
న్యూఢిల్లీ: పంజాబ్-హర్యానా సరిహద్దులో గత 13 నెలలుగా మూసివేసిన శంభు సరిహద్దు ఇప్పుడు తెరుచుకుంది (Shambu Border Reopen). ఇక్కడ నిరసన చేస్తున్న రైతులను పోలీసులు తరలించారు. ఈ నేపధ్యంలో రైతు నేతలు జగ్జీత్ సింగ్ దల్లెవాల్, సర్వాన్ సింగ్ పంధేర్ సహా దాదాపు 400 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
పంజాబ్ పోలీసులు శంభు సరిహద్దును తెరవడంతో ఈ దారిలో రాకపోకలు సాగించేవారు.. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు(Entrepreneurs) ఊపిరిపీల్చుకున్నారు. కాగా రైతు నేత రాకేష్ టికైత్ మాట్లాడుతూ పోలీసుల చర్య సరైనది కాదని, దీనిపై రైతు సంఘాలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరోవైపు యునైటెడ్ కిసాన్ మోర్చా మార్చి 26న పంజాబ్ అసెంబ్లీకి మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది. శంభు సరిహద్దు మూసివేయడం వల్ల పంజాబ్‌లోని పలు పరిశ్రమ భారీ నష్టాలను చవిచూశాయని ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా ఉపాధి సంక్షోభం ఏర్పడుతున్నదని, అందుకే శంభు సరిహద్దును ఖాళీ చేయించామని పేర్కొంది.
శంభు సరిహద్దును మూసివేయడం వలన ఇక్కడి పరిశ్రమలు ఎగుమతులు, దిగుమతులను చేయలేకపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. కాగా పంజాబ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా ఉండాలని భగవంత్ మాన్ ప్రభుత్వం కోరుకుంటోంది. తద్వారా పంజాబ్ యువతకు ఉపాధి లభిస్తుందని, దీంతో వారు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. రైతులను ఆదుకుంటామని కూడా చెబుతోంది.
ఇది కూడా చదవండి: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 70 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment