న్యూఢిల్లీ: నేపాల్‌ను ప్రాధాన్యత గల దేశంగా భారత్ పరిగణిస్తుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. కీలక ప్రాజెక్టులను నిర్ణీత కాలంలోగా పూర్తి చేయడం సహా రెండు దేశాల మధ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునేందుకు కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. భారత్ పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’గురువారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు.
ఇటీవలి సంవత్సరాల్లో నేపాల్–భారత్ ద్వైపాక్షిక సంబంధాలు క్రమేపీ వృద్ధి చెందుతు న్నాయని ముర్ము అన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను, పర్యాట కాన్ని అభివృద్ధి చేసేందుకు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. తరాలుగా కొనసాగుతున్న సంబంధాలు మరింతగా బలపడాలని రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారని రాష్ట్రపతి భవన్ తెలిపింది. అనంతరం నేపాల్ ప్రధాని ప్రచండ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment