కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు | Supreme Court issued notices to the Centrel Government | Sakshi
Sakshi News home page

కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

Published Thu, Aug 21 2014 3:21 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు - Sakshi

కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఢిల్లీ: గవర్నర్ల తొలగింపు వ్యవహారంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ అజీజ్‌ ఖురేషీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. గవర్నర్ పదవి నుంచి వైదొలగాలంటూ కేంద్రం ఒత్తిడిని ప్రశ్నిస్తూ అజీజ్ ఖురేషి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి ఈ పిటిషన్ను బదిలీ చేశారు. 6 వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

గవర్నర్ల తొలగింపు వ్యవహారం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులను గవర్నర్లుగా నియమించడం ఆనవాయితీ అయిపోయింది.  అప్పటి వరకు వున్న గవర్నర్లను తొలగించడం లేదా రాజీనామా చేయమని ఒత్తిడి తేవడం పరిపాటిగా మారింది.  యుపిఎ ప్రభుత్వం నియమించిన గవర్నర్లను  రాజీనామా చేయాల్సిందిగా ఎన్‌డిఎ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ జోషి  రాజీనామా చేశారు. రాజీనామాకు కొంతమంది తిరస్కరించారు. మరి కొంతమంది ఆ పదవిలో కొనసాగడానికి అధికారపక్షంతో తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement