సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా గత 11 నెలలుగా మూసివేతకు గురైన రాష్ట్రపతి భవన్ ఈ నెల 6 నుంచి తెరచుకోనుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సెలవుదినాలు కాకుండా శనివారం, ఆదివారం రోజుల్లో రాష్టపతి భవన్ తెరచే ఉంటుందని స్టేట్‌మెంట్ ద్వారా చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించేందుకుగానూ గరిష్టంగా స్లాట్‌కు 25 మంది చొప్పున మూడు స్లాట్లలో (ఉదయం 10:30, మధ్యాహ్నం 12:30, 2:30) పర్యాటకులను అనుమతించనున్నట్లు చెప్పింది. లోపలికి అనుమతించేందుకు ఒక్కొక్కరికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.
8 నుంచి తెరచుకోనున్న జేఎన్‌యూ
కరోనా కారణంగా మూతబడిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఈ నెల 8 నుంచి తెరచుకోనుందని జేఎన్‌యూ సోమవారం ప్రకటించింది. 4వ సెమిస్టర్ చదువుతున్న ఎంఫిల్, ఎంటెక్ విద్యార్థులు, ఎంబీఏ చివరి సెమిస్టర్‌విద్యార్థులు ఈ నెల 8 నుంచి కాలేజీకి, హాస్టల్‌కు రావచ్చని ప్రకటించింది. జూన్ 30లోగా థీసిస్‌ను సమర్పించాలని చెప్పింది.
చదవండి:
వింత సంఘటన: దానికదే కదలిన వాహనం
Comments
Please login to add a commentAdd a comment