రాష్ట్రపతి భవన్ వద్ద శనివారం స్వచ్ఛ్ భారత్ రన్ జరిగింది. ఈ రన్‌లో దాదాపు 1,500 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జెండా ఊపి ప్రారంభించారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ వద్ద శనివారం స్వచ్ఛ్ భారత్ రన్ జరిగింది. ఈ రన్‌లో దాదాపు 1,500 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్‌లో కొద్దిసేపు ప్రణబ్ కూడా పాల్గొన్నారని, ఆయనతోపాటు ఢిల్లీ పోలీసు శాఖ సిబ్బంది, రాష్ట్రపతి భవన్ భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు కూడా పాలుపంచుకున్నారు.