
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న పార్థసారథి
సాక్షి, న్యూఢిల్లీ/వెంకటాచలం(శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్–2020–21) అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు, తెలంగాణకు రెండు అవార్డులు లభించాయి. ప్రోగ్రామ్ ఆఫీసర్ కేటగిరీలో జేఎన్‌టీయూ అనంతపురానికి చెందిన జితేంద్రగౌడ్, వలంటీర్ కేటగిరీలో నెల్లూరులోని కృష్ణచైతన్య డిగ్రీ కాలేజీకి చెందిన చుక్కల పార్థసారథి, అనంతపురానికి చెందిన దేవనపల్లి సిరి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment