బదిలీ చేస్తే రాజీనామా చేస్తా! | I Will resign if transferred to Mizoram, Maharashtra governor Sankaranarayanan says | Sakshi
Sakshi News home page

బదిలీ చేస్తే రాజీనామా చేస్తా!

Published Sun, Aug 24 2014 3:42 PM | Last Updated on Mon, Oct 8 2018 6:26 PM

బదిలీ చేస్తే రాజీనామా చేస్తా! - Sakshi

బదిలీ చేస్తే రాజీనామా చేస్తా!

కొచ్చి:తనను మహారాష్ట నుంచి మిజోరాంకు బదిలీ చేసినట్లయితే ఆ పదవికి రాజీనామా చేస్తానని గవర్నర్ శంకర్ నారాయణ్ స్పష్టం చేశారు. తాను మిజోరాంకు బదిలీ అవుతున్నట్లు ఎటువంటి అధికారిక సమాచారం లేదని..  కేవలం మీడియా ద్వారా  ఆ విషయాన్ని తెలుసుకున్నానని ఆయన తెలిపారు. దీనిపై మీడియాలో పలుకథనాలు రావడంతో ఆయన స్పందించారు. ' నా బదిలీకి సంబంధించి ఎటువంటి సమాచారం ప్రభుత్వం నుంచి అందలేదు. నన్ను అవమానిస్తే గవర్నర్ పదవిలో అంటిపెట్టుకుని ఉండటానికి కొయ్యను కాదు. ఒకవేళ నన్ను బదిలీ చేస్తే అవమానించేనట్లే' అని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో తనకు గవర్నర్ గా కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు. ఆ క్రమంలోనే తన బదిలీకి తెరలేపి ఉండవచ్చు అని తెలిపారు.
 

మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ మిజోరాం గవర్నర్గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీచేసింది మహారాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్గా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ వ్యవహరిస్తారని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కె.శంకరనారాయణన్ పదవి కాలం 2017లో ముగియనుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ రాష్ట్రాల గవర్నర్ల బదిలీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement