bilateral relationship
-
ఆర్థిక, దౌత్యంలో నూతనాధ్యాయం
నాగపట్నం/న్యూఢిల్లీ: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత్, శ్రీలంక మధ్య మొదలైన పడవ ప్రయాణ సేవలు ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని సుధృడం చేస్తాయని ప్రధాని మోదీ అభిలíÙంచారు. శనివారం తమిళనాడులోని నాగపట్నం, జాఫా్నలోని కంకెసంథురై మధ్య ఫెర్రీ సేవలు మొదలవడం అనేది ఇరుదేశాల మైత్రీ బంధంలో కీలకమైన మైలురాయి అని మోదీ శ్లాఘించారు. షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ హైస్పీడ్ ఫెర్రీ సేవలు మొదలయ్యాయి. సముద్రమార్గంలో 110 కిలోమీటర్ల దూరాన్ని 3.5 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ఫెర్రీ సేవలను లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా చెరియాపని అనే పడవ 50 మంది ప్రయాణికులతో శ్రీలంకకు బయల్దేరింది. సాయంత్రం కల్లా భారత్‌కు తిరిగొచి్చంది. ‘ఇరుదేశాల మధ్య కనెక్టివిటీతోపాటు వాణిజ్యం, బంధాల బలోపేతానికి ఫెర్రీ సేవలు ఎంతో కీలకం’ అని ప్రధాని మోదీ తన వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. ‘ ఈ బంధం ఈనాటిదికాదు. ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ దీని ప్రస్తావన ఉంది. సంగం కాలం నాటి పట్టినాప్పలై, మణిమేఖలై సాహిత్యంలోనూ భారత్, శ్రీలంక నౌకల రాకపోకల వివరణ ఉంది. ప్రఖ్యాత కవి సుబ్రమణ్యభారతి రాసిన పాట ‘సింధు నదియన్ మిసై’లోనూ రెండుదేశాల బంధాన్ని వివరించారు. చారిత్రక, సాంస్కృతిక బంధాల్లో ఈ పడవ ప్రయాణాల మధుర జ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయి. ఇటీవల భారత్‌లో పర్యటించిన సందర్భంగా విక్రమసింఘే అనుసంధాన సంబంధిత విజన్ డాక్యుమెంట్‌ను భారత్‌తో పంచుకున్నారు. 2015లో శ్రీలంకలో నేను పర్యటించాకే ఢిల్లీ, కొలంబో మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ’ అని మోదీ గుర్తుచేసుకున్నారు. మనసులనూ దగ్గర చేస్తోంది ‘ఈ అనుసంధానం రెండు పట్టణాలను మాత్రమే కాదు. రెండు దేశాలను, దేశాల ప్రజలను, వారి మనసులనూ దగ్గర చేస్తోంది. ‘పొరుగుదేశాలకు ప్రాధాన్యం’ అనే మోదీ సర్కార్ విధానాన్ని మరింత తీసుకెళ్తున్నాం’ అని ఈ సేవలను లాంఛనంగా పచ్చజెండా ఊపి ప్రారంభించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నౌకలు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య అనుసంధానం, వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక అనుబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ సేవలు దోహదపడతాయని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వ్యాఖ్యానించారు. గతంలో చెన్నై, కొలంబోల మధ్య తూత్తుకుడి మీదుగా ఇండో–సియోల్ ఎక్స్‌ప్రెస్ ఆధ్వర్యంలో పడవ ప్రయాణలు కొనసాగేవి. అయితేశ్రీలంకలో పౌర సంక్షోభం తలెత్తాక 1982లో ఆ సేవలు నిలిచిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా పడవ సేవలు పునఃప్రారంభమయ్యాయి. -
రాష్ట్రపతి ముర్ముతో ప్రచండ భేటీ
న్యూఢిల్లీ: నేపాల్‌ను ప్రాధాన్యత గల దేశంగా భారత్ పరిగణిస్తుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. కీలక ప్రాజెక్టులను నిర్ణీత కాలంలోగా పూర్తి చేయడం సహా రెండు దేశాల మధ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునేందుకు కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. భారత్ పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’గురువారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. ఇటీవలి సంవత్సరాల్లో నేపాల్–భారత్ ద్వైపాక్షిక సంబంధాలు క్రమేపీ వృద్ధి చెందుతు న్నాయని ముర్ము అన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను, పర్యాట కాన్ని అభివృద్ధి చేసేందుకు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. తరాలుగా కొనసాగుతున్న సంబంధాలు మరింతగా బలపడాలని రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారని రాష్ట్రపతి భవన్ తెలిపింది. అనంతరం నేపాల్ ప్రధాని ప్రచండ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. -
పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంటు.. రష్యాలో జిన్‌పింగ్
మాస్కో: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు రష్యాలో ఘనస్వాగతం లభించింది. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన సోమవారం రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అవధులు లేని తమ స్నేహాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. రష్యాపై దండయాత్రకు దిగిన రష్యాను ఒంటరిని చేసేందుకు పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండడం, యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంటు జారీ చేసిన చేసిన నేపథ్యంలో జిన్‌పింగ్ రష్యా పర్యటన ప్రారంభించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. శాంతి చర్చల కోసం పుతిన్‌పై ఒత్తిడి! ప్రపంచంలో రెండు బలమైన దేశాల అధినేతలు జిన్‌పింగ్, పుతిన్ సోమవారం చర్చలు ప్రారంభించారు. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్, పుతిన్ మధ్య ముఖాముఖి చర్చల తర్వాత ఇరుదేశాల నడుమ ప్రతినిధుల స్థాయి చర్చలు ప్రారంభమవుతాయని రష్యా ప్రభుత్వ అధికారి యురీ ఉషాకోవ్ చెప్పారు. ఇద్దరు నాయకుల చర్చలు మంగళవారం కూడా కొనసాగుతాయని రష్యా మీడియా వెల్లడించింది. జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా, సైనికాధిపతిగా ఎన్నికైన తర్వాత జిన్‌పింగ్ తొలి విదేశీ పర్యటన కూడా ఇదే. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి నెలకొనాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు జిన్‌పింగ్ చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించడమే లక్ష్యంగా శాంతి చర్చల కోసం పుతిన్‌పై ఆయన ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బద్ధశత్రువులైన ఇరాన్, సౌదీ అరేబియా ఇటీవలే చేతులు కలిపాయి. దీని వెనుక చైనా దౌత్యం ఉంది. గత పదేళ్లుగా చైనా అధ్యక్షుడిగా పదవిలో కొనసాగుతూ ఇటీవలే మూడోసారి ఎన్నికైన జిన్‌పింగ్ రష్యాతో సన్నిహిత సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా వైఖరిని ప్రపంచంలో చాలా దేశాలు తప్పుపట్టినప్పటికీ జిన్‌పింగ్ మాత్రం పరోక్షంగా మద్దతు ప్రకటించారు. అమెరికా వ్యతిరేకతే చైనా, రష్యా దేశాలను ఒక్కటి చేస్తోంది. శాంతి ప్రణాళికతో వచ్చా: జిన్‌పింగ్ చైనా, రష్యా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయని, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయని జిన్‌పింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. థర్డ్ పార్టీని తాము లక్ష్యంగా చేసుకోవడం లేదన్నారు. రెండు పెద్ద దేశాల సంబంధాల విషయంలో ఒక కొత్త మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ లా పరిరక్షణ కోసం రష్యాతో కలిసి పని చేస్తూనే ఉంటామని జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి ప్రణాళికతో రష్యాకు వచ్చానన్నారు. ఉక్రెయిన్‌లో సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో చైనా చేసిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలిస్తున్నామని పుతిన్ తెలిపారు. దీనిపై జిన్‌పింగ్‌తో చర్చిస్తానని పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ వ్యవహారాలు, సంక్షోభాల విషయంలో చైనా నిష్పాక్షిక, సమతూక వైఖరి అవలంబిస్తోందని పుతిన్ ప్రశంసించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జిన్‌పింగ్ మాట్లాడే అవకాశమున్నట్లు సమాచారం. తన శాంతి ప్రణాళికను జెలెన్స్కీతో ఆయన పంచుకోనున్నట్లు తెలుస్తోంది. -
వందల ఏళ్ల నాటి కళాఖండాలను అప్పగించిన ఆస్ట్రేలియా
On behalf of Indians, I thank you: భారత్ ఆస్ట్రేలియా మధ్య వర్చువల్ శిఖరాగ్ర వర్చువల్ సమావేశం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఇరు దేశాల ప్రధానులు ఈ సమావేశంలో భేటి అయ్యారు. ఈ వర్చువల్ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ 'నమస్కార్'తో అభినందించారు. ఈ సమావేశంలో ఆయన ఆస్ర్టేలియాలోని ప్రధాన నగరాలైన క్వీన్స్లాండ్, న్యూ సౌత్ వేల్స్లో సంభవించిన వరదల కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణా నష్టాలపై మోదీ సానూభూతి వ్యక్తం చేశారు. అంతేకాదు ఆస్ట్రేలియాకు అక్రమంగా తరలించిన 29 భారతీయ కళాఖండాలను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నందుకు ఆస్ట్రేలియా అధినేతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పైగా మీరు పంపిన పురాతన వస్తువులలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, తదితర రాష్ట్రాలకు సంబంధించిన వందల ఏళ్ల నాటి కళాఖండాలు, ఫోటోలు ఉన్నాయని చెప్పారు. భారతీయులందరి తరపున తాను ధన్యవాదాలు తెలుపుతున్నాని అన్నారు. గత వర్చువల్ సమావేశంలో వ్యూహాత్మక భాగస్వామ్యనికి ఒక రూపాన్ని ఇవ్వగలిగాం. ఈ రోజు దాన్ని నిజం చేస్తూ ఇరుదేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశం జరుగుతున్నందుకు తాను సంతోషిస్తున్నాను అని చెప్పారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా నిర్మాణాత్మక వ్యవస్థను సిద్ధం చేస్తుందన్నారు. PM Modi inspects the 29 antiquities which have been repatriated to India by Australia. The antiquities range in 6 broad categories as per themes – Shiva and his disciples, Worshipping Shakti, Lord Vishnu and his forms, Jain tradition, portraits & decorative objects (Source: PMO) pic.twitter.com/vtYY1Pcs6T — ANI (@ANI) March 21, 2022 గత కొన్ని ఏళ్లుగా ఇరుదేశాల సంబంధాలు అద్భుతమైన వృద్ధిని సాధించాయని చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, విద్య, ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర అన్ని రంగాలలో ఇరుదేశాల మధ్య సన్నిహిత సహకారం ఉందన్నారు. ఈ మేరకు సమావేశంలో ఆస్ట్రేలియ ప్రధాని స్కాట్ మోరిసన్ మాట్లాడుతూ...రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గుర్తించి ప్రస్తావిస్తూ... ప్రాంతీయ సహకార ప్రాముఖ్యతను గురించి నొక్కి చెప్పారు. మా ప్రాంతంలో వస్తున్న వేగంవంతమైన మార్పుల కారణంగా తీవ్రమైన ఒత్తిడిన ఎదుర్కొంటున్నాం. మా క్వాడ్ నాయకులు ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణ దాడి గురించి చర్చించే అవకాశం ఇచ్చారనే నేను భావిస్తున్నాను. ఇండో-పసిఫిక్‌లోని మా స్వంత ప్రాంతానికి ఎదురైన భయంకరమైన సంఘటనే ఈ దురాక్రమణ. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో ఎదువుతున్న సంక్షోభం, పరిణామాలు తదితర సమస్యల పై చర్చించడమానికి మాకు అవకాశం వచ్చింది." అని మోరిసన్ చెప్పారు. ఈ మేరకు ఈ వర్చువల్ సమావేశాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. My remarks at the India-Australia virtual summit with PM @ScottMorrisonMP https://t.co/TLBmappqgI — Narendra Modi (@narendramodi) March 21, 2022 (చదవండి: యుద్దంపై నాటోతో బైడెన్ కీలక భేటీ.. పోలాండ్ టూర్‌కు షెడ్యూల్ ఫిక్స్) -
తారస్థాయికి విభేదాలు: అమెరికాకు చైనా వార్నింగ్!
బీజింగ్: అమెరికా- చైనాల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికే తాము ప్రాధాన్యం ఇస్తామని, అయితే అదే సమయంలో తమపై పెత్తనం చెలాయించాలని చూస్తే మాత్రం సహించబోమని పునరుద్ఘాటించారు. పరస్పర గౌరవం, సమానత్వ భావనతో మెలగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అగ్రరాజ్యం- డ్రాగన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే, జో బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపించాయి. కానీ, ఇటీవల అలస్కాలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు టోనీ బ్లింకెన్, వాంగ్ యీ మధ్య జరిగిన మొట్టమొదటి భేటీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జిన్జియాంగ్, హాంకాంగ్, తైవాన్ విషయంలో చైనా అవలంబిస్తున్న విధానాలు, ప్రపంచ స్థిరతకు భంగకరంగా మారాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. చైనా సైతం.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని గట్టిగా ఎదుర్కొంటామంటూ దీటుగానే బదులిచ్చింది. ఈ నేపథ్యంలో వాంగ్ యీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకొంటూ ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తూ, తమ మాటే శాసనం అనే వైఖరిని చైనా ఎన్నటికీ అంగీకరించబోదు. ముఖ్యంగా మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించం. అంతేకాదు, తప్పుడు సమాచారం, అసత్యాల ఆధారంగా చట్టవ్యతిరేకంగా, ఏకపక్షంగా ఆంక్షలు అమలు చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని అమెరికాను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కథనం వెలువరించింది. కాగా అలస్కా సమావేశంలో భాగంగా, జిన్జియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరుతోందన్న ఆరోపణలతో, చైనా అధికారులు, వస్తువులపై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా అమెరికా నిర్ణయం తీసుకుంది. దీంతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా ముదిరిన నేపథ్యంలో వాంగ్ యీ ఈ మేరకు స్పందించడం గమనార్హం. చదవండి: భారత్‌లో బైట్‌డ్యాన్స్‌కు మరో షాక్! బద్ధశత్రువులతో వేదికను పంచుకోనున్న భారత్ -
నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఖాట్మండు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరతీశారు. భారత్- నేపాల్ మధ్య విభేదాలకు కారణమైన కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్‌లను ఎలాగైనా తమ దేశంలో కలుపుకొంటామని పేర్కొన్నారు. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో జనవరి 14న హిమాలయ దేశపు విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలి భారత పర్యటనకు రానున్న తరుణంలో ఈ మేరకు ఓలి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘‘సుగౌలి ఒప్పందం ప్రకారం.. మహాకాళీ నదీ పరివాహక తూర్పు ప్రాంతంలో ఉన్న కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్ నేపాల్‌కు చెందుతాయి. భారత్‌తో దౌత్యపరమైన చర్చలు జరిపి వాటిని సొంతం చేసుకుంటాం. మా విదేశాంగ మంత్రి గురువారం అక్కడికి వెళ్తున్నారు. ఈ అంశంపైనే ఆయన చర్చిస్తారు. ఈ మూడు ప్రాంతాలను మా దేశంలో కలుపుతూ వెలువరించిన మ్యాపుల గురించి కూడా మాట్లాడతారు’’ అని తెలిపారు. అదే విధంగా.. పొరుగు దేశాలైన భారత్, చైనాతో ద్వైపాక్షిక బంధం దృఢపరచుకునేందుకు తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. సార్వభౌమత్వం కాపాడుకుంటూనే, సమానత్వ భావనతో స్నేహపూర్వక బంధాలు పెంపొందించుకుంటామని ఓలి పేర్కొన్నారు. కాగా ఇటీవలి కాలంలో చైనాకు బాగా దగ్గరైన నేపాల్ ప్రధాని కేపీ ఓలి శర్మ.. గత కొన్నినెలలుగా భారత్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీరాముడి జన్మస్థలం దక్షిణ నేపాల్‌లోని అయోధ్యాపురి అని, యూపీలోని అయోధ్య కాదనడం, అంతేగాక ఆ మూడు ప్రాంతాలకు సంబంధించి అధికారిక మ్యాపులు విడుదల చేయడంతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. అయితే భారత సైనిక దళాల ప్రధానాధికారి ఎంఎం నరవాణే నేపాల్ నవంబరులో పర్యటించిన నాటి నుంచి విభేదాలు కాస్త సద్దుమణిగాయి. ఏడు దశాబ్దాలుగా భారత్- నేపాల్ సైనిక చీఫ్‌లనూ పరస్పరం గౌరవించుకోవడమనే సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్లారు. (చదవండి: నేపాల్‌లో చైనా ఓవరాక్షన్) 200 ఏళ్ల నాటి వివాదం భారత్-నేపాల్-చైనా సరిహద్దులో గల లిపులేఖ్ భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది. ఈ సరిహద్దు వివాదం 200 ఏళ్ల క్రితమే మొదలైంది. ఇరు దేశాల మధ్య 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్ పాలకులు భారత్ తరఫున సంతకాలు చేయగా... ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారడం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. తాజాగా నేపాల్ కొత్త మ్యాపులు విడుదల చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది. -
బంధాలు బలోపేతం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సొంతం చేసుకున్నారు. అధ్యక్షుడి హోదాలో శ్వేతసౌధంలో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. జగమొండి డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల పాలనలో ఇతర దేశాలతో అమెరికా సంబంధాల విషయంలో గణనీయమైన మార్పులే సంభవించాయి. కొన్ని దేశాలతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక జో బైడెన్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇతర దేశాలతో సాన్నిహిత్యం పెంచుకోవడం తమ ఎజెండాలోని కీలక అంశమని ఆయన ఎన్నికల ప్రచారంలో పలుమార్లు స్పష్టం చేశారు. దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ అమెరికా కొత్త అధ్యక్షుడి విధాన నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దానిపై దృష్టి పెట్టాయి. చైనాపై సానుకూల ధోరణి! ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదగాలని తహతహలాడుతూ తమకు పక్కల్లో బల్లెంలా మారిన చైనాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారాలు మిరియాలు నూరారు. ఆ దేశంలో పలు అంక్షలు విధించారు. కరోనా వైరస్ పుట్టుకకు, వ్యాప్తికి చైనాయే కారణమని దూషించారు. వాణిజ్య యుద్ధానికి తెర తీశారు. ట్రంప్ ఇంటిముఖం పడుతుండడంతో పరిస్థితులు మారిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా విషయంలో అమెరికా నాయకత్వం సానుకూల ధోరణి కనబరిచే అవకాశం ఉందంటున్నారు. బైడెన్ గెలుపును చైనాలో మెజారిటీ జనం స్వాగతిస్తున్నారట! ఇక ఎన్ని భేదాభిప్రాయాలున్నా ఇండియాతో స్నేహాన్ని అమెరికా వదులుకోలేని పరిస్థితి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టాలన్నా, అంతర్జాతీయ ఉగ్రవాదంపై యుద్ధం చేయాలన్న అమెరికాకు ఇండియా అండ కావాల్సిందే. కశ్మీర్, మైనారిటీల విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమే అయినా ఇండియా విషయంలో ఆయన వ్యతిరేకంగా వెళ్లలేరని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భారత సంతతి మహిళ కావడం ఇండియాకు కొంత కలిసొచ్చే అంశమే. ఉత్తర కొరియాతో స్నేహమే దూర్త దేశం అని అమెరికా ఒకప్పుడు అభివర్ణించిన ఉత్తర కొరియాతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో పలు సందర్భాల్లో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు కొన్ని ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. ట్రంప్ ప్రయత్నాలను బైడెన్ కొనసాగించే పరిస్థితి కనిపిస్తోంది. రష్యాపై మరిన్ని ఆంక్షలు? అమెరికాకు రష్యా నుంచి పెద్ద ముప్పు ఉందని జో బైడెన్ ఇటీవలే వ్యాఖ్యానించారు. బైడెన్ పాలనలో తమ దేశంలో మరిన్ని ఒత్తిళ్లు, ఆంక్షలు తప్పకపోవచ్చని రష్యా నాయకత్వం అనుమాని స్తోంది. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అండతోనే డొనాల్డ్ ట్రంప్ గెలిచారన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. బైడెన్ హయాంలో అమెరికా–రష్యా సంబంధాలు బలహీనపడే అవకాశాలున్నాయి. ఊపిరి పీల్చుకున్న ఇరాన్ ట్రంప్ పాలనలో అమెరికాకు ఇరాన్ బద్ధవ్యతిరేకిగా మారిపోయింది. అమెరికా విధించిన ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దిగజారింది. అగ్రరాజ్యం ఆదేశాల మేరకు ఇతర దేశాలు ఇరాన్‌తో సంబంధాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇరాన్లో జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా హతమార్చడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ట్రంప్ ఓడిపోయి, బైడెన్ గెలవడంతో ఇరాన్ ఊపిరి పీల్చుకుంది. బైడెన్ చొరవతో తమ దేశంపై ఆంక్షలు తొలగిపోతాయని, ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని ఇరాన్ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు జర్మనీ, ఈజిప్టు, ఇజ్రాయెల్, కెనడా వంటి దేశాలతో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. -
శతాబ్దాల సంబంధాలకు సవాలు
భారత్, నేపాల్ మధ్య సంబంధాలు వేడెక్కడానికి చైనా ప్రమేయం ప్రధాన కారణం కాదు. శతాబ్దాలుగా ఇరుదేశాల ప్రజల మధ్య ఏర్పడిన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, వ్యాపార బంధాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడంతో ఇరుదేశాల మధ్య సాంప్రదాయిక వ్యాపారం గిడసబారిపోతోంది. సరిహద్దులకు రెండువైపులా ప్రజలు శతాబ్దాలుగా ఏర్పర్చుకుంటూ వచ్చిన సరళ వ్యాపార సంబంధాల స్థానంలో ప్రభుత్వాల మధ్య వ్యాపార సంబంధాలు ప్రబలమవుతూ వస్తున్నాయి. దీంతో వ్యాపార నిబంధనలు, కస్టమ్స్ అధికారుల ఒత్తిడి ఇరుదేశాలకు కీలకమైన చిరువ్యాపారంపై దెబ్బతీశాయి. నేపాల్ యువతరం ఆకాంక్షలు అలాగే ఉంటున్నాయన్న స్పృహకు అనుగుణంగా ఆధునీకరణను మల్చుకుంటే మళ్లీ ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు చివురించే అవకాశం ఉంది. అనేక శతాబ్దాల పర్యంతం భారత్, నేపాల్ దేశాల మధ్య ప్రగాఢమైన సామాజిక, సాంస్కృతిక, వ్యూహాత్మక, రాజకీయ, ఆర్థిక సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. కాలం గడిచేకొద్దీ ఇరుదేశాల మధ్య మౌలిక సూత్రాలు మారుతున్న క్రమంలో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంటోంది. అభివృద్ది చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రతిపాదించిన అవకాశాలను నేపాల్ అందిపుచ్చుకోవడం రానురాను తగ్గిపోయింది. పైగా సాధారణ నేపాలీలకు ఇవి అసందర్భంగా మారిపోయాయి. ఇరు దేశాలమధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సరిహద్దు సమస్య పాత సంబంధాలను మరింత ఆధునికరూపంలోకి మల్చుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తోంది. సరిహద్దు సమస్యకు మించి భారత్, నేపాల్ కలిసి ఎంతో సాధించవచ్చు. అదృశ్యమవుతున్న పాతబంధాలు భారత్, నేపాల్ దేశాలకు చెందిన వేలాదిమంది పౌరులు పనికోసం, వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాల కోసం, వ్యాపార లావాదేవీల కోసం ప్రతిరోజూ సరిహద్దులు దాటుతుంటారు. ఈనాటికీ నేపాల్ అతి ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా భారత్ కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా చైనా వంటి ఇతర దేశాలు నేపాల్ వాణిజ్యంలోకి చొరబడినప్పటికీ నేపాల్‌తో భారతీయ వాణిజ్యం ఇప్పటికీ 60 నుంచి 65 శాతం వరకు ఉంటోంది. ఇరుదేశాల ప్రజలు సరిహద్దులు దాటి మరీ సంబంధాలు ఏర్పర్చుకుంటున్నారు. వ్యాపార సంస్థలు సైతం ఇరుదేశాల కుటుంబాల్లోని కుమారులు, కుమార్తెలకు పరస్పర వివాహ సంబంధాలు కుదుర్చుకుంటున్నాయి. కుటుంబాలను ప్రాతిపదికగా తీసుకుని విక్రేతలు, సరఫరాదారులు సులువుగా అప్పులు ఇస్తున్నారు. అన్నిటికంటే మించి సరిహద్దుల్లో నగదు అతిసులువుగా పరస్పరం మార్పిడి అవుతోంది. ఇలాంటి హద్దుnజ nటని సంబంధాలు, సాంప్రదాయికంగా ఇరుదేశాల వ్యాపార సంస్థల మధ్య ఇన్నాళ్లుగా నెలకొన్న సరళత, నిష్కాపట్యం అనేవి ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నాయి. చైనా భారత్‌ను పోటీలోంచి తప్పిస్తుండటం వల్ల ఇదంతా జరగటం లేదు. దీనికంటే భారత్‌తో వాణిజ్య సంబంధాలను వ్యాపార నిబంధనలే అధికంగా దెబ్బతీస్తున్నాయి. కాలం చెల్లుతున్న వ్యాపార ఒప్పందాలు భారత్, నేపాల్ మధ్య వ్యాపార ఒడంబడికలు ఇప్పటికీ పాత నిబంధనలపైనే కొనసాగుతున్నాయి. ఉదాహరణకు, భారత్‌లో తయారవుతున్న ఉత్పత్తులను నేపాలీ వ్యాపారులు తమ దేశంలోకి దిగుమతి చేసుకోరు. మరోవైపున నేటి భారత్‌లో బహుళజాతి కంపెనీలను మిక్కుటంగా ఏర్పాటు కావడమే కాకుండా అవి తమ మొత్తం దక్షిణాసియా ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను భారత్‌లోని కార్యాలయాల నుంచే నిర్వహిస్తున్నాయి. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను నిర్మూలిస్తూ బడా వాణిజ్య సంస్థలు తమ కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరింపచేస్తున్నాయి. సరిహద్దులను బార్లా తెరిచినప్పటికీ, సంక్లిష్టమైన రెగ్యులేటరీ అవసరాలు ఇరుదేశాల మధ్య ఎగుమతి, దిగుమతులను క్లిష్టంగా మలుస్తున్నాయి. చిన్నతరహా వ్యాపారాన్ని ఇది విశేషంగా ప్రభావితం చేస్తోంది. ఎగుమతి, దిగుమతి కోడ్స్ నుంచి ఉత్పత్తి కోడ్ల, ఇన్వాయిస్ క్లియరెన్స్ వరకు వ్యాపార కార్యకలాపాల్లో వాస్తవంగా ఉంటున్న సంక్లిష్టత కారణంగా స్థానిక కస్టమ్స్ అధికారులకు విశేష అధికారాలను కట్టబెడుతున్నాయి. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మాత్రమే వ్యాపారం చేసుకునే చిన్న తరహా వ్యాపారులకు కస్టమ్స్ అధికారుల బారినుంచి తప్పించుకోవడం కష్టమైపోతోంది. దీంతో ఇరుదేశాల చిన్న తరహా వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీలకు చాలా సమయం తీసుకుంటున్నందున తప్పుకుంటున్నారు. సుదీర్ఘకాలంగా లాంచనప్రాయంగా కొనసాగుతూ వచ్చిన ఆర్థిక చట్రం భారత్, నేపాల్ మధ్య వాణిజ్యానికి కీలకంగా ఉంటూ వచ్చింది. మారుతున్న పరిస్థితుల్లో ఈ సులభ వ్యాపార పరిస్థితి తనదైన ఆధునికీకరణకు సిద్ధం కావడం లేదు. అయితే ఈ ప్రాచీన తరహా వ్యాపార బంధాలు ఇప్పుడు రద్దు కావడానికి అంగీకరించకూడదు. ఈ పాత సంబంధాలను విధాన నిర్ణేతలు మెరుగుపర్చి, ఆధునీకరించి ప్రజలకు మరింత ప్రయోజనకరంగా, లాభదాయకంగా వాటిని మార్చాలి. ఒకప్పుడు నేపాల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఏకైక, అతిపెద్ద వనరుగా ఉంటూవచ్చిన భారత్ పెరుగుతున్న చైనా పెట్టుబడుల కారణంగా తన స్థానాన్ని కోల్పోతోంది. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి. భారత్, నేపాల్ మధ్య సామాజిక, ఆర్థిక బంధాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వేగంగా మార్పు చెందడంలో వెనుకబడిపోయాయి. గతంలో ఇరుదేశాల మధ్య అవకాశాలను గుర్తించి, పెట్టుబడులకు భద్రత కలిగించి, వాటి సులభ చలనానికి వీలు కల్పించిన నిర్దిష్ట సామాజిక, ఆర్థిక అనుసంధానం ప్రస్తుతం వెనుకపట్టు పట్టింది. ఆధునీకరణకు కొత్త మార్గం చేపట్టలేకపోవడమే నేపాల్‌లో భారత్ పెట్టుబడుల క్షీణతకు కారణమైంది. రెండు, భారత్ ప్రభుత్వం నేరుగా నేపాల్‌లో భారత పెట్టుబడులలో జోక్యం చేసుకోవడం పెరిగేకొద్దీ ఇరుదేశాల ప్రజల మధ్య మధ్య చారిత్రకంగా కొనసాగిన ఆర్థిక బంధాలు మరింతగా క్షీణించిపోయాయి. నియత, అనియత యంత్రాంగాల ప్రాతిపదికన గతంలో నేపాల్‌లో ప్రవహించిన భారతీయ పెట్టుబడులు భారత ప్రభుత్వ జోక్యంతో గిడసబారిపోయాయి. సరిగ్గా ఈ పరిస్థితే భారత్, నేపాల్ మధ్య సంబంధాలను కూడా సంక్లిష్టంగా మార్చివేసింది. ప్రజలు మధ్య సంబంధాలు, సంస్కృతి పరంగా సాగాల్సిన వ్యాపార బంధాలు తప్పుకుని ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాల దిశగా ప్రాధాన్యత పెరిగింది. ఇరుదేశాల మధ్య ప్రభుత్వాల తరపున పెట్టుబడుల తరలింపుకు, లావాదేవీలకు భారత్ ప్రాధాన్యమివ్వగా, మరోవైపు చైనా నేరుగా నేపాల్ ప్రజలతో తమ సంస్థలను అనుసంధానించగలిగింది. అనేక చిన్న తరహా చైనా సంస్థలు ఇప్పుడు నేపాల్‌లోకి చొరబడ్డాయి. ఇవి స్థానిక భాగస్వాములను తమలో చేర్చుకుని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా బలపడుతూ వస్తున్నాయి. నేపాల్‌కు సంబంధించినంత వరకు ఇది మారుతున్న యుగం. కొత్త ఆకాంక్షలు, జాగరూకతలు బలం పుంజుకుంటున్నాయి. ఇతర ప్రభుత్వాల లాగే భారత్ కూడా నేపాల్ నూతన ప్రభుత్వ వ్యవహారాల్లో పాలుపంచుకోవాడానికి ప్రయత్నించింది కానీ మొదటి నుంచి నేపాల్‌తో భారత్ సంబంధాలు ప్రభుత్వాల ప్రాతిపదికన మాత్రమే కాకుండా విశాల ప్రాతిపదికన కొనసాగేవి. దీనివల్లే నేపాల్ వ్యాప్తంగా అనేకమంది యువతీయువకులతో, సామాజిక బృందాలతో భారత్ నేరుగా సంబంధాలు నిర్వహించగలిగింది. విషాదకరంగా నేపాలీలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడంలో భారత్ గతంలో చూపిన చొరవ ఇప్పుడు క్షీణించిపోయింది. భారతీయ ఉన్నత విద్యాసంస్థల్లో నేపాలీ విద్యార్థులకు స్కాలర్ షిప్పులు ఇవ్వడం అనేది ప్రతిభ ఆధారంగానే సాగినప్పటికీ నేపాల్ రాజకీయ పార్టీల సిఫార్సుల మేరకు ఈ స్కాలర్‌షిప్పులను అందించడం అలవాటుగా మారింది. దీంతో నేపాలీ యువత రాజకీయ ప్రాపకంతో స్కాలర్ షిప్పులు సాధించే యంత్రాంగం బలపడిపోయింది. అదేసమయంలో భారత్‌లో అభివృద్ధిని నేపాలీలు అందుకోవడం సంక్లిష్టమైపోయింది. ఇకపోతే పాఠశాల భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, అంబులెన్సులు అందించడం వంటి అభివృద్ధి కార్యకలాపాలన్నింటిలో భారత్ నేరుగా నేపాలీ స్థానిక సంస్థలు, కమ్యూనిటీలతో సంబంధం పెట్టుకుని భాగం పంచుకునేది. కానీ ఈ ప్రాజెక్టులన్నీ రాజకీయ సంబంధాలతో ప్రభావితమై మంజూరయ్యేవి. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల సాధారణ నేపాలీలకంటే స్థానిక రాజకీయ నేతలు అధిక ప్రయోజనం పొందసాగారు. దీనివల్ల కూడా నేపాలీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు భారత్‌కు దూరమైపోయాయి. అదే సమయంలో నేపాలీల ఆకాంక్షలు చెక్కుచెదరలేదు. భారత్ దీన్ని తప్పక గుర్తించాలి. ప్రథమ ప్రాధాన్యత కింద నేపాల్ పట్ల తన భౌగోళిక, రాజ కీయ, ఆర్థిక దృక్పథాన్ని భారత్ పునర్నిర్వచించుకోవాల్సి ఉంది. భారత్‌లోని ఆర్థికాభివృద్ధి అందించే అవకాశాలను సాధారణ నేపాలీలు సులువుగా పొందే మార్గాన్ని అన్వేషించాలి. భారతీయ ఆవిష్కరణలతో కనెక్ట్ అయ్యే యువ నేపాలీలకు అందుబాటులో ఉండేలా ఆధునిక వాణిజ్య హబ్‌లను భారత్ సృష్టించగలగాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నప్పుడే శతాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన విశిష్ట బంధాలు బలంగా ఉంటాయి. భారత, నేపాలల్ ప్రభుత్వాలు దీనికి అనుగుణంగా మారి తమ విధానాలను ఆధునీకరించాలి. ప్రజల మధ్య సంబంధాలు తిరిగి బలపడేందుకు దారితీసే అన్ని మార్గాలను ఇరుదేశాలు అన్వేషించాలి. - అతుల్ కె ఠాకూర్, కాలమిస్టు, రచయిత విశాల్ థాపా, కాలమిస్టు, ఆర్థికవేత్త -
ఆసియా–పసిఫిక్‌లో భారతే కీలకం
బ్యాంకాక్: ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో భారత్ పలుకుబడి పెరుగుతోందనటానికి తాజా ఉదాహరణ ఇది. ఈ ప్రాంతంలో కీలకంగా మారిన భారత్‌కు బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్) శిఖరాగ్ర సమావేశం మద్దతు తెలిపింది. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవడంతోపాటు ఉగ్రవాదం వంటి పెను సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆసియాన్ నిర్ణయించిందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్ తెలిపారు. ఆసియాన్, చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యంపై వివాదం కొనసాగుతుండటం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ప్రాబల్యం కోసం జరుగుతున్న పోటీ నేపథ్యంలో ఆసియాన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడా ఆసియాన్ చర్చించిందని, అంతర్జాతీయ చట్టాలు, నియమాల ఆధారిత వ్యవస్థ కీలకమని ఇరువర్గాలు గుర్తించాయన్నారు. అనుసంధానతే ముఖ్యం ఆసియాన్‌తో సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్ సానుకూలంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రారంభ సమావేశంలో ఆసియాన్‌తో సాన్నిహిత్యం పెంచుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ కార్యాచరణను ప్రకటించారు. ఆసియాన్‌లోని 10 దేశాలతో భూ, వాయు, సముద్ర అనుసంధానత పెంపు ద్వారా ప్రాంతీయ వాణిజ్యం, ఆర్థిక ప్రగతి గణనీయంగా మెరుగవుతాయన్నారు. డిజిటల్ అనుసంధానత కూడా చాలా కీలకమైందన్నారు. థాయ్‌లాండ్‌తో రక్షణ రంగంలో సహకారం రక్షణ పరిశ్రమల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకునేందుకు ప్రధాని మోదీ, థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చనోచా అంగీకరిం చారు. బ్యాంకాక్ నుంచి గువాహటికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించాలని, థాయ్‌లాండ్‌లోని రణోంగ్ పోర్టుతో భారత్‌లోని కోల్‌కతా, చెన్నై, విశాఖ నౌకాశ్రయాల మధ్య అనుసంధానత పెంచాలని నిర్ణయించారు. వాణిజ్యం పెంపుపైనా ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు. -
భారత్‌తో బంధానికి తహతహ
భారత్ ఒక బిగ్ మార్కెట్. 2018 నాటికి ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అంతవరకు ఆరో స్థానంలో వున్న ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టేసింది. ఈ యేడాది భారత్ ఐదో స్థానానికి చేరుకోగలదని లండన్‌కు చెందిన ఐహెచ్ఎస్ మార్కిట్ లిమిటెడ్ (గ్లోబర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్) అంచనా వేస్తోంది. భారత్ 2019–23 మధ్య కాలంలో ఏడాదికి సగటున ఇంచుమించు 7% వృద్ధిరేటు నమోదు చేయగలదని, రానున్న రెండు దశాబ్దాల్లో ఏడాదికి సగటున 75 లక్షల మంది ఆర్థిక కార్యకలాపాల్లోకి ప్రవేశించే అవకాశముందని ఆ సంస్థ చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.5% వృద్ధిరేటు సాధించగలదని ప్రపం చ బ్యాంకు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలపరచుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు భావిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించని ప్రభుత్వాలపై వేలెత్తి చూపుతున్నాయి. భారత్ పట్ల ట్రంప్ ప్రభుత్వ వైఖరి మారాలని డెమోక్రాట్లు కోరుతున్నారు. బ్రెగ్జిట్‌ను దృష్టిలో వుంచుకుని భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట వేయాలంటోంది యూకే పార్లమెంటరీ నివేదిక. వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం భారత్‌తో సంప్రదింపులు జరపడానికి బదులు వివిధ అంశాలకు సంబంధించి ఆ దేశంపై ట్రంప్ సర్కారు ఒత్తిడి తీసుకువస్తోందనే అభిప్రాయం బలం పుంజుకుంటోందని అంటున్నారు అమెరికా దిగువసభ విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు ఇలియట్ ఇంజల్. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైకేల్ పాంపియోకు సోమవారం ఆయన లేఖ రాశారు. భారత్ సహా ఆసియాలో పాంపియో జరుపుతున్న పర్యటన నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) రద్దు చేయడాన్ని, ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోరాదంటూ మన దేశంపై ఆంక్షలు విధించడాన్ని ఈ లేఖ ప్రధానంగా ప్రస్తావించింది. పాంపియో తన భారత్ పర్యటనలో భాగంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఇలియట్ సూచించారు. భారత్ విషయంలో పాలకుల మాటలకు – చేతలకు మధ్య పొంతన లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశం పట్ల అమెరికా అవలంభిస్తోన్న అస్థిర వైఖరి – దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన ఇరుదేశాల భాగస్వామ్యాన్ని దెబ్బ తీసిందని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట ప్రపంచ పోటీలో అంతకంతకూ వృద్ధి చెందుతున్న భారతదేశంతో పోల్చుకుంటే బ్రిటన్ వెనకబడిందని, పెరుగుతున్న భారత్ పలుకుబడికి సరితూగగలిగేలా తన వ్యూహం సరిచేసుకోవడంలో విఫలమయ్యిందని తాజాగా వెలువడిన బ్రిటిష్ పార్లమెంటరీ పరిశీలన నివేదిక పేర్కొంది. ‘బిల్డింగ్ బ్రిడ్జెస్ : రీఅవేకనింగ్ యూకే – ఇండియా టైస్’ శీర్షికన వెలువడిన ఈ నివేదికను ‘యూకె – ఇండియా వీక్ 2019’ సందర్భంగా బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. భారతీయ యాత్రికులు, విద్యార్థులు, వృత్తి నిపుణులకు ప్రయోజనకరమైన వీసా, వలస విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ నివేదిక వివరించింది. ద్వైపాక్షిక సంబంధాల ద్వారా బ్రిటన్ తగిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయిందని వ్యాఖ్యానించింది. భారత్‌తో తన సంబంధాలను సరిచేసుకునేందుకు ఆచరణయోగ్యమైన కొన్ని చర్యలను బ్రిటన్ తీసుకోవాలని, ప్రత్యేకించి చదువు – ఉద్యోగం – సందర్శన కోసం భారతీయులు సులభంగా బ్రిటన్ వచ్చేందుకు వీలు కల్పించాలని నివేదిక పేర్కొంది. వీసాల విషయంలో ప్రజాస్వామ్య రహిత చైనా కంటే కఠిన నిబంధనలను బ్రిటన్ అమలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
సహకార బలోపేతానికి కార్యాచరణ
న్యూఢిల్లీ: కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార బలోపేతానికి మూడేళ్ల పాటు వ్యూహాత్మక కార్యక్రమాన్ని అమలుపరచాలని భారత్, దక్షిణాఫ్రికాలు నిర్ణయించాయి. రక్షణ, వ్యాపారం, తీరప్రాంత భద్రత తదితర భిన్న రంగాల్లో సంబంధాల విస్తరణకు ఈ కొత్త ప్రయోగం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు భారత్ వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. మరోవైపు, రామఫోసా స్పందిస్తూ..వ్యూహాత్మక కార్యక్రమాన్ని వెంటనే అమల్లోకి తేవాలని రెండు దేశాల మంత్రులు, అధికారులను ఆదేశించామని తెలిపారు. దక్షిణాఫ్రికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని, గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఇరు దేశాలు నైపుణ్యాభివృద్ధిలోనూ కలసిపనిచేస్తున్నాయి. -
భాగస్వామ్యం బలోపేతం
యమనషి: భారత్–జపాన్ల భాగస్వామ్యం పూర్తిగా పరివర్తనం చెందిందనీ, ఇప్పుడు అది ‘ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం’గా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘ఇరు దేశాల బంధంలో ప్రతికూలతలేవీ లేవు. ఉన్నవన్నీ అవకాశాలే’ అని జపాన్ మీడియాతో మోదీ అన్నారు. జపాన్–భారత్ 13వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు మోదీ జపాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశంలోని అత్యంత ఎత్తైన పర్వతం ఫుజి దగ్గర్లోని ఓ రిసార్ట్‌లో జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ అనధికారిక చర్చలు జరిపారు. ఆదివారం మొత్తంగా మోదీ–అబేలు 8 గంటలపాటు కలిసి గడిపారు. జపాన్–భారత్ సంబంధాల పురోగతిని సమీక్షించి, వ్యూహాత్మకంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ‘సుందరమైన యమనషి ప్రాంతంలో అబెను కలుసుకోవడం అమితానందంగా ఉంది’ అని మోదీ అన్నారు. ప్రత్యేక ఆతిథ్యానికి కృతజ్ఞతలు: మోదీ రోబో పరిశ్రమను సందర్శించిన అనంతరం కవగుచి సరస్సు సమీపంలోని తన సొంత ఇంటికి మోదీని అబే తీసుకెళ్లి విందు ఇచ్చారు. విదేశీ నేతను ఈ ఇంటికి అబే ఆహ్వానించడం ఇదే తొలిసారి. దీనిపై మోదీ ట్వీటర్లో స్పందిస్తూ ‘తన ఇంట్లో ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చిన అబేకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాప్‌స్టిక్‌లను ఉపయోగించి జపాన్ విధానంలో ఆహారాన్ని ఎలా తినాలో కూడా అబే నాకు నేర్పించారు’ అని తెలిపారు. విందు తర్వాత ఇరువురు ప్రధానులు రైలులో టోక్యోకు చేరుకున్నారు. అక్కడే సోమవారం అధికారిక భేటీలో మోదీ, అబేలు పాల్గొంటారు. ద్వైపాక్షిక భద్రత, ఆర్థిక సహకారాలను బలపరిచే అంశంపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం తరహాలోనే జపాన్ కూడా ఓ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిపై కూడా వారిద్దరూ చర్చించే అవకాశం ఉంది. తాను ప్రధాని అయ్యాక అబేను కలవడం ఇది 12వ సారని మోదీ చెప్పారు. భారత్‌కు జీవితకాల మిత్రుణ్ని: అబే భారత్‌కు తాను జీవితకాల మిత్రుడినని అబే తెలిపారు. తాను అత్యంత ఆధారపడదగ్గ, తనకున్న అత్యంత విలువైన స్నేహితుల్లో మోదీ ఒకరన్నారు. జపాన్ తొలి ప్రధాని, తన తాత నొబుసుకె కిషి 1957లో భారత్‌ను సందర్శించడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘జపాన్ ఇంత ధనిక దేశం కానప్పుడు నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కిషిని తీసుకెళ్లి జపాన్ ప్రధానిగా వేలాదిమందికి పరిచయం చేశారు. 1958 నుంచే భారత్‌కు జపాన్ రుణాలు ఇవ్వడం ప్రారంభమైంది’ అని అబే పేర్కొన్నారు. 2007లో తాను భారత్‌ను సందర్శించినప్పుడు ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు పార్లమెంటులో ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వడం ద్వారా తనకు భారత్ కల్పించిన గౌరవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అబేకి మోదీ బహుమతి హోటల్లో మోదీకి అబే అల్పాహారం విందు ఇచ్చారు. అనంతరం వారిద్దరూ అక్కడి ఉద్యానవనంలో తిరుగుతూ మాట్లాడుకున్నారు. చేతితో మలిచిన రెండు రాతిగిన్నెలను, రాజస్తాన్ పలుగురాళ్లు పొదిగిన దుప్పట్లను, జోధ్‌పూర్‌లో తయారైన చెక్కపెట్టెను మోదీ అబేకు బహుమతిగా ఇచ్చారు. వీటన్నింటినీ మోదీ జపాన్ పర్యటన కోసమే ప్రత్యేకంగా తయారు చేయించారు. తర్వాత ఇద్దరూ పారిశ్రామిక రోబోలను తయారుచేసే ఎఫ్ఏఎన్యూసీ పరిశ్రమను సందర్శించారు. ‘ఇరు దేశాల భాగస్వామ్యాన్ని ఆధునిక సాంకేతికత స్థాయికి తీసుకెళ్తున్నాం. మోదీ, అబే రోబోల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎఫ్ఏఎన్యూసీ పరిశ్రమను సందర్శించారు’ అని విదేశాంగ శాఖ తెలిపింది. రోబోలు ఎలా పనిచేస్తాయి, వాటి సామర్థ్యాలేంటనే విషయాలను పరిశ్రమ సిబ్బంది వారికి వివరించారు. -
భారత్, రష్యా భాయి–భాయి
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వార్షిక ద్వైపాక్షిక భేటీలో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలకగా మోదీ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. పుతిన్ విమానాశ్రయంలో దిగిన అనంతరం మోదీ ఇంగ్లిష్, రష్యా భాషల్లో ట్వీట్ చేస్తూ ‘భారత్‌కు స్వాగతం పుతిన్. భారత్–రష్యాల స్నేహ బంధాన్ని మరింత దృఢంగా మార్చే మన చర్చల కోసం వేచి చూస్తున్నా’ అని పేర్కొన్నారు. మోదీ, పుతిన్ ఏకాంతంగా విందు ఆరగిస్తూ ద్వైపాక్షిక సహకారం సహా పలు అంశాలపై మాట్లాడుకున్నారని ఓ అధికారి చెప్పారు. 19వ భారత్–రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో శుక్రవారం జరగనుంది. రక్షణ రంగంలో సహకారం, ఇరాన్ నుంచి ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు, ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థపై ఒప్పందం, ఉగ్రవాదంపై పోరు, పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీ, పుతిన్‌లు చర్చించే అవకాశం ఉంది. 5 బిలియన్ డాలర్ల విలువైన ఎస్–400 ట్రయంఫ్ క్షిపణులను రష్యా నుంచి కొనుగోలు చేసే ఒప్పందం శుక్రవారం దాదాపుగా ఖరారవనుందని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే రష్యా నుంచి ఎవరూ ఆయుధాలు కొనకూడదంటూ ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. అవసరమైనప్పుడు ప్రతేకంగా ఏదైనా దేశం కోసం ఈ ఆంక్షలను సడలించేందుకు అధ్యక్షుడు ట్రంప్ కు అధికారం ఉంది. ఆంక్షలున్నా సరే రష్యా నుంచి క్షిపణుల కొనుగోలుకే భారత్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అంతరిక్ష, వాణి జ్య, ఇంధన, పర్యాటక తదిరత రంగాల్లో ఒప్పందాలు కూడా భారత్–రష్యామధ్య కుదిరే అవకాశం ఉంది. -
సాంకేతికతతో కొత్త ప్రపంచం
జోహన్నెస్‌బర్గ్: సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, బహుముఖ సహకారంతో మెరుగైన ప్రపంచాన్ని నిర్మించొచ్చని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న నూతన పారిశ్రామిక సాంకేతికత, డిజిటల్ విధానాల జోక్యం అవకాశాలు సృష్టించడమే కాకుండా సవాళ్లు విసురుతాయన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల పదో శిఖరాగ్ర భేటీ ప్లీనరీ సమావేశంలో మోదీ ప్రసంగించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం కోసం బ్రిక్స్ దేశాలతో కలసిపనిచేయాలని భారత్ ఉవ్విళ్లూరుతోందని అన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో మూలధనం కన్నా ప్రతిభే ముఖ్యమని నొక్కిచెప్పారు. ఈ తరంలో ‘అత్యుత్తమ నైపుణ్యం–కొద్ది పని’ కొత్త విధానంగా మారిందని వ్యాఖ్యానించారు. పారిశ్రామిక తయారీ, డిజైన్, ఉత్పాదకతల్లో నాలుగో పారిశ్రామిక విప్లవం మౌలిక మార్పులు తీసుకొస్తుందని పేర్కొన్నారు. బహుళత్వ విధానాలు, అంతర్జాతీయ వాణిజ్యానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఉగ్రపోరుకు సమగ్ర విధానం: బ్రిక్స్ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై పోరాడటానికి సమగ్ర విధానం అవలంబించాలని బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. బ్రిక్స్ దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడులను సదస్సు డిక్లరేషన్ ఖండించింది. అవినీతి కూడా ప్రపంచానికి అతిపెద్ద సమస్యగా మారిందని పేర్కొంది. జిన్‌పింగ్‌తో మోదీ భేటీ.. బిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. తమ భేటీ ఇరు దేశాల సంబంధాలకు, సహకారానికి కొత్త శక్తినిస్తుందని మోదీ అన్నారు. మరోవైపు, ఆతిథ్య దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో కూడా వేరుగా సమావేశమైన మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. -
సుదృఢ బంధానికి 10 సూత్రాలు
న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికా దేశాల బంధం బలోపేతం కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ 10 మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. ఆఫ్రికా ఆర్థికాభివృద్ధికి, పర్యావరణ సవాళ్లు, ఉగ్ర ముప్పు ఎదుర్కొనేందుకు ఇవి దోహదపడతాయన్నారు. రక్షణ, పర్యావరణం, సైబర్ భద్రత, వ్యవసాయం, సముద్ర వనరుల సద్వినియోగం తదితరాలకు సంబంధించి ఈ సూత్రాలను వివరించారు. అంతర్జాతీయ సంస్థల్లో ఆఫ్రికా దేశాలకు సమాన ప్రాధాన్యత లభించేంత వరకూ, అందులో సంస్కరణల కోసం భారత్ చేస్తున్న కృషి సంపూర్ణం కాదని తెలిపారు. ఉగాండా పర్యటనలో ఉన్న మోదీ బుధవారం ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిం చారు. సమానత్వం, గౌరవం, పారదర్శకత కోసం ఆఫ్రికా చేస్తున్న ప్రయత్నాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోసారి ఆఫ్రికా వైరి రాజకీయాలకు వేదిక కాకుండా, యువత ఆకాంక్షలు నెరవేర్చే ప్రాంతంగా భాసిల్లాలని వ్యాఖ్యానించారు. మిగతా ప్రపంచంతో కలసి ఆఫ్రికా దేశాలు ముందుకు సాగాలని, భారత్ వాటితో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. అపారమైన ఖనిజ వనరులు, వార సత్వ సంపదకు నిలయమైన ఉగాండాకు తమ ఆఫ్రికా విధానంలో కేంద్రక స్థానం ఉంటుంద ని చెప్పారు. వలస పాలన, స్వాతంత్య్ర ఉద్యమం, తీరప్రాంత సంబంధాలు తదితరాల్లో రెండు దేశాలకు చాలా సారూప్యతలు ఉన్నా యని చెప్పారు. సముద్ర సంపద నుంచి అన్ని దేశాలు ప్రయోజనం పొందేలా, భారత్ ఆఫ్రికా దేశాలతో కలసిపనిచేస్తుందని మోదీ అన్నారు. తూర్పు ఆఫ్రికా, తూర్పు హిందూ మహాసముద్రాల్లో సహకారం తప్ప పోటీ ఉండొద్ద న్నారు. ఉగాండా పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. రాజధాని కంపాలాకు 85 కి.మీ దూరంలోని జింజా అనే గ్రామంలో జాతిపిత గాంధీ జ్ఞాపకార్థం వారసత్వ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. కాగా, బ్రిక్స్ సదస్సులో పాల్గొనేం దుకు మోదీ దక్షిణాఫ్రికా చేరుకున్నారు. -
సమష్టి పోరుతోనే ఉగ్ర నిర్మూలన
న్యూఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాలని భారత్, నెదర్లాండ్స్ పిలుపునిచ్చాయి. ఉగ్రవాదుల ప్రాబల్యం, ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి, సీమాంతర ఉగ్రవాద నియంత్రణకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ గురువారం ప్రధాని మోదీతో చర్చలు జరిపారు మతం, జాతి, తెగ, వర్గాలతో ఉగ్రవాదాన్ని ముడిపెట్టొద్దని ఇరువురు నేతలు ఉద్ఘాటించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలు దక్షిణాసియాలో శాంతికి ముప్పుగా పరిణమించాయని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. అణు సరఫరా బృందం(ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి నెదర్లాండ్స్ మద్దతిస్తుందని రూట్ తెలిపారు. మన బంధం మరింత బలపడాలి.. వాణిజ్యం, వ్యవసాయం, ఇంధన వనరులు తదితర రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, నెదర్లాండ్స్ నిర్ణయించాయి. ఇండియా–డచ్ సీఈవోల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నాక మోదీ, రూట్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ‘అంతర్జాతీయ సౌర కూటమిలో చేరాలని నెదర్లాండ్స్‌ను గతంలోనే ఆహ్వానించాను. గురువారం వారు అందులో సభ్య దేశంగా చేరారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’ అని మోదీ అన్నారు. భారత్‌లో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నెదర్లాండ్స్ మూడో స్థానానికి చేరిందని వెల్లడించారు. భారత్‌లో కల్పిస్తున్న కొత్త అవకాశాల పట్ల డచ్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని నరేంద్ర మోదీ అన్నారు. రూట్ మాట్లాడుతూ..వాణిజ్యం, వ్యవసాయం, స్మార్ట్ సిటీస్, ఇంధన వనరుల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మెరుగైన అవకాశాలున్నాయని అన్నారు. ద్వైపాక్షిక భేటీ తరువాత విడుదలైన ఉమ్మడి ప్రకటనలో..పెట్టుబడులు, వాణిజ్య సంబంధాల అభివృద్ధిలో ప్రైవేట్ రంగ పాత్ర కీలకంగా మారిందని మోదీ, రూట్ పేర్కొన్నారు. ‘క్లీన్ గంగా’ ప్రాజెక్టుకు రూట్ కితాబు.. పవిత్ర గంగా నది ప్రక్షాళనకు ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామీ గంగే పథకాన్ని రూట్ ప్రశంసించారు. నీటిని ఆర్థిక వనరుగానే పరిగణించకుండా, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ పరంగానూ విలువ ఇవ్వాలని పేర్కొన్నారు. గంగా నది శుద్ధి కార్యక్రమంలో ఈ అంశా లన్నీ ఇమిడి ఉన్నాయని కితాబు ఇచ్చారు. కాగా, గురువారం రాత్రే రూట్ స్వదేశం బయల్దేరారు. 29 నుంచి మోదీ విదేశీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 29 నుంచి ఐదు రోజుల పాటు ఇండోనేసియా, సింగపూర్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాలతో రక్షణ, భద్రతరంగానికి సంబంధించి పలు ఒప్పందాలు చేసుకుంటారు. మే 29 నుంచి 31 వరకూ మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఇండోనేసియాతో రక్షణరంగంలో సహకారం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. అనంతరం జూన్ 1న సింగపూర్‌కు వెళ్లనున్న మోదీ ఆ దేశ ప్రధాని లీసెయిన్ లూంగ్‌తో పలు అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. అనంతరం 28 ఆసియా–పసిఫిక్ దేశాల రక్షణ మంత్రులు, ఆర్మీ చీఫ్‌లు పాల్గొనే షాంగ్రీ లా సదస్సులో మాట్లాడతారు. ఈ సదస్సులో ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం గమనార్హం. ‘గ్రామస్వరాజ్’ సక్సెస్ ప్రధాని మోదీ ఉద్ఘాటన న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ‘గ్రామస్వరాజ్ అభియాన్’ కార్యక్రమం విజయవంతమైందని.. ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 14 (అంబేడ్కర్ జయంతి) మొదలుకుని మే 5 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించాం’ అని ఆయన ట్వీట్ చేశారు. పేదలకోసం ఉద్దేశించిన ఏడు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను వివిధ బృందాలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వివరించాయన్నారు. ‘ఈ 21 రోజుల్లో 7.53 లక్షల మందికి ఉజ్వల కనెక్షన్లు, 5లక్షల ఇళ్లకు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ వెలుగులం దించాం. 16,682 గ్రామాల్లో 25 లక్షల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశాం. 1.65 లక్షల మంది∙చిన్నారులు, 42,762 మంది గర్భిణులకు మిషన్ ఇంద్ర ధనుష్‌లో భాగంగా టీకాలు వేశాం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, స్థానిక సంస్థల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. అందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
చరిత్రాత్మక భేటీ
విదేశాంగ విధానంలో మొదటినుంచీ విలక్షణ శైలిని అవలంబిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఈసారి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర స్థాయి భేటీ జరపబోతున్నారు. అందుకోసం ఆయన శుక్ర, శనివారాల్లో ఆ దేశంలో పర్యటించబోతున్నారు. శిఖరాగ్ర సమావేశాలకు సాధారణంగా దీర్ఘకాల కసరత్తు జరుగుతుంది. ప్రస్తుత సమావేశం విషయంలో అలాంటిది లేదు. దీనికసలు నిర్దిష్టమైన ఎజెండాయే లేదు. ఆ సంగతలా ఉంచి ఆకస్మికంగా చివరి నిమిషంలో ఇరు దేశాధినేతల భేటీ గురించి ప్రకటించడం దౌత్య నిపుణులను సైతం ఆశ్చర్యపరిచి ఉంటుంది. ఏదో మేరకు సానుకూల వాతావరణం ఉన్నదని భావించడం వల్లనే ఈ శిఖరాగ్ర భేటీకి ఇరుదేశాలూ సిద్ధపడ్డాయని, ఈ చర్చల తర్వాత రెండింటిమధ్యా మరింత సాన్నిహిత్యం ఏర్పడటానికి అవకాశం ఉంటుందని సహజంగానే అందరూ ఆశిస్తారు. ప్రధానిగా 2014 మే నెలలో ప్రమాణస్వీకారం చేసినప్పుడు నరేంద్రమోదీ ఆ కార్యక్రమానికి సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించారు. అలాగే 2015 డిసెంబర్లో భారత్–పాకిస్తాన్ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సమయంలో ఆయన రష్యా పర్యటన ముగించుకుని అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ వెళ్లి అటునుంచి స్వదేశానికొస్తూ ఉన్నట్టుండి లాహోర్ వెళ్తున్నట్టు ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా అయితే దేశాధినేతల మధ్య సమావేశాలు జరగడానికి నిర్దిష్టమైన ప్రొటోకాల్ ఉంటుంది. సార్క్ దేశాల అధినేతలు ఇక్కడికొచ్చినప్పుడు, మోదీ లాహోర్ వెళ్లినప్పుడు, ప్రస్తుత చైనా పర్యటన సందర్భంలో అలాంటి కసరత్తులేమీ లేవు. అందుకే ‘ఒక పద్ధతి పాటించకుండా ఇదేం దౌత్యమ’ని గతంలో కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. అయితే చర్చలెప్పుడూ మంచివే. వాటి పర్యవసానంగా వెనువెంటనే సత్ఫలితాలు కనబడకపోయినా వాటిని స్వాగతించాల్సిందే. దీర్ఘకాలంలో వాటి ప్రయోజనం వాటికుంటుంది. బీజింగ్‌లో మంగళవారం జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికెళ్లిన విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ చైనా ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో భేటీ అనంతరం ఇరు దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశం గురించి ప్రకటించారు. ఇప్పుడు ఇరు దేశాధినేతల మధ్యా చర్చలు జరగబోతున్న ఉహాన్ నగరం చరిత్రలో అనేక ఘట్టాలకు వేదిక. కొన్ని విధానాల విషయంలో కమ్యూనిస్టు పార్టీలోని పాత తరం నేతలతో వైరుధ్యాలొచ్చినప్పుడు ఆనాటి చైనా చైర్మన్ మావో జెడాంగ్ 1966లో ప్రయాణ సాధనాలనూ, అధికార లాంఛనాలనూ పక్కనబెట్టి యాంగ్సీ నదిలో 15 కిలోమీటర్ల మేర ఈతకొట్టి ఈ నగరానికి చేరుకోవడం అప్పట్లో ఒక సంచలనం. ఒక ప్రపంచ రికార్డు. అప్పటికాయన వయస్సు 73 ఏళ్లు. ఆ నగరంలోనే రెడ్గార్డుల ఆవిర్భావం, చైనా చరిత్రను మలుపుతిప్పిన సాంస్కృతిక విప్లవం పురుడు పోసుకున్నాయి. ఇప్పటికీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ రాజకీయాల్లో ఉహాన్ నగరానికి విశేష ప్రాధాన్యత ఉంది. ప్రస్తుత శిఖరాగ్ర భేటీకి ఈ నగరాన్ని ఎంచుకోవడం మన ప్రధానికి చైనా ఇచ్చే ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. 2015లో మోదీ చైనా పర్యటనకెళ్లినప్పుడు షియాన్‌లో ఆ దేశ ప్రధాని లీ కెకియాంగ్‌తో చర్చలు జరిపారు. మోదీని ప్రత్యేకంగా కలవడానికి అప్పుడు జిన్‌పింగ్ వచ్చినా ప్రధానంగా ఇరు దేశాల ప్రధానుల మధ్యే భేటీ జరిగింది. ఇప్పుడా వైఖరిని చైనా సవరించుకుంది. రెండు దేశాల మధ్యా పరిష్కారానికి ఎదురుచూస్తున్న సమస్యలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా గిల్గిత్–బాల్టిస్తాన్‌ల మీదుగా వెళ్లే చైనా–పాకిస్తాన్ కారిడార్‌కు మన దేశం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమేనని భావిస్తోంది. ఇక అణు సరఫరాదారుల గ్రూపు(ఎన్ఎస్జీ)లో సభ్యత్వం, భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం సాధించడానికి మన దేశం చేస్తున్న ప్రయత్నాలకు చైనా మోకాలడ్డుతోంది. పాక్ ఉగ్రవాద సంస్థ నాయకుడు మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా పరి గణించాలని ఐక్యరాజ్యసమితిని మన దేశం కోరుతుంటే దానికి చైనా అడ్డుపుల్లలేస్తోంది. బ్రహ్మపుత్ర, సట్లేజ్ నదుల్లో ప్రవహించే జలాల డేటాను ఇవ్వడాన్ని నిలిపేసింది. నాథూలా మార్గంవైపు మానస సరోవర యాత్ర జరపరాదని నిరుడు నిషేధం పెట్టింది. వీటిల్లో నదీజలాల డేటా పంచుకోవడానికి, నాథూలా మార్గాన్ని తిరిగి తెరిచేందుకు మొన్న సుష్మా స్వరాజ్ భేటీ తర్వాత చైనా అంగీకరించింది. మన నుంచి ఆ దేశం ఆశిస్తున్నవి కొన్ని ఉన్నాయి. భారత్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు... మరీ ముఖ్యంగా పోర్టులు, టెలికాం రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమను అనుమతించాలని అది కోరుకుంటోంది. తమ నేతృత్వంలో ప్రారంభమయ్యే బృహత్తర ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ)పై అపోహలు విడనాడి అందులో పాలుపంచుకోవాలని కోరుకుంటోంది. ఇటు మన దేశం కూడా సరిహద్దు వివాదాల్లో చైనా సామరస్య ధోరణిలో మెల గాలని ఆశిస్తోంది. సరిహద్దుల్లో తరచు చైనా సైన్యం చేస్తున్న హడావుడి సరైంది కాదని భావిస్తోంది. అలాగే మన ఉత్పత్తులను మరింతగా దిగుమతి చేసుకోవడం ద్వారా వాణిజ్యలోటును భర్తీ చేయాలని వాదిస్తోంది. చైనా నుంచి మనం 2016–17లో 6,100 కోట్ల డాలర్ల దిగుమతులు చేసుకుంటే, అదే కాలంలో చైనా మాత్రం మన దేశంనుంచి 1,000 కోట్ల డాలర్ల దిగుమతులు చేసు కుంది. ఈ సమస్యలన్నీ ప్రస్తుత శిఖరాగ్ర సమావేశంలోనే పరిష్కారం కాగలవని అను కోనవసరం లేదు. కానీ ఆ దిశగా ఒక ముందడుగు పడుతుంది. అయితే మనవైపు నుంచి ఒక సమస్య ఉంది. సంప్రదాయానికి భిన్నంగా, చొరవ తీసుకుని వివిధ దేశాల అధినేతలతో మోదీ చర్చలు జరిపినా వాటికి కొనసాగింపుగా జరగాల్సిన కృషి మాత్రం మందగిస్తోంది. ఆ విషయంలో లోటుపాట్లు సరిదిద్దుకుంటే చైనా దేశాధినేతతో జరగబోయే ప్రస్తుత శిఖరాగ్ర సమావేశం మెరుగైన ఫలితాలను సాధించగలదు. -
మోదీ-జిన్‌పింగ్ భేటీ అంతరార్థం?
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్ర, శనివారాల్లో జరిపే ‘అనధికార’ శిఖరాగ్ర భేటీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. మధ్య చైనాలోని వూహాన్ నగరంలో జరిగే రెండు అతి పెద్ద ఆసియా దేశాల నేతలు పాల్గొనే ఏకాంత సమావేశంలో వారు ఏం మాట్లాడతారో అధికారికంగా ప్రకటించలేదు. గత కొన్నేళ్లలో జిన్‌పింగ్, మోదీ పదిసార్లు కలిశారు. రెండు దేశాల రాజధానులతోపాటు పరస్పరం వారి సొంతూళ్లు సందర్శించారు. కాని, ఈ రెండు రోజుల భేటీని 1988లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ తొలి చైనా పర్యటనతో పోల్చడం విశేషం. 1954లో తొలి ప్రధాని నెహ్రూ తర్వాత 34 ఏళ్లకు చైనా వెళ్లిన మొదటి ప్రధానిగా రాజీవ్ పర్యటనకు ఎంతో ప్రాధాన్యం లభించింది. మరి తరచు బహుపాక్షిక సమావేశాల్లో కూడా కలుసుకుని మాట్లాడుకున్న నేపథ్యమున్న మోదీ, జిన్‌పింగ్ ‘అనధికార’ శిఖరాగ్ర భేటీకి అధిక ప్రాముఖ్యం ఇవ్వడానికి కారణాలున్నాయి. ఇలా శక్తిమంతమైన దేశాల నేతలతో అధికారిక లాంఛనాలు లేకుండా భేటీ కావడం జిన్‌పింగ్‌కు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు అధ్యక్షుడు బరాక్ ఒబామాతో అమెరికాలోని కాలిఫోర్నియా సనీలాండ్స్లో, ప్రస్తుత అమెరికా నేత డొనాల్డ్ ట్రంప్‌తో ఫ్లారిడాలోని ఆయన విహారకేంద్రం మార లాగోలో ఏకాంత సమావేశాలు చైనా నేత జరిపారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో మోదీ, జిన్‌పింగ్ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చకు రానున్న ద్వైపాక్షిక సమస్యలు కిందటేడాది వేసవిలో భూటాన్‌ను ఆనుకుని ఉన్న డోక్లామ్‌లో భారత, చైనా సేనలు మోహరించి 73 రోజులపాటు రెండు దేశాల మధ్య ఉద్రిక్తలకు కారణమయ్యాయి. వివాదం యుద్ధానికి దారితీయకపోయినా సేనల ఉపసంహరణతో శాంతి పునరుద్ధరణ జరిగింది. ఈ అంశంతోపాటు దశాబ్దాలుగా పరిష్కారం కాని సరిహద్దు వివాదం కూడా ఇద్దరు నేతల సమావేశంలో చర్చకు రావచ్చని భావిస్తున్నారు. ఇండియాతో వాణిజ్య సంబంధాలు ఎక్కువ ఉన్న మధ్య చైనాలో జరుగుతున్న ఈ సమావేశంలో భారత్‌కు అంతకంతకు పెరుగుతున్న ఎగుమతులు, ద్వైపాక్షిక వాణిజ్యంలో అసమతూకం కూడా ప్రస్తావనకు వస్తుందని అంచనా. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతు, చైనా పాక్ ఆర్థిక కారిడర్(సీపీఈసీ), ఎన్ఎస్జీలో సభ్యత్వం వంటి అనేక అంశాల్లో చైనాతో విభేదిస్తూ ఇండియా దృఢ వైఖరి అవలంబిస్తోంది. సీపీఈసీ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా నిర్మిస్తున్న కారణంగా భారత్ దీనిపై తీవ్ర అభ్యంతరం ప్రకటించింది. శతాబ్దాల నాటి పాత సిల్క్ రోడ్డు నీడలో భారీ లక్ష్యాలతో చైనా ప్రారంభించిన బెల్ట్, రోడ్ మౌలికసదుపాయాల ప్రాజెక్టులో భారత్‌ను భాగస్వామిని చేయడానికి ఇప్పటి వరకూ చైనా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ట్రంప్ పోకడలతో చైనా, భారత్ సత్సంబంధాలకు సదవకాశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య, అనిశ్చిత విధానాల కారణంగా చైనా, ఇండియాలు తమ విభేదాలు పక్కనబెట్టి మరింత దగ్గరయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. పశ్చిమాసియా సంక్షోభం వల్ల పూర్వపు ప్రచ్ఛన్న యుద్ధ కాలాన్ని గుర్తుచేసేలా రష్యాతో అమెరికా శత్రుత్వం పెంచుకుంటోంది. మరో పక్క వాణిజ్యరంగంలో ట్రంప్ వైఖరి చైనాకు గుబులు పుట్టించేలా ఉంది. చైనాకు నష్టదాయకంగా మారే సుంకాలు, పన్నుల విధానాన్ని ట్రంప్ అనుసరిస్తున్నారు. ఇంకా చైనా ఉపగ్రహ దేశంగా పేరున్న ఉత్తర కొరియాను తన అదుపులోకి తేవడానికి అమెరికా ప్రయత్నాలు కూడా చైనా వైఖరిలో మార్పునకు దారితీస్తున్నాయి. అందుకే ప్రాంతీయ విభేదాలు విస్మరించి జపాన్, వియత్నాంతో చైనా మెరుగైన సంబంధాలకు ప్రయత్నిస్తోంది. ఇలా ట్రంప్ దుందుడుకు విధానాలు కారణంగా భారత్‌తో చైనా స్నేహం బలపడేందుకు ఈ శిఖరాగ్ర సమావేశం ఎంత వరకు దోహదం చేస్తుందో చూడాల్సి ఉంది. వెంట వెంటనే చైనా మోదీ యాత్రలు! నెల రోజుల్లోనే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సభలో పాల్గొనడానికి మళ్లీ చైనా వెళ్లనున్న భారత ప్రధాని ఇంత హడావుడిగా జిన్‌పింగ్‌తో ఏకాంత భేటీకి చైనాలో నిర్ణయం ప్రకటించడం తొలుత సంచలనం సృష్టించింది. భారత ప్రధానితో జరిపే ఈ విలక్షణ భేటీపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే, రెండు రోజుల సమావేశం ముగిశాక ముందే చెప్పినట్టు సంయుక్త ప్రకటన ఉండదు. ఇద్దరు నేతల సంయుక్త విలేఖరుల సమావేశం కూడా జరగదు. వారి చర్చల వివరాలు, ఏవైనా ఉంటే ఫలితాలను ఆ తర్వాత వెల్లడిస్తారని చైనా మంత్రి చెప్పారు. 1988 నాటి రాజీవ్, చైనా నేత డెంగ్ జియావోపింగ్‌తో జరిపిన సమావేశంతోనే గాక, 1972లో జనచైనా సందర్శనకు వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఇదే వూహాన్ నగరంలోని అప్పటి చైనా విప్లవ నేత మావో జెడాంగ్ సొంతిట్లో ఆయనతో జరిపిన భేటీతో కూడా మోదీ-జిన్‌పింగ్ సమావేశాన్ని పోల్చుతున్నారు. నిక్సన్-మావో భేటీ అయినా ఈ విలాస గృహంలోనే భారత, చైనా నేతలు దౌత్యాధికారుల సహాయం లేకుండా కలుసుకుంటారని భావిస్తున్నారు. కాని, మావో-నిక్సన్ భేటీ ఫలితాలు వెంటనే కనిపించాయి. అప్పటి నుంచి పెట్టుబడిదారీ అమెరికా, కమ్యూనిస్ట్ చైనా మధ్య అంచనాలకు అందని రీతిలో వేగంగా సంబంధాలు బలపడ్డాయి. మరి మోదీ, జిన్‌పింగ్ ‘అనధికార’ సమావేశం అలాంటి తక్షణ ఫలితాలు ఇవ్వకపోయినా రెండు ఆసియా బడా దేశాల సంబంధాల దిశ, దశలను గణనీయంగా మార్చుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మోదీ విదేశీ పర్యటన షురూ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన నిమిత్తం సోమవారం స్వీడన్ బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 20 వరకు ఐదురోజుల పాటు జరిగే పర్యటనలో ఆయన తొలుత స్వీడన్, అనంతరం బ్రిటన్, జర్మనీ దేశాల్లో పర్యటించనున్నారు. స్వీడన్ పర్యటనలో భాగంగా మంగళవారం ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫెన్తో ద్వైపాక్షిక అంశాలపై విస్తృతమైన చర్చలు జరుపుతారు. ‘భారత్–స్వీడన్ మధ్య హృదయపూర్వక స్నేహ సంబంధాలున్నాయి. మా భాగస్వామ్యం ప్రజాస్వామ్య విలువల ఆధారంగా నిర్మించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఓ సానుకూల వాతావరణం ఏర్పడాలనేది మా అభిమతం. మా అభివృద్ధి కార్యక్రమాల్లో స్వీడన్ విలువైన భాగస్వామి’ అని పర్యటనకు ముందు మోదీ పేర్కొన్నారు. కాగా, స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో స్టెఫాన్‌తో చర్చల తర్వాత ఆ దేశ రాజు కార్ల్ గుస్తాఫ్‌తోనూ మోదీ భేటీ కానున్నారు. అనంతరం భారత్, స్వీడన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇండియా–నోర్డిక్ (ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్ దేశాల కలిపి) సదస్సును ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. లండన్‌లో రాణితోనూ భేటీ స్వీడన్ నుంచి మంగళవారం రాత్రి వరకు మోదీ చోగమ్ (కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల) సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్ చేరుకుంటారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో మోదీ చర్చలు జరుపుతారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2తోనూ ప్రధాని ప్రత్యేకంగా భేటీ అవుతారు. లండన్‌లో ఆయుర్వేద సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభిస్తారు. కాగా, 53 కామన్వెల్త్ దేశాల సృజన్మాతక జాబితాలో భారత్ పదో స్థానంలో నిలిచింది. బ్రిటన్ మొదటి స్థానం లో, కెనడా, సింగపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
అంతా భారత్ చేతుల్లోనే!
ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్.. భారత ప్రధాని మోదీని కోరారు. అంతకుముందు, మోదీకి రమల్లాలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా–ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలపై చర్చించారు. రమల్లా: ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్.. భారత ప్రధాని మోదీని కోరారు. శాంతి నెలకొల్పే అంశంలో వివిధ దేశాలతో చర్చించి ఒప్పించాల్సిన బాధ్యతను మోదీ భుజస్కంధాలపై పెట్టారు. అంతకుముందు, మోదీకి (పాలస్తీనా అధికార పర్యటనకు వచ్చిన తొలి భారత ప్రధాని) రమల్లాలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా–ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఆరు ఒప్పందాలపై ఇరుదేశాల అధికారులు సంతకాలు చేశారు. పాలస్తీనా సామర్థ్య నిర్మాణం కోసం భారత్ దాదాపు 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.321 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు మోదీ తెలిపారు. తర్వాత ఇద్దరు నేతలు సంయుక్త మీడియా ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రభావం కారణంగానే ఈ శాంతిప్రక్రియలో కీలకంగా వ్యవహరించాలని కోరామని అబ్బాస్ వెల్లడించారు. పాలస్తీనాకు అండగా ఉంటాం పాలస్తీనా ప్రభుత్వం, ప్రజల ప్రయోజనాలను కాపాడే విషయంలో భారత్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మోదీ అన్నారు. ‘భారత్, పాలస్తీనాల మధ్య స్నేహం పురాతనమైనది. పాలస్తీనా అభివృద్ధి ప్రయాణంలో భారత్ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది. చర్చల ప్రక్రియ ద్వారా పాలస్తీనా త్వరలోనే స్వతంత్ర, సార్వభౌమ దేశంగా నిలవనుంది’ అని మోదీ అన్నారు. పాలస్తీనాలో శాంతి, స్థిరత్వం నెలకొల్పే ప్రక్రియలో భారత్ మద్దతుంటుందని.. అయితే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని మోదీ తెలిపారు. దౌత్యం, దూరదృష్టి మాత్రమే హింసకు అడ్డుకట్ట వేయగలవన్నారు. ‘ఇదేమీ అంత సులభమైన విషయం కాదు. కానీ మేం ఈ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం’ అని ప్రధాని పేర్కొన్నారు. యూఏఈతో ఐదు ఒప్పందాలు పాలస్తీనాలో శాంతి నెలకొల్పేందుకు భారత నాయకత్వం మొదట్నుంచీ అండగా నిలుస్తోందని అబ్బాస్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో నిర్మాణాత్మక, ఫలప్రదమైన చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. పాలస్తీనాతోపాటు పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొంటున్న పరిస్థితులను మోదీకి వివరించామన్నారు. అయితే.. తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా అంగీకరించాల్సిందేనని అబ్బాస్ పేర్కొన్నారు. జోర్డాన్ నుంచి యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీకి అబుధాబి యువరాజు మహ్మద్ బిన్ జాయెద్ ఘనస్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ సమావేశమై.. విస్తృతాంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య ఐదు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇందులో భారత ఆయిల్ కంపెనీల కన్సార్షియానికి 10% రాయితీ కల్పించే చారిత్రక ఒప్పందం కూడా ఉంది. ఇది 2018 నుంచి 2057వరకు 40 ఏళ్లపాటు అమ ల్లో ఉంటుంది. ఈ ఒప్పందంతో గల్ఫ్ దేశాల్లోని భారత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మోదీకి అరుదైన గౌరవం పాలస్తీనా పర్యటన సందర్భంగా మోదీకి ఆ దేశం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. పాలస్తీనా విదేశీ అతిథులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’తో సత్కరించింది. అంతకుముందు జోర్డాన్ రాజధాని అమ్మన్ నుంచి రమల్లా వరకు మోదీ హెలికాప్టర్‌కు ఇజ్రాయెల్ హెలికాప్టర్లు రక్షణగా వచ్చాయి. హెలికాప్టర్ దిగగానే.. పాలస్తీనా ప్రధాని హమ్దల్లా స్వాగతం పలికారు. అనంతరం అధ్యక్ష భవనం (మఖాటా)లో ఏర్పాటుచేసిన స్వాగత కార్యక్రమానికి అబ్బాస్ ఆలింగనంతో ఆహ్వానించారు. రమల్లాలోని యాసర్ అరాఫత్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. పాలస్తీనా తమ విదేశీ అతిథులకిచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’తో మోదీని సత్కరిస్తున్న పాలస్తీనా ప్రధాని మహమూద్ అబ్బాస్. శనివారం రమల్లాలో జరిగిన కార్యక్రమంలో దీన్ని అందించారు. -
నేపాల్ అభివృద్ధే మా ధ్యేయం
ఖాట్మండు: ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నేపాల్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఖాట్మండు చేరుకున్న సుష్మా శుక్రవారం నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ, ప్రధాన మంత్రి షేర్ బహదూర్ ద్యూబ, సీపీఎన్ మావోయిస్టు సెంటర్ చైర్మన్ ప్రచండతో సమావేశమయ్యారు. నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం సాధించేందుకు, ఆ దేశ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ప్రచండతో సమావేశం సందర్భంగా ఆమె ప్రకటించారు. నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం.. అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని సుష్మా హామీ ఇచ్చారని ప్రచండ ఈ సందర్భంగా చెప్పారు. తమ చర్చలు సానుకూల పంథాలో సాగినట్టు చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం సుష్మా స్వరాజ్ నేపాల్ పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్నారు. -
రద్దుపై మోదీకి అమెరికా రాయబారి ప్రశంస
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం అమెరికా-భారత్ దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ భారత దేశంలోని అవినీతిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నారని తమకు అర్థమైందని అన్నారు. అదే సమయంలో ప్రజలు పడుతున్న అవస్థలను కూడా తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. బుధవారం కోల్‌కతాలో జరిగిన ఓ సమావేశంలో పెద్ద నోట్ల రద్దుపై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ రాయబార కార్యాలయంలో భారతీయ ఉద్యోగులు చాలా ఎక్కువ మంది ఉన్నారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అలాంటిదానికి అంతంపలకాలని కోరారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిని దోషులుగా గుర్తించి శిక్షించాల్సిందేనని తెలిపారు. పాకిస్థాన్‌తో తమ దేశం చేసుకున్న రక్షణ ఒప్పందం దృష్టంతా ఉగ్రవాదాన్ని నిర్మూలించే అంశంలో భాగమేనని, కానీ భారత్‌తో సంబంధాల విషయంలో విస్తృతి పెద్దదని తెలిపారు. భారత్‌తో సంబంధాల తమకు చాలా ముఖ్యమైనవని అన్నారు. -
5 రోజుల్లోనే..కృష్ణపట్నం టు బంగ్లాదేశ్
♦ 42 ఏళ్ల తర్వాత నేరుగా కార్గో సేవలు ఆరంభం ♦ 30 నుంచి 5 రోజులకు తగ్గిన రవాణా సమయం ♦ 25-50 నుంచి శాతం తగ్గనున్న వ్యయం ♦ పత్తి రైతులకు లాభం: పోర్టు సీఈఓ కృష్ణపట్నం పోర్టు నుంచి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి ; బంగ్లాదేశ్-భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక ఘట్టానికి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రేవు వేదికగా నిలిచింది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కుదుర్చుకున్న జల రవాణా ఒప్పందం 42 ఏళ్ల తర్వాత సోమవారం వాస్తవ రూపం దాల్చింది. గతేడాది ప్రధాని నరేంద మోదీ బంగ్లాదేశ్ పర్యటనలో ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించటం తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ నుంచి ‘నీసా పారిబాహన్’ సంస్థకు చెందిన ఎం.వి హార్బర్ నౌక ఈ నెల 23న బయలుదేరి సోమవారం కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. దీని ద్వారా తొలిసారిగా 40 టీఈయూ (ట్వంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్) పత్తిని బంగ్లాదేశ్‌లోని ఐసీటీ పన్గాన్ రేవుకు పంపుతున్నారు. పత్తి బేళ్ల లోడింగ్ అనంతరం ఈ నౌక మంగళవారం బయలుదేరి, ఏప్రిల్ 3న పన్గాన్ పోర్టుకు చేరుతుంది. నౌకలోకి పత్తి లోడింగ్ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.జానకి లాంఛనంగా ప్రారంభించారు. బంగ్లా ఎంపీ నూర్ ఏ అలామ్ చౌదురీ, ‘నీసా పారిబహాన్’ ఎండీ నాసిర్ అహ్మద్ చౌదురి, సీఈఓ సిరాజుర్ రెహ్మాన్, పన్గాన్ పోర్టు ఇన్‌ల్యాండ్ కంటైనర్ టెర్మినల్ మేనేజర్ అహ్మదుల్ కరీమ్ చౌదురి, కృష్ణపట్నం పోర్టు సీఈఓ అనిల్ యెండ్లూరి, కస్టమ్స్ అధికారులు కేక్ కట్ చేసి, ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం పోర్టు సీఈవో అనిల్ యెండ్లూరి విలేకరులతో మాట్లాడారు. మాట్లాడుతూ... ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌కు నౌకల ద్వారా సరుకులు పంపించాలంటే శ్రీలంక, సింగపూర్ దేశాలు మీదుగా వెళ్లాల్సి వచ్చేదని, ఇందుకు 25 నుంచి 30 రోజుల సమయం పట్టేదని తెలియజేశారు. ‘‘ఇప్పుడు నేరుగా సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల కేవలం ఐదు రోజుల్లో బంగ్లాదేశ్‌కు చేరుకోవచ్చు. దీనివల్ల సమయంతో పాటు రవాణా వ్యయం కూడా 25 నుంచి 50 శాతం వరకు కలసి వస్తుంది’’ అని తెలియజేశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ రేవు ద్వారా తూర్పు తీర రాష్ట్రాలకు నేరుగా సరుకు రవాణా చేసే వెసులుబాటు కలిగిందన్నారు. వస్త్రాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న బంగ్లాదేశ్ భారీగా పత్తిని దిగుమతి చేసుకుంటోందని, ఇలా దిగుమతి చేసుకుంటున్న పత్తిలో తెలుగు రాష్ట్రాల వాటా 14 శాతంగా ఉందని తెలియజేశారు. ఈ జల రవాణా లింకు ఏర్పడటం వల్ల స్థానిక పత్తి రైతులకు ప్రయోజనం క లుగుతుందన్నారు. అలాగే మిరప, పప్పు దినుసులు ఎగుమతి చేయడమే కాకుండా నేరుగా జనపనార బస్తాలను దిగుమతి చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడు నూర్ ఆలమ్ చౌదరి మాట్లాడుతూ ఢాకాకు సమీపంలో టెక్స్టైల్ కంపెనీలకు కావాల్సిన ముడిసరుకును పన్గాన్లోని నదీ రేవు మార్గం వరకు నేరుగా దిగుమతి చేసుకునే వెసులుబాటు ఏర్పడిందన్నారు. రోడ్డు రవాణా వ్యయం తగ్గడమే కాకుండా, విలువైన సమయం కాపాడుకుంటూ తక్కువ రేటుతో సరుకు రవాణా చేసుకోవచ్చన్నారు. ఇండియాలోని ఇతర రేవు పట్టణాలతో నేరుగా రవాణా పెంచుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలియజేశారు. అనంతరం ‘నీసా పారిబహాన్’ ప్రతినిధులు తమ దేశంలో ఓడ రేవుల ద్వారా సాధిస్తున్న ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎగుమతిదారుల సందేహాలను పోర్టు సీఈఓ నివృత్తి చేశారు.