దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సుమలత ఈ ఎలక్షన్లలో తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసి ఘన విజయం సాధించారు. అంబరీష్ మరణంతో రాజకీయ తెర మీదకు వచ్చిన సుమలత, తన భర్త పోటి చేసిన మాండ్య నియోజిక వర్గం నుంచే బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్‌ల పోత్తు కారణంగా మాండ్య సీటును కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌కు వదిలేసింది.
అక్కడి నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి తనయుడు, యువ హీరో నిఖిల్ గౌడ జేడీఎస్ తరపున బరిలో నిలిచాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుమలత ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. కన్నడ చిత్రసీమలోని స్టార్ హీరోలంతా సుమలతకు మద్ధతుగా నిలిచి ప్రచారంలో పాల్గొన్నారు. అంబరీష్ పై ఉన్న అభిమానంతో పాటు సింపతీ కూడా కలిసి రావటంతో సుమలత ఘన విజయం సాధించారు. అధికార పార్టీ నిఖిల్ ను గెలిపించేందుకు చేసిన ప్రయత్నాలన్నింటిని తిప్పి కొట్టి సుమలత విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment