Sher Bahadur Deuba
-
నేపాల్‌లో అధికార క్రీడ
ఏడాదిన్నర కూడా కాకముందే నేపాల్‌లో మూడో ప్రభుత్వం ఏర్పాటైంది. విచిత్రమైన కూటములు జట్టుకట్టాయి, విడిపోయాయి, మళ్లీ ఒక్కటయ్యాయి. ఇందులో భారత్ అనుకూల, అననుకూల పార్టీలూ ఉన్నాయి. మూడు ప్రభుత్వాలకూ సారథిగా ప్రచండ ఉండటం విశేషం. కోవిడ్ –19 మహమ్మారి తర్వాత నేపాలీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. తిరిగి పుంజుకునే సంకేతాలు ఎంతమాత్రమూ కనబడటం లేదు. ఇది ప్రజల్లో నిరుత్సాహానికి దారి తీస్తోంది. గతంలో ఉన్న రాచరికమే మంచిదని కొందరు భావిస్తున్నారు. కొన్ని వారాల క్రితం, ఖాట్మండులో రాచరికం అనుకూల ప్రదర్శన కూడా జరిగింది. ప్రస్తుత కూటమి అమరిక వల్ల, ఇంకా మూడేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ తిరిగి సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధం అయినట్టుగా కనబడుతోంది. నేపాల్‌లో కేవలం 15 నెలల్లోనే మూడవ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆసక్తికరంగా, ఈ మూడు ప్రభుత్వాలకూ పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ సారథ్యం వహించారు. 2022 నవంబర్‌లో జరిగిన సార్వత్రిక ఎన్ని కల్లో ఆయన పార్టీ మావోయిస్ట్ సెంటర్ 30 స్థానాలతో ప్రతినిధుల సభలో మూడవ స్థానంలో నిలిచింది. 275 మంది సభ్యుల సభలో 88 స్థానాలతో నేపాలీ కాంగ్రెస్ మొదటి స్థానంలో, 78 స్థానాలతో కమ్యూ నిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్– లెనినిస్ట్) లేదా సీపీ ఎన్–యూఎమ్ఎల్ రెండవ స్థానంలో నిలిచాయి. చీలిపోయిన ప్రజా తీర్పు ముఖ్యమైన స్థానాన్ని ప్రచండ పొందేలా అనుమతించింది. మొదటిదే అయినప్పటికీ స్వల్పకాలంలోనే ముగిసిన కూటమి సీపీఎన్–యూఎమ్ఎల్, మావోయిస్టులకూ మధ్య ఏర్పడినది.ప్రచండకు ప్రధానమంత్రి పదవిని అందించిన తర్వాత, ఆయన నేపాలీ కాంగ్రెస్ వైపునకు మళ్లడంతో ఒక నెలలోనే ఆ కూటమి విచ్ఛి న్నమైంది. చిత్రంగా, అదే ప్రచండనీ, అదే సీపీఎన్–యూఎమ్ఎల్నీ మళ్లీ ఒకచోట చేర్చిన ప్రస్తుత కూటమిలో, మరో రెండు వామపక్ష అనుకూల పార్టీలు కూడా ఉన్నాయి. ఉపేంద్ర యాదవ్ నేతృత్వంలోని సమాజ్బాదీలు (సోషలిస్టులు), మాజీ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మాజీ సీపీఎన్–యూఎమ్ఎల్ సభ్యుల పార్టీ ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాయి.ఈ కూటమిలోనే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) ఉండటం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పార్టీకి 21 సీట్లున్నాయి. యువత ఆకాంక్షలను సమర్థించే, పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఉండే ఒక వేదికగా ఈ పార్టీని చెప్పుకోవచ్చు. ఈ పార్టీ గతంలో మొదటి మావో యిస్టు... సీపీఎన్–యూఎమ్ఎల్ కూటమిలో భాగంగా ఉండేది. అంతకుముందు అమెరికన్ జాతీయుడైన రవీ లామిఛానే దాని నాయ కుడు. ప్రస్తుత సంకీర్ణంలోని నలుగురు ఉప ప్రధాన మంత్రులలో ఆయన ఒకరుగా ఉన్నారు.కోవిడ్ –19 మహమ్మారి కాలంలో నేపాలీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కానీ ఇతర దేశాల మాదిరిగా, తిరిగి పుంజుకునే సంకే తాలు ఎంతమాత్రమూ కనబడటం లేదు. ఇది ప్రజల్లో నిరుత్సాహా నికి దారి తీస్తోంది. రాజకీయ వర్గం ఫలితాలు చూపని కారణంగా కొంతమంది గతంలో ఉన్న రాచరికమే మంచిదని కూడా భావిస్తు న్నారు. కొన్ని వారాల క్రితం, రాజధాని నగరం ఖాట్మండులో రాచ రికం అనుకూల ప్రదర్శన కూడా జరిగింది. ఆర్థిక సమస్యలపై నేపాలీ కాంగ్రెస్ చాలా మొండితనంతో ఉందని ప్రచండ ఆరోపించారు. ఆ కారణంగా రాజకీయంగా తన మార్పును సమర్థించుకున్నారు. అయితే, ఐదుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నేపాలీ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ దేవుబా నిరంతరం వేచివున్న ప్రధానమంత్రి స్థానంలో పరిభ్రమించడం ప్రచండ నిజంగానే భరించలేకపోయి ఉంటారు. కానీ సాంప్రదాయకంగా నేపాలీ కాంగ్రెస్‌తో వ్యవహరించడం సులభతరమని భారతదేశం గ్రహించింది. నేపాల్‌ను హిందూ రాజ్యంగా పునఃస్థాపించాలనే నేపాలీ కాంగ్రెస్ నాయకత్వానికి మావో యిస్టు–నేపాలీ కాంగ్రెస్ కూటమి కొంత ఓదార్పునిచ్చింది. 2015 రాజ్యాంగం నేపాల్‌ను లౌకిక దేశంగా ప్రకటించింది. అయితే, సీపీఎన్–యూఎమ్ఎల్ నాయకుడు అయిన కేపీ శర్మ ఓలి గతంలో కూడా హిందూ రాజ్యం పట్ల గానీ, నేపాల్‌లో ‘సాంస్కృతిక’ రాచరికం పట్ల గానీ విముఖంగా లేరని గమనించాలి. అయోధ్యలో రామ మందిర శంకుస్థాపనను నేపాల్ ఉత్సాహంతో స్వీకరించింది. ఇది హిందూ రాజ్యానికి మద్దతును పెంచుతుంది. ప్రచండ కూడా సానుకూల పాత్రను పోషిస్తున్నట్లు కనిపిస్తు న్నారు. సంవత్సరాల తరబడి తాను విడిచిపెట్టేసినటువంటి, హిందూ రాచరికంతో గుర్తింపు పొందిన నేపాలీ అధికారిక జాతీయ దుస్తులైన దౌడా సురూవాల్ను ధరించారు. ఏమైనప్పటికీ, ప్రచండ పెంపకం వామపక్షంతో కూడుకున్నది. అది రాచరికానికి వ్యతిరేకమైనది. ఆయ నకు ఇప్పుడు తనను తాను వెనక్కి తిప్పుకొనే, నేపాల్ గుర్తింపు రాజకీయాలను తిరిగి అక్కున చేర్చుకునే అవకాశం వచ్చింది. అంటే ప్రాథమికంగా భారతదేశం నుండి తనను తాను భిన్నంగా చూపు కోవడం. అందుకే ఆయన నేపాలీ కాంగ్రెస్‌తో విడిపోయినప్పుడు దానిని ‘ప్రతీఘాత శక్తి’ అని పేర్కొన్నారు. నేపాల్‌లోని రాజకీయ చర్చల్లో దక్షిణ (భారతదేశానికి సూక్ష్మ నామం), ఉత్తర (చైనా సూక్ష్మ నామం) పాత్రలకు సంబంధించిన సూచనలు సర్వ సాధారణం. సుమారు గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ దేశాలనూ (అమెరికా, యూరోపియన్ యూనియన్ మొద లైనవి), చర్చ్తో కూడుకున్న వారి ఎన్జీఓ భాగస్వాముల పాత్రనూ కూడా కొట్టిపారేయలేము. ఇవి మానవ హక్కులు, లౌకిక వాద ఆలోచనలను కలిగి ఉండి, తమవైన డైనమిక్స్‌ను కలిగి ఉన్నాయి. కొందరికి వామపక్ష కూటమిలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చేరిక ఉత్తరాది– పాశ్చాత్య కూటమి మధ్య సఖ్యతలా కనిపిస్తుంది. చాలా మంది పరిశీలకు లకు, తాజా అమరిక నేపా ల్లో తదుపరి సాధారణ ఎన్ని కలకు రంగం సిద్ధం చేసిన ట్టుగా కనబడుతోంది. కాక పోతే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉంది. అంత కాలం అవస రమైన ఓపికను ఓలీ ప్రదర్శిస్తారా అని చాలామంది అనుమానిస్తు న్నారు. 2020లో, అధికార భాగస్వామ్య ఒప్పందం ఉన్నప్పటికీ ప్రచండకు ప్రధానమంత్రి పదవిని వదులుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రచండ ఇప్పటికే ప్రజల్లో తన పట్టును కోల్పోయినందున, తన పాత కమ్యూనిస్ట్ సహచరులతో చేతులు కలపడమే ఏకైక మార్గం. సీపీఎన్ –యూఎమ్ఎల్ మద్దతుదారుల నుండి మావోయిస్టులకు ఓటు బదిలీ అంత సులభం కానప్పటికీ, నేపాలీ కాంగ్రెస్ నుండి మావోయిస్టులకు బదిలీ చేయడం ఇంకా కఠినమైనది. కొత్త అమరిక చైనీయులు సంతో షించడానికి ఒక కారణాన్నిస్తుంది. అంతర్గత నేపాలీ రాజకీయ కోణం కూడా ఉన్నప్పటికీ, దాన్ని తీసుకురావడంలో వారి పాత్ర ఉంది. భారతదేశం ఇప్పటివరకూ నేపాల్‌కు అతిపెద్ద వాణిజ్య, ఆర్థిక భాగస్వామి. పైగా దేశంలో ఆర్థిక తేజస్సుకు గేట్‌వే. నేపాల్‌కు దాని పెరుగుతున్న జలవిద్యుత్ ఉత్పత్తి అవసరాల నుండి ప్రయోజనాలను పొందేందుకు ఇది ఏకైక అర్థవంతమైన మార్గం. ఇటీవలి సంవ త్సరాలలో సమీకృత చెక్ పోస్టుల నిర్మాణం, రైల్వే కనెక్టివిటీ అభివృద్ధి, విద్యుత్ సరఫరా లైన్లు, యూపీఐ లావాదేవీలకు వెళ్లడం వంటి వాటితో నేపాల్ కనెక్టివిటీకి భారత్ ఊతమిచ్చింది. వాస్తవానికి, నేపాల్‌కు చమురు సరఫరా చేయడానికి ఏర్పాటయ్యే పైప్‌లైన్, 900 మెగావాట్ల అరుణ్–3 ప్రాజెక్ట్ నిర్మాణంతో సహా చాలా ప్రాజెక్టులు ఓలీ 2018–19లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు.నేపాల్‌లో, ఇండియా కార్డ్‌ను ప్లే చేయడం వల్ల అది ప్రజల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్య మైనది. అనారోగ్యకరమైన ఆర్థిక స్థితి ఏ ప్రస్తుత ప్రధానమంత్రికీ మంచిది కాదు. సులభతరమైన వ్యాపారాన్ని మెరుగుపరచడం కోసం తీసుకునే చర్యలు భారతదేశం, నేపాల్ రెండింటి ప్రయోజనాలకు ఉపయోగపడుతాయి. మంజీవ్ సింగ్ పురీ వ్యాసకర్త నేపాల్‌లో భారత మాజీ రాయబారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సరిహద్దులను రాజకీయం చేయొద్దు
న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యను రాజకీయం చేయరాదని భారత్–నేపాల్ అంగీకారానికి వచ్చాయి. భారత్‌లో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా వీరు అంగీకారానికి వచ్చారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కూడా చర్చకు వచ్చింది. సమస్య పరిష్కారానికి ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని దేవ్ బా కోరగా, రెండుదేశాల మధ్య ఉన్న కాపలాలేని సరిహద్దులను అవాంఛనీయ శక్తులు దుర్వినియోగం చేయడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలు కలిసి భారత్–నేపాల్ మధ్య మొట్టమొదటి బ్రాడ్‌గేజ్ రైలు మార్గాన్ని, విద్యుత్ సరఫరా లైన్‌ను, నేపాల్‌లో రూపే చెల్లింపుల వ్యవస్థను వర్చువల్‌గా ప్రారంభించారు. రైల్వేలు, విద్యుత్ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉద్దేశించిన నాలుగు ఒప్పందాలపైనా సంతకాలు చేశారు. దేవ్ బా భారత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. ఐదోసారి పీఎం అయ్యాక ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన. చర్చల అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రింగ్లా మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దు సమస్యను రాజకీయం చేయడం మాని చర్చల ద్వారా బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయని చెప్పారు. భారత్– బంగ్లాదేశ్ సరిహద్దు సమస్యలకు సామరస్యపూర్వక సమాధానం దొరికినట్లే, నేపాల్‌తో విభేదాలకు కూడా పరిష్కారం లభిస్తుందన్నారు. రెండు దేశాల సరిహద్దుల్లోని భారత భూభాగాలైన లింపియధురా, కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ను ప్రచురించడంపై 2020 నుంచి వివాదం నడుస్తోంది. -
విశ్వాస పరీక్ష నెగ్గిన దేవ్బా
ఖాట్మండు: నేపాల్ నూతన ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఆదివారం జరిగిన విశ్వాస పరీక్షలో గెలుపొందారు. ప్రతినిధుల సభలో 275 ఓట్లుండగా, దేవ్‌బాకు 165 ఓట్లు వచ్చాయని హిమాలయన్ టైమ్స్ తెలిపింది. ఓటింగ్‌లో 249మంది పాల్గొన్నారు. వీరిలో 83 మంది దేవ్‌బాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒక సభ్యుడు తటస్థంగా ఉన్నారు. పార్లమెంట్ విశ్వాస పరీక్షలో నెగ్గడానికి 136 ఓట్లు కావాల్సిఉంది. కావాల్సిన మెజార్టీ కన్నా అధిక మద్దతునే దేవ్బా పొందారు. పార్లమెంట్‌ను రద్దు చేయవద్దని, దేవ్‌బాను ప్రధానిగా నియమించి విశ్వాస పరీక్షకు అనుమతినివ్వాలని నేపాల్ సుప్రీంకోర్టు అధ్యక్షురాలిని ఆదేశించిన సంగతి తెలిసిందే! దీంతో ఈనెల 13న దేవ్బా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కలిపి ఇప్పటికి ఆయన ఐదుమార్లు నేపాల్ ప్రధాని పదవి స్వీకరించినట్లయింది. మాజీ ప్రధాని కేపీఓలీ సిఫార్సుతో అధ్యక్షురాలు విద్యాదేవీ దిగువ సభను మేలో రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. విచారణ అనంతరం సభ రద్దు నిర్ణయాన్ని కోర్టు కొట్టేసింది. -
Nepal: చివరి నిమిషం వరకూ హైడ్రామా.. ముగిసిన రాజకీయ సంక్షోభం
ఖాట్మాండూ: చివరి నిమిషం వరకూ ఉత్కంఠగా సాగిన నేపాల్ రాజకీయ సంక్షోభం.. నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్బా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ముగిసింది. సాయంత్రం 6 గంటలకు (స్థానిక కాలమానం) ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ, రాత్రి 8 తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ దిగువ సభను గత ప్రధాని ఓలీ సూచన మేరకు అధ్యక్షురాలు విద్యా దేవి భండారి రద్దు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, సుప్రీంకోర్టు దేవ్‌బాకు అనుకూలంగా తీర్పు చెప్పింది. మంగళవారం ఆయన చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా ఆర్టికల్ 76(5) కింద అధ్యక్షురాలికి ఆదేశాలిచ్చింది. అయితే ప్రమాణస్వీకారం కోసం అధ్యక్షురాలి కార్యాలయం ఇచ్చిన నోటీసులో సుప్రీంకోర్టు పేర్కొన్న ఆర్టికల్ 76(5) ప్రస్తావన లేదు. దీంతో ఆ ఆరి్టకల్ ప్రస్తావన ఉంచి కొత్త నోటీసు ఇచ్చే వరకు తాను ప్రమాణస్వీకారం చేయబోనని తేల్చి చెప్పారు. దీంతో అధ్యక్షురాలి కార్యాలయం దిగి వచ్చి రాత్రి 8.15 గంటలకు కొత్త నోటీసు జారీ చేసింది. అనంతరం అధ్యక్షురాలు విద్యాదేవి భండారి సమక్షంలో షేర్ బహదూర్ దేవ్బా నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది అయిదవ సారి కావడం గమనార్హం. -
దేవ్‌బాను ప్రధానిగా నియమించండి
ఖాట్మాండూ: నేపాల్ రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్‌బాను ప్రధానిగా నియమించా లంటూ నేపాల్ సుప్రీంకోర్టు ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి సూచించింది. చీఫ్ జస్టిస్ చోళేంద్ర షంషేర్ రాణా ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును సోమవారం వెలువరిం చింది. మంగళవారంలోగా దేవ్‌బాను ప్రధానిగా నియమించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూలై 18 సాయంత్రం 5 గంటలకు సభ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 (5) ప్రకారం ప్రధానిని ఎన్నుకొనే ఓటింగ్‌లో పార్టీ విప్ ఏ మాత్రం పని చేయబోదని సీజే జస్టిస్‌రాణా తెలిపారు. రాజ్యాంగ విరుద్ధం నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ ప్రతిపాదన మేరకు పార్లమెంట్‌దిగువ సభను అధ్యక్షురాలు రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న ఓలీ నిర్ణయం దీంతో బెడిసికొట్టింది. నవంబర్ 12, 19లో ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దేవ్‌బాకు మద్దతు దిగువ సభను రద్దు చేయడంపై సుప్రీంకోర్టులో మొత్తం 30 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో 146 మంది ప్రతిపక్ష పార్టీ నేతలు కలసి వేసిన పిటిషన్ కూడా ఉంది. మెజారిటీకి అవసరమైన మద్దతు తమ సంకీర్ణ కూటమిలో ఉన్నందున అవకాశం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టులో వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కూటమిలో సభ్యుడైన నేపాల్ కమ్యూనిస్ట్‌పార్టీ–యూఎంఎల్ నేత మాధవ్ కుమార్ మాట్లాడుతూ.. చేయాల్సి ందంతా సుప్రీంకోర్టు చేయడంతో ఇక తామేమీ మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దేవ్బా గతంలో నాలుగు సార్లు ప్రధానిగా పని చేశారు. 1995–97, 2001–02, 2004–05, 2017–18 మధ్య ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. తాజా తీర్పుతో అయిదోసారి ప్రధాని కానున్నారు. మరోవైపు ఓలీ మద్దతుదా రులు సుప్రీంకోర్టు తీర్పుపై నిరసనలు చేపట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నింటిని మేము పాటించాల్సిన అవసరం లేదు అని నినాదాలున్న కార్డులను పట్టుకొని వీధుల్లో నిరసనలు తెలిపారు. ఓలీ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసం కోల్పోవడంతో గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. -
నేపాల్ పీఎంగా మళ్లీ ఓలి
కఠ్మాండూ: నేపాల్ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలి శుక్రవారం మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయి, విశ్వాసపరీక్షలో విఫలమవడంతో నాలుగు రోజుల కిందటే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే, విపక్ష పార్టీలు మెజారిటీ సాధించే విషయంలో విఫలం కావడంతో గురువారం రాష్ట్రపతి విద్యాదేవి భండారీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేపీ శర్మ ఓలీని కోరారు. దాంతో, రాష్ట్రపతి భవనంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఓలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెల రోజుల్లోగా ఆయన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే, రాష్ట్రపతి పాలన విధించి, 6 నెలల్లోగా ఎన్నిక లు నిర్వహించే అవకాశముంటుంది. ఓలి గత మంత్రి వర్గాన్నే కొనసాగించనున్నారు. ప్రచండ యూ టర్న్: సీపీఎన్–మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ మద్దతుతో మెజారిటీ సాధించి ప్రధాని పదవి చేపడ్తానన్న ఆశతో గురువారం వరకు నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూ దేవ్బా ఉన్నారు. అయితే, చివరి నిమిషంలో ప్రచండ కేపీ శర్మ ఓలీతో సమావేశమై దేవ్‌బాకు మద్దతిచ్చే విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. 271 మంది సభ్యుల ప్రతినిధుల సభలో ఓలి పార్టీ సీపీఎన్–యూఎంఎల్‌కు 121 మంది సభ్యులున్నారు. మెజారిటీకి 136 మంది సభ్యుల మద్దతు అవసరం. -
నేపాల్: తదుపరి ప్రధాని షేర్ బహదూర్ దుబా?
ఖాట్మండూ: ఓలి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ మంతనాలు జరుపుతోంది. దీనికోసం మంగళవారం నేపాలీ కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు భేటీ అయ్యారు. గురువారంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని దేశాధ్యక్షుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎన్సీ అధ్యక్షుడు షేర్‌బహదూర్ దుబాను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి పుష్ప కమల్ ప్రంచండ నేతృత్వంలోని సీపీఎన్ మావోయిస్టు సెంటర్ మద్దతు తెలపగా, సమాజ్‌వాదీ పార్టీలో ఓ వర్గం వ్యతిరేకించింది. గతంలో ప్రధానిగా చేయని కొత్త వ్యక్తిని ప్రధానిగా చేయాలని ఆ వర్గం పట్టుబడుతోంది. ఈ మూడు పార్టీల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో సందిగ్దత కొనసాగుతోంది. ఒకవేళ ఈ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే నేపాల్ రాజ్యాంగం ప్రకారం.. అతిపెద్ద పార్టీకి చెందిన నాయకున్ని మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఆయన 30 రోజుల్లోగా తన మెజారిటీని నిరూపించుకోవాలి. అదే జరిగితే ఓలి తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. (చదవండి: KP Sharma Oli: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి) (చదవండి: సీఎం అవుతానని 30 ఏళ్ల క్రితమే చెప్పాడు : సీఎం భార్య) -
నేపాల్ అభివృద్ధే మా ధ్యేయం
ఖాట్మండు: ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నేపాల్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఖాట్మండు చేరుకున్న సుష్మా శుక్రవారం నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ, ప్రధాన మంత్రి షేర్ బహదూర్ ద్యూబ, సీపీఎన్ మావోయిస్టు సెంటర్ చైర్మన్ ప్రచండతో సమావేశమయ్యారు. నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం సాధించేందుకు, ఆ దేశ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ప్రచండతో సమావేశం సందర్భంగా ఆమె ప్రకటించారు. నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం.. అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని సుష్మా హామీ ఇచ్చారని ప్రచండ ఈ సందర్భంగా చెప్పారు. తమ చర్చలు సానుకూల పంథాలో సాగినట్టు చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం సుష్మా స్వరాజ్ నేపాల్ పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్నారు. -
డోక్లాం వివాదాన్ని చర్చలతోనే పరిష్కరించుకోవాలి
భారత్, చైనాలకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సూచన సాక్షి, తిరుమల: భారత్, చైనాల మధ్య నెలకొన్న డోక్లాం వివాదాన్ని చర్చలతోనే పరిష్కరించుకోవాలని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సూచించారు. శనివారం తన సతీమణి అర్జూరాణా దేవ్బా, ఇతర కుటుంబీకులతో కలసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్‌తో సంస్కృతి, వారసత్వ ,స్నేహ, సుహ్రుద్భావ సంబంధాలు ఉన్నాయని, అందుకే తన తొలి విదేశీ పర్యటనకు భారత్‌కు వచ్చినట్లు చెప్పారు. -
తిరుమలలో నేపాల్ ప్రధాని పర్యటన
తిరుమల: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు ఈఓ అశోక్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరావు ఘనస్వాగతం పలికారు. ఆయన సతీసమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లారు. -
నేడు నగరంలో నేపాల్ ప్రధాని పర్యటన
ఇన్ఫోసిస్‌తో పాటు టీ హబ్ సందర్శించనున్న ప్రధాని సాక్షి, హైదరాబాద్: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన నగరానికి చేరుకుంటారు. ఇన్ఫోసిస్ క్యాంపస్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ హబ్ ఇంక్యుబేటర్ వ్యవస్థను సందర్శిస్తారు. రాత్రి ఆయనకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హోటల్ తాజ్ ఫలక్‌నుమాలో విందు ఇస్తారని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం ఆయన నేపాల్ తిరుగు పయనమవుతారని వెల్లడించాయి. -
నేపాల్ ప్రధానిగా దేవ్బా
కట్మాండు: నేపాల్ నూతన ప్రధానిగా సీనియర్ నాయకుడు షేర్ బహదూర్ దేవ్బా(70) మంగళవారం ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం ఇది నాలుగోసారి. ప్రధాన ప్రతిపక్షం యూఎం ఎల్, ఇతర పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దించకపోవడంతో దేవ్బా ఎన్నిక లాంఛనమైంది. పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో దేవ్‌బాకు అనుకూలంగా 388 ఓట్లు, వ్యతిరేకంగా 170 ఓట్లు పోలయ్యాయి. దీంతో నేపాలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఆయన నేపాల్‌కు 40వ ప్రధాని కానున్నారు. నేపాలీ కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా మావోయిస్ట్ నేత ప్రచండ రాజీనామా చేయడంతో ప్రధాని పదవికి తాజా ఎన్నిక అనివార్యమైంది.దేవ్బా ప్రభుత్వంలో మాధేశీ పార్టీలు కూడా చేరే అవకాశాలున్నాయి. రెండో దశ స్థానిక ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఇప్పుడు దేవ్‌బాపై పడనుంది. ఆయన 1995–97, 2001–02, 2004–05 మధ్య కాలంలో నేపాల్ ప్రధానిగా పనిచేశారు. దేవ్‌బాకు భారత నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే 1996లో మహంకాళి నది నీటి పంపకానికి భారత్, నేపాల్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. దేవ్‌బాకు భారత ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దేవ్బా నేతృత్వంలో నేపాల్‌లో శాంతి, అభివృద్ధి నెలకొనాలంటూ మోదీ ట్వీట్ చేశారు. -
నేపాల్ ప్రధానమంత్రి ప్రచండ రాజీనామా
-
నేపాల్ ప్రధానమంత్రి ప్రచండ రాజీనామా
ఖాట్మండ్ : నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమాల్ దహాల్ అలియాస్ ప్రపంచ రాజీనామా చేశారు. రాజకీయ ఒప్పందంలో భాగంగా ఆయన తన పదవికి బుధవారం రాజీనామా చేసినట్లు వెల్లడించారు. కొత్త ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ) నేత షేర్ బహదూర్ దేవ్ బా నియమితులవనున్నారు. గత ఏడాది ఆగస్టులో ప్రచండ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. తన రాజీనామాను వెల్లడించిన అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రచండ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి విద్యాదేవి భండారికి సమర్పించారు.