uttarakhand governor
-
తీవ్రవాదానికి మతం లేదు: అజీజ్ ఖురేషీ
సంభాల్(యూపీ): తీవ్రవాదానికి మతం లేదని ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ అన్నారు. తీవ్రవాద హింసను తుదముట్టించేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కల్కి మహోత్సవంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మనదేశంలో తీవ్రవాదులు అడుగుపెట్టకుండా చూడాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంపై ఆయన ప్రశంసలు కురిపించారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ పూనిక వహించాలని విజ్ఞప్తి చేశారు. -
ఉత్తరాఖండ్ గవర్నర్‌ను గద్దె దిగమనలేదు: రాజ్‌నాథ్
లక్నో: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. పదవి నుంచి తప్పుకోవాలని తనకు చెప్పిందన్న ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ ఆరోపణలను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. ‘ఆయనను తొలగించేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు’ అని స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలో సుప్రీం కోర్టుకు తగిన స్పందన తెలియజేస్తామన్నారు. రాజ్‌నాథ్ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో వరదప్రాంతాల పర్యటన తర్వాత మాట్లాడారు. మోడీ సర్కారు వచ్చాక నలుగురు గవర్నర్లను మార్చింది. -
గవర్నర్ తొలగింపుపై నోటీసులు
ఉత్తరాఖండ్ గవర్నర్ ఖురేషీ తొలగింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు చర్య న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్ల తొలగింపుపై ఏర్పడిన వివాదం తాజాగా కోర్టుకెక్కింది. ఉత్తరాఖండ్ గవర్నర్ పదవినుంచి తనచేత రాజీనామా చేయించేందుకు ప్రభుత్వం వ్యవహరించిన తీరును సవాలుచేస్తూ అజీజ్ ఖురేషీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి నోటీసు జారీ చేసింది. గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని, లేదా కేంద్రంచేత బర్తరఫ్కు సిద్ధపడాలని తనను బెదిరించినట్టు ఖురేషీ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఆరువారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని, కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శిని ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. పిటిషన్‌లోని అంశాలు రాజ్యాంగంలోని 156వ ఆర్టికల్ (గవర్నర్ పదవీకాలం)కు సంబంధించివైనందున పిటిషన్‌ను ఐదుగురు జడ్జీల ధర్మాసనానికి బదలీ చేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోథా అధ్యక్షతలోని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ, గవర్నర్ రాజీనామా కోరేందుకు ఒక పద్ధతి అంటూ ఉండాలని, గవర్నర్‌ను తొలగించేందుకు రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉంటుందని, కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శి కేవలం ఒక ఫోన్‌కాల్‌తో గవర్నర్‌ను రాజీనామా కోరడం కుదరదని అన్నారు. ఈ అంశంపై గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సిబల్ ఉదహరించారు. గవర్నర్ల తొలగింపు వ్యవహారంలో మోడీ సర్కార్ చర్యను వ్యతిరేకిస్తూ ఖురేషీ మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూపీఏ నియమించిన మరో ఇద్దరు గవర్నర్లను కేంద్రం బర్తరఫ్ చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకూ నలుగురు గవర్నర్లు రాజీనామా చేశారు. -
రాష్ట్రప్రభుత్వానికి ఉత్తరాఖండ్ గవర్నర్ కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ అజీజ్ ఖురేషీ బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. గత జూన్‌లో భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్లకల్లోమైన సందర్భంలో రాష్ట్రప్రభుత్వం ఆర్థిక చేయూతను అందించినందుకుగాను ఆయన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో రూ.50 కోట్లు ప్రకటించింది. ఇందులో రూ.10 కోట్లు ప్రభుత్వానికి ఆర్థిక సాయంగా, మిగతా డబ్బుతో టీటీడీ ఆధ్వర్యంలో మూడు సత్రాల నిర్మాణానికి, యాత్రికులకు వసతులు కల్పించేందుకు అందజేసింది.