గుజరాత్ గవర్నర్‌పై బదిలీ వేటు | Gujarat governor Kamla Beniwal shifted to Mizoram | Sakshi
Sakshi News home page

గుజరాత్ గవర్నర్‌పై బదిలీ వేటు

Published Mon, Jul 7 2014 1:44 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

గుజరాత్ గవర్నర్‌పై బదిలీ వేటు - Sakshi

గుజరాత్ గవర్నర్‌పై బదిలీ వేటు

మిజోరం గవర్నర్‌గా నియామకం

న్యూఢిల్లీ: గుజరాత్ గవర్నర్ కమలా బెనీవాల్ (87) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనున్నప్పటికీ కేంద్రం ఆమెపై ఆదివారం బదిలీ వేటు వేసింది. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ఇక్కట్లకు గురి చేసిన ఆమెను మిజోరం గవర్నర్‌గా నియమించింది. రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వాకు గుజరాత్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ర్టపతి భవన్ తెలిపింది.  మిజోరం గవర్నర్‌గా ఉన్న పురుషోత్తమన్‌ను నాగాలాండ్ గవర్నర్‌గా నియమించినట్లు పేర్కొం ది. ఆయనకు త్రిపుర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారంది.  లోకాయుక్త నియామకం వ్యవహారంతోపాటు గుజరాత్‌లోని స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం కోటా కోసం తెచ్చిన బిల్లును బెనీవాల్ తిరస్కరించడం వివాదాస్పదమవడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement