Amrit Udyan.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఉన్న మొఘల్ గార్డెన్స్ పేరును మారుస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. మొఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చింది. మరోవైపు.. జనవరి 31 నుంచి అమృత్ ఉద్యాన్‌లోకి ప్రజలను అనుమతించనున్నట్టు కేంద్రం వెల్లడించింది.
అయితే, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ థీమ్‌కు అనుగుణంగా మొఘల్ గార్డెన్స్ పేరును మార్చుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఇక, ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అమృత్ ఉద్యాన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం, 31వ తేదీ నుంచి అమృత్ ఉద్యాన్‌లోకి ప్రజలకు ఎంట్రీ లభించనుంది. ప్రజల సందర్శన కోసం నెల రోజుల పాటు అమృత్ ఉద్యాన్‌లోకి ప్రవేశం కల్పించనున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా వెల్లడించారు.
The Mughal Gardens at Rashtrapati Bhavan will now be known as '#AmritUdyan'. pic.twitter.com/HbxxYjsXvY
— Nikhil Parmar (@NikhilparmarBJP) January 28, 2023
రాష్ట్రపతి భవన్‌లో 15 ఎకరాల్లో మొఘల్ గార్డెన్ ఉంది. దీన్ని మొఘల్ గార్డెన్స్‌ను మొఘల్ చక్రవర్తులు నిర్మించారు. ఇవి పెర్షియన్ శైలిలో నిర్మించిన తోటలు. ఈ రకపు తోటలు పెర్షియా తోటల చార్ బాగ్ నిర్మాణంలో కట్టినవి. సాధారణంగా ఈ గార్డెన్స్ లో సరస్సులు, ఫౌంటైన్లు, కాలువలు కూడా ఉండటం విశేషం. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ఎన్నో మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. షాలిమర్ గార్డెన్స్(లాహోర్), ఢాకాలోని లాల్ బాగ్ కోట, శ్రీనగర్ లోని షాలిమర్ గార్డెన్స్ మొఘల్ గార్డెన్స్‌లో ఉన్నాయి. తాజ్ మహల్ వద్ద కూడా మొఘల్ గార్డెన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment