రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న కడియం | Kadiyam reminiscence political journey | Sakshi
Sakshi News home page

రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న కడియం

Published Mon, Dec 19 2016 2:22 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న కడియం - Sakshi

రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న కడియం

మరిపెడ : డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన రాజకీయ రంగ ప్రవేశం గురించి నెమరు వేసుకున్నారు. మండలంలోని బీచరాజుపల్లికి చెందిన గుడిపుడి కందేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని శ్రీహరి ఆదివారం పరామర్శించారు. అనంతరం పాలకుర్తి, డోర్నకల్‌ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్‌ రెడ్యానాయక్‌తో తన రాజకీయ ప్రస్థానం గురించి గుర్తు చేస్తూ మాట్లాడారు. తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినపుడు ఎంతో సంతోషం కలిగించిందన్నారు.

అంతకుమించి మంత్రి కావడంతో పట్టలేని ఆనందంగా గడిపానన్నారు. ప్రస్తుతం ఇప్పుడు అదేరీతిలో తనకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపెల్లి రవీందర్‌రావుతో పాటు నాయకులు గుడిపుడి నవీన్, అచ్యుతరావు, మహబూబాబాద్‌ జేసీ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement