Kamla Beniwal
-
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బెనివాల్ (97) మరణించారు. బుధవారం జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు . కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బెనివాల్‌ను ఆమె కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మరణించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా కమలా బెనివాల్ గుజరాత్‌తో పాటు త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు . ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బెనివాల్ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఇతర పదవులను నిర్వహించడమే కాకుండా రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు.రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ , మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పలువురు ప్రముఖులు బేనీవాల్ మృతికి సంతాపం తెలిపారు. -
గవర్నర్ పదవికి శంకర్‌నారాయణ్ రాజీనామా
-
బదిలీ చేస్తే రాజీనామా చేస్తా!
కొచ్చి:తనను మహారాష్ట నుంచి మిజోరాంకు బదిలీ చేసినట్లయితే ఆ పదవికి రాజీనామా చేస్తానని గవర్నర్ శంకర్ నారాయణ్ స్పష్టం చేశారు. తాను మిజోరాంకు బదిలీ అవుతున్నట్లు ఎటువంటి అధికారిక సమాచారం లేదని.. కేవలం మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్నానని ఆయన తెలిపారు. దీనిపై మీడియాలో పలుకథనాలు రావడంతో ఆయన స్పందించారు. ' నా బదిలీకి సంబంధించి ఎటువంటి సమాచారం ప్రభుత్వం నుంచి అందలేదు. నన్ను అవమానిస్తే గవర్నర్ పదవిలో అంటిపెట్టుకుని ఉండటానికి కొయ్యను కాదు. ఒకవేళ నన్ను బదిలీ చేస్తే అవమానించేనట్లే' అని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో తనకు గవర్నర్ గా కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు. ఆ క్రమంలోనే తన బదిలీకి తెరలేపి ఉండవచ్చు అని తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ మిజోరాం గవర్నర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీచేసింది మహారాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్‌గా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ వ్యవహరిస్తారని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కె.శంకరనారాయణన్ పదవి కాలం 2017లో ముగియనుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ రాష్ట్రాల గవర్నర్ల బదిలీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. -
మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణన్ బదిలీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ మిజోరాం గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గత అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్‌గా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ వ్యవహరిస్తారని రాష్ట్రపతి భవన్ జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది. కె.శంకరనారాయణన్ పదవి కాలం 2017లో ముగియనుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ రాష్ట్రాల గవర్నర్ల బదిలీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర గవర్నర్ కమలా బెనీవాల మధ్య వైరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను మిజోరం గవర్నర్‌గా బదిలీ చేశారు. అనంతరం ఆమెను మిజోరం గవర్నర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. దాంతో మిజోరం గవర్నర్ పదవి ఖాళీ అయింది. అయితే మరో రెండు నెలల్లో కమలా బెనీవాల్ పదవి కాలం ముగియనన్న సమయంలో ఆమెపై వేటు పడిన సంగతి తెలిసిందే. -
రాజకీయ కక్షతోనే బేనీవాల్ తొలగింపు:కాంగ్రెస్
జైపూర్:మిజోరం గవర్నర్ కమలా బేనివాల్ తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. మరో రెండు నెలల్లో కమలా బేనీవాల్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆమెను తొలగించడం రాజకీయ ప్రతీకార చర్యేనని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది నిజంగా రాజ్యాంగ విరుద్ధమని రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. మాజీ కేబినెట్ మంత్రి అయిన బేనీవాల్ భారతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని అభిప్రాయపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనంతరం గవర్నర్ గా బాధ్యతులు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నియమితురాలైన తొలగించడం వెనకు రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు. ఆమె ప్రజా జీవితంతో పాటు గానీ, రాజకీయ జీవితం కూడా నిష్కల్మషమైనదని ఆయన తెలిపారు. ఇంకా బేనీవాల్ మరికొన్ని నెలలు గవర్నర్ గా సేవలు చేయాల్సి ఉండగా ఆకస్మికంగా తొలగించడం నిజంగా సిగ్గుచేటని పైలట్ తెలిపారు.ఇదిలా ఉండగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఆమె తొలగింపును ఖండించారు. మరోవైపు బేనివాల్ తొలగింపులో ఎలాంటి రాజకీయాలు లేవని ఎన్డీఏ చెప్పుకొస్తోంది. బేనివాల్పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించామని గురువారం పార్లమెంట్ వెలువల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. -
తొలగింపు రాజకీయ ప్రతీకారమే....
న్యూఢిల్లీ : మిజోరం గవర్నర్ కమలా బేనివాల్ తొలగింపు రాజకీయ ప్రతీకారమే అని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. మరో రెండు నెలల్లో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కమలా బేనివాల్పై వేటు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో బేనివాల్ తొలగింపుపై కారణాలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు బేనివాల్ తొలగింపులో ఎలాంటి రాజకీయాలు లేవని ఎన్డీఏ చెప్పుకొస్తోంది. బేనివాల్పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించామని గురువారం పార్లమెంట్ వెలువల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. -
కమలా బెనీవాల్ పై వేటు
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీతో ఉప్పు-నిప్పులా వ్యవహరించిన కమలా బెనీవాల్ పై వేటు పడింది. మిజోరం గవర్నర్ గా ఉన్న ఆమెను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. పదవి నుంచి తొలగించారు. మరో రెండు నెలల్లో ఆమె పదవీ కాలం ముగియనుండగా ఈ చర్య తీసుకోవడం గమనార్హం. గుజరాత్ గవర్నర్ గా ఉన్న బేనీవాల్ నెల రోజుల క్రితమే మిజోరం గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. మణిపూర్ గవర్నర్ వీకే దుగ్గల్ కు మిజోరం గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పటించినట్టు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా చర్యతో కమలా బేనీవాల్ శకం ముగిసిందని భావిస్తున్నారు. -
గుజరాత్ నూతన గవర్నర్‌గా ఓపీ కోహ్లీ
గాంధీనగర్: గుజరాత్ నూతన గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపీ ఓపీ కోహ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాస్కర్ భట్టాచార్య ప్రమాణ స్వీకారం చేయించారు. కోహ్లీని గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారని అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరిష్ సిన్హా లేఖ చదివి వినిపించారు. 78 ఏళ్ల ఓపీ కోహ్లీ గుజరాత్ కు 24వ గవర్నర్ కావడం గమనార్హం. డాక్టర్ కమలా బెనీవాల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. బెనీవాల్ (87) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనున్నప్పటికీ కేంద్రం ఆమెపై బదిలీ వేటు వేసింది. ఆమెను మిజోరం గవర్నర్‌గా నియమించింది. -
గుజరాత్ గవర్నర్‌పై బదిలీ వేటు
మిజోరం గవర్నర్‌గా నియామకం న్యూఢిల్లీ: గుజరాత్ గవర్నర్ కమలా బెనీవాల్ (87) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనున్నప్పటికీ కేంద్రం ఆమెపై ఆదివారం బదిలీ వేటు వేసింది. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ఇక్కట్లకు గురి చేసిన ఆమెను మిజోరం గవర్నర్‌గా నియమించింది. రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వాకు గుజరాత్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ర్టపతి భవన్ తెలిపింది. మిజోరం గవర్నర్‌గా ఉన్న పురుషోత్తమన్‌ను నాగాలాండ్ గవర్నర్‌గా నియమించినట్లు పేర్కొం ది. ఆయనకు త్రిపుర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారంది. లోకాయుక్త నియామకం వ్యవహారంతోపాటు గుజరాత్‌లోని స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం కోటా కోసం తెచ్చిన బిల్లును బెనీవాల్ తిరస్కరించడం వివాదాస్పదమవడం తెలిసిందే. -
గుజరాత్ సీఎం పదవికి మోడీ రాజీనామా
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కమల బేణివాల్కు ఆయన సమర్పించారు. భారత 14వ ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ స్థానంలో గుజరాత్ సీఎంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆనందీ బెన్ పటేల్ పేరు దాదాపు ఖరారైంది. 2001, అక్టోబర్ లో కేశూభాయ్ పటేల్ స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా మూడు పర్యాయాలు బీజేపీని గుజరాత్లో గెలిపించి సత్తా చాటారు. ఇప్పుడు దేశానికే ప్రధాని అయ్యాయి. -
12 ఏళ్ల సీఎం పదవికి రేపు నరేంద్రమోడీ రాజీనామా
ఆహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి నరేంద్రమోడీ బుధవారం రాజీనామా సమర్పించనున్నారు. సుధీర్ఘంగా 12 ఏళ్లపాటు గుజరాత్ ను పాలించిన మోడీ లోకసభలో బీజేపీ నేతగా, ఎన్ డీఏ నాయకుడిగా ఎంపికైన నేపథ్యంలో మోడీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. మే 26 తేదిన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోకసభ లో నాయకుడిగా ఎంపికైన మోడీని ప్రభుత్వ ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆహ్వానించారు. ప్రధాని పదవిని చేపట్టేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మోడీ తన రాజీనామా లేఖను గవర్నర్ కమ్లా బేణివాల్ కు సమర్పిస్తారు. వీడ్కోలు పలికేందుకు గుజరాత్ అసెంబ్లీలో ఏర్పాటు చేస్తే ప్రత్యేక సమావేశానికి మోడీ హాజరవుతారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు మోడీ రాజీనామా సమర్పిస్తారని అధికారులు తెలిపారు.