ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రోడ్డెక్కిన విపక్షాలు..ఢిల్లీలో ఉద్రిక్తత | Democracy In Danger Opposition MPs March To Rashtrapati Bhavan | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రోడ్డెక్కిన విపక్షాలు..ఢిల్లీలో ఉద్రిక్తత

Published Fri, Mar 24 2023 4:41 PM | Last Updated on Fri, Mar 24 2023 4:44 PM

Democracy In Danger Opposition MPs March To Rashtrapati Bhavan - Sakshi

కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష పార్టీలన్ని రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు బ్యానర్లు చేతపట్టుకుని పార్లమెంట్‌ వరకు నిరసన ర్యాలీలు చేపట్టారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. రాష్ట్రపతి భవన్‌ వైపు పాదయాత్రతో వస్తున్న విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదానీ హిండెన్‌బర్గ్‌ వ్యవహారం, రాహుల్‌ గాంధీ అరెస్టు తదితర అంశాల నేపథ్యంలో శుక్రవారం విపక్షాలన్ని ఆందోళనకు దిగాయి.

ఈ మేరకు ఈ అంశంపైనే శుక్రవారం కూడా ప్రతిపక్ష సభ్యులు ఉభయల సభల్లో ఆందోళనకు దిగడంతో ఎలాంటి చర్చలు జరగకుండానే సభలు మరోసారి వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలోనే తొలుత పార్లమెంట్‌ ప్రాంగణంలోనే నిరసనలు చేపట్టిన ప్రతిపక్ష ఎంపీలు..విజయ్‌ చౌక్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌వైపుకు ర్యాలీ ప్రదర్శనలు చేపట్టాయి. అయితే పోలీసులు ర్యాలీలకు అనుమతి లేదంటూ వారిని అదుపులో తీసుకున్నారు. దీంతో విజయ్‌ చౌక్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

అదీగాక గత కొంతకాలంగా అదానీ హిండెన్‌బర్గ్‌ సమస్యపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేయడమే గాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కావాలని కోరుతున్నాయి. ఐతే దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని విపక్ష ఆరోపిస్తున్నాయి. పైగా దీని నుంచి దృష్టి మరల్చడానికే కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌పై అరెస్టు వంటి ఎత్తుగడలను ఉపయోగిస్తుందని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటుందంటూ విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి.

(చదవండి: రాహుల్‌ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు.. ప్రకటించిన లోక్‌సభ సెక్రటరీ జనరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement