Gujarat Governor
-
గవర్నర్ పదవికి శంకర్‌నారాయణ్ రాజీనామా
-
బదిలీ చేస్తే రాజీనామా చేస్తా!
కొచ్చి:తనను మహారాష్ట నుంచి మిజోరాంకు బదిలీ చేసినట్లయితే ఆ పదవికి రాజీనామా చేస్తానని గవర్నర్ శంకర్ నారాయణ్ స్పష్టం చేశారు. తాను మిజోరాంకు బదిలీ అవుతున్నట్లు ఎటువంటి అధికారిక సమాచారం లేదని.. కేవలం మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్నానని ఆయన తెలిపారు. దీనిపై మీడియాలో పలుకథనాలు రావడంతో ఆయన స్పందించారు. ' నా బదిలీకి సంబంధించి ఎటువంటి సమాచారం ప్రభుత్వం నుంచి అందలేదు. నన్ను అవమానిస్తే గవర్నర్ పదవిలో అంటిపెట్టుకుని ఉండటానికి కొయ్యను కాదు. ఒకవేళ నన్ను బదిలీ చేస్తే అవమానించేనట్లే' అని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో తనకు గవర్నర్ గా కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు. ఆ క్రమంలోనే తన బదిలీకి తెరలేపి ఉండవచ్చు అని తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ మిజోరాం గవర్నర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీచేసింది మహారాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్‌గా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ వ్యవహరిస్తారని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కె.శంకరనారాయణన్ పదవి కాలం 2017లో ముగియనుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ రాష్ట్రాల గవర్నర్ల బదిలీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. -
మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణన్ బదిలీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ మిజోరాం గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గత అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్‌గా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ వ్యవహరిస్తారని రాష్ట్రపతి భవన్ జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది. కె.శంకరనారాయణన్ పదవి కాలం 2017లో ముగియనుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ రాష్ట్రాల గవర్నర్ల బదిలీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర గవర్నర్ కమలా బెనీవాల మధ్య వైరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను మిజోరం గవర్నర్‌గా బదిలీ చేశారు. అనంతరం ఆమెను మిజోరం గవర్నర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. దాంతో మిజోరం గవర్నర్ పదవి ఖాళీ అయింది. అయితే మరో రెండు నెలల్లో కమలా బెనీవాల్ పదవి కాలం ముగియనన్న సమయంలో ఆమెపై వేటు పడిన సంగతి తెలిసిందే. -
గుజరాత్ నూతన గవర్నర్‌గా ఓపీ కోహ్లీ
గాంధీనగర్: గుజరాత్ నూతన గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపీ ఓపీ కోహ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాస్కర్ భట్టాచార్య ప్రమాణ స్వీకారం చేయించారు. కోహ్లీని గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారని అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరిష్ సిన్హా లేఖ చదివి వినిపించారు. 78 ఏళ్ల ఓపీ కోహ్లీ గుజరాత్ కు 24వ గవర్నర్ కావడం గమనార్హం. డాక్టర్ కమలా బెనీవాల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. బెనీవాల్ (87) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనున్నప్పటికీ కేంద్రం ఆమెపై బదిలీ వేటు వేసింది. ఆమెను మిజోరం గవర్నర్‌గా నియమించింది.