న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంతో.. కాంగ్రెస్ కావాలనే రాజకీయం చేస్తోందని ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు మహేష్ జెఠ్మలానీ అంటున్నారు.అదానీపై అమెరికాలో నమోదైంది అభియోగాలు మాత్రమే.. అవి రుజువు కాలేదని అన్నారాయన.
ఛార్జ్‌షీట్‌లో ఎలాంటి ఆధారాలు లేవు. అయినా కావాలనే కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది.అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ పనితీరు గురించి ట్రంప్ ఎప్పుడో చెప్పారు. యూఎస్ న్యాయశాఖ.. బైడెన్ కనుసన్నల్లో పని చేసే విభాగం. అంతర్జాతీయంగా వ్యాపారం నిర్వహిస్తున్న భారత కంపెనీల పై అమెరికాలో దాఖలైన అభియోగాలను గుడ్డిగా నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ, అభియోగ పత్రంలో లంచాలు ఇచ్చినట్లు ఆధారాల్లేవు.
సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కేందుకు భారత అధికారులకు లంచాలకు కుట్ర చేశారనే ఆరోపణలకు ఆధారాలు ఎక్కడున్నాయి?. ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ ఆధారాలు చూపాలి. దీన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవాలనుకుంటోంది. మహారాష్ట్రలో ఓటమి తర్వాత ఈ అంశాన్ని డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అదానీ, మణిపూర్ మినహా మిగిలిన అంశాలేవీ లేవా? అని ప్రశ్నించారాయన.
The US indictment against #Adani is based on claims, not proven facts. There's no allegation of bribery in India, only a speculative charge of conspiracy to bribe. The case revolves around bond issuances by #AdaniGreenEnergy, where the DOJ infers without evidence that bondholders… pic.twitter.com/KsBAUwPbWl
— Mahesh Jethmalani (@JethmalaniM) November 27, 2024
Comments
Please login to add a commentAdd a comment