నువ్వు లేని జీవితం చాలా మార్పు తెచ్చింది.. సుమలత ఎమోషనల్! | Actress Sumalatha Emotional post On Husband Ambaressh Demise After 5 Years | Sakshi
Sakshi News home page

Sumalatha: 'పైనుంచి దీవిస్తావని ఆశిస్తున్నా'.. సుమలత ఎమోషనల్ పోస్ట్!

Published Fri, Nov 24 2023 1:06 PM | Last Updated on Fri, Nov 24 2023 1:40 PM

Actress Sumalatha Emotional post On Husband Ambaressh Demise After 5 Years - Sakshi

ప్రముఖ సీనియర్ నటి సుమలత పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటకకు చెందిన సుమలత టాలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోలతో నటించారు. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న ఆమె.. తన భర్త, దివంగత నటుడు అంబరీశ్‌ను తలుచుకుని ఎమోషనలైంది. ఆయన మరణించి ఇప్పటికీ ఐదేళ్లు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో తన భర్త ఫోటోను పంచుకుంది.

సుమలత ఇన్‌స్టాలో రాస్తూ..' నువ్వు లేని ఈ ఒంటరి జీవితం నాలో చాలా  మార్పు తెచ్చిపెట్టింది! మన ఆనందం , దుఃఖం , నవ్వు , కన్నీళ్లు ప్రతి ఒక్క క్షణం ఎప్పటికీ గుర్తుంటాయి . మీరు లేని లోటు నా జీవితాంత తీర్చలేనిది.  కానీ నీ ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటుంది.  నిన్ను ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నా జీవితంలో నువ్వే నాకున్న ఓకే ప్రపంచం. ఈరోజు నువ్వు గర్వంగా నవ్వుతూ పైనుంచి మన అభిషేక్ చిత్రాన్ని ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు మిస్‌ యూ సార్, కన్నడ సూపర్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కాగా.. ఇవాళ సుమలత తనయుడు అభిషేక్‌ నటించిన చిత్రం బ్యాడ్ మ్యానర్స్ కర్ణాటక వ్యాప్తంగా రిలీజైంది. ఇటీవలే సుమలత తనయుడు అభిషేక్‌.. అవివా బిడపాను పెళ్లాడారు. జూన్‌లో వీరి విహహం బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, యశ్‌, మోహన్‌బాబు సహా పలువురు సినీతారలు హాజరయ్యారు.

అంబరీశ్- సుమలత లవ్‌ స్టోరీ

1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో అంబరీష్‌, సుమలత మొదటిసారి కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్‌ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్‌ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్‌ రాజకీయంగానూ చురుకుగా ఉండేవారు. 2018 నవంబర్‌ 24న అంబరీష్‌ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement