న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాల గురించి వీరు చర్చించినట్టుగా అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో చైనాతో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోదీ శుక్రవారం లద్దాఖ్‌లో ఆకస్మిక పర్యటన జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికుల త్యాగాలను ఆయన కొనియాడారు. లేహ్‌లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించారు. అలాగే నిములో ఉన్న ఫార్మర్డ్ పోస్ట్ వద్ద భారతీయ సైనిక, వైమానిక, ఐటీబీపీ దళాలనుద్దేశించి ఉద్వేగపూరితంగా, స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. మరోవైపు ఆర్మీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో మోదీ, రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. (చదవండి : సెల్యూట్.. బ్రేవ్ హార్ట్స్!)
ఈ భేటీకి సంబంధించి రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ కూడా చేసింది. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలను ఆయనకు వివరించారు’ అని పేర్కొంది.
Prime Minister @narendramodi called on President Kovind and briefed him on the issues of national and international importance at Rashtrapati Bhavan today. pic.twitter.com/yKBXCnfboE
— President of India (@rashtrapatibhvn) July 5, 2020
Comments
Please login to add a commentAdd a comment