రాష్ట్రపతి భవన్లో 'స్వచ్ఛ భారత్' | 'Swachh Bharat Run' organised at Rashtrapati Bhavan | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్లో 'స్వచ్ఛ భారత్'

Published Sat, Oct 4 2014 12:42 PM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

రాష్ట్రపతి భవన్లో 'స్వచ్ఛ భారత్'

రాష్ట్రపతి భవన్లో 'స్వచ్ఛ భారత్'

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్చ భారత్ రన్' కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్లో చేపట్టారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్చ భారత్ రన్' కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్లో చేపట్టారు. శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దాదాపు 1500 మంది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నట్టు రాష్ట్రపతి భవన్ అధికారుల ఓ ప్రకటనలో తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ కూడా ఇందులో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రపతి భద్రత సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, సెక్రటేరియట్ అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు పరిసరాలను శుభ్రం చేశారు. వచ్చే ఐదేళ్లలో దేశాన్ని పరిశుభ్రమైన భారత్గా తయారు చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ గాంధీ జయంతి అక్టోబరు 2న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement