remix song
-
సక్సెస్ కోసం మెగాస్టార్ దారిలో బాలకృష్ణ!
టాలీవుడ్ లో రీమిక్స్ సాంగ్స్ కొత్తేమీ కాదు.. తమ అభిమాన హీరోలు పాటలను...యంగ్ హీరోస్ రీమిక్స్ చేసి తమ సినిమాకి హైప్ తెచ్చుకుంటారు. అయితే ఇప్పటి వరకు ఏ హీరో తన పాటలనే తను నటించే సినిమా కోసం రీమిక్స్ చేసుకోలేదు. కానీ టాలీవుడ్ ఇద్దరు హీరోలు కొత్త ట్రెండ్ ను సెట్ చేయటానికి ట్రై చేస్తున్నారు. తమ సినిమాల్లోని హిట్ సాంగ్స్‌ని నయా మూవీస్‌లో రీమేక్ చేయబోతున్నారు. వాల్తేరు వీరయ్య మూవీలో తన వింటేజ్ లుక్ ... మ్యానరిజమ్స్ ప్రేక్షకులకి ఒక్కప్పటి చిరంజీవిని గుర్తు చేశాడు. అందుకే బోళాశంకర్ లో వింటేజ్ చిరంజీవి లుక్ ను మాత్రమే కాకుండా...అభిమానులకు కిక్ ఇచ్చేందుకు చిరు మరో ఎక్స్ఫర్మెంట్ కి రెడీ అయ్యాడు. తన సినిమాలోని ఓ హిట్ సాంగ్ ను...బోళాశంకర్ లో రీమిక్స్ చేయిస్తున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో చూడాలని వుంది సినిమా చేశాడు. ఆ సినిమాలో రామ చిలకమ్మా పాట సూపర్ హిట్ అయింది. బోళాశంకర్ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ ఈ పాటను రీమిక్స్ చేస్తున్నాడు. చిరు బోళాశంకర్ లో తన పాట రీమిక్స్ చేయమని చెప్పటానికి ఒక రీజన్ వుంది. వాల్తేరువీరయ్య సినిమాలో తన ఓల్డ్ సాంగ్ కి శృతిహాసన్ తో కలిసి స్టెప్స్ వేశాడు..ఆ డ్యాన్స్ ను ఫ్యాన్స్ బాగా ఎంజాయి చేశారు. తన సినిమాలోని ఓ సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తే అభిమానులు ఇంకా బాగా ఎంజాయి చేస్తారనే ఐడియాతోనే చిరు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక బాలకృష్ణ కూడా వీరసింహా రెడ్డి తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ (NBK108) స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్ గా నటించి వింటేజ్ బాలకృష్ణను గుర్తు చేశాడు. దీంతో NBK108 టీమ్ కూడా బాలకృష్ణ ఓల్డ్ మూవీలోని ఓ సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేసేందుకు రెడీ అవుతుందట. బాలకృష్ణ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిన సమరసింహారెడ్డి.. ఈ సినిమాలోని అందాల ఆడబోమ్మ పాటను మళ్లీ రీమిక్స్ చేస్తున్నారనే న్యూస్ నెట్టింట వైరల్ మారింది. తమన్ మ్యూజిక్ లో ఆ సాంగ్ రీమిక్స్ అయితే ఇంకా అదిరిపోతుందని బాలకృష్ణ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల డాటర్ గా నటించే ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా కాజల్ నటించనుందట. అయితే అందాల ఆడబొమ్మ రీమిక్స్ చేస్తారా లేదా అనే విషయంపై చిత్ర యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. -
మంచి మంచి పాటల్ని చెడగొడుతున్నారు కదయ్యా!
ముంబై: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ వుడ్లో అయినా పాత హిట్ సాంగ్స్‌ను రీమిక్స్‌లు, రీ-రీమిక్స్‌లు, రీక్రియేషన్ల పేరుతో ఇప్పటి తరాలకు అందిస్తుండడం చూస్తున్నాం. అదే సమయంలో చాలావరకు కొత్తవాటిపై విమర్శలు వెల్లువెత్తుతుండం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా.. శ్రీలంక గాయని యోహానీతో ‘మనికే మేగే’ సాంగ్‌ను.. ‘థ్యాంక్ గాడ్’ సినిమా కోసం ఆమెతోనే పాడించి ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీ కంపోజిషన్‌పై మాములు తిట్లు పడడం లేదు. ఇక ఇప్పుడు మరో క్లాసిక్ పాటను చెడగొట్టే యత్నమూ జరుగుతోందన్న విమర్శ వెల్లువెత్తుతోంది. ‘మైనే పాయల్ హై ఛన్‌కాయి’ సాంగ్ గుర్తుందా? అప్పట్లో నార్త్-సౌత్ తేడా లేకుండా ఊపేసిన సాంగ్. ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకున్న సాంగ్ అది. సింగర్ నేహా కక్కర్ ‘ఓ సజ్నా’ పేరిట రీమిక్స్ చేయించి వదిలింది టీ సిరీస్. దీంతో మంచి పాటను చెడగొట్టారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే నేహా కక్కర్ పాడిన పలు రీక్రియేషన్స్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి గతంలో. ఇక ఒరిజినల్ కంపోజర్ & సింగర్ ఫాల్గుని పాథక్ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఫ్యాన్స్ షేర్ చేసిన కొన్ని మీమ్స్‌ను, విమర్శలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ రూపంలో షేర్ చేశారంటూ కథనాలు వెలువడుతున్నాయి. video credits: T-Series ఫాల్గుని పాడిన మైనే పాయల్ హై ఛన్‌కాయి ఒరిజినల్ సాంగ్ 1999లో రిలీజ్ అయ్యింది. వివన్ భాటేనా, నిఖిలా పలాట్లు ఇందులో నటించారు. కాలేజీ షోలో తొలుబొమ్మల ప్రదర్శన మీద ఈ సాంగ్ పిక్చరైజేషన్ ఉంటుంది. ఇక కొత్త వెర్షన్ ఓ సజ్నాకు తన్షిక్ బాగ్చీ మ్యూజిక్ అందించగా.. ప్రియాంక శర్మ, ధనాశ్రీ వర్మ నటించారు. videoCredits: FalguniPathakVEVO -
తాతకు బహుమతి
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు అశోక్. కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆయనకు ఓ బహుమతి అందించింది ఈ చిత్రబృందం. కృష్ణ సూపర్ హిట్ పాటల్లో ‘యమలీల’ సినిమాలోని ‘జుంబారే జుజుంబారే...’ పాట ఒకటి. ఇప్పుడు ఇదే పాటను రీమిక్స్ చేశారు ఆయన మనవడు గల్లా అశోక్. ఈ పాట టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. కృష్ణ స్టెప్స్‌ను అనుకరిస్తూ అశోక్ గల్లా ఈ రీమిక్స్‌కి స్టెప్స్ వేశారు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. 50 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. -
‘జుంబారే.. జుజుంబరే’ రిలోడేడ్ అదిరింది!
-
‘జుంబారే.. జుజుంబరే’ రీమిక్స్ అదిరింది!
సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘జుంబారే.. జుజుంబరే’ రీమిక్స్ సాంగ్ స్పెషల్ వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యమలీల చిత్రంలోని ఈ పాట ఎంత పాపులరో వేరే చెప్పనక్కర్లేదు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన ఈ పాటకి జొన్నవిత్తుల సాహిత్యం అందించారు. కృష్ణ, పూజా ‘జుంబారే.. జుజుంబరే’ పాటకు డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇదే పాటని సరికొత్త స్టైల్లో రూపొందించారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. (చదవండి: రాజమౌళితో మహేశ్ సినిమా ఆశించొచ్చా?) టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, నరేష్, సత్యా, అర్చనా సౌందర్య నటిస్తున్నారు. 50 శాతం సినిమా చిత్రీకరణ పూర్తయింది. కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్ నిలిచిపోయింది. తాతగారి పాటకు అశోక్ గల్లా స్టెప్పులు అదిరిపోయాయని అభిమానులు సంబరపడిపోతున్నారు. -
ఒక్కసారి ఒరిజినల్ సాంగ్ వినండి: రెహమాన్
పాత సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేయటం అన్ని చిత్ర పరిశ్రమల్లో ఓ ట్రెండ్‌గా కొనసాగుతోంది. అయితే కొన్ని పాటల మాత్రమే ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి. సరిగా మెప్పించని పాటలు సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలకు గురవుతున్న విషయం తెలిసిందే. సిద్దార్థ్ మల్హోత్రా, తారా సుతారియా నటించిన మసక్కలి 2.0 హిందీ పాట ఇటీవల విడుదలైంది. కొత్త వర్షన్ మసక్కలి పాటను తనీష్ బాగ్చి రూపొందించారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా ఈ మసక్కలి 2.0 పాటపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్విటర్లో స్పందించారు. ‘ఒక పాటను రూపొందించడానికి నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తుంది. పలుమార్లు మార్చి మార్చి పాటను రూపొందించాల్సి ఉంటుంది. ఒరిజినల్ మసక్కలి పాట కోసం సుమారు 200 మంది సంగీతకారులు పనిచేశారు. అందుకే ఒకసారి మసక్కలి ఒరిజినల్ పాటను విని సంతోషించండి’ అని రెహమన్ పేర్కొన్నారు. అంతేకాకుండా మసక్కలి ఒరిజనల్ పాట లింక్‌ను కూడా షేర్ చేశాడు. కాగా ఈ పాటను ఏఆర్ రెహమన్ ‘ఢిల్లీ 6’ మూవీ కోసం కంపోజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పాట పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ పాటను మోహిత్ చౌహాన్ పాడగా, ప్రసూన్ జోషి సాహిత్యం అందించారు. ఇక ‘ఢిల్లీ 6’ సినిమాలో సోనమ్ కపూర్, అభిషేక్ బచ్చన్లు జంటగా నటించిన విషయం తెలిసిందే. ‘ఢిల్లీ 6’ సినిమాకు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. Enjoy the original #Masakali https://t.co/WSKkFZEMB4@RakeyshOmMehra @prasoonjoshi_ @_MohitChauhan pic.twitter.com/9aigZaW2Ac — A.R.Rahman (@arrahman) April 8, 2020 -
‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు
వెంకటేష్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా క్షణ క్షణం. 1990లో రిలీజ్ అయిన ఈసినిమాలో జాము రాతిరి జాబిలమ్మ పాట సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా, ఆ పాట విడుదలై 29 ఏళ్లు పూర్తి చేసుకొని 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులకు జామురాతిరి జాబిలమ్మ పాటను సరికొత్తగా అందించారు కీరవాణి టీం. కీరవాణి టీంలో ఉన్న యువతరం గాయనీ గాయకులు ఈ పాటను సరికొత్తగా ఆలపించి రిలీజ్ చేశారు. అంతేకాదు కాలిఫోర్నియాలోని సాన్జోస్లో చిత్రీకరించిన విజువల్స్‌తో వేల్ రికార్డ్స్ ద్వారా పాటను రీమిక్స్ చేసి విడుదల చేశారు. అప్పట్లో బాలు, చిత్రలు ఈ పాటను ఆలపించగా రీమిక్స్ వర్షన్లో హేమ చంద్ర, కాలభైరవ, మనీష, దీపు, దామిని, మౌనిమ, శృతి, నోయల్ సీన్, పృథ్వీ చంద్రలు ఆలపించారు. -
ఇప్పుడు కత్రినాతో వాన పాట
పాపులర్ అయిన పాత పాటలన్నీ కొత్త సినిమాల కోసం రీమిక్స్ చేసే ట్రెండ్ తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ ఉంది. ముఖ్యంగా ఈ మధ్య హిందీలో ఈ రీమిక్స్ లెక్క పెరిగింది. గత ఏడాది రీమిక్స్ సాంగ్స్ ‘దిల్బర్ దిల్బర్...’ (సత్యమేవ జయతే), ‘ఆంఖ్ మారే..’ (సింబా) విన్నాం. తాజాగా అక్షయ్ కుమార్ కూడా ఓ రీమిక్స్ సాంగ్‌కు స్టెప్ వేయనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సూర్యవన్షీ’ అనే పోలీస్ స్టోరీ చేస్తున్నారు అక్షయ్. కత్రినా కైఫ్ కథానాయిక. ‘మోహ్రా’ సినిమాలోని అక్షయ్, రవీనా టాండన్ పాడుకున్న వాన పాట ‘టిప్ టిప్ బర్సా పానీ...’ ఎంత పాపులరో తెలిసిందే. చెప్పాలంటే ‘మోహ్రా’ సినిమాలో ప్రతీ పాట బ్లాక్‌బస్టరే. ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్..’, ‘నా కజ్రే కా దర్’ పాటలు ఆ సినిమాలోవే. ఇక అక్షయ్, కత్రినా కాలు కదపనున్న ‘టిప్ టిప్ బర్సా పానీ..’ పాటకు ఫర్హాఖాన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఒకప్పుడు తాను డ్యాన్స్ చేసిన పాటను మళ్లీ తన సినిమాలోనే రీమిక్స్ చేయడం పట్ల అక్షయ్ స్పందిస్తూ – ‘‘ఈ పాటను వేరే ఏ యాక్టర్ రీమిక్స్ చేసినా కచ్చితంగా నిరుత్సాహపడేవాణ్ణి. ఎందుకంటే నాకు, నా కెరీర్‌కు ఈ పాట చాలా స్పెషల్’’ అన్నారు. ‘సూర్యవన్షీ’ వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. -
పాత ట్యూన్‌కి కొత్త స్టెప్స్
తొంభైలలో అజయ్ దేవగన్, టబు పాడుకున్న ‘రుక్ రుక్...’ పాటను లేటెస్ట్గా రీమిక్స్ చేశారు ‘హెలికాఫ్టర్ ఈల’ చిత్రబృందం. కాజోల్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘హెలీకాఫ్టర్ ఈల’. గాయని కావాలనుకునే తల్లి పాత్రలో కాజోల్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అజయ్ దేవగన్, టబు నటించిన ‘విజయ్‌పథ్ ’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘రుక్ రుక్..’ను రీమిక్స్ చేశారు. ఈ పాత ట్యూన్‌కు కొత్త స్టెప్స్ జోడించారట కాజోల్. ఈ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. అజయ్ దేవగన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఆయన పాటకే ఆయన శ్రీమతి కాజోల్ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ సినిమాను అజయ్ దేవగన్, జయంతీలాల్ నిర్మించారు. అక్టోబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
మమ్మమ్మాస్..
స్పెషల్ సాంగ్స్‌లో మరింత స్పెషల్‌గా కనిపించడమే కాదు డ్యాన్స్‌లో రెండింతలు రెచ్చిపోతారు తమన్నా. మళ్లీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోవడానికి రెడీ అవుతున్నారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘అల్లరి అల్లుడు’ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ మమ్మమాస్ అనేలా దుమ్మురేపిన ‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ సాంగ్‌ను ‘సవ్యసాచి’ చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌లోనే చైతూతో కలిసి స్టేజ్‌ను అదరగొట్టనున్నారు తమన్నా. ఈ సాంగ్‌ను వచ్చే నెలలో షూట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్ వేస్తున్నారు. ఆల్రెడీ తమన్నా ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటల్లో ఆమె స్టెప్స్ అదుర్స్. ఇప్పుడీ పాటలోనూ మాస్ స్టెప్స్‌తో మెస్మరైజ్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ మిల్కీ బ్యూటీ చైతూకు జోడీగా ‘100 పర్సెంట్ లవ్’, ‘తడాఖా’ చిత్రాల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
తిడతారని తెలుసు.. అయినా ఆ పాటను చేశాం!
సాక్షి, సినిమా : ఆణిముత్యాల్లాంటి సినిమాలనుగానీ, పాటలను గానీ రీమేక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాటిని చెడగొట్టారన్న విమర్శలు పెద్ద ఎత్తున్న వినిపిస్తుంటాయి. ఈ మధ్య బాలీవుడ్లో అలాంటిదే ఒకటి జరిగింది. 1988లో తేజబ్ సినిమాలోని ఏక్ దో తీన్ సాంగ్‌ను తాజాగా బాఘీ-2 చిత్రం కోసం రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. క్లాసిక్ సాంగ్‌లో మాధురి దీక్షిత్ స్టెప్పులు ఇరగదీస్తే... ఇప్పుడీ కొత్త పాటలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చిందులేసింది. అయితే పాట క్వాలిటీ పరంగానే కాదు.. విజువల్‌గా, డాన్సుల పరంగా కూడా అంత బాగోలేదని విమర్శకులు పెదవి విరిచేశారు. పైగా సోషల్ మీడియాలో ఈ ప్రయత్నంపై చిత్ర దర్శకుడు అహ్మద్ ఖాన్‌పై ప్రేక్షకులు కొందరు దుమ్మెత్తిపోశారు. దర్శకుడి వివరణ... ఈ నేపథ్యంలో దర్శకుడు అహ్మద్ ఖాన్ స్పందించాడు. పాటను సినిమాలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడే విమర్శలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇక పాటకు డాన్సులు సమకూర్చుంది అహ్మదేనంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై కూడా ఆయన స్పందించారు. ‘ఆ పాటను ప్రముఖ డాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య కంపోజ్ చేశారు. ఆ విషయంలో నేను ఎలాంటి జోక్యం చేసుకోలేదు. పైగా పాట చిత్రీకరణ జరుపుకున్న సమయంలో ఆ దరిదాపులకు కూడా నేను వెళ్లలేదు’ అని అహ్మద్ చెప్పుకొచ్చాడు. ‘పాటను నాశనం చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. కేవలం క్లాసిక్ పాటకు ప్రేక్షకులకు మళ్లీ గుర్తు చేద్దామన్న ప్రయత్నం మాత్రమే మాది. అయినా ఈ పాటపై విమర్శించే వారిని మేం పట్టించుకోలేదల్చుకోలేదు. కాకపోతే ఈ పాటపై మాధురి దీక్షిత్ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. మరోవైపు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్‌తోపాటు ఈ పాట ఒరిజినల్ కంపోజర్(తేజబ్ చిత్రం) సరోజ్ ఖాన్ కూడా ఈ ప్రయత్నంపై అభినందనలు గుప్పిస్తూ.. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ జంటగా నటించిన భాఘీ తెలుగు క్షణం సినిమాకు రీమేక్. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది. -
అక్కినేని వారసుడు కూడా అదే పని చేస్తున్నాడు
స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోలు సక్సెస్ కోసం ఫ్యామిలీ ఇమేజ్ను బాగానే వాడేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ హీరోలు రీమిక్స్ పాటలతో తన వారసత్వాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్లు కూడా ఈ ప్రయత్నం చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ సక్సెస్‌లో రీమిక్స్ పాటల ప్రభావం కూడా బాగానే ఉంది. తాజాగా అక్కినేని వారసుడిగా పరిచయం అయిన యంగ్ హీరో సుశాంత్ కూడా ఇదే ఫార్ములాను నమ్ముకుంటున్నాడు. ఏకంగా ఏఎన్నార్ నటించిన ఆల్ టైం క్లాసిక్ దేవదాసు సినిమాలోని పాటను రీమిక్స్ చేస్తున్నాడు సుశాంత్. నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన పల్లెకు పోదాం పారును చూద్దాం పాటను తన లేటెస్ట్ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నాడు సుశాంత్. మరి ఈ సెంటిమెంట్ అయిన సుశాంత్‌కు వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి. -
మనసు మార్చుకున్న మెగా వారసుడు
వారసుడిగా ఎంట్రీ ఇచ్చి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకుంటున్న యువ నటుడు సాయిధరమ్ తేజ్. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఈజీగానే ఎంట్రీ ఇచ్చినా.., తన టాలెంట్‌తో మంచి సక్సెస్‌లు సాధిస్తున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాల సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్నాడు. అయితే ఈ సినిమాలతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా తన ప్రతీ సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఇమిటేట్ చేయటంతో పాటు చిరు పాటలను రీమిక్స్ చేయటం ఇప్పుడు సాయికి ఇబ్బందిగా మారింది. కెరీర్ స్టార్టింగ్‌లో గుర్తింపు కోసం ఫర్వాలేదు కానీ, ప్రతీ సినిమాలో ఇలా ఇమిటేట్ చేస్తే, సొంత ఐడెంటిటీ రాదంటున్నారు విశ్లేషకులు. దీంతో ఇక ఈ ఇమిటేషన్ సెంటిమెంట్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు తేజు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తిక్క సినిమాలో కూడా చిరంజీవి పాటను రీమిక్స్ చేయాలని ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే సాయి మాత్రం వద్దని ఖచ్చితంగా చెప్పేశాడట. కథకు అవసరమైతే తప్ప ఇప్పట్లో రీమిక్స్ పాటలను చేసే ఆలోచనే లేదంటున్నాడు. మరి సొంత ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్న సాయి ప్లాన్స్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. -
ఎంతవారులైన గాని వేదాంతులైన గాని..
టాలీవుడ్ లో రీమిక్స్ పాటల జోరు కొనసాగుతోంది. ప్రతి సినిమాలోనూ రీమిక్స్ పాటలు సాధారణమైపోయాయి. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ‘రౌడీ ఫెలో’ సినిమా కోసం పెద్ద ఎన్టీఆర్ పాటను రీమిక్స్ చేశారు. మహ్మద్ రఫీ పాడిన 'ఎంతవారులైన గాని వేదాంతులైన గాని' అనే పాటను రీమిక్స్ చేసి ఈ సినిమాలో పెడుతున్నారు. రీమిక్స్ వెర్షన్ చాలా బాగా వచ్చిందని, యువశ్రోతలను ఆకట్టుకునేలా సంగీతం కుదిరిందని దర్శకుడు చైతన్య కృష్ణ తెలిపారు. పెద్ద ఎన్టీఆర్ నివాళిగా ఈ రీమిక్స్ పాట పెడుతున్నామని అన్నారు. రోహిత్ సరసన విశాఖాసింగ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, పోసాని, పరుచూరి వెంకటేశ్వరరావు, తాళ్లూరి రామేశ్వరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.