భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను రాష్ట్రపతి భవన్‌కి ఆహ్వానించారు. ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేందుకు సూచనగా.. దహీ చీనీని రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే స్వహస్తాలతో మోదీకి అందించారు. ఇలా ఎందుకు తినిపిస్తారు? ఏంటీ స్వీట్ ప్రాముఖ్యత.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయ దుందుభి మోగించారు. ఆ తర్వాత నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలన్నీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని రాష్టపతి భవన్‌కి ఆహ్వానించారు. ముచ్చటగా మూడోసారి పదవిని అంకరిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుతూ.. మోదీకి దహీ-చీనీని తినిపించారు రాష్టపతి ముర్ము. ఈ ఆచారం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇలా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ స్వీట్ తీసుకోవడం అనాదిగా జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తారంటే..
Dahi-Cheeni Tradition of Bharat. 🇮🇳 https://t.co/ojqpaw7LuE pic.twitter.com/BGYznrKWra
— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 7, 2024
దహీ-చీనీ అంటే..
పెరుగు-పంచదార లేదా బెల్లంతో కూడిన స్వీట్. దీన్ని దహీ-చీనీ అంటారు. ఈ స్వీట్ సంప్రదాయం భారతీయ సంస్కృతిలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే పెద్దలు, పిల్లలకు ఇలా పెరుగుతో కూడిన బెల్లం లేదా చక్కెరను తినిపిస్తారు. ఇలా చేస్తే వారికి మంచి అదృష్టం, విజయం లభిస్తుందని పెద్దల నమ్మకం. ఇలా దహీ చీనీని తినడం వెనుకు పెద్ద శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో దహీని కపా-వర్థక్ అని అంటారు. అంటే శరీరానికి స్వాంతన చేకూర్చి, ప్రశాంతతను ఇచ్చేది అని అర్థం. వేసవిలో దీన్ని తీసుకోవడంలో శరీరానికి చలువ చేస్తుంది.
ఇందులో కలిపే పంచదార లేదా బెల్లం శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. ఈ రెండింటి కలియిక ఒత్తిడిని తగ్గించి, అలసటను దూరం చేస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. దీనిలో కాల్షియం, రిబోఫ్లేవిన్, బీ6, బీ12 ఉంటాయి. ముఖ్యంగా పెరుగులో ఉండే బ్యాక్టీరియా శరీరానికి మంచి ప్రోబయోటిక్స్‌ని అందించి ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని తీపి శరీరానికి తక్షణ ఎనర్జీని ఇచ్చే ఇంధనంగా ఉంటుంది కాబట్టి ఈ స్వీట్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. భారతీయ సంప్రదాయంలో ఉండే కొన్ని ఆచారాలు సైన్సుతో ముడిపడి ఉంటాయి. అవి మానవుల హితార్థం ఏర్పరిచినవే.
కాగా, ఇక్కడ మోదీ ప్రధానిగా మంచి పాలను ప్రజలకు అందించే క్రమంలో ఎదురయ్యే సమస్యలను సునాయాసంగా జయించి కీర్తి గడించాలని కోరుకుంటూ ఈ దహీ చీని రాష్ట్రపతి తినిపించడం జరుగుతుంది. అంటే నీకు మంచి జరగాలని ఆశ్వీరదిస్తూ ఓ మధురమైన స్వీట్‌తో పని ప్రారంభిస్తే..ఆ మధురమైన తీపి పదార్థం వలే పనులన్నీ ఆనందాయకంగా చకచక అవుతాయని అర్థం. అలాగే మనం కూడా మంచి జరిగినా, ఏదైనా విజయం సాధించిన స్వీట్లతోనేగా వేడుక చేసుకుంటాం. అయితే ఇక్కడ మన సంప్రదాయం ఆరోగ్య ప్రయోజనాలతో కూడి ఈ స్వీట్‌తో ప్రారంభించమని చెబుతుతోంది.
(చదవండి: మృగశిర కార్తెకు ఆ పేరే ఎలా వచ్చింది? బెల్లం ఇంగువ ఎందుకు తింటారు?)
Comments
Please login to add a commentAdd a comment