సాక్షి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతల జాబితా 19వ తేదీన ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సామాన్యుల్లో అసామాన్యులకు, పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించి తమదైన ముద్రవేసిన వారికి ఈ అవార్డుల్ని అందిస్తున్నారు. కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జీవీడి. కృష్ణమోహన్, ఇతర అవార్డు కమిటీ సభ్యులతో కలిసి అవార్డుకు ఎంపికైన వారి జాబితాను రేపు(గురువారం) సాయంత్రం ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1వ తేదీన అవార్డు గ్రహీతలకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డుల్ని అందించడం ఇది వరుసగా మూడో ఏడాది.
వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు క్రింద గ్రహీతలకు రూ.10 లక్షల నగదు పురస్కారంతో పాటు వైఎస్సార్ కాంస్య ప్రతిమ, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.5 లక్షల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment