
తొలగింపు రాజకీయ ప్రతీకారమే....
న్యూఢిల్లీ : మిజోరం గవర్నర్ కమలా బేనివాల్ తొలగింపు రాజకీయ ప్రతీకారమే అని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. మరో రెండు నెలల్లో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కమలా బేనివాల్పై వేటు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో బేనివాల్ తొలగింపుపై కారణాలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు బేనివాల్ తొలగింపులో ఎలాంటి రాజకీయాలు లేవని ఎన్డీఏ చెప్పుకొస్తోంది. బేనివాల్పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించామని గురువారం పార్లమెంట్ వెలువల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు.