జైపూర్: రాజస్తాన్‌లో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. బల పరీక్ష నిరూపణ కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందిగా ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తన మద్దతుదారులతో కలిసి రాజ్‌భవన్ బయట ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే సమావేశాల నిర్వహణపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం సీఎం నివాసంలో మరోసారి రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. అసెంబ్లీనిర్వహణకు సంబంధించిన అజెండాపై మంత్రులు చర్చించారు. శాసనసభ సమావేశాలు జరపాలని గవర్నర్‌కు కేబినెట్ విజ్ఞప్తి చేసింది.
అంతకుముందు జైపూర్ ఫైర్‌మౌంట్ హోటల్‌లో సీఎల్పీ భేటీ నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉండాలని గహ్లోత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అవసరమైతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నాకు సిద్ధమన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడంలో బీజేపీ సక్సెస్ అయితే.. తాము ప్రధాని కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని.. ధైర్యంగా ఉండాలని శాసనసభ్యులకు తెలిపారు. 3 వారాలపాటు క్యాంప్‌లో ఉండాల్సి రావచ్చని అన్నారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ భేటీ రెండోసారి వాయిదాపడింది.
Comments
Please login to add a commentAdd a comment