
‘‘రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాను’’ అన్నారు రాశీ ఖన్నా. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు ఐఏయస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. అనుకోకుండా నటిని అయ్యాను. నటిగా చాలా విషయాలు తెలుసుకోగలిగాను. ఇప్పుడు ఎలాగూ ఐఏయస్ ఆఫీసర్ అవ్వలేను. కానీ భవిష్యత్తులో పక్కాగా రాజకీయాల్లోకి వెళ్తాను. అంతకంటే ముందు ఓ ఎన్జీవో ప్రారంభిస్తాను. ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుంటాను. వాళ్ల సమస్యలు అర్థం చేసుకుని సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు. కానీ సహాయం ఎలా చేయాలో తెలుసు’’ అన్నారు రాశీ. ప్రస్తుతం తమిళంలో ‘అరన్ మణై, తుగ్లక్ దర్బార్’ చిత్రాలు చేస్తున్నారు రాశీ ఖన్నా.
Comments
Please login to add a commentAdd a comment