Swachh Bharat Run
-
నెక్లెస్ రోడ్డులో స్వచ్ఛ భారత్ రన్
-
నెక్లెస్ రోడ్డులో స్వచ్ఛ భారత్ రన్
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఉదయం స్వచ్ఛ భారత్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీందర్ గుప్తా ఈ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్లో దాదాపు వెయ్యి మందికి పైగా రైల్వే ఉద్యోగులు ఈ పాల్గొన్నారు. -
రాష్ట్రపతి భవన్ వద్ద స్వచ్ఛ్ భారత్ రన్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ వద్ద శనివారం స్వచ్ఛ్ భారత్ రన్ జరిగింది. ఈ రన్లో దాదాపు 1,500 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్లో కొద్దిసేపు ప్రణబ్ కూడా పాల్గొన్నారని, ఆయనతోపాటు ఢిల్లీ పోలీసు శాఖ సిబ్బంది, రాష్ట్రపతి భవన్ భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు కూడా పాలుపంచుకున్నారు. -
రాష్ట్రపతి భవన్లో 'స్వచ్ఛ భారత్'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్చ భారత్ రన్' కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్లో చేపట్టారు. శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 1500 మంది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నట్టు రాష్ట్రపతి భవన్ అధికారుల ఓ ప్రకటనలో తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ కూడా ఇందులో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రపతి భద్రత సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, సెక్రటేరియట్ అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు పరిసరాలను శుభ్రం చేశారు. వచ్చే ఐదేళ్లలో దేశాన్ని పరిశుభ్రమైన భారత్‌గా తయారు చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ గాంధీ జయంతి అక్టోబరు 2న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.