Abishek Ambareesh, Aviva Bidapa to tie the knot on June 5 - Sakshi
Sakshi News home page

Abishek Ambareesh: పెళ్లిపీటలెక్కనున్న సీనియర్‌ నటి తనయుడు, ఆరోజే వివాహం

Published Sat, May 20 2023 3:20 PM | Last Updated on Sat, May 20 2023 4:13 PM

Abishek Ambareesh, Aviva Bidapa Wedding Date Out - Sakshi

ప్రముఖ దివంగత నటుడు అంబరీష్‌, సుమలతల తనయుడు అభిషేక్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎంటర్‌ప్రెన్యూర్‌ అవివా బిడప్పతో ఏడడుగులు వేయనున్నాడు. బెంగళూరులో జూన్‌ 5న వీరి వివాహం జరగనుంది. ఆ తర్వాత రెండు రోజులకే గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇటు అభిషేక్‌ తల్లి సుమలత అటు వధువు పేరెంట్స్‌, ఫ్యాషన్‌ డిజైనర్స్‌ ప్రసాద్‌ బిడప్ప, జుడిత్‌ ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టారు.

అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వివాహానికి సినీ,రాజకీయ ప్రముఖులు విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా అభిషేక్‌, అవివా కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్లికి రెడీ అయ్యారు. గతేడాది డిసెంబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఫంక్షన్‌కు పలువురు సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేసిన సంగతి తెలిసిందే!


అభిషేక్‌, అవివాతో సుమలత

అభిషేక్‌ పేరెంట్స్‌ బ్యాగ్రౌండ్‌..
1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు అంబరీష్‌, సుమలత. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్‌ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్‌ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్‌ రాజకీయంగానూ చురుకుగానే ఉండేవారు. 2018 నవంబర్‌ 24న అంబరీష్‌ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది.


సుమలత, అంబరీష్‌

తండ్రీకొడుకులకు ఎదురైన బాధా సంఘటన
1978లో పదువరల్లి పాండవురు అనే కన్నడ చిత్రం షూటింగ్‌ చేస్తున్న సమయంలో అంబరీష్‌ తండ్రి మరణించారు. ఆయన అంత్యక్రియలను పూర్తి చేసి మూడు రోజుల్లో తిరిగి షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు అంబరీష్‌. తండ్రికి ఎదురైన పరిస్థితే తర్వాత కొడుక్కి కూడా ఎదురైంది. అమర్‌ సినిమా షూటింగ్‌ సమయంలో అంబరీష్‌ చనిపోయారు. ఆయన అంత్యక్రియలను దగ్గరుండి జరిపించిన అతడు మూడు రోజుల్లో తిరిగి షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. కుటుంబానికి వచ్చిన కష్టం నిర్మాతకు నష్టంగా మారకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ప్రస్తుతం అభిషేక్‌ బ్యాడ్‌ మేనర్స్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్‌ కానుంది.

చదవండి: మంచి జోడీ కోసం వెతుకున్న సమంత

ఇదంత సులువేమీ కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement