in the future
-
రాజకీయాల్లోకి రావాలనుంది
‘‘రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాను’’ అన్నారు రాశీ ఖన్నా. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు ఐఏయస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. అనుకోకుండా నటిని అయ్యాను. నటిగా చాలా విషయాలు తెలుసుకోగలిగాను. ఇప్పుడు ఎలాగూ ఐఏయస్ ఆఫీసర్ అవ్వలేను. కానీ భవిష్యత్తులో పక్కాగా రాజకీయాల్లోకి వెళ్తాను. అంతకంటే ముందు ఓ ఎన్జీవో ప్రారంభిస్తాను. ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుంటాను. వాళ్ల సమస్యలు అర్థం చేసుకుని సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు. కానీ సహాయం ఎలా చేయాలో తెలుసు’’ అన్నారు రాశీ. ప్రస్తుతం తమిళంలో ‘అరన్ మణై, తుగ్లక్ దర్బార్’ చిత్రాలు చేస్తున్నారు రాశీ ఖన్నా. -
భవిష్యత్‌లో మహిళా దలైలామా!
ముంబై: భవిష్యత్తులో మహిళా దలైలామా వచ్చే అవకాశ ముందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రబోధకులు దలైలామా అన్నారు. బౌద్ధ సంప్రదాయం చాలా ఉదారమైనదని, స్త్రీపురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం ఐఐటీ బాంబేలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘భవిష్యత్‌లో సమర్థవంతమైన మహిళ వస్తే కచ్చితంగా ఆమె మహిళా దలైలామా అవ్వచ్చు. ఎందుకంటే, బౌద్ధ సంప్రదాయం చాలా ఉదారవాదమైంది. ప్రస్తుతం భారత్, టిబెట్ దేశాల్లోని అత్యున్నత స్థానాల్లో పురుషులతో సమానంగా మహిళలు ఉన్నారు. చిన్ననాటి నుంచే మానసిక పరిశుభ్రతకు చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎందుకంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మెదడు ప్రశాంతంగా ఉండాలి. మెదడు, భావోద్వేగాలకు సంబంధించిన జ్ఞానం భారత్‌లో 3 వేల ఏళ్ల కంటే పురాతనమైంది. 3 వేల ఏళ్ల పురాతన నాగరికత కలిగిన దేశం భారత్ ఒక్కటే. మెదడుని ప్రశాంతంగా ఉంచే పద్ధతులు భారత్‌లో అప్పటి నుంచే ఉన్నాయి. ఆనందం అనేది ప్రశాంతతకు సంబంధించినది. అయితే 20వ శతాబ్దంలో అత్యంత హింస చెలరేగుతోంది. 21వ శతాబ్దం మాత్రం దీన్ని పునరావృతం చేయరాదు. దయా హృదయంతో మానవ మేధస్సు అత్యంత ఆవశక్యమైంది’ అని దలైలామా అన్నారు. -
కొత్త ఆశల వైపు..
సాగర సోయగాలను అణువణువునా సింగారించుకున్న సుందర నగరం మనది. ఉజ్వల భవిష్యత్తు దిశగా పరుగులు తీసే అద్భుత ప్రదేశం మనది. అయితే అనుకోని విపత్తు ఈ సౌందర్యాన్ని చిందరవందర చేసింది. అనూహ్యంగా ఎదురైన అవాంతరం ఈ ప్రయాణానికి అవరోధం సృష్టించింది. నిజమే.. ప్రకృతి మునుపెన్నడూ లేని రీతిలో విశాఖపై పగబట్టింది. అంతమాత్రాన ఈ పయనం ఆగదు కదా.. ఉరకలేసే జలపాతాన్ని గండశిల అడ్డుకుంటే ప్రవాహం దానిపై నుంచి పొంగిపొర్లక తప్పదు కదా! దీపశిఖ వంటి విశాఖను సుడిగాలి చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నించినంత మాత్రాన వెలుగుల వెల్లువ నిలిచిపోదుగా! సంకల్పబలం ముందు ప్రకృతి సైతం తలదించక తప్పదని విశాఖ ఇప్పటికే నిరూపించింది. ఆ మనోబలంతోనే ఈ మహానగరం పురోగమిస్తుంది. రాష్ట్ర ముఖచిత్రం మారిన నేపథ్యంలో విశాఖ ప్రాధాన్యం ఇంతింతై పెరుగుతోంది. స్మార్ట్ సిటీ చాన్స్, ఐటీఐఆర్ ఇంపార్టెన్స్ విశాఖ భవిష్యత్తుకు ఆలంబనగా నిలిస్తే, సహజసిద్ధమైన సౌందర్యం కారణంగా లభించబోయే పర్యాటక మహర్దశ విశాఖ స్వరూపాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతుంది. అందుకు ఈ కొత్త సంవత్సరమే ఆలంబన కానుంది. విశాఖ వాకిట మళ్లీ కళకళలాడనున్న మామిడాకుల తోరణం ఉజ్వల భవితకు సంకేతం కాకుంది. నేటి సూరీడి సాక్షిగా రేపటి వెలుగు కాంతులీనబోతోంది. -
బాల సంస్కార్
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఎనిమిదవ కథనమిది... మురికివాడలకు వెళ్లినపుడు మొదట మన చూపు పడేది అక్కడి పిల్లలపైనే. అక్కడి జీవన విధానం వారి భవిష్యత్తుపై ఏ స్థాయి ప్రభావం చూపుతుందో కనిపిస్తుంటుంది. అక్కడి వాతావరణం, మనుషులు, పరిసరాలు, వారి అలవాట్లు... వీటిని మార్చడం అంత సులువు కాదు. కానీ... ఆ మురికివాడల్లోని పిల్లలు, ఆలోచనలు... తద్వారా వారి జీవన విధానాన్ని మార్చగలం. ఇదే సంకల్పంతో గౌరుగారి గంగాధరరెడ్డి ఆ వాడల్లో అడుగుపెట్టారు. ‘శ్రీ శారదాధామం’ ఆధ్వర్యంలో ‘బాల సంస్కార కేంద్రాలు’ స్థాపించి రేపటి పౌరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. రాజేంద్రనగర్ మండలం పరిధిలో 21 పాఠశాలల్లో ‘బాల సంస్కార కేంద్రాలు’ ఉన్నాయి. శ్రీశారదాధామం హైస్కూలు పరిధిలో నిర్వహించే ఈ కేంద్రాల్లో ప్రతిరోజూ యోగా, మెడిటేషన్, కరాటే వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘శ్రీశారదాధామం పాఠశాల నెలకొల్పి ఇరవై ఏళ్లు దాటింది. బాల సంస్కార కేంద్రాలు నెలకొల్పి నాలుగేళ్లయింది. వెనకపడ్డ గ్రామాల్లోని పాఠశాలల్లో మా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఏదో పాఠశాలకు వస్తున్నామంటే వస్తున్నాం అన్నట్టు కాకుండా... పిల్లల మనస్తత్వం, పాఠశాలకు పంపితే పనైపోతుందనుకునే తల్లిదండ్రుల ఆలోచనా తీరుని మార్చడాన్నే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు కదిలాం. తొలుత పాఠశాలలకు వెళ్లి మా సేవా కార్యక్రమాల గురించి చెప్పి, కొంత సమయం తీసుకున్నాం. ఆ సమయాల్లో మా టీం వెళ్లి వివిధ అంశాలను బోధిస్తుంది’ అని చెప్పారు గంగాధరరెడ్డి. విద్యార్థుల సాయంతో... 21 సెంటర్లలో పేద విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పాఠాలు, దేశభక్తి గీతాలు, కథలు నేర్పడానికి కాలేజీ విద్యార్థులు ముందుకొస్తున్నారు. కొందరు గృహిణులు కూడా బోధకులుగా చేరారు. ‘మా లక్ష్యాలు ఎంత గొప్పవైనా... వాటిని అమలు చేసేవారు ఉండాలి కదా. దాని కోసం మా ప్రాంతంలో ఉండే కాలేజీ విద్యార్థులు, కొందరు చదువుకున్న గృహిణులు ముందుకొచ్చారు. దాంతో మా పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లో ఉదయం పిల్లలకు యోగా, మెడిటేషన్ వంటివి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. సాయంత్రం డ్రిల్, కరాటే వంటి శిక్షణా తరగతులు ఉంటున్నాయి’ అని చెప్పారు గంగాధర్‌రెడ్డి. వీటితో పాటు బాల సంస్కార కేంద్రాల నిర్వాహకులు నెలరోజులకోసారి మురికివాడల్లోని పిల్లలకు పాజిటివ్ హోమియోకేర్ ద్వారా ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా... చాలీచాలని సంపాదన వల్ల పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయే జీవితాలను చూస్తూనే ఉంటాం. వీరి పరిస్థితే ఇలా ఉంటే సంపాదించిన నాలుగు డబ్బులను వ్యసనాలకు ఖర్చు పెట్టే పేద తల్లిదండ్రుల కడుపున పుట్టిన చిన్నారుల సంగతి ఎలా ఉంటుందో ఊహించగలం. దీని కోసం బాల సంస్కార కేంద్రం నిర్వాహకులు ఏడాదికి రెండుసార్లు మురికివాడల్లో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నారు. చదువుకున్న పిల్లల భవిష్యత్తును వారి ముందుంచుతూ వారి భవిష్యత్తు కోసం ఎలా కష్టపడాలి.. ఏ విధంగా నడుచుకోవాలో బోధిస్తోంది. ‘ఈ కార్యక్రమం వల్ల చాలామంది తల్లిదండ్రుల్లో మార్పుని చూశాం. ముఖ్యంగా ఆడపిల్లల చదువును అర్ధంతరంగా ఆపేయడం తగ్గింది. అలాగే పదో తరగతి తర్వాత పిల్లల్ని కాలేజీకి పంపేవారి శాతం కూడా పెరిగింది’ అంటారు గంగాధర్. ఆర్థిక సాయంకన్నా అక్షర సాయం గొప్పదని నమ్మిన శ్రీ శారదాధామం పాఠశాల వ్యవస్థాపకుల లక్ష్యాలను ముందుకు తీసుకెళుతున్న బాల సంస్కార కేంద్రాల ఆశయం నెరవేరాలని మనసారా కోరుకుందాం. ప్రజెంటేషన్: భువనేశ్వరి bhuvanakalidindi@gmail.com -
స్థలకాలాలు బ్లెస్ చేస్తాయి
కథలెందుకు రాస్తారు? సాధారణంగా ఒక రచయిత రచనలను అంచనా కట్టాలంటే వాటిని ఆ రచయిత జీవించిన స్థలకాలాల్లో నిలబెట్టి అంచనా కట్టమంటారు. అంటే అతడు తన కాలానికి చెందిన ప్రజలని వ్యక్తం చేశాడా? తన స్థలం సాధకబాధకాలను రిప్రజెంట్ చేశాడా? చూడమంటారు. అవి రాయనివాడు ఏం రాసినా అనవసరమే. గురజాడ ఏ రచన చూసినా ఆయన ఏ కాలంలో ఏ ప్రజల్ని చెబుతున్నాడో తెలిసిపోతుంది. శ్రీపాద కథలు తన స్థలకాలాలకు నిలువుటద్దాలు కదా. సాధారణంగా ప్రతి మంచి రచయిత ఏం చేస్తాడంటే తన ప్రతి రచనలోనూ తన స్థలకాలాల ఆనవాలును వదిలే తీరతాడు. అతడు గతంలోకి వెళ్లొచ్చు. భవిష్యత్తులోకి కూడా వెళ్లొచ్చు. కాని ఏ వర్తమానంలో నిలుచుని ఉన్నాడో చెప్పే తీరతాడు. రెండో ప్రపంచయుద్ధాన్ని చూసిన రచయితలు ఆ యుద్ధాన్ని ఎక్కడో ఒక చోట రాయకుండా వదల్లేదు. యూదుల ఊచకోతను చూసిన రచయితలు ఆ ఊచకోతను ఏదో ఒక విధంగా రాయకుండా ఊరుకోలేదు. విప్లవానికి ముందు రష్యన్ సమాజంలో రేగుతున్న అగ్గిని చూసిన రచయితలు దానిని ఏదో ఒక మేరకు రాజేయకుండా ఊరుకోలేదు. విప్లవం వచ్చాక అందులోని పొసగని విషయాలను చూసిన రచయితలు ఏదో ఒక మేరకు వెక్కిరించి పరాయి దేశాలకు పారిపోకుండా కూడా ఊరుకోలేదు. అందరూ రచయితలే. తమ స్థలకాలాలకు నిబద్ధులు. అమెరికాలో ఇద్దరు రచయిత్రులు వేరే వేరే సమయాల్లో పుట్టారు. ఒకామె హెరియత్ బీచర్ స్టవ్. 1811లో పుట్టింది. ఊహ తెలిసినప్పటి నుంచి ఆమె చూసింది ఒకటే ఒకటి- నల్ల బానిసత్వం. ఆడవాళ్లు మగవాళ్లు పిల్లలు వృద్ధులు ఇళ్లలో పొలాల్లో పశువుల శాలల్లో... పశువుల కంటే ఘోరంగా... ప్రాణాలకు తెగించి పారిపోతే తప్ప వీళ్లకు మోక్షం లేదు. కాని యజమానులు ఆ దారి కూడా మూసేశారు.1850లో ‘ఫ్యుజిటివ్ స్లేవ్ లా’ తెచ్చారు. అంటే అమెరికాలో ఎక్కడికి పారిపోయినా పట్టుకున్నవాళ్లు తిరిగి యజమానికి అప్పగించాల్సిందే. వీళ్లను వాసన పట్టి వేటాడ్డానికి కుక్కలను కూడా ప్రవేశ పెట్టారు. ఎంత నీచం ఇది. ఇక ఆమె ఆగలేకపోయింది. ఉండబట్టలేని మనసుతో తీవ్రమైన ఆవేదనతో 1852లో నవల రాసింది. ్ఖఛ్ఛి ఖీౌఝ’ట ఇ్చఛజీ. బానిసత్వంపై తొలినవల. ప్రపంచానికి తెరిచిన కిటికీ. కొట్లాది కాపీలు అమ్ముడుపోయింది. బానిస సంస్కరణల కోసం సంకల్పించిన అబ్రహాం లింకన్‌కు స్ఫూర్తినిచ్చిందనే పేరు సంపాదించింది. అది దాని ఘనత. మరొక రచయిత్రి హార్పర్ లీ. 1926లో పుట్టింది. ఆమె కూడా ఊహ తెలిసినప్పటి నుంచి నల్లవాళ్లను చూసింది. ఇప్పుడు బానిసత్వం లేదు. కాని అడుగడుగునా వివక్ష. వర్ణ వివక్ష. రంగు మారితే మనిషి మారిపోవడం, పరిస్థితులు మారిపోవడం, అవకాశాలు మారిపోవడం. నిందలూ నేరారోపణలూ... ఇంతకు మించిన హాస్యాస్పదమైన విషయం ఏమైనా ఉందా? ఆమెకు కోపం వచ్చింది. అందరికీ వాతలు పెడుతూ 1960లో నవల రాసింది. ఎన్ని కోట్ల కాపీలు అమ్ముడుపోయాయంటే ఇప్పటికీ దీని రికార్డ్‌ను బ్రేక్ చేసే అమ్మకాలు ఏ నవలా సాధించలేదు. స్థలం ఒకటే. కాని కాలం మారింది. దానికి తగ్గట్టుగా స్పందన మారింది. తమ కాలంతో పాటు కలసి పాడాలని ఆ ఇద్దరు రచయిత్రులూ నిశ్చయించుకున్నారు. చిరాయువును పొందారు. స్థలకాలాలు అలా బ్లెస్ చేస్తాయి రచయితలని. అదిగో- అలా బ్లెస్ చేసిన ప్రతి సందర్భంలోనూ చేతులు ముడుచుకు కూచోక కలం పట్టుకుని కదను తొక్కడానికీ పాఠకుల గుండెలను తట్టి ఆ స్పందనలో సంతృప్తిని వెతుక్కోవడానికీ చాలామంది రాస్తుంటారు. రాసి నిలుస్తూ ఉంటారు. - ఖదీర్ -
బోర్డర్‌లైన్ డిజార్డర్స్... హెచ్చరించే జబ్బులు... తప్పించుకోగల ముప్పులు!!
మనిషి శరీర ఉష్ణోగ్రత 98.4 ఫారన్‌హీట్ డిగ్రీలు ఉండాలి. అంతకంటే ఏ ఒకటో రెండో డిగ్రీలు ఎక్కువైనా అది జ్వరమే గానీ... ప్రమాదకరం కాదు. కానీ ఒకవేళ ఆ ఉష్ణోగ్రత 102 ఫారిన్‌హీట్ దాటితే..? అలాగే మనలోని షుగర్ పాళ్లు పరగడుపున ఎప్పుడూ 90 - 100 లోపు ఉండాలి. ఒకవేళ ఆ సంఖ్య 126 చేరేప్పటివరకూ రోగికి మందులతో అవసరం లేకుండా... శారీరక వ్యాయామాలు, ఆహార నియమాలు తదితర పద్ధతులతోనే సరిపెడతారు డాక్టర్లు. అలాగే రక్తపోటు... ఇది సాధారణంగా 120/80 ఉండాలి. నూట ఇరవై వరకు ఉండే పై విలువను సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. కింద ఉండే 80 విలువను డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఈ విలువల్లో కొద్దిపాటి తేడాలను డాక్టర్లు పరిగణనలోకి తీసుకోరు. ఉదాహరణకు 120 ఉండాల్సిన చోట 130 పెద్ద పెరుగుదల కాబోదు. కానీ... అదేపనిగా ఎప్పుడూ ఆ ప్రెషర్ 140 కంటే పైనే ఉంటుందనుకుందాం. అప్పుడు దానికి కారణాలను పరిగణనలోకి తీసుకుని వైద్యం చేయాల్సిందే. పై ఉదాహరణలను బట్టి తెలుస్తున్న విషయం ఏమిటంటే... శరీర ఆరోగ్యాన్ని సూచించే కొన్ని అంశాల కొలతలు నిర్ణీత ప్రమాణంలో ఉండాలి. దాని కంటే కొంత పెరగడాన్ని తక్షణం పెద్ద ప్రమాదంగా పరిగణించకపోయినా... సమీప భవిష్యత్తులో వచ్చే పెను ప్రమాద హెచ్చరికగా భావించవచ్చు. జబ్బు ఒక్కసారిగా రాకుండా... తాను త్వరలో తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఇలా హెచ్చరికలు పంపుతుంటుంది. ఇటువంటి దశలో ఉన్న జబ్బులను ‘బార్డర్‌లైన్ డిజార్డర్స్’గా పేర్కొనవచ్చు. తమ హెచ్చరికలతో భవిష్యత్తు ఆరోగ్యాన్ని అప్రమత్తం చేసే ఆ జబ్బుల గురించి, అవి మరింత ముదరకుండా అవగాహన కోసమే ఈ కథనం. 1- హైపర్‌టెన్షన్ ప్రతి వ్యక్తి రక్తనాళాల్లోనూ రక్తం కొంత వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వేగం ఇలా కొనసాగాలంటే రక్తనాళాల్లో రక్తం కొంత ఒత్తిడితో ప్రవహించాలి. ఇలా రక్తానికి ఒత్తిడి ఉండాలంటే అది గుండె స్పందనల వల్ల సాధ్యమవుతుంది. గుండె స్పందిస్తోంది అంటే... అది ఒకసారి పూర్తిగా ముడుచుకుంటుందని అర్థం. రక్తనాళాల్లోకి రక్తం కొంత ఒత్తిడితో ప్రవహించడానికి గుండె రక్తాన్ని పంప్ చేసినప్పుడు మంచి రక్తనాళాల్లో (ఆర్టరీస్)లో రక్తం ఎంత పీడనంతో ప్రవహిస్తుందో తెలుసుకునే కొలత (రీడింగ్)ను ‘సిస్టోలిక్ ప్రెషర్’ అంటారు. అలాగే రెండు సిస్టోలిక్ ప్రెషర్స్ మధ్యన రక్తనాళాల్లో రక్త పీడనాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఇలా రక్తపోటుకు రెండు విలువలు ఉంటాయి. దీన్నే సాధారణంగా 120/80 గా పేర్కొంటుంటారు. ఇది సాధారణ విలువ. ప్రీ-హైపర్‌టెన్షన్: సాధారణంగా వైద్యుడి వద్దకు రోగి వెళ్లగానే చూసేది రక్తపోటు కొలతనే. ఈ కొలత 120/80 ఉంటే అది ప్రమాదరహిత స్థితిగా గుర్తించి ఇక దాని గురించి ఆలోచించరు. కానీ ఈ కొలతలు ఎప్పుడూ ఇదే దశలో ఉండకుండా మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉందనుకోండి. అలాగే కింది విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉందనుకోండి. ఆ కొలతలు ఉన్న దశను పూర్తిగా రక్తపోటు ఉన్న దశగా చెప్పలేం. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్‌టెన్షన్’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్‌టెన్షన్’ దశ భవిష్యత్తులో ప్రమాదకరమైన ‘హైబీపీ’కి దారితీయవచ్చు. వెసులుబాటు ఇదే... ప్రీ-హైపర్‌టెన్షన్‌లో ఉండే వెసులుబాటు ఏమిటంటే... రోగి వెంటనే మందులు వాడాల్సిన అవసరం లేదు. జీవనశైలిని చక్కబరచుకుని రక్తపోటును స్వాభావికంగానే అదుపులోకి తెచ్చుకునే నష్టనివారణ చర్యలు ప్రారంభించవచ్చు. తోడుగా ప్రమాదకరమైన పరిస్థితి కూడా... రక్తపోటు పెరగడం వల్ల ఏర్పడే దీర్ఘకాలిక అనర్థాలు వెంటనే కనిపించవు. పైగా రక్తపోటు పెరిగి ఉందన్న విషయం మొదట్లో అసలు రోగికి తెలియకపోవచ్చు కూడా. అందువల్ల దీనివల్ల జరిగే అనర్థాలు కొనసాగుతూ పోతాయి... ఇదో ప్రమాదకరమైన పరిస్థితి. సాధారణంగా హెచ్చరికలు పంపడం మామూలు పరిస్థితుల్లో తెలియకపోవచ్చు. అందుకే బార్డర్‌లైన్ అనే దశ హైబీపీకి ఉండి, హెచ్చరికలు పంపుతుందిలే అన్న నిర్లక్ష్యం ‘హైబీపీ’ విషయంలో కుదరదు. అందుకే నలభై దాటిన వారు అప్పుడప్పుడూ బీపీని పరీక్షించుకుంటూ ఉండి, అది పంపించే హెచ్చరికలను పరిశీలించుకుంటూ ఉండటం మేలు. హైపర్‌టెన్షన్ అనర్థాలకు కారణాలు బీపీ క్రమంగా పెరుగుతూ పోతే దీర్ఘకాలంలో జరిగే అనర్థాలు చాలా ఎక్కువే. ఉదాహరణకు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే అథెరోస్క్లిరోసిస్, గురక వల్ల మెదడుకు, గుండెకు తగినంత ఆక్సిజన్ అందని స్లీప్ ఆప్నియా, శరీరాన్ని ఉత్తేజ పరిచేందుకు ఉపయోగపడే ఎడ్రినల్ గ్రంథులు మితిమీరి పనిచేయడం, కొన్ని మందులు తీసుకోవడం (ఉదా: గర్భనిరోధకమందులు, జలుబు, నొప్పినివారణ మందుల వంటివి), మాదకద్రవ్యాలు తీసుకోవడం వంటి అనేక అంశాలు రక్తపోటును పెంచేందుకు దోహదపడే విషయాలే. రిస్క్ ఫ్యాక్టర్లు: పెరుగుతున్న వయసు, స్థూలకాయం, హైబీపీ ఉన్న కుటుంబ చరిత్ర, ఒకేచోట కుదురుగా కూర్చుని పనిచేసే జీవనశైలి, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగాకు నమలటం, మద్యం తీసుకోవడం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు హైబీపీకి రిస్క్ ఫ్యాక్టర్లు. నిర్ధారణ: తరచూ రక్తపోటును పరీక్షింపజేసుకుంటూ ఉండాలి. అది తరచు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటే దాన్ని హెచ్చరికగా భావించి వెంటనే జాగ్రత్తపడాలి. రెండు లేదా ఎక్కువసార్లు బీపీ అధికంగా ఉంటే... దాన్ని రక్తపోటుగా నిర్ధారణ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్త తీసుకోండి... ప్రీహైపర్‌టెన్షన్ అన్నది ప్రమాదకర దశ కాదు అని రిలాక్స్ కావద్దు. అది పంపే హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తం కండి. వెంటనే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోండి. ఎందుకంటే అప్పటికీ జాగ్రత్త తీసుకోకపోతే అది గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలంలో మతిమరపు, మెదడుకు సంబంధించిన సమస్యలు, మూత్రపిండాల సమస్యలను తీసుకురావచ్చు. 2- డయాబెటిస్... మనం ఏ పని చేయాలన్నా రక్తంలోని చక్కెర పాళ్లే ఆ శక్తిని సమకూరుస్తాయి. అయితే మనం ఏ పనీ చేయనప్పుడు రక్తంలోని అవే చక్కెరపాళ్లు మాయమై... భద్రపరచుకునే వ్యవస్థ ఒకటి మన శరీరంలో పనిచేస్తుంటుంది. ఇలా... రక్తంలోని చక్కెర పాళ్లను శరీరం తనంతట తానే నియంత్రించుకునే శక్తి శరీరానికి ఉంటుంది. ఒకవేళ ఈ శక్తి లోపించడం ప్రారంభమైతే...? అదే ప్రీ-డయాబెటిస్ దశ. ప్రీ-డయాబెటిస్ అంటే... శరీరం తనలోని చక్కెర పాళ్లను తనంతట తానే అదుపులోకి తెచ్చుకోలేకపోతోందనే హెచ్చరికలు పంపేందుకు సూచనగా చక్కెర కొలతల్లో కొద్దిపాటి తేడాలు కనిపిస్తాయి. నిజానికి ఆ సమయంలో రక్తంలో చక్కెర విలువలు నార్మల్ కంటే ఎక్కువగా ఉంటాయి. అది నిజంగా ఒక హెచ్చరిక లాంటిదే. ఒకవేళ అప్పటికీ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులోని పదేళ్ల వ్యవధిలో ఆ వ్యక్తికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు 50 శాతం కంటే ఎక్కువ. కాబట్టి ఇది డయాబెటిస్ వచ్చేవారికి ఒక మంచి సూచన లాంటిది. ఈ హెచ్చరిక సమయంలోనే జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని టైప్-2 డయాబెటిస్‌గా మారకుండా ముందుగానే నివారించుకునే అవకాశం ఉందన్నమాట. కారణాలు: డయాబెటిస్‌కు అనేక కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు... రోజూ ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడం లేదా తొమ్మిది గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం, కుటుంబ చరిత్రలో డయాబెటిస్ ఉండటం, శరీరంలో ట్రైగ్లిసరైడ్స్ పాళ్లు 250 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉండటం, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పాళ్లు 35 మి.గ్రా. కంటే తక్కువగా ఉండటం, రక్తపోటు, మహిళల్లో గర్భధారణ సమయంలో డయాబెటిస్ రావడం (జెస్టెషనల్ డయాబెటిస్), కడుపులో పిండం బరువు చాలా ఎక్కువగా ఉండటం (4.1 కిలోల కంటే ఎక్కువగా), మహిళకు పీసీఓడి వంటి వ్యాధులు ఉండటం, వయసు 45 ఏళ్ల కంటే అధికంగా ఉండటం వంటివి డయాబెటిస్‌కు రిస్క్‌ఫాక్టర్లు. పై కారణాలు ఉన్న పరిస్థితుల్లో రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచే హార్మోన్లను స్రవించే పాంక్రియాస్ గ్రంథి సరిగా పనిచేయకపోవచ్చు. అంటే రక్తంలోని చక్కెర పాళ్లను సరిగా అదుపు చేయగలంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవచ్చు. లేదా మన కణాలే ఆ హార్మోన్‌కు ప్రతిస్పందించడం మానేయవచ్చు. (ఈ కండిషన్‌నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు). లేదా ఈ రెండు ప్రక్రియలూ ఏకకాలంలో జరగవచ్చు. నిర్ధారణ: రక్తపరీక్షతో రక్తంలోని చక్కెర పాళ్లను తెలుసుకోవచ్చు. ఆ పరీక్షల తీరుతెన్నులివి... 1) ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ రక్త పరీక్ష: ఇందులో పరగడపున నిర్వహించిన రక్తపరీక్షలో చక్కెర పాళ్లు 100 నుంచి 125 ఎంజీ/డీఎల్ ఉండాలి. ఇది అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రమాణాల ఆధారంగా. అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 110-125 ఎంజీ/డీఎల్ ఉంటే దాన్ని ప్రీ-డయాబెటిక్ కండిషన్‌గా... అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని డయాబెటిస్‌గా పరిగణిస్తారు. 2) గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ): నోటి ద్వారా 75 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చి, దాని ఆధారంగా నిర్ణీత వ్యవధుల్లో రక్తంలోకి వెలువడే చక్కెర పాళ్లను పరీక్షించి, డయాబెటిస్ వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షలో గరిష్ట పరిమితి 140-199 ఎంజీ/డీఎల్. 3) హెచ్ బీ ఏ 1 సీ పరీక్ష: ఈ పరీక్ష నిర్వహించినప్పుడు విలువలు 5.7 - 6.4 మధ్య ఉంటే అది నార్మల్‌గా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం దాన్ని తప్పనిసరిగా డయాబెటిస్‌గా పరిగణించి, తగిన వైద్య చికిత్సలు, సూచనలు, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రీ-డయాబెటిక్ అని తేలితే ఆ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోండి. తగినట్లుగా జాగ్రత్తలు తీసుకుని, జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే రాబోయే రెండు నుంచి మూడేళ్ల వ్యవధిలో ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో 25 శాతం మంది, వచ్చే పదేళ్ల వ్యవధిలో ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో 50 శాతం మంది తప్పనిసరిగా డయాబెటిక్‌గా మారుతారు. అందుకే ప్రీ-డయాబెటిస్ అనే హెచ్చరిక సూచనలను (వార్మింగ్ సిగ్నల్స్‌ను) తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని, వాకింగ్ లాంటి వ్యాయామాలు మొదలుపెట్టడం వల్ల ప్రయోజనాలే తప్ప నష్టం ఉండదు. దీని వల్ల భవిష్యత్తులో రాబోయే ఎన్నో ఆరోగ్యపరమైన అనర్థాలను, ముప్పులను సమర్థంగా ఎదుర్కోవచ్చు. లక్షణాలు ప్రీ-డయాబెటిస్‌లో నిత్యం ఆకలిగా అనిపించడం, కారణాలు తెలియకుండా బరువు కోల్పోవడం లేదా బరువు పెరగడం, ఎప్పుడూ నీరసంగా, అలసటగా అనిపించడం, కళ్లు మాటిమాటికీ మసకబారిపోవడం, గాయాలు మానడంలో ఆలస్యం, చిగుర్లకు, మూత్రం, చర్మం లేదా ఏదైనా శరీర భాగాల్లో ఇన్ఫెక్షన్ ఉంటే అది మాటిమాటికీ తిరగబెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే విధిగా రక్తంలో చక్కెర పాళ్ల పరీక్షలు చేయించుకోవాలి. 3- ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) ఇది రాబోయే పక్షవాతానికి ఒక ముందస్తు సూచనగా భావించవచ్చు. పక్షవాతం వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయో, అవి తాత్కాలికంగా కనిపించి పోతాయి. కానీ పక్షవాతం వచ్చినప్పుడు జరిగే ఎలాంటి నష్టాలూ ఈ దశలో ఉండవు. కాబట్టి పక్షవాతం రాబోయే వారికి ఇది ముందస్తు హెచ్చరికలా భావించి, జాగ్రత్త పడటానికి ఒక చక్కని అవకాశం ఇస్తుందీ ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) అనే ఈ దశ. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్‌కు కారణాలు: 1) మెదడుకు రక్తాన్ని చేరవేసే మెడ దగ్గర ఉండే రక్తనాళాలు లేదా మెదడులోని రక్తనాళాలు బాగా సన్నబారడం 2) గుండె వద్ద ఉన్న రక్తనాళాల్లోనే రక్తం గడ్డకట్టి, ఆ రక్తపు గడ్డలు రక్తప్రవాహంతో పాటు కొట్టుకుపోయి మెదడు దగ్గర పోగుపడినట్లుగా కావడం వల్ల మెదడుకు తగినంత రక్తసరఫరా జరగకపోవడం. రిస్క్ ఫాక్టర్లు: అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉండటం, పొగతాగే అలవాటు, మద్యపానం చాలా ఎక్కువగా తీసుకోవడం, రాత్రివేళల్లో నిద్రలో గురకరావడం (స్లీప్ ఆప్నియా), రక్తంలో కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండటం నిర్ధారణ: రోగి లక్షణాల ఆధారంగా టీఐఏను నిర్ధారణ చేస్తారు. ఒక్కోసారి రోగికి ఐటీఏ లక్షణాలు ఉన్నాయని తెలిశాక... ఎమ్మారై బ్రెయిన్ (యాంజియోగ్రామ్‌తో పాటు); కెరోటిడ్ డాప్లర్ ఈసీజీ, 2డీ ఎకో, బ్లడ్ కోయాగ్యులేషన్ పారామీటర్స్ పరీక్షలు వంటివి చేస్తారు. వీటివల్ల టీఐఏ ఎందుకు వచ్చిందో తెలియడానికి ఆస్కారం ఉంది. చికిత్స: రోగికి తక్షణ చికిత్సగా రక్తాన్ని పలుచబార్చే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, అసిట్రోమ్, స్టాటిన్స్ వంటి మందులతో చికిత్స చేయాలి. ఒకవేళ రక్తనాళాలు సన్నబారడం అనే ప్రక్రియ 70 శాతం కంటే ఎక్కువగా జరిగితే ఈ వ్యాధి విషయంలో స్టెంటింగ్ లేదా ఎండరాక్టమీ వంటి చికిత్స ప్రక్రియలు అవసరమవుతాయి. లక్షణాలు అకస్మాత్తుగా ముఖంలోని ఒకవైపు బలహీనంగా అనిపించవచ్చు. ఒకవైపు చేయి లేదా కాలు బలహీనంగా అనిపించవచ్చు. కాలు, చేయి పడిపోయినట్లుగా ఉండవచ్చు. ఆ తర్వాత మాట సరిగా రాకపోవడం, నిలకడ లేకుండా నడవడం, అకస్మాత్తుగా ఒకటి లేదా రెండు కళ్లూ కనిపించకుండా పోవడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి కొద్దినిమిషాలు మొదలుకొని, గంటలోపే తగ్గిపోతాయి. 4- మినిమల్ కాగ్నిటివ్ ఇంపెయిర్మెంట్ (ఎమ్సీఐ) మీ తెలివితేటలు, జ్ఞాపకశక్తి వంటి మెదడు సామర్థ్యాలు మీరు గుర్తించేటంతగా తగ్గిపోతే దాన్ని ‘మినిమల్ కాగ్నిటివ్ ఇంపెయిర్మెంట్ (ఎమ్సీఐ) రుగ్మతగా భావించవచ్చు. ఒకవేళ ఎవరైనా తమలో ఇలాంటి లక్షణాలను గమనిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. పైన పేర్కొన్న వ్యాధి లక్షణాలు వెన్వెంటనే బయటపడవు. లేదా గుర్తించడానికి వీలుగా ఉండవు. అయితే వాళ్ల కుటుంబ సభ్యులు లేదా మిత్రుల గమనింపు ఆధారంగా వారిలో మిత్రులను గుర్తించడం, పేర్లను గుర్తుపెట్టుకోవడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని, అతడి వయసు ఆధారంగా అతడిలోని జ్ఞాపకశక్తిని అంచనా వేయవచ్చు. ఇందులో ఏవైనా తేడాలు వస్తున్నాయని తెలిసిన వెంటనే రోగిని డాక్టర్‌కు చూపించాలి. నిర్ధారణ: ఈ వ్యాధిని నిర్ధారణ చేయడానికి నిర్ణీత పరీక్ష అంటూ ఏదీ లేకపోయినా రోగి ఆరోగ్య చరిత్ర, అతడి మిత్రుల/కుటుంబ సభ్యుల నుంచి లభ్యమయ్యే సమాచారం, జ్ఞాపకశక్తి, ఏదైనా విషయంలో అతడు ప్రణాళికలు రచించే తీరు, నిర్ణయాత్మక శక్తి, ఆలోచనావిధానం, న్యూరలాజికల్ ఇవాల్యువేషన్/న్యూరోసైకలాజికల్ ఇవాల్యుయేషన్ వంటి ప్రక్రియలతో అతడు నిజంగా ఎంసీఐతో బాధపడుతున్నాడో లేదో నిర్ధారణ చేయవచ్చు. రిస్క్ ఫాక్టర్లు : పెరిగే వయసు, రోగి కుటుంబ సభ్యుల్లో అల్జైమర్స్ వంటి వ్యాధులు ఉండటం, కుటుంబ చరిత్రలో వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి లోపించే లక్షణాలు కనిపిస్తుండటం వంటివన్నీ ఎంసీఐకి రిస్క్ ఫాక్టర్లే. లక్షణాలు: ఒకవ్యక్తి పేరును ఒకటికి, రెండుసార్లు గుర్తు తెచ్చుకుంటే గానీ గుర్తురాకపోవడం వంటివి మామూలే. అయితే చాలా కీలకమైన సమాచారం కూడా మరచిపోవచ్చు. గతంలో తేలిగ్గా గుర్తుంచుకున్న అంశాలు, గత పరిచయాలను మరచిపోవడం, గతంలోలా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోవడం, ఆయా సందర్భాల్లో తగిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తార్కికమైన రీతిలో స్పందించలేకపోవడం వంటివి తరచు జరుగుతుంటే ఎంసీఐ అనే కండిషన్ ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇవే లక్షణాలు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి లక్షణాలు ఉన్నప్పుడూ కనిపించవచ్చు. అందుకే డాక్టర్‌ను సంప్రదించి తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం. చికిత్స: ఎంసీఐకి నిర్దిష్ట చికిత్స ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే దీని వల్ల రాబోయే అనర్థాలను తగ్గించడానికి, గుండెజబ్బుల రిస్క్ వంటి ప్రమాదాలను నివారించడానికి, రోగి పరిస్థితి విషమించకుండా ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో ఉంచవచ్చు. రోగితో జ్ఞాపకశక్తి పెరిగే బ్రెయిన్‌గేమ్స్ ఆడిస్తూ, పుస్తకాలు చదివిస్తూ, సుడోకు వంటి పజిల్స్ చేయిస్తూ ఉంటే పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఎంసీఐ ఉన్నట్లుగా తేలితే ప్రతి ఆరు నెలలకోమారు తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేయిస్తుండాలి. ఈ తరహా రోగులకు రివాస్టగ్మైన్, డోనెపెజిల్, గాలాంటమైన్, మెమాంటైన్ వంటి మందుల వాడకాన్ని మొదలుపెట్టాల్సి ఉంటుంది. భవిష్యత్ అనర్థ సూచన రాబోయే జ్ఞాపకశక్తి లేమి (డిమెన్షియా)కి సూచన ఎంసీఐ. భవిష్యత్తులో డిమెన్షియా తీవ్రమైతే రోగికి కలగబోయే అనర్థాలను ముందుగా హెచ్చరించేదే ఈ ఎంసీఐగా భావించవచ్చు. ఒకవేళ ఎంసీఐ అని నిర్ధారణ అయితే ఇందులో ఏడాదికి 6 - 15 శాతం రోగులు డిమెన్షియాకు (తీవ్రమైన జ్ఞాపకశక్తి లోపానికి) గురయ్యేందుకు అవకాశం ఉంది. జీవనశైలి మార్పులతో... జీవనశైలిలో మార్పులే పై అన్ని వ్యాధులకూ ఒక మంచి నివారణ. వ్యాధి ఏదైనా అది ముందస్తు హెచ్చరికలు చేసింది కాబట్టి దాన్ని మరింత ముదరకుండా చూసుకోవడం రోగి బాధ్యత. అందుకే కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో పై వ్యాధులన్నింటికీ మరింత ముదరకుండా, మరింత ఎక్కువ కాకుండా తప్పనిసరిగా నివారించుకునే అవకాశం ఉంది. అందుకు చేయాల్సింది కూడా చాలా సులభం. ఆ జాగ్రత్తలు ఏమిటంటే... ఆహారంలో ఇవి ముఖ్యం... హెచ్చరిక చేస్తున్న రోగ లక్షణాలు మనలో ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే... ఆహారంలో ఆకుకూరలు, పొట్టు ఉన్న ధాన్యంతో చేసిన పదార్థాలు, కొవ్వు తక్కువగా ఉండేవి తీసుకోవాలి. వంటల్లో ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం. వాల్నట్ వంటి ఆరోగ్యకరమైన నట్స్ వాడటం, గ్రీన్ టీ తాగడం వంటివి వ్యాధులు ముదరకుండా చూస్తాయి. మాంసాహారులు కొవ్వు తక్కువగా ఉండే చేపలు, చికెన్ తీసుకోవడం మంచిది. మేలు చేసే ఈ అలవాట్లను అందరూ నిరభ్యంతరంగా అనుసరించవచ్చు. ఆహారంలో ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించాలి. వ్యాయామం తప్పనిసరి... బరువు పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ బరువు పెరుగుతుంటే కారణాలు కనుగొని, దాన్ని నివారించుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటి ప్రక్రియలను అనుసరించాలి. ధూమపానం, మద్యపానం పూర్తిగా మానేయాలి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
గూగుల్‌ను ఆకట్టుకొన్న యంగ్ టీమ్!
భారత్ నుంచి ఉద్యోగాల కోసం అమెరికాకు వచ్చే యువత సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది... భవిష్యత్తులో వాళ్లంతా స్వదేశంలోనే సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం మొదలు పెడతారు... అని అంటాడు రాహుల్ జైన్. ‘అప్యూరిఫై’ అనే అప్లికేషన్ ద్వారా గూగుల్ ఐఎన్‌సీ నుంచి పెట్టుబడులను ఆకర్షించిన యువభారతీయ బృందంలో ఒకరు రాహుల్‌జైన్(27). జై శ్రీనివాసన్, మనీశ్‌లతో కలసి రాహుల్‌జైన్ అప్యూరిఫై అప్లికేషన్‌ను రూపొందించాడు. ఇప్పుడు ఈ బృందం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొంది. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌లో చదువు పూర్తి కాగానే రాహుల్ జైన్ జింగా అనే గేమింగ్ డెవలప్మెంట్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించాడు. చదివిన చదువు, చేస్తున్న పని అతడిలోని సృజనాత్మకతను మేల్కొల్పాయి. ఉద్యోగాన్ని వదిలి సొంతంగా కొత్త అప్లికేషన్‌ను రూపొందించాలనే ఆలోచనను కలిగించాయి. ఇలాంటి మేధోమథనం నుంచే ‘అప్యూరిఫై’ అనే అప్లికేషన్ పుట్టింది. తన స్నేహితులు ఇద్దరితో కలిసి ఆ అప్లికేషన్‌కు ప్రాణం పోసే పనిలో పడ్డాడు రాహుల్. ఇతడి అప్లికేషన్ గురించి సమాచారమందుకొన్న గూగుల్ పెట్టుబడి దారుగా రంగంలోకి దిగింది. ఆ అప్లికేషన్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్న గూగుల్ దాన్ని టేకోవర్ కూడా చేసింది. గూగుల్ మానసపుత్రిక అయిన ఆండ్రాయిడ్ అపరేటింగ్ సిస్టమ్‌లో ఆ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచడానికి ఒకింత భారీ మెత్తాన్ని చెల్లించి జైన్‌తో ఒప్పందం చే సుకొంది. దీంతో ఈ యువకుడి దశ తిరిగింది. పేరు మార్మోగింది. తన అప్లికేషన్‌ను గూగుల్‌కు అమ్మడం ద్వారావచ్చిన డబ్బును మరిన్ని స్టార్టప్‌ల మీద పెట్టుబడిగా పెడుతున్నాడు రాహుల్ జైన్. వివిధ అవసరాల కోసం మనిషికి సదుపాయంగా ఉండే అప్లికేషన్‌ను అభివృద్ధి పరచడానికి సరికొత్త అప్లికేషన్ల రూపకల్పనకు పూనుకొన్నాడు. ప్రముఖ వ్యవస్థాపకుడిగా మారాడు. ‘భారత్‌లో వ్యాపారవేత్తల్లోఎక్కువమంది ఇన్నిరోజులూ సేవారంగానికి సంబంధించిన విభాగాలపైనే దృష్టిపెట్టారు. ఔట్సోర్సింగ్ రూపంలో కార్మికవృత్తికే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయంలో మార్పు వస్తోంది. భారతీయులు తమ తెలివితేటలను విభిన్న రంగాల్లో వ్యాపారాభివృద్ధిని సాధించడానికి పెట్టుబడిగా పెడుతున్నారు...’ అనేది జైన్ విశ్లేషణ. ఈ విశ్లేషణ ఇతరుల విషయంలో ఏమో కానీ... జైన్ విషయంలో అయితే మాత్రం వంద శాతం నిజమనిపిస్తుంది. జైన్ కంఫర్ట్‌జోన్ నుంచి బయటకు వచ్చి జై శ్రీనివాసన్, మనీశ్లను కలుపుకొని అప్లికేషన్ రూపకల్పన ఆలోచన చేశాడు. ఆ సాహసమే విజయానికి దారి చూపింది. అప్లికేషన్ ఐడియా గురించి చెప్పగా గూగుల్ వెంచర్స్ వాళ్లు 1.75 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టడానికి ముందుకొచ్చారు. అనంతరం మరో 4.5 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించి ఆ అప్లికేషన్‌ను పూర్తిగా కొనేశారు. దీంతో జైన్ బృందం దశ తిరిగింది. రాజీ పడిపోయి ఉద్యోగాలు చేసుకొంటూ, కంఫర్ట్ జోన్లో ఉన్నామని ఆనందిస్తూనే, మరోవైపుగా ఆందోళన పడటం కంటే... ఆత్మవిశ్వాసం ఉంటే సాహసం చేయడమే మంచిదనేది జైన్ సిద్ధాంతం. తను ఇప్పుడు అనుసరించిన ఈ బాటనే రానున్న రోజుల్లో మరింతమంది భారతీయ యువతీ యువకులు అనురిస్తారని జైన్ భావిస్తున్నాడు. ఈ మాటల ద్వారా అనేక మందిలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. రాహుల్‌జైన్ కాన్పూర్‌కు చెందిన యువకుడు. తండ్రి ప్రభుత్వ పనులను చేసిపెట్టే కాంట్రాక్టర్. ఉద్యోగాన్ని వదిలి ఈ విధంగా అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడానికి మొదట ఇంట్లో మద్దతు లభించలేదని... అయినప్పటికీ తను రిస్క్ చేశానని జైన్ చెబుతాడు. మరి ఇప్పుడు ఆ రిస్క్‌కు తగినట్టుగా విజయాన్ని సాధించడం ఎంతో ఆనందాన్నిస్తుందని అంటాడు. -
కీలు బొమ్మలు
చెప్పుచేతల్లో ఉండేవారికే కీలక కుర్చీలు ఇప్పటికే డ్వామా పీడీ బదిలీ ఆయన స్థానంలో టీడీపీ ఎమ్మెల్యే భార్య అధికారుల బదిలీలకు టీడీపీ నేతల కసరత్తు విజయవాడ : సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ విధంగా ఆదేశించడంతో దాన్ని ఇక్కడ ‘తమ్ముళ్లు’ పాటిస్తున్నారు. భవిష్యత్తులో తమకు అనుకూలంగా పనిచేసే అధికారులను కీలక కుర్చీల్లో కూర్చోబెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు తాము చెప్పినట్టు వినే వారినే నియమించేలా పావులు కదుపుతున్నారు. మాట వినని అధికారులకు బదిలీలను బహుమానంగా ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం డ్వామా పీడీ అనిల్‌కుమార్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే సతీమణిని నియమించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఉపాధి’ కోసమేనా..! సార్వత్రిక ఎన్నికల ముందు డ్వామా పీడీగా అనిల్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కోట్లాది రూపాయలతో నిర్వహించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డ్వామా ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. కాబట్టి డ్వామా పీడీ తమకు అనుకూలంగా ఉంటే సులభంగా ‘ఉపాధి’ లభిస్తుందని తమ్ముళ్లు భావించి అనిల్‌కుమార్‌ను బలవంతంగా బదిలీ చేయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో గుంటూరు జిల్లా తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ సతీమణి మాధవీలతను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పోస్టు కోసం కొందరు రాజకీయంగా పైరవీలు చేసినా, మాధవీ లతను నియమించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. నందిగామ ఉపఎన్నిక వల్ల కోడ్ అమల్లో ఉండటంతో ఉత్తర్వులు జారీ చేయలేదని సమాచారం. కోడ్ ముగిసిన వెంటనే ఆమెను నియమిస్తారని సమాచారం. మాధవీలత గతంలో జిల్లా బీసీ సంక్షేమాధికారిణిగా పనిచేశారు. డీపీవో పోస్టుపై కూడా పైరవీలు ఖాళీగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి పోస్టు కోసం కూడా పైరవీలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇన్చార్జి డీపీవోగా డీఆర్డీఏ ఏపీడీ చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నారు. డీపీవో పోస్టు కోసం కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నలుగురు అధికారులు పోటీ పడుతున్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు డీఎల్పీవోలు కూడా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా మరో ఇద్దరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీ జిల్లా నేతలు మాత్రం తమకు అనుకూలమైనవారిని ఈ సీటులో నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్ పీడీ పోస్టుపై బేరసారాలు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టు కోసం బేరసారాలు సాగుతున్నాయి. ఖాళీగా ఉన్న ఈ పోస్టు కోసం కూడా నలుగురు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్చార్జి పీడీగా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్పమణి వ్యవహరిస్తున్నారు. ఈ కుర్చీపై కన్నేసిన కొందరు లక్షలాది రూపాయలు లంచం ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదని సమాచారం. మరికొందరు అధి కార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ నేతలు మాత్రం జిల్లా స్థాయి అధికారులతోపాటు మండల కేంద్రాల్లో పనిచేసే తహశీల్దార్లు, ఎంపీడీవోలు కూడా తమ చెప్పుచేతల్లో ఉండేవారిని నియమించేలా జాబితాలు సిద్ధం చేసినట్లు తెలిసింది. -
భూదాహం..
రూ.3 వేల కోట్ల విలువైన భూములపై పెద్దల కన్ను కారుచౌకగా కాజేసేందుకు యత్నాలు అధికారులపై ఒత్తిళ్లు విశాఖ రూరల్: జిల్లాలో ప్రభుత్వ భూములకు రెక్కలొస్తున్నాయి. వందల ఎకరాల వరకు ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇప్పటికే పరదేశిపాలెంలో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూధాన భూముల అక్రమ కేటాయింపులు వెలుగులోకి రాగా.. తాజాగా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన స్థలాలపై పెద్దల కన్ను పడింది. రూ.3 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కారుచౌకగా కొట్టేయడానికి ఫైలు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) కోసం 8 ఏళ్ల క్రితం చేసిన జీవోను అడ్డుపెట్టుకొని 316 ఎకరాలను కేవలం రూ.158 కోట్లకే కొట్టేయడానికి కొంత మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి తెరవెనుక మంత్రాంగాన్ని నడుపుతున్నట్లు భోగట్టా. ఇందుకోసం అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నట్టు సమాచారం. ఎపీఎఫ్‌డీసీకి 316 ఎకరాలు విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం భూములు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2005లో ప్రభుత్వాన్ని కోరింది. దీంతో జిల్లా అధికారులు భీమిలిలో అన్నవరం సర్వే నంబర్ 101లో 80 ఎకరాలు, కుమ్మరిపాలెం సర్వే నంబర్ 87లో 80 ఎకరాలు, కొత్తవలస సర్వే నంబర్ 73లో 154 ఎకరాలు కొండ పోరంబోకు భూములను గుర్తించారు. అన్నవరం భూములకు ఎకరాకు రూ.4 లక్షలు, కొత్తవలసలో ఎకరాకు రూ.8 లక్ష లు, కుమ్మరిపాలెంలో ఎకరాకు రూ.10 లక్షలు చొప్పున ప్రతిపాదనలు రూపొందించారు. భూ పరిపాలన ముఖ్య కమిషనర్ మాత్రం ప్రాంతం తో సంబంధం లేకుండా ఎకరాకు రూ.50 లక్షలు చొప్పున ధర నిర్ణయించారు. 316 ఎకరాలకు మొత్తం రూ.158 కోట్లు చెల్లించాలంటూ 2006, నవంబర్ 10న జీవో నెంబర్ 1650 విడుదల చేశారు. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాత్రం ఇప్పటి వరకు ఆ భూములను కొనుగోలు చేయలేదు. అందరి కళ్లు ఆ భూముల పైనే.. రాష్ట్ర విభజన తర్వాత అందరి చూపు విశాఖపైనే పడింది. హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విశాఖలో భూముల ధరలు విపరీతంగా ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో భవిష్యత్తు అభివృద్ధి విశాఖపైనే కేంద్రీకృతమై ఉంది. దీంతో ఇక్కడ భూములపై పెద్దల కళ్లు పడ్డాయి. ప్రభుత్వ భూములను కారు చౌకగా కొట్టేయడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించిన స్థలాన్ని కొట్టేసే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఆ సంస్థ కోసం చేసిన జోవోను ఆధారంగా చేసుకొని ఎకరా రూ.10 కోట్లు విలువ చేసే ఆ భూములను 2006లో ప్రతిపాదిత ధర రూ.50 లక్షలకే చేజిక్కించుకోడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారు. జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అండదండలతో వ్యవహారాన్ని నడుపుతున్నట్టు సమాచారం. రెండేళ్ల క్రితం ఒక ప్రముఖ హీరో భీమిలిలో స్టూడియో నిర్మాణానికి స్థలాన్వేషణ చేశారు. అధికారులు సైతం అత్యంత రహస్యంగా భూములను గుర్తించే పనిని చేపట్టారు. అప్పట్లో ఏపీఎఫ్డీసీ భూములను కూడా పరిశీలించారు. కానీ స్టూడియో ఏర్పాటు నిర్ణయం జరగలేదు. అధికారులపై ఒత్తిళ్లు తాజాగా రూ.3 వేల కోట్లు విలువ చేసే ఆ భూములను 2006లో నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసేందుకు ఫైలు సిద్ధమవుతోంది. ఈ విషయంలో ఒక ప్రజాప్రతినిధి అధికారులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ స్థాయిలో ఈ నిర్ణయం జరగాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ భూములను ఇతర ప్రాజెక్టులకు గుర్తించకుండా ఉండాలంటూ సదరు ప్రజాప్రతినిధి అధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. సాధారణంగా ఒక ప్రాజెక్టు కోసం కేటాయించిన స్థలాన్ని సదరు సంస్థ కొనుగోలు చేయని పక్షంలో లేదా కొనుగోలు చేసినా నిర్ణీత సమయంలో నిర్మాణాలను చేపట్టని పక్షంలో ఆ భూములను వెనక్కు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆ భూముల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా జిల్లాలో విద్యా సంస్థలు, ఇతర ప్రాజెక్టు కోసం రెవెన్యూ అధికారులు జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నారు. ఇందులో ఏపీఎఫ్‌డీసీకి కేటాయించిన భూములను చేర్చకూడదంటూ అధికారులపై ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేటాయింపుల నిర్ణయం ప్రభుత్వ స్థాయిలో జరగాల్సి ఉంటుందని, ఇందులో తమ పాత్ర నామమాత్రమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. -
ప్రతి అడుగులో.. కొత్తదనం
ఎస్పీబీఎంతో మహానగరానికి కొత్త హంగులు ఉద్యోగుల సహకారంతో జనానికి మెరుగైన సేవ వారంలో రెండు రోజులు పాతబస్తీ వాసుల కోసమే సాక్షి ఇంటర్వూ ్యలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సాక్షి, సిటీబ్యూరో ప్రతినిధి : ‘అనేక ఆశలు, ఆకాంక్షలు, సమస్యలు, సవాళ్లు నేడు హైదరాబాద్ జనం మదిలో మెదిలే ప్రధాన అంశాలు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అన్నింటా కృషి చేస్తుంది. ప్రతి అడుగులో అభివృద్ధి, సంక్షేమంతో కూడిన కొత్తదనం నింపుతూ రేపటి భవిష్యత్తుకు బాటలు వేస్తాం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో కీలక రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా నియమితులైన మహమూద్ గురువారం సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రేపటి హైదరాబాద్ కోసం తమ ప్రభుత్వం చేపట్టబోయే పథకాలు, తమ ముందున్న లక్ష్యాలు, సవాళ్లను ఆయన వివరించారు. అవేంటో ఆయన మాటల్లోనే.. హైదరాబాద్‌కు సరికొత్త ఇమేజ్ తెస్తాం హైదరాబాద్‌కు ప్రపంచ చిత్రపటంలో ఇప్పటికే ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వం కలిగిన అతికొద్ది నగరాల్లో భాగ్యనగరి అగ్రభాగంలో ఉంది. అయితే ఇక్కడ స్థిరపడుతున్న వారి సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో 1930వ దశకంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వరంలో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు ద్వారా ఏర్పాటు చేసిన రహదారులు, నాలాలు, మంచినీటి పైపులైన్లే ఇప్పటికీ పెద్ద దిక్కు. శివార్లలో అయితే మంచినీరు, రహదారి, వీధిలైట్ల పరిస్థితి తక్షణం మెరుగవ్వాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో హైదరాబాద్‌కు సరికొత్త ఇమేజ్ తెచ్చే దిశగా కార్యాచరణ మొదలైంది. నగర మంత్రిగా నాకూ ఆ కార్యాచరణలో భాగం పంచుకునే అవకాశం దక్కింది. రోడ్లు, మంచినీరు, విద్యుత్, పక్కా ఇళ్ల (సడక్, పానీ, బిజిలీ, మకాన్- ఎస్పీబీఎం)పై దృష్టి సారించి నగరాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. సత్వర సేవలకు యాక్షన్‌ప్లాన్ రెవెన్యూ శాఖతో పాటు మహానగర పరిధిలో అన్నింటా పౌరులు, పారిశ్రామికవేత్తలకు సత్వర సేవలు అందించేందుకు ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ను ప్రభుత్వం రూపొందించబోతోంది. ఉదాహరణకు నేను ఇటీవల సింగపూర్‌కు వెళ్లినప్పుడు 21 అంతస్తుల భవన నిర్మాణానికి గంటల్లో అన్ని అనుమతులు వచ్చేశాయి. మన హైదరాబాద్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అలాగే నూతన పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ పలు అవాంతరాలున్నాయి. ఇక ముందు సత్వర సేవలను అందించేదుకు కేసీఆర్ ప్రభుత్వం వినూత్న ప్రణాళికలను ముందుకు తేబోతుంది. అయితే కొత్తగా ఏర్పాటైన కొత్త రాష్ట్రం అన్నింటా ముందుకు వెళ్లాలంటే అంతటా బాధ్యతాయుతమైన వాతావరణం ఉండాలి. అందుకే నగరాభివృద్ధిలో కీలకమైన ఉద్యోగులు, సిబ్బందిని మేము మా కుటుంబసభ్యులుగానే భావిస్తూ వారితో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాం. ఇటీవల సీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశంలోనూ రెండు కోట్ల జనానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రణాళిక రూపొందించమని అధికారులను ఆదేశించ డం జరిగింది. ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యం నిజాం నవాబు.. నగరంలోని వేల ఎకరాల భూములు, భవంతులు అప్పటి ప్రభుత్వానికి అప్పగించారు. ఆ భూములు, భవనాలు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకుని, వాటిని ప్రజా అవసరాలకు వినియోగించడం, మిగిలిన వాటిని పరిరక్షించడం చేయాలన్నది మా లక్ష్యం. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదు. న్యాయ వివాదాల్లో ఉన్న భూముల వివరాలు తెలుసుకుని ఉన్నత న్యాయస్థానాలకు అప్పీళ్లు వేస్తాం. మహానగర పరిధిలో రెవెన్యూ శాఖలో జవాబుదారీతనం, పారదర్శకత, సత్వర సేవల కోసం యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి వీలైనంత త్వరలో లోపాలు లేని సుపరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ప్రజలకు అందుబాటులో ఉంటా.. పద్నాలుగా సంవత్సరాల పోరాటం అనంతరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రంలోనూ ప్రజలు కోరుకున్న ప్రభుత్వమే కొలువుదీరింది. ఇంతటితో ప్రజల పని అయిపోయింది. మేమిక వారి సంక్షేమం, అభివృద్ధి చూసుకోవాలి. అధికారం వచ్చింది కదా అని ప్రజలకు దూరం వెళ్లాలనుకోవటం లేదు. సౌభ్రాతృత్వం - సమానత్వం, దాపరికం లేని పరిపాలన అనే ఎజెండాతో మహానగర ప్రజలకు నేను నిత్యం అందుబాటులో ఉంటా. ఈ ఆదివారం బాధ్యతలు తీసుకుంటా. అధికారులతో సమావేశాలు, సమీక్షల సమయం మినహాయిస్తే మిగిలిన సమయమంతా నగర ప్రజలకే కేటాయిస్తాం. శని, ఆదివారాల్లో అయితే ఆజంపురాలోనే పాతనగర వాసుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తాం. -
పిల్లల కోసం బళ్లో...
స్ఫూర్తి అప్పుడెప్పుడో కాలేజీ బుల్లోడు అనే సినిమా వచ్చింది. కోట్ల ఆస్తి ఉండి కూడా కొడుకుని దార్లో పెట్టడానికి ఏఎన్నార్ కాలేజీలో చేరతారు. ఆ వయసులో కాలేజీకి వెళ్లడమేంటి, సినిమా కాబట్టి సరిపోయింది అనుకున్నారంతా. కానీ సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా అలా జరుగు తుందని ముంబైకి చెందిన జయశ్రీ కానమ్ నిరూపించింది. నలభయ్యొక్కేళ్ల వయసులో జయశ్రీ బడిలో చేరింది. అయితే ఏఎన్నార్లాగా పిల్లల్ని దారిలో పెట్టడానికి కాదు.. తన ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తునూ తీర్చిదిద్దడానికి! చిన్నప్పుడు ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసింది జయశ్రీ. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేసేది. యుక్త వయసు వచ్చిన తరువాత జయంత్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడ పిల్లలకు తల్లయ్యింది. అంతా ఆనందంగా ఉంది అనుకున్న సమయంలో ఆమె జీవితం అల్లకల్లోలం అయ్యింది. 2005లో... ఆఫీసు నుంచి ఇంటికొస్తున్న జయంత్ హఠాత్తుగా వచ్చిన వరద నీటిలో చిక్కుకుని మరణించాడు. దాంతో కూతుళ్ల బాధ్యత జయశ్రీ మీదే పడింది. ఇళ్లల్లో వంట పని చేస్తూ కూతుళ్లను చదివించసాగింది. అంతలో అనుకోకుండా అంగన్వాడీలో పనిచేసే అవకాశం వచ్చింది జయశ్రీకి. అక్కడ చిన్న పిల్లలకు తనకు తెలిసిన చదువు చెప్పేది. ఆమె తెలివితేటలను గుర్తించిన ఓ ప్రభుత్వాధికారి, ‘నువ్వు చదువుకుని ఉంటే ఇంకా మంచి పని ఇప్పించే వాడిని, పిల్లల్ని ఇంకా బాగా పెంచుకునేదానివి’ అన్నారు. అంతే... ఆ క్షణమే ఆమె చదువుకోవాలని నిర్ణయించుకుంది. జయశ్రీ పెద్ద కూతురు షీతల్ ఇంటర్ చదువుతోంది. రెండో కూతురు శ్వేత ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసింది. కూతురితో పాటే జయశ్రీ కూడా పరీక్షలు రాసింది. డిగ్రీ కూడా చేస్తానంటోంది. ఇన్నేళ్ల తరువాత చదువుకుంటు న్నందుకు సంతోషపడటం లేదామె. తన కూతుళ్ల కోసం చదువుకుంటున్నందుకు సంబరపడుతోంది. తమ కోసం కష్టపడుతోన్న తల్లికి షీతల్, శ్వేతలు సహాయ పడుతున్నారు. తాము కూడా బాగా చదివి తల్లిని మహరాణిలా చూసు కుంటామంటున్నారు. అమ్మ రుణం తీర్చుకోవడానికి వాళ్లు ఆ మాత్రం చేయకుండా ఎలా ఉంటారు! -
తుమ్మపాల.. పీడకల
మొరాయిస్తున్న పురాతన యంత్రాలు 30 వేల టన్నుల లోపే గానుగాట ? లక్ష టన్నుల లక్ష్యం ఫలించని స్వప్నం 8 శాతం లోపు రికవరీతో కలవరం ఏ క్షణం ఏమవుతుందోనన్న భయం డెబ్భై ఐదేళ్లుగా అనకాపల్లి కీర్తికి నిలువెత్తు నిదర్శనం.. దశాబ్దాలుగా వేలాది మంది రైతులకు ఆధారం.. తుమ్మపాల చక్కెర కర్మాగారం! కానీ అంత ప్రశస్తి ఉన్న ఈ అన్నదాత ఆశాకిరణం ఇప్పుడు వెలవెలపోతోంది. కాలం చేసిన మాయాజాలం కారణంగా పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తోంది. మూలకు చే రే తీరులో ఉన్న యంత్రాలు చీటికీ మాటికీ మొరాయిస్తుండడంతో భవిష్యత్తు భయపెడుతోంది. గానుగ లక్ష్యం దిగజరిపోతోంది. రికవరీ శాతం కలవరపెడుతోంది. లక్ష టన్నుల క్రషింగ్ దేవుడెరుగు.. అందులో పావుసగం సాధిస్తే గొప్పేనన్న నిర్లిప్తత నీరసం కలిగిస్తోంది. అనకాపల్లి, న్యూస్‌లైన్: చేరువలో ఉన్న గోవాడ దూసుకు పోతూ ఉంటే, అనకాపల్లి వి.వి.రమణ (తుమ్మపాల) సహకార చక్కెర కర్మాగారం మాత్రం పడుతూ లేస్తూ పయనం సాగిస్తోంది. సుమారు 75 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కర్మాగారాన్ని యాంత్రిక వైఫల్యం శాపంలా వెంటాడుతోంది. కాలం చెల్లిన యంత్రాలు మొరాయిస్తుండడంతో ఏటేటా రికవరీ శాతం తగ్గిపోతోంది. లక్ష టన్నుల క్రషింగ్ కలేనన్న అభిప్రాయం బలపడుతోంది. పరువు కాపాడుకునేందుకైనా గానుగాట నిర్వహించాలని ముందుకు వచ్చిన తుమ్మపాల కర్మాగారానికి మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకవైపు చెరకు కొరత, మరొక వైపు సాంకేతిక సమస్యలు జంటగా వెంటాడుతున్నాయి. లక్ష టన్నుల మాట అటుంచి కనీసం గతేడాది చేపట్టిన క్రషింగ్ లక్ష్యాన్ని అధిగమించగలమా అనే అనుమానం తుమ్మపాల యాజమాన్యాన్ని వేధిస్తోంది. 30 వేల టన్నుల లోపే? ఆశలు ఎన్ని ఉన్నా, వెంటాడుతున్న వాస్తవాలతో యాజమాన్యం బెంబేలెత్తుతోంది. తుమ్మపాల కర్మాగార ప్రస్తుత సీజన్ క్రషింగ్ 30 వేల టన్నుల లోపే ఉంటుందని ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం 25 వేల టన్నుల వరకు క్రషింగ్ చేపట్టినప్పటికీ రికవరీ శాతం దయనీయంగా మారింది. కేవలం 7.92 రికవరీ శాతం నమోదవుతున్న పరిస్థితుల్లో ఎంత గానుగాడినా ఆస్థాయిలో నష్టాలే వస్తాయని ఆర్ధిక నిపుణుల అంచనాగా ఉంది. ఈ నేపథ్యంలో గానుగాటను ఎంత పొడిగించినా లాభం లేదని ఇప్పటికే కర్మాగార వర్గ్గాలు ఒక అంచనాకు వచ్చాయి. ఇదే సమయంలో చెరకు కొరత ఆందోళన కలిగిస్తోంది. క్రషింగ్ ఏరోజైనా ముగించే పరిస్థితి కనిపిస్తోంది. అటు ఉత్సాహం.. ఇటు నీరసం పక్కనున్న గోవాడ కర్మాగారం దూసుకుపోతోంది. 3 లక్షల టన్నుల గానుగాటతో 9.27 రికవరీ శాతం నమోదయింది. తుమ్మపాల తీరు మరీ తీసికట్టుగా ఉంది. 25 వేల టన్నులు గానుగాడి 7.92 రికవరీ శాతం నమోదయిందంటే పరిస్థితి అర్ధమవుతుంది. వెంటాడుతున్న బకాయిల భయం, సిబ్బంది జీతాల సమస్య, కానరాని ఆధునికీకరణ నిధులు, చేరని క్రషింగ్ లక్ష్యం .. భవిష్యత్తు భయంగా ఉంది. రాజకీయంగా కూడా అనిశ్చిత వాతావరణం ఉండడంతో రాబోయే ప్రభుత్వం ద్వారానే తుమ్మపాలకు మేలు జరగాలని అన్ని వర్గాల వారు భావిస్తున్నారు. -
ఆరోగ్య ఛత్రం
కేజీహెచ్‌కు మాస్టర్‌ప్లాన్ ఒకే గొడుగు నీడలో కీలక వైద్య సేవలు ఆర్కిటెక్ట్ సంస్థ నియామకం ఆస్పత్రిల్లో ఖాళీ స్థలాల గుర్తింపు ఇకపై భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగానే నిర్మాణాలు ముందుగా రేడియాలజీ, వైద్య పరీక్షలన్నీ ఒకేచోట ఏర్పాటుకు నిర్ణయం విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామారావును కేజీహెచ్ క్యాజువాల్టీకి తీసుకువచ్చారు. అతనికి అత్యవసరంగా రక్తం ఎక్కించాలని క్యాజువాల్టీలో చెప్పారు. దీంతో రక్తం కోసం అన్నీ వెతుక్కుని బ్లడ్‌బ్యాంకుకు పరుగెత్తారు. తీరా అక్కడికి వెళ్తే బ్లడ్ గ్రూప్ కోసం క్లినికల్ ల్యాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకుని క్యాజువాల్టీకి వచ్చేసరికి బాగా టైం పట్టింది. ఈలోగా రామారావు పరిస్థితి మరింత విషమించింది. ఒక్క రామారావే కాదు వివిధ రోగాలతో వచ్చేవారికీ పరీక్షల పేరుతో వివిధ బ్లాకులకు వెళ్లొచ్చేసరికి కాలయాపన జరుగుతోంది. దీనివల్ల రోగి పరిస్థితి క్షీణించడమే కాకుండా అతడి బంధువులకు బోలెడు శ్రమ..ఒత్తిడి ఎదురవుతోంది. ఇకమీదట ఇలాంటి అవస్థలకు తెరదించాలని ప్రభుత్వ యంత్రాంగం సంకల్పించింది. కేజీహెచ్‌లో కీలక సేవలన్నీ ఒకే చోట అందించాలని ప్రతిపాదన సిద్ధమవుతోంది. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి అంగీకారం లభించింది. ఆర్కిటెక్ట్ సంస్థ నియామకం కూడా పూర్తయింది. ప్రస్తుతం అన్ని సదుపాయాలున్నా.. ల్యాబొరేటరీల నుంచి వైద్య విభాగాలు వరకు అన్నీ గందరగోళంగా ఉన్నాయి. అత్యవసర వైద్య విభాగాలు ఒకచోట, వైద్య పరీక్షలు మరోచోట, బ్లడ్‌బ్యాంక్ ఇంకోచోట.. ఇలా వైద్యం కోసం కేజీహెచ్‌కు వస్తే ఒక్కోదానికి ఒక్కో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర వైద్యం కోసం క్యాజువాల్టీకి వచ్చిన వారు వీటి చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం పడుతుంది. అత్యవసర వైద్యసేవలన్నింటినీ ఒకే చోటుకు తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. క్యాజువాల్టీ, బ్లడ్‌బ్యాంక్, రేడియాలజీ, ఐసీయూ, 24 గంటల ల్యాబొరేటరీ ఇలా ప్రధానమైన వన్నింటినీ ఒకే బిల్డింగ్‌లో ఏర్పాటు చేయాల్సిన అవసరముందని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వైద్యులకు సూచించారు. ఆ దిశగా ప్రతిపాదనలను వేగవంతం చేస్తున్నారు. గైనకాలజీవార్డు ఎదురుగా ఉన్న మెడ్‌ఆల్ డయాగ్నస్టిక్స్ సెంటర్ భవనంపైన అదనపు అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందులో ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని ముందు భావించినప్పటికీ కొత్త ప్రతిపాదనల దృష్ట్యా అన్ని రకాల స్కాన్లు, రేడియాలజీ, ఇతర వైద్య పరీక్షా విభాగాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే కేజీహెచ్‌లో ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, శిథిలావస్థకు వచ్చిన భవనాలు, ఇతరత్రా వాటిపై ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. -
ఆమెలోని విపరీత ధోరణి మారేదెలా?
నేనొక సాఫ్ట్వేర్ కంపెనీకి డెరైక్టర్ని. అందమైన భార్య, బుద్ధిమంతులైన పిల్లలు, అంతా సంతోషంగా గడిచిపోతోందనుకుంటున్న తరుణంలో జరిగిన కొన్ని సంఘటనలు మా కుటుంబాన్ని కూల్చేలా పరిణమించాయి. ఏమిటంటే... ఉద్యోగరీత్యా నేను తరచు క్యాంప్‌లకు వెళుతుంటాను. ఒక్కోసారి రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంటుంది. ఈ తరుణంలో ఒకసారి నా భార్య నా స్నేహితునితో చాలా ‘క్లోజ్’గా ఉండ గా నా తల్లిదండ్రుల కంటబడింది. తనని క్షమించమని, ఇంకెప్పుడూ అలా చెయ్యనని ప్రాధేయపడింది. కొన్నాళ్లకు అంతా సజావుగా ఉందనుకునేంతలోనే మరో‘సారీ...’ మామూలుగా ఆమె చాలా మంచిది. కానీ ఈ ఒక్క విషయంలోనే... ఏదైనా తీవ్రనిర్ణయం తీసుకుంటే నా పిల్లలు బాధపడతారని ఆలోచిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోవడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - అజిత్, హైదరాబాద్ మీ శాంతం, సహనం ప్రశంసనీయం. పిల్లల భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయం మెచ్చదగ్గది. మీది చాలా నిశితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన తీవ్రమైన సమస్య. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ భార్య సైక్లోథైమిక్ డిజార్డర్ అనే సమస్యతో బాధపడుతోందని అర్థమవుతోంది. ఇది బైపోలార్ డిజార్డర్‌కు తీవ్రరూపం. ఈ స్థితిలో పేషెంట్లు రకరకాలైన భావోద్వేగాలు కలగలసిన మైండ్‌తో ఉంటారు. మంచి మూడ్‌లో ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటూ, మంచి పనులు చేయాలని కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుపోతారు. ఈ ప్రపంచాన్నే జయించగలమన్నంత ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆ సమయంలోనే కొత్త కొత్త స్నేహితులను, సంబంధాలను పెంచుకుందామనుకుంటారు. ఒకదశలో అది శృతిమించి, వారితో రకరకాలైన రిలేషన్స్‌ను పెంచుకునే స్థాయికి వెళతారు. ఒకవేళ వారు ఇంటర్నెట్ను, సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లను వాడేవారైతే గనుక ఈ ధోరణి వెర్రితలలు వేస్తుంది. అపరిచితులను కూడా ఇంటికి ఆహ్వానించేంత తీవ్రస్థాయిలో వీరి భావోద్వేగాలుంటాయి. ఆ స్నేహితులు వీరి మూడ్‌ను అదనుగా చేసుకుని క్యాష్ చేసుకుంటే మనం చేయగలిగిందేమీ ఉండదు. అదే వీరి మూడ్ బాగోకపోతే మాత్రం నిరుత్సాహం, నిరాశానిస్పృహలతో కుంగిపోతారు. తమవల్ల ఏదైనా చిన్న తప్పు జరిగినా, అందుకు పదే పదే క్షమాపణలు కోరతారు. ఒకోసారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లి, నిస్సహాయ ధోరణికి మారిపోతారు. ఆత్మన్యూనతతో బాధపడుతుంటారు. ఒక తరుణంలో ఆత్మహత్యకు కూడా పాల్పడతారు. కుటుంబసభ్యులు ఇటువంటి పేషెంట్లలోని మూడ్స్‌ను గమనించి, అందుకు అనుగుణంగా నడుచుకోవడం అవసరం. వారిని తీవ్రంగా మందలించడం, కోప్పడటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండకపోగా, మరింత కుంగిపోతారు. మీ శ్రీమతి స్వతహాగా మంచిదేనంటున్నారు, స్వభావం కూడా చెడ్డది కాదంటున్నారు కాబట్టి, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఆమె ఎందుకిలా ప్రవర్తిస్తోందో అర్థమవుతుంది. ఇదే సమయంలో మీ శ్రీమతి విషయంలో మీరు సానుభూతి చూపడం, క్షమాగుణంతో వ్యవహరించడాన్ని కొనసాగించడం అవసరం. ఆమెను వెంటనే సైకియాట్రిస్ట్‌కు చూపించి, వారి సలహా మేరకు మెడికల్ ట్రీట్మెంట్, కౌన్సెలింగ్ ఇప్పించండి. విష్ యు ఆల్ ది బెస్ట్. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్