
నేపాల్ ప్రధానితో సుష్మా కరచాలనం
ఖాట్మండు: ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నేపాల్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఖాట్మండు చేరుకున్న సుష్మా శుక్రవారం నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ, ప్రధాన మంత్రి షేర్ బహదూర్ ద్యూబ, సీపీఎన్ మావోయిస్టు సెంటర్ చైర్మన్ ప్రచండతో సమావేశమయ్యారు.
నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం సాధించేందుకు, ఆ దేశ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ప్రచండతో సమావేశం సందర్భంగా ఆమె ప్రకటించారు. నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం.. అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని సుష్మా హామీ ఇచ్చారని ప్రచండ ఈ సందర్భంగా చెప్పారు. తమ చర్చలు సానుకూల పంథాలో సాగినట్టు చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం సుష్మా స్వరాజ్ నేపాల్ పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment