ప్రాణాలతో పోరాడుతున్న ప్రచండ కూతురు! | Prachanda to visit India to meet ailing daughter | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో పోరాడుతున్నప్రచండ కూతురు!

Published Wed, Nov 27 2013 3:58 PM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM

ప్రాణాలతో పోరాడుతున్న ప్రచండ కూతురు!

ప్రాణాలతో పోరాడుతున్న ప్రచండ కూతురు!

కఠ్మాండు: నేపాల్ యూనిఫైడ్ సీపీఎన్-మావోయిస్టు (యూసీపీఎన్-ఎం) అధినేత పుష్ప కమల్ దహాల్ అలియాస్ ప్రచండ గురువారం భారత్కు వస్తున్నారు. నోయిడా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న తన కూతురిని చూసేందుకు ఇండియా వెళుతున్నారని ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. ప్రచండ, ఆయన సతీమణి సీత ఇద్దరూ రేపు భారత్కు వెళుతున్నారని తెలిపారు.

వీరి కుమార్తె జ్ఞాను కేసీ దహా(40) రొమ్ము కేన్సర్తో బాధపడుతూ నోయిడాలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కూతురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చూసేందుకు ప్రచండ దంపతులు ఇక్కడకు వస్తున్నారు. ఏడేళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన జ్ఞాను- ముంబైలో చికిత్స పొందారు. కేన్సర్ మళ్లీ తిరగబెట్టడంతో గతేడాది అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్నారు. మరోసారి వ్యాధి తిరగబెట్టడంతో నెలన్నర రోజులుగా నోయిడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement