రాష్ట్రపతిగా ప్రణబ్ @ మూడేళ్లు | President completes 3 years in office tomorrow | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిగా ప్రణబ్ @ మూడేళ్లు

Published Sat, Jul 25 2015 1:12 AM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM

రాష్ట్రపతిగా ప్రణబ్ @ మూడేళ్లు - Sakshi

రాష్ట్రపతిగా ప్రణబ్ @ మూడేళ్లు

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీబాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో కేంద్రమంత్రులకు ఆయన విందు ఇవ్వనున్నారు. మంత్రులతోపాటు అతిథులు ఈ విందులో పాల్గొంటారని రాష్ట్రపతిభవన్ శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో తెలిపింది. వేర్వేరు సందర్భాల్లో రాష్ట్రపతిగా ప్రణబ్ చేసిన 154 ప్రసంగాలను పొందుపరిచిన రెండు సంపుటాలను, రాష్ట్రపతిభవన్ విశిష్టతను వివరించే రెండు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు. వీటిని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరిస్తారు. భారతదేశ 13వ రాష్ట్రపతిగా  2012, జులై 25వ తేదీన ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement