సంభాల్(యూపీ): తీవ్రవాదానికి మతం లేదని ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ అన్నారు. తీవ్రవాద హింసను తుదముట్టించేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కల్కి మహోత్సవంలో గురువారం ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మనదేశంలో తీవ్రవాదులు అడుగుపెట్టకుండా చూడాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంపై ఆయన ప్రశంసలు కురిపించారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ పూనిక వహించాలని విజ్ఞప్తి చేశారు.
తీవ్రవాదానికి మతం లేదు: అజీజ్ ఖురేషీ
Published Thu, Oct 30 2014 6:20 PM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM
Advertisement
Advertisement