‘జుంబారే.. జుజుంబ‌రే’ రీమిక్స్‌ అదిరింది! | Krishna Birthday Jumbare Jujumbare Remix Special Video Released | Sakshi
Sakshi News home page

‘జుంబారే.. జుజుంబ‌రే’ రీమిక్స్‌ అదిరింది!

Published Sun, May 31 2020 6:59 PM | Last Updated on Sun, May 31 2020 10:13 PM

Krishna Birthday Jumbare Jujumbare Remix Special Video Released - Sakshi

సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘జుంబారే.. జుజుంబ‌రే’ రీమిక్స్‌ సాంగ్‌ స్పెషల్‌ వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ య‌మ‌లీల చిత్రంలోని ఈ పాట ఎంత పాపుల‌రో వేరే చెప్పనక్కర్లేదు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన ఈ పాట‌కి జొన్నవిత్తుల సాహిత్యం అందించారు. కృష్ణ‌, పూజా ‘జుంబారే.. జుజుంబ‌రే’ పాటకు డ్యాన్సుల‌తో ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడు ఇదే పాట‌ని స‌రికొత్త స్టైల్‌లో రూపొందించారు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య.
(చదవండి: రాజమౌళితో మహేశ్‌ సినిమా ఆశించొచ్చా?)

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు, మ‌హేష్ బాబు మేనల్లుడు గ‌ల్లా అశోక్  హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు శ్రీ‌రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్యా, అర్చనా సౌంద‌ర్య నటిస్తున్నారు. 50 శాతం సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తయింది. క‌రోనా లాక్‌డౌన్‌తో షూటింగ్ నిలిచిపోయింది. తాతగారి పాటకు అశోక్‌ గల్లా స్టెప్పులు అదిరిపోయాయని అభిమానులు సంబరపడిపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement