Pushpa Kamal Dahal
-
నేపాల్‌లో అధికార క్రీడ
ఏడాదిన్నర కూడా కాకముందే నేపాల్‌లో మూడో ప్రభుత్వం ఏర్పాటైంది. విచిత్రమైన కూటములు జట్టుకట్టాయి, విడిపోయాయి, మళ్లీ ఒక్కటయ్యాయి. ఇందులో భారత్ అనుకూల, అననుకూల పార్టీలూ ఉన్నాయి. మూడు ప్రభుత్వాలకూ సారథిగా ప్రచండ ఉండటం విశేషం. కోవిడ్ –19 మహమ్మారి తర్వాత నేపాలీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. తిరిగి పుంజుకునే సంకేతాలు ఎంతమాత్రమూ కనబడటం లేదు. ఇది ప్రజల్లో నిరుత్సాహానికి దారి తీస్తోంది. గతంలో ఉన్న రాచరికమే మంచిదని కొందరు భావిస్తున్నారు. కొన్ని వారాల క్రితం, ఖాట్మండులో రాచరికం అనుకూల ప్రదర్శన కూడా జరిగింది. ప్రస్తుత కూటమి అమరిక వల్ల, ఇంకా మూడేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ తిరిగి సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధం అయినట్టుగా కనబడుతోంది. నేపాల్‌లో కేవలం 15 నెలల్లోనే మూడవ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆసక్తికరంగా, ఈ మూడు ప్రభుత్వాలకూ పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ సారథ్యం వహించారు. 2022 నవంబర్‌లో జరిగిన సార్వత్రిక ఎన్ని కల్లో ఆయన పార్టీ మావోయిస్ట్ సెంటర్ 30 స్థానాలతో ప్రతినిధుల సభలో మూడవ స్థానంలో నిలిచింది. 275 మంది సభ్యుల సభలో 88 స్థానాలతో నేపాలీ కాంగ్రెస్ మొదటి స్థానంలో, 78 స్థానాలతో కమ్యూ నిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్– లెనినిస్ట్) లేదా సీపీ ఎన్–యూఎమ్ఎల్ రెండవ స్థానంలో నిలిచాయి. చీలిపోయిన ప్రజా తీర్పు ముఖ్యమైన స్థానాన్ని ప్రచండ పొందేలా అనుమతించింది. మొదటిదే అయినప్పటికీ స్వల్పకాలంలోనే ముగిసిన కూటమి సీపీఎన్–యూఎమ్ఎల్, మావోయిస్టులకూ మధ్య ఏర్పడినది.ప్రచండకు ప్రధానమంత్రి పదవిని అందించిన తర్వాత, ఆయన నేపాలీ కాంగ్రెస్ వైపునకు మళ్లడంతో ఒక నెలలోనే ఆ కూటమి విచ్ఛి న్నమైంది. చిత్రంగా, అదే ప్రచండనీ, అదే సీపీఎన్–యూఎమ్ఎల్నీ మళ్లీ ఒకచోట చేర్చిన ప్రస్తుత కూటమిలో, మరో రెండు వామపక్ష అనుకూల పార్టీలు కూడా ఉన్నాయి. ఉపేంద్ర యాదవ్ నేతృత్వంలోని సమాజ్బాదీలు (సోషలిస్టులు), మాజీ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మాజీ సీపీఎన్–యూఎమ్ఎల్ సభ్యుల పార్టీ ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాయి.ఈ కూటమిలోనే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) ఉండటం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పార్టీకి 21 సీట్లున్నాయి. యువత ఆకాంక్షలను సమర్థించే, పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఉండే ఒక వేదికగా ఈ పార్టీని చెప్పుకోవచ్చు. ఈ పార్టీ గతంలో మొదటి మావో యిస్టు... సీపీఎన్–యూఎమ్ఎల్ కూటమిలో భాగంగా ఉండేది. అంతకుముందు అమెరికన్ జాతీయుడైన రవీ లామిఛానే దాని నాయ కుడు. ప్రస్తుత సంకీర్ణంలోని నలుగురు ఉప ప్రధాన మంత్రులలో ఆయన ఒకరుగా ఉన్నారు.కోవిడ్ –19 మహమ్మారి కాలంలో నేపాలీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కానీ ఇతర దేశాల మాదిరిగా, తిరిగి పుంజుకునే సంకే తాలు ఎంతమాత్రమూ కనబడటం లేదు. ఇది ప్రజల్లో నిరుత్సాహా నికి దారి తీస్తోంది. రాజకీయ వర్గం ఫలితాలు చూపని కారణంగా కొంతమంది గతంలో ఉన్న రాచరికమే మంచిదని కూడా భావిస్తు న్నారు. కొన్ని వారాల క్రితం, రాజధాని నగరం ఖాట్మండులో రాచ రికం అనుకూల ప్రదర్శన కూడా జరిగింది. ఆర్థిక సమస్యలపై నేపాలీ కాంగ్రెస్ చాలా మొండితనంతో ఉందని ప్రచండ ఆరోపించారు. ఆ కారణంగా రాజకీయంగా తన మార్పును సమర్థించుకున్నారు. అయితే, ఐదుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నేపాలీ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ దేవుబా నిరంతరం వేచివున్న ప్రధానమంత్రి స్థానంలో పరిభ్రమించడం ప్రచండ నిజంగానే భరించలేకపోయి ఉంటారు. కానీ సాంప్రదాయకంగా నేపాలీ కాంగ్రెస్‌తో వ్యవహరించడం సులభతరమని భారతదేశం గ్రహించింది. నేపాల్‌ను హిందూ రాజ్యంగా పునఃస్థాపించాలనే నేపాలీ కాంగ్రెస్ నాయకత్వానికి మావో యిస్టు–నేపాలీ కాంగ్రెస్ కూటమి కొంత ఓదార్పునిచ్చింది. 2015 రాజ్యాంగం నేపాల్‌ను లౌకిక దేశంగా ప్రకటించింది. అయితే, సీపీఎన్–యూఎమ్ఎల్ నాయకుడు అయిన కేపీ శర్మ ఓలి గతంలో కూడా హిందూ రాజ్యం పట్ల గానీ, నేపాల్‌లో ‘సాంస్కృతిక’ రాచరికం పట్ల గానీ విముఖంగా లేరని గమనించాలి. అయోధ్యలో రామ మందిర శంకుస్థాపనను నేపాల్ ఉత్సాహంతో స్వీకరించింది. ఇది హిందూ రాజ్యానికి మద్దతును పెంచుతుంది. ప్రచండ కూడా సానుకూల పాత్రను పోషిస్తున్నట్లు కనిపిస్తు న్నారు. సంవత్సరాల తరబడి తాను విడిచిపెట్టేసినటువంటి, హిందూ రాచరికంతో గుర్తింపు పొందిన నేపాలీ అధికారిక జాతీయ దుస్తులైన దౌడా సురూవాల్ను ధరించారు. ఏమైనప్పటికీ, ప్రచండ పెంపకం వామపక్షంతో కూడుకున్నది. అది రాచరికానికి వ్యతిరేకమైనది. ఆయ నకు ఇప్పుడు తనను తాను వెనక్కి తిప్పుకొనే, నేపాల్ గుర్తింపు రాజకీయాలను తిరిగి అక్కున చేర్చుకునే అవకాశం వచ్చింది. అంటే ప్రాథమికంగా భారతదేశం నుండి తనను తాను భిన్నంగా చూపు కోవడం. అందుకే ఆయన నేపాలీ కాంగ్రెస్‌తో విడిపోయినప్పుడు దానిని ‘ప్రతీఘాత శక్తి’ అని పేర్కొన్నారు. నేపాల్‌లోని రాజకీయ చర్చల్లో దక్షిణ (భారతదేశానికి సూక్ష్మ నామం), ఉత్తర (చైనా సూక్ష్మ నామం) పాత్రలకు సంబంధించిన సూచనలు సర్వ సాధారణం. సుమారు గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ దేశాలనూ (అమెరికా, యూరోపియన్ యూనియన్ మొద లైనవి), చర్చ్తో కూడుకున్న వారి ఎన్జీఓ భాగస్వాముల పాత్రనూ కూడా కొట్టిపారేయలేము. ఇవి మానవ హక్కులు, లౌకిక వాద ఆలోచనలను కలిగి ఉండి, తమవైన డైనమిక్స్‌ను కలిగి ఉన్నాయి. కొందరికి వామపక్ష కూటమిలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చేరిక ఉత్తరాది– పాశ్చాత్య కూటమి మధ్య సఖ్యతలా కనిపిస్తుంది. చాలా మంది పరిశీలకు లకు, తాజా అమరిక నేపా ల్లో తదుపరి సాధారణ ఎన్ని కలకు రంగం సిద్ధం చేసిన ట్టుగా కనబడుతోంది. కాక పోతే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉంది. అంత కాలం అవస రమైన ఓపికను ఓలీ ప్రదర్శిస్తారా అని చాలామంది అనుమానిస్తు న్నారు. 2020లో, అధికార భాగస్వామ్య ఒప్పందం ఉన్నప్పటికీ ప్రచండకు ప్రధానమంత్రి పదవిని వదులుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రచండ ఇప్పటికే ప్రజల్లో తన పట్టును కోల్పోయినందున, తన పాత కమ్యూనిస్ట్ సహచరులతో చేతులు కలపడమే ఏకైక మార్గం. సీపీఎన్ –యూఎమ్ఎల్ మద్దతుదారుల నుండి మావోయిస్టులకు ఓటు బదిలీ అంత సులభం కానప్పటికీ, నేపాలీ కాంగ్రెస్ నుండి మావోయిస్టులకు బదిలీ చేయడం ఇంకా కఠినమైనది. కొత్త అమరిక చైనీయులు సంతో షించడానికి ఒక కారణాన్నిస్తుంది. అంతర్గత నేపాలీ రాజకీయ కోణం కూడా ఉన్నప్పటికీ, దాన్ని తీసుకురావడంలో వారి పాత్ర ఉంది. భారతదేశం ఇప్పటివరకూ నేపాల్‌కు అతిపెద్ద వాణిజ్య, ఆర్థిక భాగస్వామి. పైగా దేశంలో ఆర్థిక తేజస్సుకు గేట్‌వే. నేపాల్‌కు దాని పెరుగుతున్న జలవిద్యుత్ ఉత్పత్తి అవసరాల నుండి ప్రయోజనాలను పొందేందుకు ఇది ఏకైక అర్థవంతమైన మార్గం. ఇటీవలి సంవ త్సరాలలో సమీకృత చెక్ పోస్టుల నిర్మాణం, రైల్వే కనెక్టివిటీ అభివృద్ధి, విద్యుత్ సరఫరా లైన్లు, యూపీఐ లావాదేవీలకు వెళ్లడం వంటి వాటితో నేపాల్ కనెక్టివిటీకి భారత్ ఊతమిచ్చింది. వాస్తవానికి, నేపాల్‌కు చమురు సరఫరా చేయడానికి ఏర్పాటయ్యే పైప్‌లైన్, 900 మెగావాట్ల అరుణ్–3 ప్రాజెక్ట్ నిర్మాణంతో సహా చాలా ప్రాజెక్టులు ఓలీ 2018–19లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు.నేపాల్‌లో, ఇండియా కార్డ్‌ను ప్లే చేయడం వల్ల అది ప్రజల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్య మైనది. అనారోగ్యకరమైన ఆర్థిక స్థితి ఏ ప్రస్తుత ప్రధానమంత్రికీ మంచిది కాదు. సులభతరమైన వ్యాపారాన్ని మెరుగుపరచడం కోసం తీసుకునే చర్యలు భారతదేశం, నేపాల్ రెండింటి ప్రయోజనాలకు ఉపయోగపడుతాయి. మంజీవ్ సింగ్ పురీ వ్యాసకర్త నేపాల్‌లో భారత మాజీ రాయబారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల
నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ యూఏఈలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఒక విచిత్రం చోటుచేసుకుంది. ప్రధాని ప్రచండను తీసుకుని దుబాయ్‌కు బయలుదేరిన విమానం షెడ్యూల్ కంటే ముందే బయలుదేరింది. నిర్ణీత సమయానికి ముందుగానే విమానం టేకాఫ్ కావడంతో 31 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయి, పలు అవస్థలు పడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నేపాల్ ప్రధాని ప్రచండతో దుబాయ్‌కి బయలుదేరిన నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం నిర్ణీత షెడ్యూల్‌కు రెండు గంటల ముందుగానే బయలుదేరింది. దీంతో ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 31 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దుబాయ్ వెళ్లే విమానం ఆర్ఏ- 299 బుధవారం రాత్రి 11.30 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉండగా, వీవీఐపీ హోదా కారణంగా విమానం 9.30 గంటలకు బయలుదేరిందని విమానయాన సంస్థ తెలిపింది. ‘ప్రధాని ప్రచండ అదే విమానంలో ఉన్నారు. కాప్-28 సమ్మిట్ కోసం ఆయన ప్రతినిధి బృందంతో కలిసి దుబాయ్‌కి బయలుదేరారని, అందుకే విమానం ముందుగానే బయలుదేరాల్సి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు’ అంటూ విమానయాన సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో 274 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 31 మంది విమానం ఎక్కలేకపోయారు. విమానం రెండు గంటలు రీషెడ్యూల్ చేశాం. ఇమెయిల్ ద్వారా విమానం బయలుదేరే సమయం గురించి ప్రయాణికులకు ముందుగానే తెలియపరిచాం. అయితే 31 మంది ప్రయాణికులు స్పందించలేదని ఎయిర్‌లైన్ వివరించింది. యూఏఈలో జరిగే వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని ప్రచండ.. నేపాల్ నుంచి దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ఆయన పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. మరోవైపు కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇది కూడా చదవండి: ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్ -
నోరుజారిన నేపాల్ ప్రధాని.. ఏకి పారేస్తున్న ప్రతిపక్షాలు
ఖాట్మండు: నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహాల్ ఇటీవల భారతీయ వ్యాపారి సర్దార్ ప్రీతమ్ సింగ్ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తాను ప్రధానమంత్రి కావడానికి ఆయన చాలా సహాయం చేశారని చేసిన వ్యాఖ్యలు నేపాల్ లో పెను దుమారాన్ని రేపాయి. నేపాల్ ప్రధాని నియామకం ఢిల్లీ కనుసన్నల్లో జరిగిందని ప్రధాని ప్రచండకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి అక్కడి ప్రతిపక్షాలు. ప్రఖ్యాత భారత వ్యాపారి ప్రీతమ్ సింగ్ పేరిట కిరణ్ దీప్ సంధు రాసిన జీవితచరిత్ర పుస్తకం "రోడ్స్ టు ది వ్యాలీ: ది లెగసీ ఆఫ్ సర్దార్ ప్రీతమ్ సింగ్ ఇన్ నేపాల్" ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహాల్ ప్రచండ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత్-నేపాల్ సంబంధాలు బలపడటానికి ప్రీతమ్ సింగ్ చాలా సహాయపడ్డారని, తన రాజకీయ జీవితం తొలినాళ్లలో కూడా అయన చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చారు. నన్ను ప్రధాన మంత్రిని చేయడానికి ఆయన అనేకమార్లు ఢిల్లీ వెళ్లడమే కాదు అటు ఢిల్లీ నాయకులతోనూ, ఇటు ఖాట్మండు నాయకులతోనూ సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఈ వ్యాఖ్యలకు నేపాల్ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ప్రధాని వ్యాఖ్యలు జాతి స్వాతంత్య్రానికి, గౌరవానికి, రాజ్యాంగానికి, చట్టసభకే అవమానకరమని ప్రతిపక్ష నాయకుడు కెపి శర్మ ఓలి అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ తోపాటు ఇతర ప్రతిపక్షాలు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీల నేతలు ప్రధాని ప్రచండ రాజీనామాను డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ అసెంబ్లీ సమావేశాలకు తీవ్ర అంతరాయం కలిగించారు. నేపాల్ ప్రధాని ప్రచండ ప్రతిస్పందిస్తూ నేపాల్ అంతర్గత రాజకీయాల్లో భారత్ పాత్ర ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు ప్రీతమ్ సింగ్ కు సాంఘిక సంక్షేమం మీదనే కాదు రాజకీయాల పైన కూడా అంతే ఆసక్తి ఉండేదని చెప్పాలనుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం మాకు మీ వివరణ అక్కర్లేదు.. మీ రాజీనామా మాత్రమే కావాలని పట్టుబట్టడంతో నేపాల్ జాతీయ అసెంబ్లీ సమావేశానికి నిరవధికంగా అంతరాయం కలిగింది. ఇది కూడా చదవండి: వింబుల్డన్‌లో దారుణం.. స్కూల్లోకి దూసుకెళ్లిన కారు.. -
రాష్ట్రపతి ముర్ముతో ప్రచండ భేటీ
న్యూఢిల్లీ: నేపాల్‌ను ప్రాధాన్యత గల దేశంగా భారత్ పరిగణిస్తుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. కీలక ప్రాజెక్టులను నిర్ణీత కాలంలోగా పూర్తి చేయడం సహా రెండు దేశాల మధ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునేందుకు కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. భారత్ పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’గురువారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. ఇటీవలి సంవత్సరాల్లో నేపాల్–భారత్ ద్వైపాక్షిక సంబంధాలు క్రమేపీ వృద్ధి చెందుతు న్నాయని ముర్ము అన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను, పర్యాట కాన్ని అభివృద్ధి చేసేందుకు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. తరాలుగా కొనసాగుతున్న సంబంధాలు మరింతగా బలపడాలని రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారని రాష్ట్రపతి భవన్ తెలిపింది. అనంతరం నేపాల్ ప్రధాని ప్రచండ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. -
నేపాల్‌తో పటిష్ఠ బంధం
అనుభవాన్ని మించిన ఉపాధ్యాయుడు లేడంటారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఆ పదవి చేపట్టాక విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకుని, బుధవారం నాలుగు రోజుల పర్యటన కోసం రావటం ఈ సంగతినే మరోసారి తెలియజెబుతోంది. ఆయనకు వామపక్ష నేపథ్యం ఉంది. రాచరికాన్ని కూలదోసి ప్రజాతంత్ర రిపబ్లిక్కు పట్టంగట్టిన సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది ఆయన నేతృత్వంలోని మావోయిస్టు పార్టీయే. అందువల్లే తొలి దఫా 2008లోనూ, ఆ తర్వాత 2016లోనూ అధికారంలోకొచ్చినప్పుడు ఆయన సహజంగానే చైనా వైపు మొగ్గు చూపారు. కానీ ఈసారి ఆయన ఆలోచనలో మార్పు వచ్చిన దాఖలా కనబడుతోంది. ఎందు కంటే మొన్న మార్చి నెలాఖరున చైనా నిర్వహించిన కీలకమైన బావ్ ఫోరం ఫర్ ఆసియా సమా వేశానికి రారమ్మని ఆ దేశం పిలిచినా, అక్కడి అగ్ర నాయకత్వంతో సమావేశమయ్యే అవకాశం ఉన్నా వెళ్లకుండా ప్రతినిధి బృందాన్ని మాత్రమే పంపారు. నేపాల్ ప్రధాని పీఠాన్ని ఎవరు అధిరోహించినా తొలి విదేశీ పర్యటన కోసం భారత్ రావటం సంప్రదాయంగా వస్తోంది. కొత్త అధినేత రాగానే ఆహ్వానించటం భారత్‌కు కూడా రివాజైంది. కానీ ఈసారి మన దేశం ప్రచండను పిలిచేందుకు ఆర్నెల్ల సమయం తీసుకుంది. ఆయన పర్యటన మూడుసార్లు వాయిదాలు పడి ప్రస్తుత కార్యక్రమం ఖరారైంది. వాస్తవానికి నేపాల్‌లో ప్రచండకు మునుపటంత ఆకర్షణ లేదు. 275 స్థానాలుండే నేపాల్ పార్లమెంటుకు తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఏకంగా 227 స్థానాలు గెల్చుకున్న ఆయన నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) ఇప్పుడు రెండంకెల స్థాయికి పడిపోయింది. ఆమాటకొస్తే నేపాల్‌లో ప్రస్తుతం ఎవరికీ చెప్పుకోదగ్గ బలం లేదు. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్టు–లెనినిస్టు) తర్వాత మూడో స్థానంలో ప్రచండ పార్టీ ఉండగా... ప్రస్తుతం ఎనిమిది పార్టీల కూటమి ప్రభుత్వానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు. సహజంగానే ఈ పరిస్థితి ఆయన వైఖరిలో మార్పు తెచ్చిందనుకోవాలి. భారత్ – నేపాల్ సంబంధాల్లో అడపా దడపా ఒడిదుడుకులు ఎదురవుతున్న సంగతి నిజమే అయినా అవి నిలకడగానే ఉన్నాయి. నేపాల్‌తో మనకు 1,850 కిలోమీటర్ల నిడివి సరిహద్దు ఉంది. ఆ రీత్యా వ్యూహాత్మకంగా మన దేశానికి నేపాల్ అత్యంత ముఖ్యమైన దేశం. సముద్ర తీరం లేకపోవటం వల్ల సరుకు రవాణా, సర్వీసుల రంగాల్లో దాదాపుగా అది మన దేశంపైనే ఆధార పడుతుంది. నేపాల్ దిగుమతులన్నీ మన రేవుల ద్వారానే సాగుతాయి. ఇంధన రంగంలోనూ ఈ సహకారం కొనసాగుతోంది. ఆ దేశంలో భారత్ పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించింది. మన దేశానికి నేపాల్ 450 మెగావాట్ల విద్యుత్‌ను ఎగుమతి చేస్తోంది. ఈ రంగంలో మన సహకారంతో మరిన్ని ప్రాజెక్టులు నిర్మించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అలాగే నేపాల్‌లో రైల్వే ప్రాజెక్టులకు భారత్ సాయం అందిస్తోంది. గురువారం ఇరుదేశాల ప్రధానులూ ఆన్లైన్లో రెండు చెక్‌పోస్టు లనూ, బిహార్ నుంచి సరుకు రవాణా రైలును ప్రారంభించారు. ఇవిగాక రెండు దేశాల ప్రధానుల సమక్షంలో ఏడు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. నేపాల్‌ను ఎప్పటికప్పుడు మంచి చేసుకునేందుకు చైనా శతవిధాల ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో కొన్నిసార్లు సఫలీకృతమైంది కూడా. ఒక్క ప్రచండ అనేమిటి... భారత్ అనుకూలుడిగా ముద్రపడిన ఓలి శర్మ సైతం చైనా వ్యామోహంలో పడి మన దేశంపై నిప్పులు చెరిగిన సందర్భాలున్నాయి. కనుకనే చైనా పెట్టుబడుల శాతం గణనీయంగా పెరిగింది. కేంద్రంలో ఎవరు అధికారంలోవున్నా నేపాల్‌పై మన దేశం పెద్దన్న పాత్ర పోషించా లనుకోవటం అప్పుడప్పుడు సమస్యలకు కారణమవుతున్న సంగతి కాదనలేనిది. ఉదాహరణకు 2016లో రాజ్యాంగానికి ఆమోదముద్ర వేసే దశలో నేపాల్‌లోని తెరై ప్రాంతంలో ఉన్న మాధేసి, తారూ వంటి మైనారిటీ జాతులు ఉద్యమించాయి. వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవా లని, వారితో చర్చించి రాజ్యాంగంలో తగిన మార్పులు చేయాలని మన దేశం సూచించింది. కానీ దీన్ని నేపాల్ పట్టించుకోలేదు. ఆ తర్వాత తెరై ప్రాంతంలో భారీయెత్తున ఉద్యమాలు సాగాయి. దాంతో మన దేశంనుంచి వంటగ్యాస్ రవాణా నెలల తరబడి నిలిచిపోయింది. ఉద్యమాల వెనక భారత్ ప్రమేయం ఉన్నదనీ, తమను లొంగదీసుకునేందుకే ఇవన్నీ చేస్తున్నారనీ నేపాల్ ఆరోపించింది. ఈ పరిస్థితిని అప్పట్లో చైనా చక్కగా వినియోగించుకుంది. వాస్తవానికి ఇప్పుడు సరిహద్దుల విషయంలో ప్రచండపై ఒత్తిళ్లు ఎక్కువే ఉన్నాయి. ఉత్తరా ఖండ్‌లోని లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని నేపాల్ చాన్నాళ్లుగా వాదిస్తోంది. వాటిని తమ దేశంలో భాగంగా చూపుతూ మూడేళ్ల క్రితం మ్యాప్‌లు కూడా ముద్రించింది. వాటికి సంబంధించిన బిల్లుల్ని కూడా అక్కడి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే అనంతర కాలంలో ఈ వివాదం సద్దుమణిగింది. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అంగీకారం కుదిరింది. దీన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామని మోదీకి ప్రచండ సూచించారు. ఇరుగుపొరుగు అన్నాక సమస్యలు సహజం. వాటిని ఒడుపుగా పరిష్కరించుకోవటంలోనే ఆ దేశాల పరిణతి కనబడుతుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలనూ ‘సూపర్ హిట్’ చేస్తామనీ, వాటిని హిమాలయ శిఖరాల ఎత్తుకు తీసుకెళ్తామనీ ప్రచండకు నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. ఇదొక మంచి పరిణామం. తదుపరి కార్యాచరణ ఆ దిశగా చురుగ్గా కదిలితే శతాబ్దాలనాటి ఇరు దేశాల సంబంధాలూ మరింత ఉన్నత స్థాయికి చేరతాయనడంలో అతిశయోక్తి లేదు. -
నేపాళంలో కొత్త భూపాలం?
పెళ్ళిలో నాగవల్లి నాటి మాట సదస్యానికి ఉంటుందా?! నేపాల్‌కు కొత్త ప్రధానిగా కొలువు తీరిన పుష్పకమల్ దహల్ (ప్రచండ)ను చూస్తే ఆ జాతీయమే గుర్తొస్తుంది. ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకు తిరిగిన 5 పార్టీల కూటమిని ఫలితాలొచ్చాక గాలికి వదిలేసి, అప్పటి దాకా తాను విమర్శించిన వారితో కలసి ఆయన అధికారంలోకి రావడం అలానే ఉంది. ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ –మావో యిస్ట్ సెంటర్’ (సీపీఎన్–ఎంసీ) నేత ప్రచండ ఈ ఎన్నికల ముందు మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్‌తో తిరిగారు. తీరా అధికారం కోసం తన బద్ధశత్రువైన మరో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీతో చేతులు కలిపారు. ఓలీ సారథ్య ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్– ఐక్య మార్క్సిస్ట్– లెనినిస్ట్’ (సీపీఎన్– యూఎంఎల్)తో పాటు పలు చిన్నాచితకా పార్టీలతో కలసి అధికారం పంచుకుంటున్నారు. ఏ ప్రభుత్వమూ పూర్తికాలం అధికారంలో ఉండదన్న అపకీర్తిని మూటగట్టుకున్న నేపాల్‌లో ఈ అవసరార్థ అధికార కూటమి ఎన్నాళ్ళుంటుందో తెలీదు కానీ చైనా అనుకూల ప్రచండ, దేవ్బా ద్వయం వల్ల భారత్ అప్రమత్తం కాక తప్పని పరిస్థితి. 68 ఏళ్ళ ప్రచండ 13 ఏళ్ళు అజ్ఞాత జీవితం గడిపారు. 1996 నుంచి 2006 వరకు సాగిన సాయుధ తిరుగుబాటుకు ప్రచండే సారథి. 2006 నవంబర్‌లో సమగ్ర శాంతి ఒప్పందంపై సంతకంతో ఆ తిరుగుబాటు కథకు తెరపడింది. దశాబ్ద కాలపు తిరుగుబాటుకు స్వస్తి చెప్పి, సీపీఎన్ – ఎంసీ ప్రశాంత రాజకీయాల పంథాను అనుసరించడం మొదలుపెట్టాక ఆయనా ప్రధానస్రవంతి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ విప్లవ వీరుడు ప్రధాని పీఠం అధిష్ఠించడం ఇది ముచ్చటగా మూడో సారి. దేవ్బా సారథ్య నేపాలీ కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించింది గనక అదే పగ్గాలు పడుతుందనీ, దేవ్బా, ప్రచండలు పదవిని పంచుకుంటారనీ అంతా అనుకున్నారు. కానీ, ప్రధానిగా తొలి విడత ప్రచండకు ఇవ్వడానికి దేవ్బా తటపటాయించడంతో తేడా వచ్చింది. అదే అదనుగా ఓలీ చాణక్యతంత్రంతో ప్రచండను తన వైపు తిప్పుకోవడం రాజకీయ చాతుర్యం. నిజానికి, 275 స్థానాల ప్రజాప్రతినిధుల సభలో ప్రచండ నాయకత్వంలోని సీపీఎన్–ఎంసీ ఈ ఎన్నికల్లో గెలిచింది 32 సీట్లే. అయితే, ఓలీ సారథ్యంలోని సీపీఎన్–యూఎంఎల్ (78) కాక మరో అయిదు పార్టీలు మద్దతు నిచ్చాయి. అలా ప్రచండకు 165 మంది సభ్యుల అండ దొరికింది. బద్ధ శత్రువులుగా ఎన్నికల్లో పోరాడిన ప్రచండ, ఓలీలు ఫలితాలొచ్చాక ఇలా కలసిపోతారనీ, వంతుల వారీగా ప్రధాని పీఠం పంచుకొనేలా అవగాహన కుదుర్చుకుంటారనీ ఎవరూ ఊహించలేదు. ఇది ఓటర్లకూ మింగుడుపడని విషయం. ఇవన్నీ నేపాల్ అంతర్గత రాజకీయాలు. అక్కడ ఏ పార్టీలో, ఎవరు ప్రధాని కావాలనేది అక్కడి పార్టీల, ప్రజల ఇష్టం. ఆ ప్రధానులూ, ప్రభుత్వాలూ పూర్తికాలం అధికారంలో లేకుంటే అది ఆ దేశానికి నష్టం. కాకపోతే, రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి మారిన ఈ హిమాలయ పొరుగుదేశపు బాగోగులు, దోస్తీ భౌగోళిక–రాజకీయాల్లో భారత్‌కు కీలకం. అధికారమే లక్ష్యంగా 2 కమ్యూనిస్ట్‌పార్టీ గ్రూపుల నేతలూ దగ్గరవడానికి చైనాతో సాన్నిహి త్యంతో పాటు ఓలీ అంటే సానుకూలత ఉన్న నేపాల్ ప్రెసిడెంట్ విద్యాదేవి కూడా కారణమం టారు. ఏమైనా దీంతో నేపాల్‌తో బంధాల్లో చైనాదే పైచేయనే అభిప్రాయం సహజమే. కొత్త ప్రధాని ప్రచండ ఏనాడూ భారత్‌కు సానుకూల వ్యక్తి కాదు. పైపెచ్చు ఆయన మనసంతా చైనా మీదే. కాక పోతే, క్రితంసారి ఆయన పదవిలో ఉన్నప్పుడు భారత్ పట్ల సదా సానుకూలత చూపే నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నారు. కాబట్టి కథ నడిచిపోయింది. కానీ, ఈసారి చైనా వైపు మొగ్గే ఓలీతో కలసి అధికారం పంచుకుంటున్నారు గనక రానున్న రోజులు భారత్‌కు ఎలా ఉంటాయన్నది ప్రశ్న. అలా చూస్తే ప్రపంచంలో ఒకప్పటి ఏకైక హిందూరాజ్యాన్ని అక్కున చేర్చుకోలేకపోవడం ఇక్కడ హిందూ ఆధిక్యవాదాన్ని పరోక్షంగా ప్రవచిస్తున్న పాలకుల దౌత్య వైఫల్యమని కొందరి విమర్శ. అయితే, పదవి చేపట్టిన ప్రచండను ముందుగా మోదీనే అభినందించడం విశేషం. గతంలో ఓలీ అధికారంలో ఉండగా మోదీ రెండుసార్లు నేపాల్కెళితే, ఆయన రెండుసార్లు భారత్‌కు వచ్చారు. కింగ్‌మేకర్ ఓలీ నేతృత్వ పార్టీ కూడా తాము భారత్ కన్నా చైనాతో బంధానికే మొగ్గుతామనే భావనను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. భారత, చైనాల పట్ల నేపాల్ వైఖరిలో పెద్ద మార్పేమీ ఉండదనీ, భారత్‌తో ‘సంతులిత, విశ్వసనీయ’ సంబంధాలు నెరుపుతామనీ అంటోంది. కానీ, ఓలీ గద్దెపై ఉన్నప్పుడే వివాదాస్పద ప్రాంతాలను నేపాల్‌లో భాగంగా చూపుతూ కొత్త రాజకీయ పటాన్ని జారీ చేయడం, చకచకా పార్లమెంట్ ఆమోదముద్ర వేయడం అంత తేలిగ్గా మర్చిపోలేం. ఆరేళ్ళు పనిచేసి, అర్ధంతరంగా చైనా వదిలేసిన రెండు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లను ఈ ఏడాదే భారత్ చేపట్టింది. మునుపటి దేవుబా సర్కార్ వాటిని భారత్‌కు కట్టబెట్టింది. అప్పట్లో ఓలీ దాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ఓలీ భాగస్వామిగా కొత్త ప్రభుత్వం వచ్చేసరికి, వాటి భవిత ప్రశ్నార్థకమే. పైగా, కొత్త సర్కార్ రాగానే చైనా రకరకాల ప్రాజెక్ట్‌లతో నేపాల్‌లో కాలూనేందుకు ఉరకలేస్తోంది. నేపాల్ – చైనా సరిహద్దు రైల్వేలైన్ అధ్యయనానికి నిపుణుల బృందాన్ని మంగళవారమే పంపింది. ఈ పరిస్థితుల్లో భారత్ చొరవ చూపాలి. ప్రాజెక్ట్‌లే కాక విద్య, వైద్యం, పర్యావరణం లాంటి అనేక అంశాల్లోనూ ప్రజాస్వామ్య గణతంత్ర భారత్‌తో సన్నిహిత భాగస్వామ్యమే నేపాల్‌కు దీర్ఘకాలంలో లాభమని నచ్చజెప్పగలగాలి. ఒక్క నేపాల్‌కే కాదు... వ్యూహాత్మకంగా మనకూ అది ముఖ్యం! -
నేపాల్‌లో నాటకీయ పరిణామాలు.. ప్రధానిగా ‘ప్రచండ’ నియామకం
కాఠ్మాండు: నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానమంత్రిగా సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ పార్టీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’ ప్రధానిగా నియామకమయ్యారు. అధికార పంపకాలపై నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదుర్ దేవ్బాతో జరిగిన చర్చలు విఫలమైన క్రమంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలితో జతకట్టారు ప్రచండ. ఓలితో పాటు విపక్షంలోని చిన్న చిన్న పార్టీలు ప్రచండకు మద్దతు ప్రకటించాయి. దీంతో తనకు 165 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారిని కలిశారు. అధికారం ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరారు. ఈ క్రమంలో ఆయన్ను ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 క్లాజ్ 2 ప్రకారం నేపాల్ తదుపరి ప్రధానిగా ప్రచండను నియమించినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అంతకు ముందు ఆదివారం సాయంత్రం 5 గంటల్లోనే చట్టసభ్యులు మెజారిటీని కూడగట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రెసిడెంట్ కోరారు. గడువు ముగిసే సమయానికి కొద్ది గంటల ముందు ప్రచండ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. దీంతో ఆయనను నియమిస్తూ ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రచండతో పాటు సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్ కేపీ శర్మ ఓలి, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్ఎస్పీ) ప్రెసిడెంట్ రవి లమిచ్చనే, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చీఫ్ రాజేంద్ర లింగ్దే సహా ఇతర నేతలు హాజరయ్యారు. ప్రచండకు మొత్తం 275 సభ్యుల్లో 165 మంది చట్టసభ్యుల మద్దతు లభించింది. అందులో సీపీఎన్-యూఎంఎల్ 78, సీపీఎన్-ఎంసీ 32, ఆర్ఎస్పీ 20, ఆర్పీపీ 14, జేఎస్పీ 12, జనమాత్ 6, నాగరిక్ ఉన్ముక్తి పార్టీ 3 సభ్యులు ఉన్నారు. నేపాల్ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు ప్రచండ. రొటేషన్ పద్ధతిపై ఒప్పందం.. నేపాల్ ప్రధాని పదవీ కాలం ఐదేళ్లు. పదవిని రొటేషన్ పద్ధతిలో చేపట్టాలని ఎన్నికలకు ముందు షేర్ బహదుర్ దేవ్బా, పుష్ప కమల్ దహాల్ మధ్య ఒప్పందం కుదిరింది. తొలి రెండున్నరేళ్లు తనకు పదవి ఇవ్వాలని ప్రచండ కోరగా.. అందుకు దేవ్బా నిరాకరించటంతో సంక్షోభం తలెత్తింది. విపక్ష కూటమితో చేతులు కలిపారు ప్రచండ, సహచర కమ్యూనిస్టు పార్టీ నేత, మాజీ ప్రధాని కేపీ శర్మ ఒలిని కలిశారు. రొటేషన్ పద్ధతిన ప్రధాని పదవిని పంచుకునేందుకు ఓలి అంగీకరించటంతో ప్రభుత్వ ఏర్పాటు, ప్రచండ ప్రధాని పదవి చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
పార్టీ పేరులో ‘మావోయిస్టు సెంటర్’ని తొలగించాలి
ఖట్మండూ: దేశంలో మావోయిస్టు భావజాలాన్ని వ్యతిరేకించే, కమ్యూనిస్టు శక్తులు సైతం పార్టీలో చేరేందుకు అనుకూలంగా ఉండేలా పార్టీ పేరులో నుంచి ‘మావోయిస్టు సెంటర్’ అనే పదాన్ని తొలగించాలంటూ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్–మావోయిస్టు సెంటర్ (ఎంసీ) నేపాల్ చీఫ్ పుష్ప కమల్ దహాల్ ‘‘ప్రచండ’’ ప్రతిపాదించినట్లు మీడియా వెల్లడించింది. మాజీ ప్రధాని ప్రచండ దేశంలోని కమ్యూనిస్టు శక్తుల ఐక్యతను ఆకాంక్షించారని, అయితే పార్టీ పేరులో నుంచి మావోయిస్టు పదాన్ని తొలగించడం ద్వారా అది సాధ్యమౌతుందని, అందుకు పార్టీ సిద్ధంగా ఉందని సీపీఎన్–ఎంసీ సభ్యుడు శివకుమార్ మండల్ చెప్పినట్టు హిమాలయన్ టైమ్స్ రిపోర్టు చేసింది. ప్రధాని కెపి.శర్మ ఓలి నేతృత్వంలోని సీపీఎన్–యుఎంఎల్‌తో సీపీఎన్–ఎంసీ విలీనాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పేరు మార్పు విషయం చర్చకొచ్చింది. ప్రధాని కేపి.శర్మ ఓలికి కేంద్ర కమిటీలోనూ, పార్లమెంటరీ పార్టీలోనూ పూర్తి మెజారిటీ రావడంతో పార్టీలో ఆయన స్థానం బలోపేతం అయ్యింది. ప్రచండతో చేతులు కలిపిన, సీపీఎన్–యుఎంఎల్ నేపాల్ వర్గంలోని ఇతర కీలక నేతలు మాధవ్ కుమార్ నేపాల్, ఝలనాథ్ ఖానల్‌లు ఓలిని ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరినట్టు రిపోర్టు వెల్లడించింది. 2017 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేసి, ఘనవిజయం సాధించిన తరువాత, సీపీఎన్ (యుఎంఎల్), సీపీఎన్ (ఎంసీ)లు కలిసి 2018లో యూనిఫైడ్ నేపాల్‌కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. 275 మంది సభ్యుల ప్రతినిధుల సభను డిసెంబర్లో రద్దు చేయాలన్న ఓలి నిర్ణయంతో ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. అయితే సుప్రీంకోర్టు పార్లమెంటు దిగువ సభను తిరిగి నియమించింది. రెండు పార్టీల విలీనాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తరువాత తిరిగి తమ పార్టీలను మళ్ళీ విలీనం చేయాలని భావిస్తే, పార్టీకి కొత్త పేరు, ఎన్నికల గుర్తుతో రావాలని నేపాల్ ఎన్నికల కమిషన్ సీపీఎన్(యుఎంల్), సీపీఎన్(ఎంసీ)లను ఆదేశించింది. మార్క్స్, లెనిన్‌ల కమ్యూనిస్టు సిద్ధాంతమే నిజమైన కమ్యూనిజమని విశ్వసించే కమ్యూనిస్టు పార్టీలనేకం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని, ‘‘మావోయిస్టు సెంటర్’’ అనేది వీరి మధ్య ఐక్యతకు విఘాతంగా మారిందని మండల్ పేర్కొన్నారు. మావో చెప్పినట్టుగా ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అని సీపీఎన్–ఎంసీ తొలుత భావించిందనీ, అయితే 2006లో జరిగిన సమగ్ర శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తరువాత ‘బ్యాలెట్ ద్వారానే రాజకీయాధికారం లభిస్తుంది’ అని విశ్వసిస్తోందని మారిన సీపీఎన్–ఎంసీ విధానాన్ని రాజకీయ విశ్లేషకులు ఉద్దభ్ ప్యాకురేల్ వివరించారు. ఉదారవాద ప్రజాస్వామ్య విలువలు కలిగిన సీపీఎన్–యుఎంఎల్‌తో విలీనం అవడంతో సీపీఎన్–ఎంసీకి మావోయుస్టు ట్యాగ్‌ని తొలగించుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్యాకురేల్ వ్యాఖ్యానించారు. చదవండి: రైతుల నిరసనకు లిల్లి సింగ్ మద్దతు -
అధికార పార్టీ భేటీ వాయిదా.. రంగంలోకి ఆమె!
ఖాట్మండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తీరుపై అధికార కమ్యూనిస్టు పార్టీలో అసంతృప్తి చెలరేగుతున్న నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. పార్టీ కో చైర్మన్ పుష్ప కమల్ దహల్(ప్రచండ), ఓలి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో బుధవారం జరగాల్సిన భేటీని జూలై 28 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రధాని, పార్టీ పదవి నుంచి వైదొలిగేందుకు ఓలి సుముఖంగా లేరని, ఈ క్రమంలో పార్టీలో చీలిక వచ్చే పరిస్థితులు తలెత్తినట్లు సమాచారం. మరోవైపు.. పార్టీ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రచండ రాజకీయంగా మరింత బలపడేందుకు కేబినెట్లో తన వర్గానికి స్థానం కల్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి నాటికి ఓలి కేబినెట్లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. (మేడిన్ చైనా రామాయణం) కాగా సుదీర్ఘ కాలంగా మిత్రదేశంగా కొనసాగుతున్న భారత్ పట్ల ఓలి వైఖరిని నిరసిస్తూ సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్సిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఓలి ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సమావేశం అనేకమార్లు వాయిదా పడింది. మరోవైపు చైనాతో సత్సంబంధాలు పెంచుకుంటున్న ఓలి తాను పదవి నుంచి దిగిపోయేది లేదని స్పష్టం చేయడంతో రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇలాంటి తరుణంలో, భారత్‌తో సరిహద్దు వివాదాలు నెలకొన్న వేళ నేపాల్‌ను అడ్డుపెట్టుకుని భారత్‌పై అక్కసు వెళ్లగక్కాలని చూస్తున్న చైనా అధికార పార్టీలో చీలిక వస్తే మొదటికే మోసం వస్తుందనే భావనతో సంక్షోభాన్ని చల్లార్చేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నేపాల్‌లోని చైనా రాయబారి హు యోంకి ఇప్పటికే ఎన్సీపీ నేతలతో సమావేశమై.. సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఓలిని ప్రధానిగా కొనసాగిస్తూనే.. పార్టీలో చీలిక రాకుండా వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. -
ఓలీ వ్యాఖ్యలపై నేపాల్‌లో ఆగ్రహం
ఖాట్మండు : శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్, నేపాల్ మధ్య పరిస్థితి ఉద్రిక్తతంగా ఉన్న సమయంలో ఓలీ తన వ్యాఖ్యలతో పరిస్థితులను మరింత క్షీణింపచేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓలీ చేసిన వ్యాఖ్యల పట్ల భారత్, విదేశాల్లోనే కాక స్వదేశంలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓలీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేత కమల్ థాపా ప్రధాని కేపీ ఓలీ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.(ఒక్క రాముడేంటి, అన్ని గ్రహాలు నేపాల్‌వే..) ‘ఒక ప్రధాని ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం తగదు. చూస్తుంటే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి బదులు, ప్రధాని ఓలీ భారత్-నేపాల్ సంబంధాలను నాశనం చేయాలని చూస్తున్నట్టు ఉందని’ అన్నారు. నేపాల్‌లో భారత వ్యతిరేక భావాలు పెంచడం కోసమే ఓలీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేపాల్ ప్రధాన వార్తాపత్రిక ఖాట్మండు పోస్ట్ కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఓలీ వ్యాఖ్యలు నేపాల్-ఇండియా సంబంధాలను, రెండు దేశాల ప్రజలు, నాయకుల మధ్య సంబంధాలను చెదిరిపోయేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారని రాసుకొచ్చింది. ఓలీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నేపాల్ విదేశాంగ శాఖ వివరణ జారీ చేసింది. నేపాలీ భాషలో రామాయణాన్ని రచించిన ఆదికవి భాను భక్త ఆచార్య 207వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేపీ శర్మ ఓలీ ఈ విధంగా మాట్లాడారని.. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఏ రాజకీయ దురుద్దేశం లేదని తెలిపింది. రాముడి కాలానికి సంబంధించిన ప్రాంతాలపైన చాలా అపోహలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో రాముడు, రామాయణం కాలానికి సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు మరిన్ని అధ్యయనాలు జరగాలన్న అంశాన్ని ఆయన ప్రముఖంగా చెప్పారని వివరించింది. (చైనా మెప్పు కోసమే ఆ వ్యాఖ్యలు..) కాగా, భారత్, నేపాల్ మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మే 20న నేపాల్ తన కొత్త మ్యాప్ జారీ చేసింది. అందులో లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలను తమ ప్రాంతాలుగా చూపించింది. ఈ మూడు ప్రాంతాలు ప్రస్తుతం భారత్‌లో ఉన్నాయి. కానీ అది తమ ప్రాంతం అని నేపాల్ చెబుతోంది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. దీని గురించి నేపాల్‌తో చర్చించేది లేదని తేల్చిచెప్పింది. ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలకై కృషి చేస్తామని పేర్కొన్నది. గత కొద్ది కాలంగా ఓలీ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. చైనా అండ చూసుకునే ఓలీ భారత వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలకు దిగుతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. -
చీలిక దిశగా నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ
కఠ్మాండు: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’ మధ్య సయోధ్య కుదరక పోవడంతో అధికార పార్టీలో చీలిక దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చైనా అనుకూలుడిగా పేరున్న ఓలి తరఫున నేపాల్‌లో చైనా రాయబారి హౌ యాంకుయి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తుండటం గమనార్హం. చైనా రాయబారి గురువారం ప్రచండను ఆయన నివాసంలో కలిసి చర్చలు జరిపారు. ప్రధాని ఓలి రాజకీయ భవితవ్యం శుక్రవారం జరగనున్న పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తేలిపోనుంది. కాగా, కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ ఇప్పటి వరకు 4 పర్యాయాలు భేటీ అయినా ఇద్దరు నేతల వివాద పరిష్కారం కోసం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోయింది. (భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు.. నేపాల్ ప్రధానికి షాక్) -
ప్రచండ కొత్త అడుగులు
నేపాల్ నూతన ప్రధాని పుష్ప కమల్ దహల్(ప్రచండ) తన తొలి విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకుని నాలుగురోజుల పర్యటన కోసం గురువారం వచ్చారు. మనపట్ల నేపాల్ దృక్పథంలోనూ, ప్రత్యేకించి ప్రచండ అవగాహనలోనూ వచ్చిన మార్పును ఇది సూచిస్తుంది. భూకంపంతో దెబ్బతిన్న నేపాల్ పునర్నిర్మాణానికి మన దేశం 75 కోట్ల డాలర్ల సాయం అందించాలన్న నిర్ణయంతోపాటు పలు కీలక ఒప్పందాలపై రెండు దేశాలూ శుక్రవారం సంతకాలు చేశాయి. చారిత్రకంగా, సాంస్కృతికంగా ఎంతో సాన్నిహిత్యమున్న భారత్-నేపాల్ మధ్య ఇటీవలికాలంలో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ప్రచండకు ముందు 9 నెలల పాటు ప్రధానిగా ఉన్న ఖడ్గప్రసాద్ ఓలీ హయాంలో ఇవి ఎన్నడూలేని స్థాయికి దిగజారాయి. తనపట్ల కొన్ని ‘విదేశీ శక్తులు’ ఏర్పర్చుకున్న అయిష్టత కారణంగానే పదవి కోల్పోయానని రాజీనామా చేసినప్పుడు పరోక్షంగా భారత్‌నుద్దేశించి ఓలీ ఆరోపించారు. నూతన రాజ్యాంగంపై మాధేసి, తారూ వంటి మైనారిటీ జాతుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించి, వారి అభీష్టానికి అనుగుణంగా మార్పులు చేయాలని మన దేశం నేపాల్‌కు సూచించింది. ఈ సవరణలు జరిగాకే కొత్త రాజ్యాంగం అమలు కావాలని కూడా సలహా ఇచ్చింది. అయితే నేపాల్ దీన్ని పట్టించుకోకుండా రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత మైనారిటీ జాతుల ఉద్యమం ఉధృత మైంది. ఆందోళనకారులు సరిహద్దుల్లోని రహదార్లు దిగ్బంధించడం వల్ల నేపాల్‌కు ఇక్కడినుంచి వెళ్లే సరుకు రవాణా, ఇంధనం తదితర నిత్యావసరాలన్నీ నిలిచి పోయాయి. సాధారణ ప్రజానీకం చెప్పనలవికాని పాట్లుబడ్డారు. ఈ ఉద్యమం వెనక భారత్ హస్తమున్నదని నేపాల్ నాయకులు ఆరోపించారు. దీన్నుంచి బయట పడటం కోసం తన సరిహద్దుకు ఆవలివైపునున్న చైనాను ఆ దేశం ఆశ్రయించింది. సహజంగానే ఈ పరిస్థితిని తనకనుకూలంగా మలుచుకోవడానికి చైనా ప్రయత్నిం చింది. మైనారిటీ జాతుల ఆందోళన సమయంలో నేపాల్‌తో రవాణా బంధాన్ని ఏర్పరుచుకోవడమే కాదు... ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ఒప్పం దం కుదుర్చుకుంది. చైనా ఓడరేవులను నేపాల్ వినియోగించుకునేందుకు, ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి, రహదారి నిర్మాణం చేప ట్టడానికి అంగీకారం కుదిరింది. ఈ విషయంలో ఒప్పందాలు ఖరారు చేసుకు నేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నేపాల్ సందర్శించాలని కూడా అనుకు న్నారు. ఈలోగానే నేపాల్ రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడింది. ఓలీకి వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. ఆ తీర్మానం ఎటూ ఆమోదం పొందక తప్పదని గ్రహించిన ఓలీ చర్చకు ముందే రాజీనామా చేశారు. ఈ పరిణామాలన్నిటితో చైనా విస్తుపోయింది. ఓలీ అనంతరం ఆ పదవి లోకొచ్చిన ప్రచండ తొలి పర్యటనకు మన దేశాన్ని ఎంచుకోవడం దాన్ని మరింత కుంగదీసింది. ఫలితంగా జిన్‌పింగ్ వచ్చే నెలలో జరపాలనుకున్న నేపాల్ పర్యటన రద్దయిందన్న కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే అవి నిజం కాదని చెప్పినా ఇంతవరకూ ఆయన పర్యటన తేదీలైతే ఖరారు కాలేదు. మైనారిటీ జాతుల ఉద్యమంలో తన పాత్రేమీ లేదని, ఆ ఉద్యమ ప్రభావం పొరుగునున్న మన భూభా గంలోని ప్రాంతాలపై పడుతున్నందువల్లే వాటిని పరిష్కరించుకోమని సలహా ఇచ్చామని మన దేశం చెబుతూ వచ్చింది. ఏదేమైనా ఒకప్పుడు భారత్ అనుకూలుడిగా ముద్రపడిన ఓలీ హయాంలో ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న మాట వాస్తవం. నిజానికి 2008-09 మధ్య తొమ్మిది నెలలపాటు ప్రధానిగా పనిచేసినప్పుడు ప్రచండ సైతం చైనా వైపే మొగ్గు చూపారు. అప్పట్లో తన తొలి విదేశీ పర్యటనకు ఆయన చైనానే ఎంచు కున్నారు. ఆ దేశం కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉండటం, ప్రచండ మావోయిస్టు రాజకీయ నేపథ్యం ఇందుకు కారణం. పైగా భారత్ తమ దేశంపై పెద్దన్న తరహాలో పెత్తనం చేస్తున్నదన్న అభిప్రాయం నేపాల్ మావోయిస్టుల్లో బలంగా ఉండేది. తమను తీవ్రంగా అణిచేసిన రాజరికానికి మన దేశం గట్టి మద్దతుదారుగా నిలిచిందని వారు భావించేవారు. ముఖ్యంగా ఇరు దేశాలమధ్యా స్నేహసంబం దాలకు కీలక మలుపుగా భావించే 1950నాటి భారత్-నేపాల్ ఒప్పందం రద్దు కావాలని డిమాండ్ చేసేవారు. కానీ ఒక ఇంటర్వ్యూలో ప్రచండే చెప్పుకున్నట్టు ఈ ఏడెనిమిదేళ్లలో ‘ప్రధాన స్రవంతి’ రాజకీయాలు మావోయిస్టులకు బాగా వంట బట్టాయి. దౌత్యరంగంలో మెలకువలు కూడా బాగా తెలిసొచ్చాయి. అందువల్లే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారత్, చైనాలు రెండింటికీ ‘సమాన ప్రతిపత్తి’ ఇస్తున్నట్టు కనబడటం కోసం రెండు దేశాలకూ ఉన్నత స్థాయి ప్రత్యేక దూతలను పంపారు. అయితే చైనాకు ఇది అంతగా రుచించినట్టు కనబడదు. ఇందువల్లే జిన్‌పింగ్ నేపాల్ పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని దౌత్య నిపుణుల అంచనా. తాము చైనాకు దూరం కావాలనుకోవడం లేదని ప్రచండ దూతలు చెప్పినా ఓలీ హయాంలో కుదిరిన రవాణా ఒప్పందంలోగానీ, అప్పట్లో వచ్చిన ఇతర ప్రతిపాదనల విషయంలోగానీ ప్రచండ బాధ్యతలు స్వీకరించాక ఆశించినంత ప్రగతి కనబడలేదన్న అసంతృప్తి ఆ దేశానికుంది. అంతమాత్రాన భారత్, నేపాల్ మధ్య వెనువెంటనే మునుపటి స్థాయిలో సంబంధాలు ఏర్పడతాయని చెప్పలేం. ఇటీవలికాలంలో ఇరు దేశాలమధ్యా అపో హలు తీవ్ర స్థాయికి చేరుకోవడమే ఇందుకు కారణం. నేపాలీ కాంగ్రెస్‌తో ప్రచండ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయన తొమ్మిదినెలలపాటు ప్రధాని పీఠంపై ఉంటారు. ఆ తర్వాత నేపాలీ కాంగ్రెస్ అధినేత షేర్ బహదూర్ దేవ్బా ఆ పదవిని స్వీకరిస్తారు. ఏదేమైనా చాన్నాళ్ల తర్వాత రెండు దేశాలూ దగ్గర కావడానికి చిత్త శుద్ధితో ప్రయత్నాలు ప్రారంభించాయి. మిగిలినవాటి మాటెలా ఉన్నా ప్రచండ తాజా పర్యటనతో రెండు దేశాలమధ్యా అలుముకున్న అపోహలు పటాపంచ లవుతాయని...అవి ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయని ఆశించాలి. -
ప్రధానితో భేటీ అయిన నేపాల్ పీఎం
-
మోదీతో నాకు కెమిస్ట్రీ ఉంది!
కఠ్మాండు: భారత్-నేపాల్ మధ్య పరస్పర విశ్వాస పునరుద్ధరణ తన తాజా పర్యటన ప్రధాన ఉద్దేశమని నేపాల్ నూతన ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ (ప్రచండ) తెలిపారు. నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 15 నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఓ భారతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన తాజా భారత పర్యటనపై నెలకొన్న ఆకాంక్షలు, అంచనాలు, ఇరుదేశాల సంబంధాల్లో చైనా పాత్ర తదితర అంశాలను ప్రస్తావించారు. గత ఏడాదికాలంగా భారత్-నేపాల్ మధ్య సంబంధాలు అంత బాగాలేవని ఒప్పుకొన్న ఆయన.. ప్రధాని మోదీపై తనకు వ్యక్తిగతంగా నమ్మకం ఉందని, ఆ విశ్వాసం పునాదిగా సంబంధాలు బలోపేతం చేసుకుంటామని చెప్పారు. పొరుగు దేశాలైన భారత్-నేపాల్ మధ్య మళ్లీ సంబంధాలు మెరుగు పడుతున్నాయని చెప్పారు. 'మోదీజీ నేను ఒకే రకంగా ఆలోచిస్తాం. మా మధ్య కెమిస్ట్రీ ఉంది. మా సిద్ధాంతాలలో, ఎదుర్కొన్న పరిస్థితుల్లో వైరుద్ధ్యం ఉండవచ్చు. కానీ అది వేరే విషయం. భారీ మెజారిటీతో గెలిచిన ఆయన భారత్‌కు బలమైన ప్రధానమంత్రి. ఆయనను నేపాలీ ప్రజలు, నేను నమ్ముతున్నాం. ఇప్పుడు మేం ఈ విశ్వాసాన్ని మరింతగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది' అని సీనియర్ మావోయిస్టు నాయకుడైన ప్రచండ చెప్పారు. భారత్-నేపాల్ సంబంధాల్లో చైనా పెద్ద విషయం కాబోదని ఆయన పేర్కొన్నారు. భావజాలపరంగా మీరు చైనాకు సన్నిహితమా? అని ప్రశ్నించగా.. 'చైనా ఎలాంటి భావజాలాన్ని కొనసాగిస్తున్నదని నేను అనుకోవడం లేదు. వారికి వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలే ముఖ్యం' అని చెప్పారు. -
ప్రాణాలతో పోరాడుతున్న ప్రచండ కూతురు!
కఠ్మాండు: నేపాల్ యూనిఫైడ్ సీపీఎన్-మావోయిస్టు (యూసీపీఎన్-ఎం) అధినేత పుష్ప కమల్ దహాల్ అలియాస్ ప్రచండ గురువారం భారత్‌కు వస్తున్నారు. నోయిడా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న తన కూతురిని చూసేందుకు ఇండియా వెళుతున్నారని ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. ప్రచండ, ఆయన సతీమణి సీత ఇద్దరూ రేపు భారత్‌కు వెళుతున్నారని తెలిపారు. వీరి కుమార్తె జ్ఞాను కేసీ దహా(40) రొమ్ము కేన్సర్‌తో బాధపడుతూ నోయిడాలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కూతురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చూసేందుకు ప్రచండ దంపతులు ఇక్కడకు వస్తున్నారు. ఏడేళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన జ్ఞాను- ముంబైలో చికిత్స పొందారు. కేన్సర్ మళ్లీ తిరగబెట్టడంతో గతేడాది అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్నారు. మరోసారి వ్యాధి తిరగబెట్టడంతో నెలన్నర రోజులుగా నోయిడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.