mahesh jethmalani
-
‘అదానీపై ఆరోపణలు... విదేశీ శక్తుల కుట్ర.. ఒక్క ఆధారం చూపలేదు’
సాక్షి, అమరావతి: ‘అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయ శాఖ (డీఓజే) చేసిన ఆరోపణలు, మోపిన అభియోగాలు కేవలం ఊహాగానాలు. పూర్తిగా నిరాధారం. పైగా వాటిని కూడా పూర్తిగా వక్రీకరించి మరీ భారత ప్రజల ముందు పెట్టారు. అదికూడా సరిగ్గా పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యే ముందే వాటిని బయట పెట్టడం వెనక భారీ దురుద్దేశాలు దాగున్నాయి. ఇది భారత్‌ను ఆర్థికంగా అస్థిరపరిచేందుకు, దేశ కార్పొరేట్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నమే’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ పేర్కొన్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్‌లో అధికారులకు, నేతలకు లంచాలిచ్చినట్టు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదని జఠ్మలానీ గుర్తు చేశారు. తాను కేవలం ఒక జాతీయవాదిగా వ్యక్తిగత హోదాలో మాత్రమే దీనిపై స్పందిస్తున్నట్టు చెప్పారు. అంతేగానీ అదానీలకు గానీ, వారి గ్రూప్‌నకు గానీ మద్దతుగా మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. అమెరికాలో జో బైడెన్ సారథ్యంలోని డెమొక్రటిక్ ప్రభుత్వానికి చెందిన అధికార లాబీలు ఏడాదిన్నరగా మోదీ సర్కారుకు పూర్తి వ్యతిరేకంగా పని చేస్తున్నాయన్నారు. ‘అదానీ’ వివాదంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.విశ్వసనీయత లేదని స్వయంగా ట్రంప్ చెప్పారు..“అది పూర్తిగా అమెరికాలో అదానీ గ్రీన్ కంపెనీ జారీ చేసిన బాండ్లకు సంబంధించిన అంశం. ఇన్వెస్టర్లకు సమాచారమే ఇవ్వకుండా బాండ్లు జారీ చేశారని, భారత్‌లో కాంట్రాక్టులు పొందేందుకు లంచాలు ఆశ చూపిన విషయాన్ని దాచి అమెరికాలో పెట్టుబడుల సేకరణకు ప్రయత్నం చేశారని అభియోగాలు మోపారు. కానీ అందుకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపలేదు. పైగా ఈ ఉదంతానికి సంబంధించి భారత్‌లో ఏ చట్టాలను ఉల్లంఘించారో కనీసం ఒక్క అభియోగంలో కూడా పేర్కొనలేదు. కనీసం ఉల్లంఘించినట్టు కూడా చెప్పలేదు.భారత్‌లో అధికారులకు గానీ, ప్రజాప్రతినిధులకు గానీ అదానీ గ్రూప్ లంచమిచ్చినట్టు ఎక్కడా నిర్దిష్టంగా చెప్పలేదు కూడా. ‘లంచాలిచ్చారు, లేదా ఇస్తామని వాగ్దానం చేశారు’ అంటూ చాలా పదాల కూర్పులో చాలా తెలివిగా వ్యవహరించారు. కేవలం కుట్ర జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారేగానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ చూపలేదు. పైగా ఆ కుట్రను అమలు చేశారని కూడా ఎక్కడా చెప్పలేదు. లోతుగా చూస్తే ఇవన్నీ కేవలం అమెరికా న్యాయ శాఖ ఊహాగానాలేనని అడుగడుగునా స్పష్టమవుతూనే ఉంది’ అని జఠ్మలానీ స్పష్టం చేశారు. అమెరికాలో న్యాయ శాఖ అనేదే ఒక పెద్ద జోక్ అని, దానికి విశ్వసనీయతే లేదని ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంపే బాహాటంగా చెప్పారని గుర్తు చేశారు.అదానీ ఎపిసోడ్ మొత్తాన్నీ భారత్‌పై బైడెన్ సర్కారు పన్నాగంలో భాగంగా జఠ్మలానీ అభివర్ణించారు. ‘అదానీలపై ఆరోపణలు తెరపైకి వచ్చినప్పుడల్లా ఆ గ్రూపు ఆర్థికంగా భారీగా నష్టపోతూ వస్తోంది. ఈసారి ఏకంగా 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయింది. హిండెన్‌బర్గ్ నివేదికైనా, డీఓజే అభియోగాలైనా పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా రెండు రోజుల ముందు బయటికొచ్చాయి. ఇందులోకి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సాక్ష్యం లేకుండా కేవలం ఓ అభియోగ పత్రంపై ఆధారపడి నిరాధార ఆరోపణలు చేయడం కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీకి తగని పని’ అని జఠ్మలానీ పేర్కొన్నారు. విశ్వసనీయమైన సాక్ష్యాలంటూ ఉంటే కాంగ్రెస్ ముందుగా వాటిని ప్రజల ముందు పెట్టాలని జఠ్మలానీ డిమాండ్ చేశారు. -
‘సోలార్’ లంచాలు.. ఊహాగానాలే
సాక్షి, అమరావతి: ‘‘అదానీ’’ వ్యవహారంపై మీడియాలో వెలువడుతున్న ఊహాజనిత కథనాలు ‘అదుగో పులి అంటే.. ఇదుగో తోక!’ అన్నట్లుగా ఉన్నాయనే అభిప్రాయం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూపు లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా న్యాయశాఖ (డీఓజే) నమోదు చేసిన కేసులో నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్‌లో అధికారులకు, నేతలకు లంచాలిచ్చినట్లు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదని వెల్లడించారు. కేవలం కుట్ర జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారేగానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ చూపలేదని.. లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టమవుతోందన్నారు. ఇక ఈ కేసులో అత్యంత కీలకమైన 1, 5వ నేరారోపణల్లో అదానీ గానీ ఆయన మేనల్లుడు పేర్లు గానీ లేనే లేవని చెప్పారు. ‘ఎఫ్‌సీపీఏ’ని ఉల్లంఘించారన్న నేరారోపణల్లోగానీ.. న్యాయానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణల్లోగానీ అదానీల పేర్లు లేవనే విషయాన్ని వారు తెరపైకి తెచ్చారు. కీలకమైన ఈ రెండు నేరారోపణల్లో అదానీల పేర్లు లేవనే విషయాన్ని ప్రధానంగా మీడియా సంస్థలు గుర్తించాలని సూచిస్తున్నారు. అసలు లంచం ఇవ్వటానికి ప్రయత్నించారనిగానీ.. ఇచ్చారనిగానీ నిరూపించే కనీస సమాచారం కూడా లేదని పేర్కొంటున్నారు. ఆ నేరారోపణల్లో ఎక్కడా కూడా ఇండియాలో లంచాలు ఇచ్చినట్లు లేదని.. లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారన్నదే ప్రధాన నేరారోపణ అని.. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా ‘డీఓజే’ నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ఈ కేసులో న్యాయపరమైన అంశాలను విశ్లేషించిన న్యాయ కోవిదులు చెబుతున్నారు. -
‘ఆధారాల్లేకుండా అదానీపై కాంగ్రెస్ ఆరోపణలు’
న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంతో.. కాంగ్రెస్ కావాలనే రాజకీయం చేస్తోందని ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు మహేష్ జెఠ్మలానీ అంటున్నారు.అదానీపై అమెరికాలో నమోదైంది అభియోగాలు మాత్రమే.. అవి రుజువు కాలేదని అన్నారాయన.ఛార్జ్‌షీట్‌లో ఎలాంటి ఆధారాలు లేవు. అయినా కావాలనే కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది.అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ పనితీరు గురించి ట్రంప్ ఎప్పుడో చెప్పారు. యూఎస్ న్యాయశాఖ.. బైడెన్ కనుసన్నల్లో పని చేసే విభాగం. అంతర్జాతీయంగా వ్యాపారం నిర్వహిస్తున్న భారత కంపెనీల పై అమెరికాలో దాఖలైన అభియోగాలను గుడ్డిగా నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ, అభియోగ పత్రంలో లంచాలు ఇచ్చినట్లు ఆధారాల్లేవు.సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కేందుకు భారత అధికారులకు లంచాలకు కుట్ర చేశారనే ఆరోపణలకు ఆధారాలు ఎక్కడున్నాయి?. ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ ఆధారాలు చూపాలి. దీన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవాలనుకుంటోంది. మహారాష్ట్రలో ఓటమి తర్వాత ఈ అంశాన్ని డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అదానీ, మణిపూర్ మినహా మిగిలిన అంశాలేవీ లేవా? అని ప్రశ్నించారాయన.The US indictment against #Adani is based on claims, not proven facts. There's no allegation of bribery in India, only a speculative charge of conspiracy to bribe. The case revolves around bond issuances by #AdaniGreenEnergy, where the DOJ infers without evidence that bondholders… pic.twitter.com/KsBAUwPbWl— Mahesh Jethmalani (@JethmalaniM) November 27, 2024 -
'చైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకొనే బీబీసీ తప్పుడు ప్రచారం'
న్యూఢిల్లీ: చైనాకు చెందిన సంస్థ నుంచి డబ్బులు తీసుకునే ప్రధాని మోదీపై బీబీసీ తప్పుడు డాక్యుమెంటరీని రూపొందించిందని బీజేపీ ఎంపీ, సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలాని ఆరోపించారు. హూవావే సంస్థ నుంచి బీబీసీకి డబ్బులు అందాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. Why is #BBC so anti-India? Because it needs money desperately enough to take it from Chinese state linked Huawei (see link) & pursue the latter’s agenda (BBC a fellow traveller, Comrade Jairam?)It’s a simple cash-for-propaganda deal. BBC is up for sale https://t.co/jSySg542pl — Mahesh Jethmalani (@JethmalaniM) January 31, 2023 'బీబీసీ ఎందుకు భారత్‌కు వ్యతిరేకం? ఆ సంస్థకు బాగా డబ్బు అవసరమైంది. చైనాకు చెందిన హువావే సంస్థ ఆ డబ్బును సమకూర్చింది. డబ్బు తీసుకుని కావాలనే బీబీసీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీబీసీ అమ్ముడుపోతోంది.' అని మహేష్ జెఠ్మాలని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి బ్రిటన్ మేగజీన్ 'ది స్పెక్టేటర్' 2022 ఆగస్టులో ప్రచురించిన ఓ కథనాన్ని కూడా షేర్ చేశారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ సైతం బీబీసీ డాక్యుమెంటరీ దురుద్దేశంతో ఉందని ఆరోపించారు. భారత్ వృద్ధికి ఆటంకం కల్గించేందుకే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. చైనా ప్రభుత్వం అండదండలతో కొన్ని సంస్థలు బీబీసీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, రెండేళ్లుగా డబ్బులు అందిస్తున్నాయని అన్నారు. ఈ డాక్యుమెంటరీని ప్రతిపక్షాలు కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. కార్తీ చిదంబరం సెటైర్లు.. మరోవైపు బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సెటైర్లు వేశారు. కేంద్రం బీబీసీ డాక్యమెంటరీని బ్యాన్ చేయడం చిన్నపిల్లల మనస్తత్వాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఒకవేళ బీజేపీ నేతల దగ్గర బలమైన ఆధారాలుంటే బ్రిటన్‌లో ఆ సంస్థపై ఫిర్యాదు చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. డాక్యుమెంటరీలో వాస్తవం లేదని ప్రభుత్వం భావిస్తే అసలు నిజాలేంటో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయకుండా బ్యాన్ ఎందుకు చేశారని అడిగారు. బీజేపీ నేతలు నిజంగా చైనా గురించి మాట్లాడాలనుకుంటే సరిహద్దులో చొరబాట్లు గురించి చర్చించాలన్నారు. చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ -
7 కోట్ల మంది డేటాచోరీ
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ డేటా వివాదంలో వెలుగులోకి వస్తున్న అంశాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాతోపాటు ఏపీలోని పలు జిల్లాలకు చెందిన దాదాపు 7కోట్ల మంది ఓటర్ల సమాచారం ఐటీగ్రిడ్స్ కంపెనీలో జరిపిన సోదాల్లో దొరికిందని తెలంగాణ హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది మహేష్ జెఠ్మలాని బుధవారం వెల్లడించారు. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన, బయట ఎక్కడా ఉండకూడని అత్యంతక కీలకమైన రహస్య సమాచారం ఐటీగ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వద్ద లభించిందని ఆయన న్యాయస్థానానికి నివేదించారు. ఐటీగ్రిడ్స్ కార్యాలయంలో తనిఖీలు చేసినప్పుడు అనేక ఆశ్చర్యకర వివరాలు తెలిశాయన్నారు. ఈ జాబితాను సదరు సంస్థకు ఎలా అందిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో అనే సమాచారం కూడా సోదాల్లో దొరికిందన్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన 7 కోట్ల మంది సమాచారం వీరి వద్ద ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చునన్నారు. ‘సేవా మిత్ర’యాప్ ద్వారా ఓటర్లను ఎవరికి ఓటు వేస్తారంటూ ఆరా తీసి, అధికార పార్టీకి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పిన వారి ఓట్లను పెద్ద ఎత్తున తొలగించారని కోర్టుకు నివేదించారు. ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్‌గా అశోక్ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని, దర్యాప్తు నిమిత్తం హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీచేసినా స్పందనలేదన్నారు. దర్యాప్తునకు సహకరించడం లేదని, చట్టం, దర్యాప్తు సంస్థలంటే గౌరవం లేని ఇటువంటి వ్యక్తుల పట్ల కోర్టులు సానుకూల వైఖరిని ప్రదర్శించరాదన్నారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తి కాకపోవడంతో న్యాయమూర్తి షమీమ్ అక్తర్ తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు. ఓటర్ల డేటాచోరీ కేసులో తనపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా అశోక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ, ఈ వ్యవహారం మొత్తం ఏపీ ఓటర్లకు సంబంధించిందని, అందువల్ల ఈ కేసును ఏపీకి బదిలీ చేయాలని ఆయన కోర్టును కోరారు. -
లాయర్‌ను మార్చిన హృతిక్ రోషన్?
హీరోయిన్ కంగనా రనౌత్‌తో గొడవ పడుతున్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.. తన న్యాయవాదిని మార్చేశాడట. టాప్ లాయర్ మహేష్ జెఠ్మలానీ సేవలను ఇకమీదట హృతిక్ పొందుతాడు. అయితే ఈ విషయం గురించి మహేష్ జెఠ్మలానీ మాత్రం ఏమీ స్పందించలేదు. ఇంతకాలం హృతిక్ తరఫున దీపేష్ మెహతా అనే న్యాయవాది వాదిస్తున్నారు. ఆయనే కంగనకు లీగల్ నోటీసులు కూడా పంపారు. ఈ కేసులో అవసరాన్ని బట్టి తన సీనియర్ అమిత్ దేశాయ్‌ని గతంలో సంప్రదించానని, ఇంకా అవసరమైతే తాను ముకుల్ రోహత్గీ సలహాలు కూడా తీసుకుంటానని మెహతా చెప్పారు. అయితే, ఈ లాయర్ మీద అంతగా నమ్మకం లేకపోవడం వల్లే హృతిక్ ఈ కేసులో లాయర్‌ను మార్చేశాడని చెబుతున్నారు.