన సామర్థ్యాన్ని చాటుకున్నారు. అంతకుముందు ఆశిమ్ అలీఘర్, గోరఖ్‌పూర్, ఆగ్రా వంటి జిల్లాల్లో పోలీసు బలగాలకు నాయకత్వం వహించడమే కాకుండా, ఉత్తరప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు నేతృత్వం వహించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి చెందిన దళిత ఉపకులం ‘జాతవ్’ వర్గానికి చెందిన ఆశిమ్ అరుణ్ యూపీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే వీఆర్ఎస్ ప్రకటించి ఈ నెల 16న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం కన్నౌజ్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ గతంలో ఎంపీగా గెలిచారు. ఇక్కడి నుంచే ఆశిమ్ అరుణ్ పోటీ చేస్తుండటంతో అప్పుడే ఆయన చేరికపై అఖిలేష్ ఘాటుగా స్పందించారు. ‘ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ఆశిమ్ అరుణ్ సహాయపడుతున్నారని నేను ఆరోపించాను. బీజేపీలో చేరికతో అది నిజమైంది’ అని విమర్శలు గుప్పించారు. ఇక ఆశిమ్ అరుణ్‌తో పాటే మాజీ ఐఏఎస్ అధికారి రామ్ బహదూర్ సైతం ఆదివారం బీజేపీలో చేరారు. 2017కు ముందే బీఎస్పీలో చేరి మోహన్‌లాల్‌గంజ్ నుంచి పోటీ చేసి ఓడిన రామ్ బహదూర్ ప్రస్తుతం అదే స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. బ్రిజ్‌లాల్ స్ఫూర్తితో.. యూపీ మాజీ డీజీపీ బ్రిజ్‌లాల్ స్ఫూర్తితోనే ఆశిమ్ అరుణ్ బీజేపీలో చేరారని తెలుస్తోంది. మాజీ ఐపీఎస్ అయిన బ్రిజ్లాల్లో 2017లో యూపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీలో చేరారు. పాసీ దళితుడైన బ్రిజ్‌లాల్ 2010–12లో బీఎస్పీ అధినేత్రి మాయావతి హయాంలో యూపీ డీజీపీగా పనిచేసిన సమయంలో ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‘గా పేరు గడించారు. బీజేపీలో చేరాక ఆయన్ను రాజ్యసభకు పంపడంతో పాటు యూపీలో నేరస్థులు, మాఫియాల అణిచివేతలో ఆయన సహాయాన్ని యోగి ప్రభుత్వం తీసుకుంటోంది. ఇక 1988 బ్యాచ్‌కు చెందిన గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఏ.కే. శర్మ గత ఏడాది బీజేపీలో చేరేందుకు వీఆర్ఎస్ తీసుకున్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా పనిచేసిన సమయంలో, ఆ తర్వాత ప్రధాని అయ్యాక ఆయన కార్యాలయంలో పని చేసిన ఏ.కే. శర్మ, వీఆర్ఎస్ తీసుకున్నాక బీజేపీ ఆయన్ను శాసనమండలికి పంపింది. గత ఏడాది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మోదీ ఆశీస్సులతో యోగి కేబినెట్లో చేరతారనే అంతా భావించారు. కానీ ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా ఎదుగుతారనే భయంతో ఏకే శర్మను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి యోగి సుముఖత చూపలేదు. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన శర్మ... మోదీ నియోజకవర్గం వారణాసితో పాటు తూర్పు యూపీలో క్రియాశీలంగా వ్యహరిస్తున్నారు. ఇక 2014 ఎన్నికల సంందర్భంగా మరో ఐపీఎస్ అధికారి, ముంబాయి పోలీస్ కమిషనర్‌గా ఉన్న సత్యపాల్‌సింగ్‌ను యూపీలోని భాగ్‌పట్ నుంచి పార్లమెంట్‌కు పోటీ పెట్టిన విషయం తెలిసిందే. ఆయన ఆర్ఎల్డీ చీఫ్ అజిత్‌సింగ్‌ను ఓడించి వార్తల్లో నిలిచారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఆయన అజిత్‌సింగ్ కుమారుడు జయంత్ చౌదరీని ఓడించారు. గతంలోనూ అనేకమంది... యూపీలో బ్యూరోక్రాట్ల నుంచి పొలిటీషియన్లుగా మారిన వారి లిస్టు పెద్దదిగానే ఉంది. మాజీ ఐఏఎస్ అధికారులు కున్వర్ ఫతే బహదూర్, పన్నా లాల్ పునియా, అహ్మద్ హసన్, శిరీష్ చంద్ర దీక్షిత్, దేవేంద్ర బహదూర్ రాయ్, దేవి దయాల్, ఐసీఎస్ అధికారులు మహేంద్ర సింగ్ యాదవ్, బీపీ సింఘాల్ తదితరులు ఉన్నారు. వీరిలో చాలామంది ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల్లో రాష్ట్ర మంత్రులగానూ పనిచేశారు. – సాక్షి, న్యూఢిల్లీ -
పార్టీని ఆధీనంలోకి తెచ్చుకుంటా
సాక్షి ప్రతినిధి, చెన్నై: క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెడతానని, అన్నాడీఎంకేను ఆధీనంలోకి తెచ్చుకుంటానని, తననెవరూ అడ్డుకోలేరని అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ అన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి గత నెల 27న విడుదలై బెంగళూరు శివార్లలోని రిసార్టులో రెస్ట్ తీసుకున్న శశికళ సోమవారం అర్ధరాత్రి చెన్నైకి చేరుకున్నారు. కృష్ణగిరి జిల్లా కందికుప్పంతోపాటూ పలు చోట్ల ఆమె కారులో నుంచే ప్రసంగించారు. ‘అణగదొక్కాలనే వారి ప్రయత్నాలు ఫలించవు. క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తా. త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు వివరిస్తా. కార్యకర్తలకు, అభిమానులకు మాత్రమే నేను బానిసను. వారికి దాసోహం అవుతా. అమ్మ సమాధి సందర్శనకు వీలులేకుండా అకస్మాత్తుగా ఎందుకు మూసివేశారో ప్రజలందరికీ తెలుసు. అన్నాడీఎంకే పతాకాన్ని నేను వినియోగించడంపై పోలీసులకు ఆ పార్టీ నేతలు, మంత్రులు ఫిర్యాదు చేయడం వారిలో నెలకొన్న భయానికి నిదర్శనం. నా అభిమానులైన కార్యకర్తల సహకారంతో విజయం సాధించవచ్చు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమ్మ ఆశీర్వాద బలంతో అధిగమిస్తా. ప్రాణం ఉన్నంతవరకు, తుదిశ్వాస విడిచేవరకు అఖిల భారత అన్నాడీఎంకే ద్వారా ప్రజా సంక్షేమాన్ని కాపాడుతా. కరోనా బారిన పడినా అమ్మ ఆశీర్వాదం వల్ల కోలుకున్నా’ అని అన్నారు. అన్నాడీఎంకే పతాకంతోనే చిన్నమ్మ రాక సోమవారం ఉదయం 8 గంటలకు రిసార్టు నుంచి చెన్నైవైపు కారులోనే బయలుదేరారు. 10.45 గంటలకు ఆమె కారు తమిళనాడు సరిహద్దుల్లోకి ప్రవేశించగానే పోలీసులు ఆమె కారును అడ్డుకుని అన్నాడీఎంకే పతాకాన్ని తొలగించాలని కోరగా శశికళ నిరాకరించారు. అన్నాడీఎంకే తరపున పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఒక నేత ‘అది నా అధికారిక కారు, అడ్డుకునే హక్కు లేదు’అని వాదించడంతో పోలీసులు వెనక్కితగ్గారు. శశికళకు ఘన స్వాగతం పలికేందుకు వచ్చిన కార్లు రెండు బాణసంచాతో పేలడంతో కాలి బూడిదయ్యాయి. శశికళ రాకదృష్ట్యా చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటైంది. కృష్ణగిరి జిల్లాలో శశికళకు స్వాగతం పలుకుతున్న మద్దతుదారులు, అభిమానులు -
రాజకీయాల్లోకి రావాలనుంది
‘‘రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాను’’ అన్నారు రాశీ ఖన్నా. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు ఐఏయస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. అనుకోకుండా నటిని అయ్యాను. నటిగా చాలా విషయాలు తెలుసుకోగలిగాను. ఇప్పుడు ఎలాగూ ఐఏయస్ ఆఫీసర్ అవ్వలేను. కానీ భవిష్యత్తులో పక్కాగా రాజకీయాల్లోకి వెళ్తాను. అంతకంటే ముందు ఓ ఎన్జీవో ప్రారంభిస్తాను. ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుంటాను. వాళ్ల సమస్యలు అర్థం చేసుకుని సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు. కానీ సహాయం ఎలా చేయాలో తెలుసు’’ అన్నారు రాశీ. ప్రస్తుతం తమిళంలో ‘అరన్ మణై, తుగ్లక్ దర్బార్’ చిత్రాలు చేస్తున్నారు రాశీ ఖన్నా. -
రాజకీయాల్లోకి రజనీ
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ (66) రాజకీయ రంగ ప్రవేశంపై మూడేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్న ఊగిసలాటకి ఎట్టకేలకి తలైవా తెరదించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి సరిగ్గా 6 నెలల ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ట్విట్టర్ వేదికగా గురువారం ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని, దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తాము ఆధ్యాత్మిక లౌకిక రాజకీయాలనే కొత్త పంథాలో నడవనున్నట్టు తెలిపారు. ‘‘మేము తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో గెలుస్తాం. నీతి నిజాయితీ, పారదర్శకత, అవినీతిరహిత రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తాం. ఈసారి ఎన్నికల్లో అద్భుతాలు జరగబోతున్నాయి’’అని రజనీ ట్వీట్ చేశారు. ఇప్పుడు జరగకపోతే ఎప్పటికీ జరగదు, మేము మారుస్తాం. మేము అన్నింటినీ మారుస్తాం అన్న హ్యాష్‌ట్యాగ్‌లను జత చేరుస్తూ రజనీ తన రాజకీయ అరంగేట్రం ప్రకటన చేశారు. రాజకీయ అరంగేట్రంపై రజనీకాంత్ స్పష్టతనివ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. చెన్నై కోడంబాక్కంలో శ్రీరాఘవేంద్రస్వామి కల్యాణమండపం వద్ద బాణా సంచా కాల్చారు. నగర వీధుల్లో తిరుగుతూ లడ్డూలు పంచిపెట్టారు. గెలుపోటములకు మీదే బాధ్యత సోషల్ మీడియాలో రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన చేశాక రజనీకాంత్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాల తలరాత మార్చడం ఎంతో అవసరమన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ అది సాధ్యం కాదని, తమిళ ప్రజల కోసం తన ప్రాణాలైనా ఇస్తానని చెప్పారు. కరోనా వైరస్ కారణంగా తన పొలిటికల్ ఎంట్రీ కాస్త ఆలస్యమైందన్నారు. రాజకీయాల్లో విజయం సాధించడమంటే అది ప్రజా విజయమేనన్న రజనీ ‘‘నేను ఎన్నికల్లో గెలిస్తే అది ప్రజా విజయం, ఒకవేళ నేను ఓడిపోతే కూడా అది వాళ్ల పరాజయమే. నా గెలుపు మీ గెలుపు ఎలాగో, నా ఓటమి మీ ఓటమి కూడా. అంతా మీ చేతుల్లోనే ఉంది’’అని వ్యాఖ్యానించారు. గత అక్టోబర్‌లో అనారోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రాలేనంటూ రజనీకాంత్ పేరిట రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ లేఖలో పేర్కొన్నట్టుగా అనారోగ్య సమస్యలు తనని వేధిస్తున్నాయని, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అవడంతో కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు సమూహాలకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారని అప్పట్లోనే చెప్పారు. బీజేపీ ప్రముఖునికి పదవి బీజేపీ మేధావుల విభాగం తమిళనాడు అధ్యక్షుడు అర్జున్ మూర్తి రజనీ కొత్త పార్టీకి సమన్వయకర్తగా నియమితులయ్యారు. పార్టీ పర్యవేక్షకుడిగా గాంధీ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్‌ను నియమించారు. రజనీతోపాటు వీరిద్దరూ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. -
రజనీ ఇంటి ముందు రచ్చ..
సాక్షి ప్రతినిధి, చెన్నై: రజనీకాంత్ రాజకీయాలు మొదటి నుంచి గందరగోళంగానే సాగుతున్నాయి. కలకలం రేపే సమాచారంతో రజనీ పేరుతో వెలువడిన ఉత్తరం, రజనీకాంత్ గురువారం చేసిన ట్వీట్‌కు కొనసాగింపుగా శుక్రవారం మరికొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాజకీయాలకు స్వస్థి పలకనున్నట్లుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించనున్నట్లు సమాచారం వెలుగుచూడడంతో రజనీకాంత్ అభిమానులు చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని ఆయన ఇంటి ముందు శుక్రవారం భైఠాయించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు...రజనీ రాజకీయాల్లోకి రావాలి అంటూ నినాదాలు చేశారు. అభిమాన సంఘాలను మక్కల్ మన్రాలుగా మార్పులు చేయడంతోపాటూ సభ్యత్వ నమోదు ద్వారా రజనీకాంత్ బలోపేతం చేశారు. అ«ధ్యాత్మిక పాలనను అందిస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు. కరోనా కారణంగా ఏడునెలలుగా బాహ్యప్రపంచానికి దూరంగా మెలుగుతున్నారు. (చదవండి: రజనీ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ సస్పెన్స్) అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ఏర్పాటుపై సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు గురువారం రజనీ చేసిన ప్రకటన అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని నినాదాలు చేశారు. నిరాహారదీక్షలు చేపట్టైనా రజనీతో పార్టీ పెట్టిస్తామని రజనీ మక్కల్ మన్రం చెన్నై ఎగ్మూరు శాఖ ఉప కార్యదర్శి కే రజనీ అన్నారు. రజనీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారని నమ్ముతున్నట్లు అభిమానులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారుతుంది, రాజకీయాలు మారుతాయి అనే నినాదంతో కూడిన బనియన్లు వేసుకున్నారు. మీ ఆరోగ్యం, సంతోషం మాకు ఎంతో ముఖ్యం, వీటిని దృష్టిలో ఉంచుకుని మీరు తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తామని బీజేపీ నేత, సినీ నటి కుష్బూ ప్రకటించారు. తన ఆరోగ్య పరిస్థితిని రజనీ స్పష్టం చేశారు. రాజకీయపరమైన నిర్ణయాన్ని త్వరలో అభిమానుల ముందు ప్రకటిస్తారని చెన్నై కార్పొరేషన్ మాజీ మేయర్ కరాటే త్యాగరాజన్ చెప్పారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో మరో సరికొత్త అనధికారిక సమాచారం ప్రచారంలోకి వచ్చింది. ‘అభిమానుల తీవ్ర అసంతృప్తితో దిగొచ్చిన రజనీకాంత్ మనసు మార్చుకున్నారు..వచ్చే¯ð నెల మక్కల్ మన్రం నిర్వాహకులతో సమావేశం అవుతున్నారు...వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారీ మహానాడుతో ప్రజల ముందుకు రానున్నారు’ అని అందులోని సమాచారం. ఏది నిజం, ఏది అబద్దం అని తలలు పట్టుకోవడం రాజకీయవర్గాల వంతుగా మారింది. -
రజనీ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ సస్పెన్స్
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి వాడి వేడిగా చర్చ సాగుతోంది. రజనీ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకి బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక లేఖ తీవ్ర ఆందోళనకి, గందరగోళానికి గురి చేసింది. అయితే ఆ లేఖ తాను రాయలేదని స్పష్టం చేసిన రజనీ అందులో ఉన్న అనారోగ్య అంశాలు వాస్తవమేనన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని తనకు వైద్యులు సలహా ఇచ్చినట్టుగా రజనీ గురువారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన అనారోగ్యం గురించి ఆయన బహిరంగంగా చెప్పడం ఇదే తొలిసారి. ‘కరోనా వైరస్ ఉన్నంతవరకు నేను ప్రచారానికి వెళ్లడం మంచిది కాదని వైద్యులు సూచించారు. నా వయసు 70 ఏళ్లు. కిడ్నీ మార్పిడి జరిగింది. నా రోగనిరోధక వ్యవస్థ బాగా క్షీణించింది. బయటకి వెళితే సులభంగా కరోనా దాడి చేస్తుంది. వ్యాక్సిన్ వచ్చినా నాకు పని చేస్తుందన్న భరోసా వైద్యులు ఇవ్వడం లేదు. నేను నా ఆరోగ్యం గురించి బాధపడడం లేదు. నా చుట్టూ ఉన్న వారి క్షేమం గురించి ఆలోచిస్తున్నాను’అని మీడియాలో చక్కర్లు కొట్టిన లేఖలో ఉంది. అనారోగ్యం వాస్తవమే: రజనీ ఆ లేఖ తాను రాసినది కాదని వెల్లడించిన రజనీకాంత్ అందులో పేర్కొన్న అనారోగ్య అంశాలు వాస్తవమేనని తెలిపారు. వైద్యులు తనని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చినట్టుగా వెల్లడించారు. రజనీ మక్కల్ మంద్రమ్‌తో చర్చించిన తర్వాత సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. -
వారసులొచ్చారు..
సాక్షి బెంగళూరు/చెన్నై: రాజకీయ పార్టీల్లో ఒకే కుటుంబం పెత్తనం తరాలపాటు కొనసాగుతుందనడానికి తాజా సాక్ష్యాలివి. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్..తమిళనాట మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తనయుడు ఉదయనిధి తమ పార్టీల యువజన విభాగం బాధ్యతలు స్వీకరించారు. తద్వారా వీరు భవిష్యత్ పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రుల జాబితాలో చేరిపోయారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జేడీఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే హెచ్‌కే కుమారస్వామిని నియమించిన అధిష్టానం, యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలను సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను అప్పగించింది. నిఖిల్ ఇటీవలి ఎన్నికల్లో మాండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగి సినీనటి సుమలత చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మేరకు జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా దేవెగౌడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కాంగ్రెస్‌పైనే ఆధారపడి ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని తెలిపారు. తమిళనాడులో.. డీఎంకే చీఫ్ స్టాలిన్ తనయుడు, సినీ నటుడు ఉదయనిధి(42)ని పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా నియమిస్తూ స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. దాదాపు 35 ఏళ్లపాటు ఈ పదవిలో స్టాలిన్ పనిచేశారు. ప్రస్తుతం మురసోలి ట్రస్ట్‌కు ఉదయనిధి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే కరుణానిధి స్థాపించిన మురసోలి పత్రిక నడుస్తోంది. ఉదయనిధి ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. తాజా నియామకంతో కరుణకుటుంబంలోని నాల్గోవ్యక్తికి పార్టీలో కీలక పదవి దక్కినట్లయింది. -
బీజేపీ లేకుంటే నేను జీరో
అహ్మదాబాద్/గాంధీనగర్: తన రాజకీయ ప్రస్థానం 1982లో బీజేపీ నుంచి ప్రారంభమైందని.. పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి వరకు ఎదిగానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. తన జీవితం నుంచి బీజేపీని తీసేస్తే మిగిలేది శూన్యమేనని వ్యాఖ్యానించారు. జీవితంలో తాను సాధించింది, నేర్చుకున్నది, దేశానికి ఇచ్చింది అంతా బీజేపీ ప్రసాదించిందేనని, బీజేపీ లేకుండా తాను జీరోనే అని అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానానికి శనివారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు జరిగిన రోడ్‌షో, ర్యాలీల్లో అమిత్‌షా పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని నరేన్‌పుర వద్ద ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం నుంచి ఈ రోడ్‌షో ప్రారంభమైంది. దాదాపు 4 కి.మీ. మేర సాగిన రోడ్‌షోకు జనం లక్షలాదిగా తరలివచ్చారు. మూడు రెట్లు పెరిగిన అమిత్‌షా ఆస్తులు గత ఏడేళ్లలో తన ఆస్తులు మూడు రెట్లు పెరిగి రూ.38.81 కోట్లకు చేరినట్లు అమిత్ షా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తన, తన భార్య పేరిట రూ.23.45 కోట్ల మేర స్థిర, చర ఆస్తులున్నట్లు తెలిపారు. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో తన చేతిలో రూ. 20,633 కోట్లు, భార్య వద్ద రూ.72,578 ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరు దంపతుల పేరిట బ్యాంకులో సేవింగ్స్ రూపంలో రూ.27.80 లక్షలు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.9.80 లక్షలున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. రాజ్యసభ ఎంపీగా ఉండటంతో పాటు, అద్దెలు, వ్యవసాయం ద్వారా తనకు ఆదాయం వస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ టోపీ వద్దు! అమిత్ నామినేషన్ పత్రాలు వేయడానికి వెళ్లినపుడు సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి షా వెంట ఆయన కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. తన మనవరాలిని చేతిలోకి తీసుకున్న షా ఆమె ధరించిన టోపీని తీసేసి బీజేపీ టోపీ పెట్టగా ఆ చిన్నారి తనకు ఇష్టం లేదన్నట్లు వెంటనే తీసిపడేసింది. ఇలా మూడుసార్లు ప్రయత్నించి ఇక చేసేదేమీ లేక షా చివరకు ఆమె టోపీనే తిరిగి తొడిగి ముద్దాడారు. -
బీజేపీలో చేరిన గౌతమ్ గంభీర్
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (37) రాజకీయాల్లోకి ప్రవేశించారు. శుక్రవారం కేంద్ర మంత్రులు జైట్లీ, రవిశంకర్ల సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వం నచ్చి బీజేపీలో చేరుతున్నానని, పార్టీ సభ్యుడిగా దేశ సంక్షేమం కోసం కృషి చేస్తానని గంభీర్ తెలిపారు. దేశానికి మంచి చేయడానికి, పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఇది మంచి వేదిక అని వెల్లడించారు. అనంతరం గంభీర్ బీజేపీ పార్టీ అధినేత అమిత్ షాను కలుసుకున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన గంభీర్ బీజేపీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరనుందని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ కేడర్ విస్తరించిందని, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని పార్టీలో చేర్చుకున్నామని తెలిపారు. గంభీర్, 2011 ప్రపంచ కప్, 2007 టీ–20 ప్రపంచ కప్‌లను భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. బిహార్‌లో మహాకూటమి సీట్ల ఖరారు పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలకుగాను బిహార్‌లో మహాకూటమి సీట్ల పంపిణీ ఖరారైంది. ఇందులోభాగంగా లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ) అధ్యక్షుడు శరద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) గుర్తుపై పోటీ చేయనున్నారు. బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు గాను 20 చోట్ల లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ, 9 స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీకి ఉంచనున్నాయి. మహా కూటమిలోకి కొత్తగా వచ్చి చేరిన ఉపేంద్ర కుష్వాహాకు చెందిన లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) 5, ముకేశ్ సాహ్నికి చెందిన వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) 3 స్థానాల్లో పోటీ చేస్తాయి. మాజీ సీఎం జితేన్ రామ్ మాంఝికి చెందిన హిందుస్తా ఆవాల్ మోర్చా(హెచ్ఏఎం) మూడు చోట్ల నుంచి బరిలోకి దిగనుంది. ఆర్జేడీ తనకు దక్కిన 20 చోట్లలో ఒక సీటును సీపీఐ(ఎంఎల్)లిబరేషన్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది. అదేవిధంగా, 11 సీట్లు ఇవ్వాలంటూ మొదట్నుంచీ పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ కూడా రాజ్యసభ సీటు ఇచ్చే ఒప్పందంపై 9 స్థానాలకు దిగివచ్చింది. ఆర్ఎల్ఎస్పీకి మహాకూటమిలో చేరడంతో 5 సీట్లు దక్కాయి. బీఎస్పీ తొలి జాబితా లక్నో: బీఎస్పీ 11 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో జేడీఎస్ మాజీ నేత డేనిష్ అలీ పేరు ఉంది. జేడీఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అలీ గత వారమే బీఎస్పీలో చేరారు. రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లకుగాను ఎస్పీ– బీఎస్పీ– ఆర్ఎల్డీ కూటమిలో బీఎస్పీ 38 చోట్ల, ఎస్పీ 37, ఆర్ఎల్డీ 3 చోట్ల తమ అభ్యర్థులను పోటీకి ఉంచనున్నాయి. శుక్రవారం బెంగళూరు సెంట్రల్ ఎంపీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కుటుంబంతో వచ్చి నామినేషన్ వేస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ మధురై నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వస్తున్న ట్రాన్‌జెండర్ భారతి కన్నమ్మ -
రాజకీయాల్లోకి మిజోరం గవర్నర్!
తిరువనంతపురం: మిజోరం గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ తన పదవికి శుక్రవారం రాజీనామా సమర్పించారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కేరళ నుంచి ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజశేఖరన్ గతేడాది మేలో మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ముద్రపడ్డ రాజశేఖరన్ త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి పోటీ చేసే అవకాశముందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి పోటీచేసిన రాజశేఖరన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ చేతిలో ఓడిపోయారు. -
ప్రియాంకతో కాంగ్రెస్ నిధుల సమస్య తీరొచ్చు!
వాషింగ్టన్: ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనేది ఇప్పటి వరకు స్పష్టం కానప్పటికీ.. ఆమె రంగప్రవేశంతో ఆ పార్టీ వనరులు, నిధుల లేమి నుంచి బయటపడే అవకాశముందని నిపుణులు అంటున్నారు. నిధుల విషయంలో అధికార బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉందని వారు చెబుతున్నారు. ‘కాంగ్రెస్‌లో కొత్తగా ప్రచార బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. కానీ, ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన నిధుల కొరత తీర్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి’ అని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు మిలన్ వైష్ణవ్ అంటున్నారు. ప్రఖ్యాత ‘ఫారిన్ పాలసీ’ మేగజైన్‌కు రాసిన తాజా వ్యాసంలో ఆయన ఈ విషయం పేర్కొన్నారు. ‘కాస్ట్స్ ఆఫ్ డెమోక్రసీ: పొలిటికల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా’ పుస్తకం సహ రచయిత కూడా అయిన వైష్ణవ్.. ‘ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి నిధులు అందకపోవడంతో రాష్ట్ర విభాగాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. 2014 ఎన్నికల తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో చాలా తక్కువ విజయాలు సాధించిన ఆ పార్టీ తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఉంది. దేశ రాజకీయాలకు కీలక బిందువైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పట్టించుకోకుండా ముఖ్యమైన ఎస్పీ–బీఎస్పీ పార్టీల కూటమి ఏర్పడటం మరో దెబ్బ. ఎంతో కీలకమైన ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 41 లోక్‌సభ సీట్లున్న తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. మిగతా పక్షాలతో కలిసి ఎన్నికల్లో బీజేపీపై పైచేయి సాధించటానికి ఆ పార్టీకి అవకాశం వచ్చింది. అయితే, శ్రేణుల్లో ఉత్తేజం నింపడం, మిత్రుల్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు ఎన్నికల్లో గెలుపునకు డబ్బు ఎంతో కీలకం. ఆ పార్టీకి నిధుల కొరత ఉంది. ప్రియాంక రాకతో అది తీరే అవకాశం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
లోక్‌సభ ఎన్నికల్లో సుమలత పోటీ?
సాక్షి బెంగళూరు: మాజీ మంత్రి, కన్నడ రెబెల్‌స్టార్, దివంగత అంబరీశ్ భార్య సుమలత రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాండ్య లోక్‌సభ స్థానం నుంచి ఆమె పోటీచేస్తారని సమాచారం. ఆమె భర్త అంబరీశ్ కాంగ్రెస్‌లో కొనసాగడం తెల్సిందే. అనారోగ్యంతో ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి సుమలత పోటీ చేయాలనుకున్నా మాండ్య స్థానాన్ని సంకీర్ణంలోని జేడీఎస్ ఆశిస్తోంది. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ తదితరులు సుమలతకు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో నిలిచేందుకు ఆమె సిద్ధమని సమాచారం. కాంగ్రెస్– జేడీఎస్ కూటమిలో భాగంగా మాండ్య స్థానం నుంచి సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. సుమలత పోటీ చేస్తే నిఖిల్ గెలుపు కష్టమని రాజకీయ విశ్లేషకుల అంచనా. సుమలతకు జేడీఎస్ వర్గాల నుంచి భారీ స్థాయిలో మద్దతు ఉన్నట్లు సమాచారం. దీంతో సుమలత, నిఖిల్ మధ్య ఓట్లు చీలి చివరకు బీజేపీ గెలిచే చాన్సుందని భావిస్తున్నారు. -
4న కుంభమేళాలో పుణ్యస్నానం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 4వ తేదీన రాహుల్, ప్రియాంక కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే రోజు ఆమె తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం సోదరుడు రాహుల్‌తో కలిసి లక్నోలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఒకవేళ ఫిబ్రవరి 4వ తేదీన వీలుకాకుంటే 10వ తేదీన వసంత పంచమి రోజు కుంభమేళాకు వెళతారని సమాచారం. తోబుట్టువులిద్దరూ గంగ, యమున, అంతర్వాహిని సరస్వతీ సంగమంలో పవిత్ర స్నానాలు చేయనుండటం ఇదే ప్రథమం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కీలకంగా వ్యవహరించేందుకు ఇటీవల సోదరి ప్రియాంకకు రాహుల్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హిందుత్వ భావనపై కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి ఆవలంబిస్తోందనే అపవాదును తొలగించుకునేందుకే రాహుల్, ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, 2001లో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియా గాంధీ కుంభమేళాలో పాల్గొన్నారు. గోవాలో రాహుల్, సోనియా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం శనివారం గోవాకు చేరుకున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. రాబోయే మూడు రోజులు వీరు గోవాలోనే ఉంటారన్నారు. వీరు దక్షిణగోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బసచేస్తున్నారన్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమనీ, రాహుల్, సోనియా పార్టీ నేతలను కలుసుకోబోరని స్పష్టం చేశారు. -
తూర్పు యూపీ బాధ్యతలే ఎందుకు?
లోక్‌సభ ఎన్నికల ముంగిట ప్రియాంక గాంధీ ఎట్టకేలకు రాజకీయ అరంగేట్రం చేశారు. ఉత్తరప్రదేశ్ (తూర్పు) పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమించడం ద్వారా కాంగ్రెస్ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తూర్పు యూపీలోని 30 లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత ఇప్పుడు ప్రియాంకపై ఉంది. ఈ ప్రాంతంలోనే ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి, సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇంతకుమునుపు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్ ఉన్నాయి. తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌ల నియోజకవర్గాలు రాయ్‌బరేలీ, అమేథీల్లో ఆమె 1999 నుంచి అడపాదడపా ప్రచారం చేస్తున్నారు. ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలను కలుస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. 2007, 2012, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రియాంక ఈ రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఇలా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయకుండా పూర్తి స్థాయిలో ప్రియాంకను రాజకీయాల్లోకి దింపి బాధ్యతలు అప్పగిస్తే నాయనమ్మ ఇందిరాగాంధీలా తిరుగులేని విజయాలు సాధిస్తారనే నమ్మకం పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉంది. ముఖకవళికలు, నడక, వేష భాషల్లో ఇందిర పోలికలు ప్రియాంకలో ఎక్కువనే భావన సర్వత్రా ఉంది. 20 ఏళ్ల క్రితమే ప్రియాంకకు కాంగ్రెస్‌లో క్రియాశీల బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వచ్చినా, తన పిల్లలు ఎదిగే వరకూ ఎదురుచూడాలనే ఇంతకాలం ఆగారని పరిశీలకులు భావిస్తున్నారు. అనుకున్నట్లే కొడుకు రేహాన్(18), కూతురు మిరాయా(16)కు టీనేజ్ వయసు వచ్చాకే ఆమె క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. ► 1999లో సోనియా తరఫున ప్రచారం.. కాంగ్రెస్ కష్టకాలంలో ఉండగా జరిగిన 1999 లోక్‌సభ ఎన్నికల్లో తల్లి, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మొదటిసారి రాజీవ్ గాంధీ నియోజకవర్గమైన అమేథీ నుంచి పోటీచేసినప్పుడు ప్రియాంక ఎన్నికల ప్రచారంలో తొలిసారి పాల్గొన్నారు. ఇక, రాయ్‌బరేలీలో సమీప బంధువు అరుణ్‌నెహ్రూ బీజేపీ తరఫున పోటీచేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తన తండ్రి సన్నిహిత మిత్రుడు కెప్టెన్ సతీశ్‌శర్మ తరఫున ప్రచారం చేసి గెలిపించారు. అరుణ్ నెహ్రూ పేరెత్తకుండా, ‘ఇందిరాజీ కుటుంబానికి ద్రోహం చేసి, నా తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తే ఇక్కడ బీజేపీ అభ్యర్థి’ అంటూ ప్రియాంక నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో సోనియా భారీ మెజారిటీతో విజయం సాధించగా, అరుణ్నెహ్రూను సతీశ్‌శర్మ ఓడించారు. ఇలా ప్రియాంక రాజకీయాల మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. 2004 లోక్‌సభ ఎన్నికల తరువాత సోనియా ప్రధాని పదవిని తిరస్కరించడం వెనక రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా ఉన్నట్లు చెబుతారు. 2014 ఎన్నికల్లో అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీతో తలపడిన రాహుల్‌గాంధీ స్వల్ప మెజారిటీతోనైనా గెలవడానికి ప్రియాంక ప్రచారమే తోడ్పడిందని చాలామంది అభిప్రాయపడ్డారు. ► భర్త వ్యాపారాలతో చెడ్డపేరు! యూపీఏ హయాంలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రారంభించి రాజస్థాన్, హరియాణా, ఢిల్లీలో అక్రమంగా భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయాక వాద్రా భూ కుంభకోణాలపై విచారణ కొనసాగుతోంది. ప్రియాంక క్రియాశీల రాజకీయ రంగ ప్రవేశానికి భర్త వ్యాపార లావాదేవీలపై వచ్చిన ఆరోపణలు అడ్డంకిగా మారాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. తూర్పు యూపీ బాధ్యతలే ఎందుకు? పశ్చిమ యూపీతో పోల్చితే ఆర్థికంగా వెనుకబడిన తూర్పు ప్రాంతం రాజకీయంగా కీలకం కావడంతో నరేంద్రమోదీ వారణాసి నుంచి పోటీచేశారు. బీజేపీ, ఎస్పీ–బీఎస్పీ కూటమికి గట్టి పునాదులున్న తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తేనే ఈ పార్టీ కనీసం 20–25 సీట్ల గెలుచుకునే అవకాశం ఉంది. ఈ కారణంగానే ప్రియాంకను 30 లోక్‌సభ సీట్లున్న తూర్పు యూపీ ఇన్చార్జిగా నియమించారని భావిస్తున్నారు. అనారోగ్యం వల్ల తల్లి సోనియా వచ్చే ఎన్నికల్లో పోటీచేయకపోతే రాయ్‌బరేలీలో ప్రియాంక రంగంలోకి దిగుతారని అంచనా వేస్తున్నారు. అమేథీ, రాయ్‌బరేలీకి ఆనుకుని ఉన్న సుల్తాన్పూర్, ప్రతాప్‌గఢ్, ఉన్నావ్ స్థానాల్లో ప్రియాంక ప్రచారం చేస్తే కాంగ్రెస్ విజయావకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇందిరకు అసలైన వారసురాలు! ఆహార్యంలోనే కాకుండా మాటతీరు, నడవడికలోనూ నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పోలి ఉండే ప్రియాంకనే ఆమెకు నిజమైన వారసురాలని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గ కార్యకర్తలతో ఎంతో సులువుగా మమేకమై, వారిని ఒక్కతాటిపైకి తేవడంలో ఆమె విజయవంతమయ్యారు. ప్రియాంకకు ఇందిరా గాంధీ పోలికలు ఉండటం పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. 1972, జనవరి 12న జన్మించిన ప్రియాంక గాంధీ ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో పాఠశాల విద్యను పూర్తిచేశారు. జీసస్ అండ్ మేరీ కాలేజీలో సైకాలజీలో డిగ్రీ పట్టా పొందారు. బౌద్ధధర్మంలో ఎంఏ పాసైన ఆమె బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది. 1997లో రాబర్ట్ వాద్రాను వివాహమాడారు. వారికి కొడుకు రేహాన్, కూతురు మిరాయా ఉన్నారు. రాహుల్ వైఫల్యాన్ని అంగీకరించారు: బీజేపీ ప్రియాంక గాంధీని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వ లోపాన్ని అంగీకరించిందని బీజేపీ వ్యాఖ్యానించింది. విపక్ష కూటమిలో పలు పార్టీల చేతిలో తిరస్కరణకు గురవడంతో రాహుల్ గాంధీ ‘కుటుంబ కూటమి’ని ఎంచుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబం నుంచే కాంగ్రెస్ మరొకరికి పట్టాభిషేకం చేయడం సహజమేనని, కాంగ్రెస్‌లో కుటుంబమే పార్టీ అని, కానీ బీజేపీలో పార్టీనే కుటుంబమని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముచ్చటిస్తూ ప్రధాని మోదీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక కుటుంబం, వ్యక్తి కోరికల ఆధారంగా బీజేపీలో నిర్ణయాలు తీసుకోమని చెప్పారు. మరింత పెద్ద బాధ్యతకు అర్హురాలు ప్రియాంక స్థాయికి తూర్పు యూపీ ప్రధాన కార్య దర్శి పదవి తక్కువేనని కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఆమె మరింత విస్తృతమైన పాత్రకు అర్హురాలని పేర్కొన్నారు. ఈ నియామకం కాంగ్రెస్ దృక్కోణాన్ని తెలియజేస్తోందని, ఇది ఒక సోదరుడు(రాహుల్) సోదరిని పార్టీ పదవికి నియమించిన సందర్భమని వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ.. 2019 ఎన్నికల్లో ప్రియాంక గాంధీనే ప్రత్యేక ఆకర్షణ అవుతారన్నారు. -
ప్రియాంక రాజకీయ అరంగేట్రం
న్యూఢిల్లీ: చాలా ఏళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. గాంధీ కుటుంబం నుంచి మరో వారసురాలు అధికారికంగా రాజకీయ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా(47) బుధవారం తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో ఆమె తన సోదరుడు రాహుల్‌కు సహాయకారిగా పనిచేస్తారని వెల్లడించాయి. కాంగ్రెస్‌ను విస్మరించి ఎస్పీ–బీఎస్పీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యం పెంచడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 1980 మధ్యనాళ్ల వరకు ఉత్తరప్రదేశ్‌ను తన కంచుకోటగా నిలుపుకున్న కాంగ్రెస్ క్రమంగా ప్రభ కోల్పోయింది. ప్రియాంక నియామకంతో అక్కడ పునర్వైభవం సంతరించుకుంటామని ఆ పార్టీ ఆశాభావంతో ఉంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక తన తల్లి సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలీ నుంచి పోటీచేసే అవకాశాలున్నాయి. అలాగే, ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాను రాహుల్ గాంధీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. హరియాణా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గులాం నబీ ఆజాద్ స్థానాన్ని ప్రియాంక, సింధియా భర్తీ చేయనున్నారు. ప్రియాంక నియామకం పార్టీకి లాభిస్తుందని కాంగ్రెస్ పేర్కొనగా, బీజేపీ పెదవి విరిచింది. రాహుల్ నాయకత్వ వైఫల్యాన్ని ఆమె నియామకం సూచిస్తోందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ ఓటమిని ప్రియాంక గాంధీ కూడా తప్పించలేరని పేర్కొంది. యూపీలో సానుకూల మార్పు:రాహుల్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టడం ఉత్తరప్రదేశ్‌లో కీలక పరిణామంగా మారింది. ప్రియాంక గాంధీ నియామక ప్రకటన వెలువడగానే రాహుల్ గాంధీ అమెథీలో మీడియాతో మాట్లాడుతూ తన సోదరిపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రియాంక సమర్థురాలని, ఎన్నికల సమయంలో ఆమె తనకు అండగా ఉండబోతుండటం హర్షదాయకం అని పేర్కొన్నారు. ఆమె రాకతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఆలోచనలు, సానుకూల మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమిగా ఏర్పడిన ఎస్పీ–బీఎస్పీలపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, బీజేపీని ఓడించేందుకు వారితో కలసిపనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. గుజరాత్ అయినా యూపీ అయినా ఎన్నికల్లో దూకుడుగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత పునర్వవ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా, ఇటీవల రాజస్తాన్ సీఎంగా ఎన్నికైన అశోక్ గహ్లోత్ స్థానంలో కేసీ వేణుగోపాల్‌ను ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)గా నియమిం చింది. ఆయన కర్ణాటక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగనున్నారు. ఇప్పటికే కీలక నిర్ణయాల్లో పాత్ర.. మాజీ ప్రధాని, నానమ్మ ఇందిరా గాంధీ పోలికల్లో ఉండే ప్రియాంక రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగుపెడతారని కాంగ్రెస్ నేతలు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు.ప్రియాంక ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రాజకీయాల్లోకి వస్తారని సోనియా గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. తల్లి సోనియా, సోదరుడు రాహుల్ తరఫున అడపాదడపా ప్రచారం చేసిన ఆమె.. పార్టీ తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో పాత్ర పోషించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సీఎంల ఎంపికలో రాహుల్‌కు సలహాలిచ్చారు. పంజాబ్ కాంగ్రెస్‌లోకి మాజీ క్రికెటర్ సిద్ధూ, మన్‌ప్రీత్ బాదల్‌ను తీసుకురావడంలోచొరవ చూపారు.‘ప్రియాంక.. శుభాకాంక్షలు. జీవితంలో ఏ దశలోనైనా నీకు తోడుగా ఉంటా. నీ శక్తిమేర పనిచేసి ఉత్తమ ఫలితాలు రాబట్టు’ అని భర్త రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. భారత రాజకీయాల్లో ఎక్కువ సమయం వేచి చూసింది ప్రియాంక రాక కోసమేనని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీ (యూ) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ అన్నారు. -
కమల్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి
తమిళ సినిమా: కమలహాసన్ రాజకీయరంగప్రవేశంపై తీసుకున్న నిర్ణయానికి చివరి వరకూ కట్టుబడి ఉండాలని సీనియర్ హాస్యనటుడు వివేక్ అన్నారు. తమిళనాడులో మరో వంద రోజుల్లో ఎన్నికలు జరిగినా పోటీ చేయడానికి నేను రెడీ అంటూ నటుడు కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. ఇప్పటివరకూ పరోక్షంగా తన రాజకీయ రంగప్రవేశం గురించి చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా తన నిర్ణయాన్ని వెల్లడించడాన్ని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్వాగతిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హాస్యనటుడు వివేక్ శనివారం తన ట్విట్టర్ పేజీలో రాజకీయరంగ ప్రవేశ నిర్ణయాన్ని తీసుకున్న కమలహాసన్‌ను అభినందిస్తున్నానన్నారు. ఆయన చివరి వరకూ ఆ నిర్ణయానికి కట్టుబడాలని నిజాయితీపరుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. వచ్చేది ఎవరైనా, ఆహ్వానించడం సంప్రదాయం అయినా, ఆదరించేది ప్రజలేనని వివేక్ పేర్కొన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపైనే మరో నటుడు ఎస్వీ.శేఖర్ అన్నాడీఎంకే నేతలపై విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మైలాడుదురైలోని కావేరి పుష్కర స్నానం చేసి ఆడి కంచి శంకరస్వామిజీలను దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఎస్వీ.శేఖర్ విలేకరులతో మాట్లాడుతూ కావేరి మహాపుష్కర స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం అన్నారు. అందుకే ఇక్కడ నిత్యం 50 వేల మంది పుణ్యస్నానాలు చేస్తున్నారన్నారు. అయితే కావేరి నీరు రాకపోవడంతో కలుషిత నీటిలోనే పుణ్య స్నానాలాచరిస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఇక్కడ కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అన్నాడీఎంకే నేతలు తమ ప్రభుత్వాన్ని ,పార్టీ గుర్తును కాపాడుకోవడం పైనే దృష్టి సారిస్తున్నారని, ప్రజల గురించి పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు. రజనీ,కమల్ ఎవరైనా.. రజనీకాంత్, కమలహాసన్, విజయ్ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, అయితే వారు ప్రజలకు ఏం చేస్తారో స్పష్టం చేయాలన్నారు. -
రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న కడియం
మరిపెడ : డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన రాజకీయ రంగ ప్రవేశం గురించి నెమరు వేసుకున్నారు. మండలంలోని బీచరాజుపల్లికి చెందిన గుడిపుడి కందేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని శ్రీహరి ఆదివారం పరామర్శించారు. అనంతరం పాలకుర్తి, డోర్నకల్ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్ రెడ్యానాయక్‌తో తన రాజకీయ ప్రస్థానం గురించి గుర్తు చేస్తూ మాట్లాడారు. తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినపుడు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. అంతకుమించి మంత్రి కావడంతో పట్టలేని ఆనందంగా గడిపానన్నారు. ప్రస్తుతం ఇప్పుడు అదేరీతిలో తనకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపెల్లి రవీందర్‌రావుతో పాటు నాయకులు గుడిపుడి నవీన్, అచ్యుతరావు, మహబూబాబాద్ జేసీ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాల్లోకి యువ సినీ హీరో?
పలు సినిమాలతో తమిళనాట మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న యువ హీరో ఉధయనిధి స్టాలిన్ రాజకీయరంగ ప్రవేశం దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. డీఎంకే అధినేత కరుణానిధి మనవడు, స్టాలిన్ కొడుకుగా రాష్ట్రంలో ఆయనకు క్రేజ్ ఉంది. ఉదయ్ పొలిటికల్ ఎంట్రీ నిజమేనని డీఎంకే వర్గాలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఇప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న ఉదయనిధి స్టాలిన్.. ఇటీవల 'మనిధన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే ఉధయనిధి క్రియాశీలక రాజకీయాల్లోకి దిగితే చిత్ర పరిశ్రమలో డీఎంకే వాదిగా ముద్రపడే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే రాజకీయాల ఊసెత్తకుండా ఇన్నాళ్లూ జాగ్రత్త పడుతూ వచ్చారు. ఆ మధ్య స్టాలిన్ కూడా తనకు వారసులుగా తన కొడుకు గానీ, కూతురుగానీ రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు. ఇప్పుడు డీఎంకే వర్గాలు మాత్రం ఉదయనిధి స్టాలిన్ రాజకీయరంగ ప్రవేశం ఖాయం అంటున్నారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీనేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు తలకిందులైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ రాజకీయ వాతావరణానికి దూరంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఆయన తండ్రి ఎంకే స్టాలిన్ శాసనసభ్యుడిగా ధ్రువపత్రాన్ని అందుకోవడానికి వెళ్లినప్పుడు వెంటే వెళ్లారు. ఆ మధ్య ఎన్నికల ప్రచారానికి స్టాలిన్ తంజావూరు వెళ్లినప్పుడు ఆయనతో ఉదయనిధి కూడా వెళ్లారు. ఇదంతా చూస్తుంటే ఉదయనిధి స్టాలిన్ రాజకీయరంగప్రవేశం ఖాయం అనే స్వరం సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది.