మాజీ గవర్నర్‌ కమలా బెనివాల్‌ కన్నుమూత | former Gujarat governor Kamla Beniwal dies | Sakshi
Sakshi News home page

మాజీ గవర్నర్‌ కమలా బెనివాల్‌ కన్నుమూత

Published Wed, May 15 2024 9:05 PM | Last Updated on Wed, May 15 2024 9:17 PM

former Gujarat governor Kamla Beniwal dies

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, గుజరాత్‌ మాజీ గవర్నర్‌ కమలా బెనివాల్‌ (97) మరణించారు. బుధవారం జైపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు .  

కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బెనివాల్‌ను ఆమె కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మరణించారు.  గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా కమలా బెనివాల్‌ గుజరాత్‌తో పాటు త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు . ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బెనివాల్ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఇతర పదవులను నిర్వహించడమే కాకుండా రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ , మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పలువురు ప్రముఖులు బేనీవాల్ మృతికి సంతాపం తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement