లోక్‌సభ ఎన్నికల్లో సుమలత పోటీ? | Sumalatha Ambarish Political Entry | Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో సుమలత పోటీ?

Jan 31 2019 5:44 AM | Updated on Mar 9 2019 3:34 PM

Sumalatha Ambarish Political Entry  - Sakshi

సాక్షి బెంగళూరు: మాజీ మంత్రి, కన్నడ రెబెల్‌స్టార్, దివంగత అంబరీశ్‌ భార్య సుమలత రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాండ్య లోక్‌సభ స్థానం నుంచి ఆమె పోటీచేస్తారని సమాచారం. ఆమె భర్త అంబరీశ్‌ కాంగ్రెస్‌లో కొనసాగడం తెల్సిందే. అనారోగ్యంతో ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్‌ నుంచి సుమలత పోటీ చేయాలనుకున్నా మాండ్య స్థానాన్ని సంకీర్ణంలోని జేడీఎస్‌ ఆశిస్తోంది. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ తదితరులు సుమలతకు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో నిలిచేందుకు ఆమె సిద్ధమని సమాచారం. కాంగ్రెస్‌– జేడీఎస్‌ కూటమిలో భాగంగా మాండ్య స్థానం నుంచి సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్‌ పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. సుమలత పోటీ చేస్తే నిఖిల్‌ గెలుపు కష్టమని రాజకీయ విశ్లేషకుల అంచనా. సుమలతకు జేడీఎస్‌ వర్గాల నుంచి భారీ స్థాయిలో మద్దతు ఉన్నట్లు సమాచారం. దీంతో సుమలత, నిఖిల్‌ మధ్య ఓట్లు చీలి చివరకు బీజేపీ గెలిచే చాన్సుందని భావిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement