12 ఏళ్ల సీఎం పదవికి రేపు నరేంద్రమోడీ రాజీనామా
ఆహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి నరేంద్రమోడీ బుధవారం రాజీనామా సమర్పించనున్నారు. సుధీర్ఘంగా 12 ఏళ్లపాటు గుజరాత్ ను పాలించిన మోడీ లోకసభలో బీజేపీ నేతగా, ఎన్ డీఏ నాయకుడిగా ఎంపికైన నేపథ్యంలో మోడీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. మే 26 తేదిన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
లోకసభ లో నాయకుడిగా ఎంపికైన మోడీని ప్రభుత్వ ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆహ్వానించారు. ప్రధాని పదవిని చేపట్టేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మోడీ తన రాజీనామా లేఖను గవర్నర్ కమ్లా బేణివాల్ కు సమర్పిస్తారు. వీడ్కోలు పలికేందుకు గుజరాత్ అసెంబ్లీలో ఏర్పాటు చేస్తే ప్రత్యేక సమావేశానికి మోడీ హాజరవుతారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు మోడీ రాజీనామా సమర్పిస్తారని అధికారులు తెలిపారు.