సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీలో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)కి నోటీసులు జారీ చేసింది. హతేన్‌సింగ్ కాశ్యప్‌తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది.
రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్రానికి, ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజస్తాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయని ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. అనవసరమైన భావోద్వేగపూరిత వాదనలు చేయొద్దని హితవు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment