గవర్నర్లు విధి నిర్వహణలో రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు.
న్యూఢిల్లీ: గవర్నర్లు విధి నిర్వహణలో రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. రాష్ట్రపతి భవన్ నుంచి.. గవర్నర్‌లకు కొత్త సంవత్సర సందేశాన్ని ప్రణబ్ అందించారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సానుకూల వాతావరణం ఉండేలా గవర్నర్లు చొరవ తీసుకోవాలన్నారు.. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోఈ సూచనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.