కార్తీతో.. ముగ్గురు భామలు? | Three Actresss In Karthi Sardar 2Movie | Sakshi
Sakshi News home page

కార్తీతో.. ముగ్గురు భామలు?

Published Thu, Aug 1 2024 1:20 PM | Last Updated on Thu, Aug 1 2024 1:20 PM

Three Actresss In Karthi Sardar 2Movie

దక్షిణాది స్టార్స్‌లో నటుడు కార్తీ ఒకరు. ఇప్పటికి 25 చిత్రాలను పూర్తి చేసిన ఈయన ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. వాటిలో మెయ్యళగన్‌ చిత్రం, వా వాద్ధియార్‌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. కాగా ప్రస్తుతం సర్ధార్‌– 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఈయన ఇంతకు ముందు నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన సర్ధార్‌ చిత్రానికి సీక్వెల్‌. 

సర్ధార్‌ చిత్రం 2022లో విడుదలై సూపర్‌హిట్‌ అయ్యింది. కాగా కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఆ చిత్రంలో నటి రాశీఖన్నా, రజీషా విజయన్‌ హీరోయిన్లుగానూ నటి లైలా ముఖ్య పాత్రలోనూ నటించారు.ఆ చిత్ర దర్శకుడు పీఎస్‌.మిత్రన్‌నే సర్ధార్‌– 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సర్ధార్‌ చిత్రాన్ని నిర్మించిన ప్రిన్స్‌ పిక్చర్స్‌ సంస్థ అధినేత ఎస్‌.లక్ష్మణన్‌నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా పోతే ఇందులో సర్ధార్‌ చిత్రంలో నటించిన రాశీఖన్నా, గానీ, రజీషా విజయన్‌ గానీ,లైలా గానీ నటించడం లేదు. ఇందులో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్లు సమాచారం. 

ఈ పాత్రల కోసం నటి ప్రియాంక మోహన్, మాళవిక మోహన్, ఆషికా రఘునాథ్‌ను నటింపజేయడానికి వారితో చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే ఇందులో నటుడు ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. జీవీ.ప్రకాశ్‌కుమార్‌  సంగీతాన్ని, జార్జ్‌ సీ.విలియమ్స్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

 కాగా ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది.  దీంతో సర్ధార్‌ చిత్రం కంటే మరింత భారీగా సర్ధార్‌– 2 రూపొందుతోందన్నమాట. కాగా నటుడు కార్తీ ఈ మూడు చిత్రాల్లోనూ ఒకదానికొకటి సంబంధం లేని వైవిధ్యభరిత కథా పాత్రల్లో కనిపిస్తుండడం గమనార్హం. 
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement