
గుజరాత్ సీఎం పదవికి మోడీ రాజీనామా
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కమల బేణివాల్కు ఆయన సమర్పించారు. భారత 14వ ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ స్థానంలో గుజరాత్ సీఎంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆనందీ బెన్ పటేల్ పేరు దాదాపు ఖరారైంది.
2001, అక్టోబర్ లో కేశూభాయ్ పటేల్ స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా మూడు పర్యాయాలు బీజేపీని గుజరాత్లో గెలిపించి సత్తా చాటారు. ఇప్పుడు దేశానికే ప్రధాని అయ్యాయి.