
మా ఇంట్లోకీ నీళ్లొచ్చాయి: రాష్ట్రపతి
ఎంత దేశాధ్యక్షుడైనా ఆయన కూడా ప్రకృతి ప్రభావానికి లోనుకాక తప్పలేదు. ఢిల్లీలో ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది. ఉష్ణోగ్రత కూడా ఒకేసారి 8 డిగ్రీలు పడిపోయింది. పలు ప్రాంతాల్లో గాలి దుమారం రేగింది. భారీ వర్షం కారణంగా రాష్ట్రపతి భవన్‌లోకి కూడా నీళ్లొచ్చాయి.
ప్రధాన భవనంలోకి నీళ్లు ప్రవేశించకపోయినా.. రాష్ట్రపతి భవన్ తడిసి ముద్దయింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన నాలుగు ఫొటోలను కూడా షేర్ చేశారు.
Rain drenched #Rashtrapati Bhavan! pic.twitter.com/S9bRO9hUfg
— President of India (@RashtrapatiBhvn) 23 May 2016